Saturday, May 16, 2026

మోక్షం అంటే ఏమిటి?|Jagadguru Sri Sri Vidhusekhara Bharathi Swami Varu|Gita Makarandam

మోక్షం అంటే ఏమిటి?|Jagadguru Sri Sri Vidhusekhara Bharathi Swami Varu|Gita Makarandam

Author Name:Gita Makarandam - గీతా మకరందము

Youtube Channel Url:https://www.youtube.com/@GitaMakarandam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=4tk4peZwukA



Transcript:
(00:00) ఇప్పుడు మీరు మోక్షం అన్నారు మోక్షము అంటే ఏంటి అసలు అర్థం అసలు ఎవరికీ మోక్షం అనదానికి అర్థం తెలియదు మోక్షమా దేవుని కలవడమా దేవుడు అంటే ఏంటి ఎలా కలుస్తాము ఏంటి అనేది అందరికీ ఎవరికీ తెలియదు అందరూ మోక్షం మోక్షం అంటూ ఉంటారు అవును ఆ మోక్షానికి కరెక్ట్ అర్థం మోక్షం అంటే ఏమిటి అంటే సంసారం నుంచి ముక్తులం కావడం మోక్షం అంటే ఏమిటి విడుదల మోక్షం అంటే విడుదలేగా దేని నుంచి విడుదల అనిఅంటే దుఃఖం నుంచి సంసారం అంటే దుఃఖమే కదా ఏదో ఒక దుఃఖం ఉండనే ఉంటుంది కదా మనం నాలుగు రోజులు సుఖంగా ఉన్నాం అనుకున్నా కూడా మళ్ళీ ఐదో రోజు ఏదో ఒక దుఃఖం రానే వస్తుంది. మరీ
(00:41) రాకపోయినా కాస్త దుఃఖమైనా ఉండనే ఉంటుంది. ప్రతి మనిషికి ప్రతి ప్రాణికి ఏదో ఒక దుఃఖం ఉండనే ఉంటుంది. ఈ సంసారంలో మనం సరిగ్గా చూస్తే గనుక పరిశీలిస్తే గనుక దుఃఖం లేనటువంటి ప్రదేశం ఎక్కడా లేదు. ఇప్పుడు ఉదాహరణకి స్వర్గం స్వర్గం గురించి పురాణాల్లో ఉంది చాలా పుణ్యం చేసినటువంటి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని ఉంది. కాబట్టి స్వర్గంలో సుఖం చాలా ఉంటుంది అని [సంగీతం] ఉంది అక్కడ కూడా సుఖం అధికంగా ఉంటుంది అనేది వాస్తవమే కానీ అక్కడ దుఃఖం లేదు అనడానికి మాత్రం వీలు లేదు అక్కడ కూడా దుఃఖం అనేది ఉండనే ఉంటుంది.
(01:16) ఎందుకు అనిఅంటే అక్కడ కూడా ఇప్పుడు వీడు వీడు పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళాడు వీడు [సంగీతం] చేస్తున్నటువంటి పుణ్యం అంతా క్షయం అవుతూ వస్తుంది అనుభవిస్తున్నాడు గా అక్కడ అనుభవిస్తున్నప్పుడల్లా పుణ్యం క్షీణం అయిపోతూ ఉంటుంది. ఆ క్షయం అవుతున్న కొద్ది అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు ఇక్కడికే రావాలి. పుణ్యం క్షయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళీ పుణ్యం చేసి మళ్ళీ వెళ్ళాలి అక్కడే ఉండిపోవడానికి వీలు లేదు శాశ్వతంగా కాబట్టి అక్కడ ఏముందండి కొన్నాళ్ళ అయిన తర్వాత అయిపోవస్తుంది అయిపోవస్తుంది పుణ్యం క్షయం అయిపోతుంది అనగానే మళ్ళీ వాడు ఇక్కడికి
