మనిషి గొప్పతనం అతను ఎంత సంపాదించాడో, ఎంత పెద్ద ఇల్లు కట్టాడో, ఎంత పేరు తెచ్చుకున్నాడో దాంట్లో లేదు.
అతనిలో ఎంత సహనం పెరిగింది, ఎంత దయ పెరిగింది, ఎంత కరుణ పెరిగింది అనేదే అసలైన విలువ.
మన శరీరం కూడా మన నియంత్రణ లేకుండానే పనిచేస్తోంది.
మనము తినే ఆహారం జీర్ణం అవుతుంది, గుండె కొడుతుంది, శ్వాస సాగుతుంది.
ఒక చిన్న విత్తనం మహావృక్షంగా మారుతుంది.
ఆకాశం, సముద్రం, ప్రకృతి — ఇవన్నీ సహజ ధర్మంతో నడుస్తున్నాయి.
కానీ మనం మాత్రం “అన్నీ నేనే చేస్తున్నాను” అనే అహంకారంలో పడిపోతాం.
అక్కడినుంచే అసహనం, పోలికలు, ఈర్ష్య, అశాంతి మొదలవుతాయి.
ప్రకృతిని గమనిస్తే ఒక గొప్ప పాఠం తెలుస్తుంది —
నిజమైన శక్తి నిశ్శబ్దంలో ఉంటుంది.
నిజమైన గొప్పతనం వినమ్రతలో ఉంటుంది.
మనము ప్రకృతి నుండి వచ్చాము.
మళ్ళీ ఆ ప్రకృతి లాంటి పవిత్రత, ప్రశాంతత, సహజత్వం మనలో వికసిస్తే జీవితం అద్భుతంగా మారుతుంది.
దైవత్వం బయట ఎక్కడో లేదు.
మనలో దయగా, ప్రేమగా, కరుణగా వికసించే గుణాలే నిజమైన దైవత్వం.
https://m.youtube.com/post/Ugkx8lWWbVEJO6sGaVGCus9z7EETLG7vLMbU
No comments:
Post a Comment