(01:45) రావాలి తత్ప్రయుక్తంగా వాడికి మళ్ళీ దుఃఖం వస్తుంది ఇది అయిపోవస్తుంది ఇంకా కొన్ని రోజులే ఉండేది అని వాడికి దుఃఖం ఇంకా మనం దేవతలకి చూస్తూ ఉంటాం రాక్షసుల వల్ల రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళకంతా దుఃఖం కాబట్టి అక్కడ కూడా దుఃఖం అనేది ఉంటుంది. సుఖం అధికంగా ఉంటుంది కాబట్టి యతావత ఏమైంది సంసారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ లోకానికి వెళ్ళినా కూడా అక్కడ దుఃఖం అనేది కాస్త ఉండనే ఉంటుంది.
(02:10) మరి దుఃఖం నుంచి సంపూర్ణంగా అంటే ఎప్పుడైతే మనం సంపూర్ణంగా దుఃఖం నుంచి విముక్తులం అవుతామో ఎప్పుడైతే ఇంక మనకి దుఃఖం యొక్క లేషం కూడా మనకి మళ్ళీ రాదో అటువంటి స్థితిని మోక్షం అని అంటారు. ఆ మోక్షం అనేది మనకి రావాలి అని అంటే మోక్షం అంటే దుఃఖం నుంచి విముక్తులం కావడం దుఃఖం నుంచి విముక్తులం కావాలి అని అంటే ముందు అసలు ఈ దుఃఖం ఎందువల్ల వచ్చింది అనేదాన్ని ముందు తెలుసుకోవాలి.
(02:41) ఆ దుఃఖం ఎందువల్ల వచ్చింది అనేదాన్ని తెలుసుకుంటే ఆ దుఃఖానికి మార్గాన్ని దుఃఖానికి హేతువ అయినటువంటి దాన్ని మనం నిలువరించొచ్చు. ఈ దుఃఖానికి హేతువు అనేది ఏమిటి అనింటే భగవత్పాదుల వారు చెప్పింది అవిద్య అవిద్య అంటే మాయ దుఃఖం మాయ అజ్ఞానం అంటే ఏమిటి ఈ దేహాదులనే ఆత్మ అని అనుకోవడం దేహము ఇంద్రియము మనసు వీటిలనే నేను అని భావించడం కాబట్టి ఇప్పుడు ఏమైందంటే దేహన్నే నేను అని భావిస్తున్నాం కాబట్టి దీనికి ఏదైనా దుఃఖం కలిగితే నాకు దుఃఖం వచ్చింది అని అనుకోవడం మనిషి యొక్క వాస్తవ స్వరూపం అంటే జీవుడి యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అనిఅంటే సుఖ స్వరూపం అది ఎలా చెప్
(03:17) చెప్తారు అనింటే ఇప్పుడు ఉదాహరణకి నిద్రావస్థలో సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రతి మనిషికి సుఖం యొక్క అనుభవం కలుగుతుంది. ప్రతి మనిషికి అనుభవంలో ఉన్నటువంటి విషయమే ఇది నిద్రావస్థలో అత్యంత సుఖం కలుగుతుంది. ఆ నిద్రావస్థలో కలిగేంత సుఖం అది వేరే ఇంకెక్కడ లభించదు. ఏ భోగ్య వస్తువులతోన అంత సుఖం లభించదు.
(03:40) మరి ఆ నిద్రావస్థలో సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడు ఏమన్నా భోగ్య వస్తువులు ఉన్నాయా ఏమీ లేవు. ఇంకొకటి ఒక వ్యక్తికి ఏదో శరీరానికి ఏదో పెద్ద గాయం అయింది చాలా వేదన పడుతున్నాడు. అప్పుడు అటువంటి సందర్భంలో సరే ఏదో వైద్యం జరుగుతోంది అటువంటి సందర్భంలో నిద్రపోయాడు కానీ ఆ నిద్రలో ఉన్నంతవరకు ఆ గాయానికి సంబంధించినటువంటి దుఃఖం వాడికి తెలియదు వాడు మర్చిపోతాడు.
(04:02) అప్పుడు కూడా వాడు సుఖంగానే ఉంటాడు ఆ నిద్రపోతున్నంత సేపు సుఖంగానే ఉంటాడు. మళ్ళీ వాడికి మెలుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గాయం వాడికి గుర్తొస్తుంది అయ్యో నాకు గాయం కలిగింది నాకు దెబ్బ తగిలింది అని మళ్ళీ వాడు దుఃఖిస్తూ ఉంటాడు ఆ నెప్పిని అనుభవిస్తాడు. కాబట్టి ఏమైందంటే అక్కడికి మనిషి జీవుడి యొక్క వాస్తవ స్వరూపం సుఖ స్వరూపం అది మనక ఎలా తెలుస్తుంది అంటే సుషుప్తి అవస్థలో వేరే ఏ విధమైనటువంటి బాహ్య సాధనాలు గాని భోగ్య వస్తువులు గాని లేకపోయినా కూడా అత్యంతమైనటువంటి సుఖాన్ని ప్రతి ఒక్క జీవుడు అనుభవిస్తున్నాడు ఇది ప్రతి ఒక్క జీవుడికి అనుభవం కొత్తగా
(04:35) చెప్పాల్సింది ఏమ లేదు అనుభవంలో ఉన్నటువంటి విషయమే ఇది ఆ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది అనిఅంటే మన యొక్క ఆత్మ సుఖమే ఆ ఆత్మ ఆత్మ సుఖమే ఆ సందర్భంలో మనకి స్పష్టంగా అభివ్యక్తం అవుతుంది. ఆ నిద్రావస్థలో ఏమవుతుంది ఈ బాహ్య దృష్టి ఏమీ లేదు మనకి బాహ్య దృష్టి గాని శరీరం దృష్టి మీద గాని ఇంద్రియాల మీద గాని మనసు మీద గాని మనక అసలు దృష్టే లేదు ఆ సందర్భంలో మనక ఏమీ కనిపించట్లేదు.
(05:00) అప్పుడు మనకి ఉన్నది ఒకే ఒకటి ఆత్మ ఆ ఆత్మ సుఖాన్ని మనం ఆ సందర్భంలో పొందుతున్నాం కాబట్టి అది అపారమైనటువంటి సుఖం కాబట్టి ఆ ఆత్మ అనేది వస్తుతః సుఖ స్వరూపం అని మనకి [సంగీతం] తెలుస్తుంది. మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది మళ్ళీ శరీరాదుల మీద మనకి అభిమానం అనేది వస్తుంది. ఏవండీ ఇది నేను అనే భ్రాంతి మళ్ళీ మనకి అది మళ్ళీ పునః ఉద్భవిస్తుంది.
(05:21) పునః అది జాగృతం అవుతుంది. అప్పుడు ఈ శరీరాల్లో కలిగినటువంటి దుఃఖాలని ఇది నాకే కలుగుతుంది అని మనం అనుకొని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఈ దుఃఖానికి కారణం ఏమిటి అనింటే ఈ దేహాదుల్లో ఉండేటటువంటి ఆత్మ బుద్ధి ఈ ఆత్మ బుద్ధి గనుక పోయిందంటే అప్పుడు వాస్తవంగా మన యొక్క ఆత్మ ఏది అనేది మనకు తెలుస్తుంది అప్పుడు ఈ దేహాదుల మీద ఆత్మ బుద్ధి పోతుంది ఆ ఆత్మ సాక్షాత్కారం అయిపోయిన తర్వాత ఆ ఆత్మ సుఖం అనేది సంపూర్ణంగా మనకు అభివ్యక్తం అవుతుంది.
(05:55) ఇప్పుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఆత్మ సుఖం మనకు అభివ్యక్తం అవుతుంది తెలుస్తుంది కానీ ఆ సందర్భంలో అయితే మరి ఇంకా నిద్రే ఒకటి నిద్ర ఒకటి చాలు ఇంకా మళ్ళీ ఇంకా మోక్షం ఎందుకు నిద్రలో మనకి ఆత్మ సుఖమేగా తెలుస్తుంది అప్పుడు ఇంకా మోక్షం ఎందుకు అనడానికి వీలు లేదు ఎందుకంటే నిద్రావస్థలో ఆ స్వరూప సుఖం అనేది కాస్త అభివ్యక్తం అవుతూ ఉన్నా కూడా అప్పుడు మనకి ఆ అజ్ఞానం అనేది సంపూర్ణంగా పోలే ఇంకా అజ్ఞానం అనేది ఉంది అది ఉంది కాబట్టే మళ్ళీ మనం జాగ్రత్త అవస్థలోకి రావాల్సి వస్తుంది తెలియకుండా రమించేది నిద్ర తెలిసి రమించేది మోక్షం మోక్షం మోక్షం
(06:26) ఇంకొక ఒక తేడా ఏమిటి అంటే నిద్రావస్థలో అజ్ఞానం ఉంటుంది మోక్షావస్థలో అజ్ఞానం ఉండదు అజ్ఞాన అదే తెలిసి అంటే జ్ఞానం జ్ఞానం వచ్చినప్పుడే కదా తెలిసి రమించేసి మోక్షం

No comments:

Post a Comment