Saturday, May 16, 2026

Ishtagosti ( ఇష్టాగోష్ఠి ) Episode - 31

Ishtagosti ( ఇష్టాగోష్ఠి ) Episode - 31

Author Name:Kailasanadh Spiritual

Youtube Channel Url:https://www.youtube.com/@KailasanadhMalladi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=L-YdUzyGZgU



Transcript:
(00:00) శ్రీ గురుభ్యో నమః ఇష్టా గోష్టి సనాతన ధర్మమునకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు మనకు సులభముగా అర్థమయ్యే రీతిలో శాస్త్రీయమైన సమాధానాలను ప్రసాదించారు. మాస్టారు అందించిన ఆ సమాధానాలను మనకు చక్కగా తెలియజేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ ఇష్టా గోష్టి అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము.
(00:34) అందులో భాగంగా ఈరోజు ఆరోగ్యశాస్త్రం రెండవ భాగము అనేటువంటి అంశములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఒకరు అడిగిన ప్రశ్నకు మాస్టారు సమాధానం చెప్తూ ఉన్నారు. స్వస్థ వృత్తానికి ఆహార నియమానికి సూటిగా సంబంధం ఉన్నది. ఎలాంటి ఆహారం తీసుకుంటే మందుల ప్రమేయం లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే విషయం మీద అనేక అభిప్రాయాలు ఉన్నాయి.
(01:07) శాకాహారం మంచిది అనేవారు మాంసాహారం పుష్టికరమైనది అనేవారు రెండు పార్టీల వారు ఉన్నారు. శాఖహారులము అని చెప్పుకునేవారు పాలు పెరుగు వెన్న నెయ్యి బాహాటంగా వాడుకుంటూనే ఉన్నారు. కనుక వీరిని అహింసాపూర్వక మాంసాహారులు అనవలసినదే గానీ శాఖహారులు అని గట్టిగా అనటానికి వీలు లేదు శాఖహారులు అని వీళ్ళని గట్టిగా అనటానికి వీలు లేదుటండి ఎవరినండి ఈ పాలు పెరుగు వెన్నెయి వాడుకుంటున్నారుగా వీళ్ళని గట్టిగా శాఖహారులు అనటానికి వీలు లేదుట ఎందుకండీ ఎందుకంటే అవి కూడా జంతువుల నుండి వచ్చినవి కదండీ అందువల్ల కొందరు పాలు పెరుగు మొదలైనవి నిషేధించిన
(01:52) శాఖాహారులు కూడా ఉన్నారు. ఉదాహరణకి పాశ్చాత్య దేశాలలో యోగాభ్యాసం చేస్తూ భారతీయ సంస్కృతిని అవలంబిస్తూ ఉన్న కొన్ని వేల మంది తెల్లవారు పాలు వెన్న మొదలైనవి కూడా ముట్టరు. బ్రసెల్స్ లండన్ పారిస్ మొదలైన మహానగరాల్లో ఉన్న శాఖహార భోజనశాలలో కూడా ఇవి నిషిద్ధమే పుష్టికరమైన ఆహారం అయితే ఆయా శరీర తత్వాన్ని బట్టి కుటుంబంలో తరతరాలుగా వస్తూ ఉన్న అభ్యాసాన్ని బట్టి శాఖహారమైన మాంసాహారమైన ఆరోగ్యకరమే అంటే ఎవరికి వాళ్ళకి ఏది పాటిస్తున్నారో అది ఆరోగ్యకరమే అటండి అయితే శరీర
(02:38) తత్వాన్ని చూసుకోవాలి. వాళ్ళ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కుటుంబంలో తరతరాలుగా వస్తున్న అభ్యాసాన్ని బట్టి రెండిట్లో ఏదైనా ఆరోగ్యకరమే శాఖహారంలో కూరగాయలు తీయని పండ్లు పండ్ల రసాలు తేనె విశేషంగా వాడటం శరీర ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. ఉడకబెట్టిన పదార్థాలు పచ్చివాటికన్నా తక్కువ బలాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాచిన పాల కన్నా పచ్చిపాలు ఎక్కువ ఆరోగ్యం కాచటం ఉడకబెట్టడంతో జీవకణాలు మృతమవుతాయి అన్నది కాదనరాని సత్యం శరీరంలో ప్రాణమయ కోసం చురుకుగా ఉంటేనే గాని అన్నమయ్య కోసం ఆరోగ్యకరమైన ధాతువుల నిర్మాణం జరగదు అన్నమయ్య కోసము
(03:27) అంటే ఫిజికల్ బాడీ అండి దాని లోపలి పొరలో ఉండేటువంటిది ఈ ప్రాణమయ కోసం కనుక శరీరంలో ప్రాణమయ కోసం చురుగ్గా ఉంటే గానీ ఈ ఫిజికల్ బాడీ ఆరోగ్యకరమైన ధాతువుల నిర్మాణం జరగదు. అంటే ఫిజికల్ బాడీకి ఆరోగ్యకరమైన ధాతువుల నిర్మాణం జరగదు. ప్రాణమయ కోసం చలాకీగా ఉండి స్పందనలలో సామ్యం సిద్ధించాలంటే ఉడకబెట్టకుండా కాచకుండా ఉన్న శాకాహార సంపద చాలా అవసరం.
(04:02) స్పందనలు అంటే పల్సేషన్స్ అండి ప్రాణమయ కోసం చలాకిగా ఉండాలి పల్సేషన్స్ వాటిల్లో సామ్యం సిద్ధించాలి అంటే గనుక ఉడకబెట్టకుండా కాచకుండా ఉన్న శాఖహార సంపద చాలా అవసరంంట అందుకని ఏదో ఒక రూపంలో పండ్లు పచ్చికూరలు తేనె పచ్చిధాన్యపు గింజలు శరీరానికి అందించబడాలి. ఇక యోగాభ్యాసం ఇంద్రియ నిగ్రహం మానసిక శాంతి కోరిన వారికి ఇవి తప్పనిసరి అని చెప్పనక్కరలేదు మానసిక శాంతి కావాలి అంటే ఏం చేయాలండి యోగాభ్యాసం ఇంద్రియ నిగ్రహం ఇవి చేసుకోవయ్యా అంటున్నారు.
(04:46) ఇవి తప్పనిసరి అంటున్నారండి పచ్చి ఆహార పదార్థాల కన్నా ఉడకబెట్టినవి అంతకన్నా వేయించినవి కాల్చినవి తక్కువ ఆరోగ్యాన్ని ఇస్తాయి. నూనె నేతి వేపుళ్లు వడియాలు అప్పడాలు ఒరుగులు ఊరగాయలు అలవాటు చేసుకున్నచో రుచి కోసమే కానీ దేహ పోషణకు పనికిరావు ఇవి కేవలం రుచి కోసం అండి ఇవి నిరుపయోగాలే కాకుండా అనారోగ్యాలు కూడాను ఇవి అనారోగ్యం అటండి నిరుపయోగాలట ఏవండీ ఒడియాలు గాని అప్పడాలు గాని ఒరుగులు గాని ఊరగాయలు గాని నేతి వేపుళ్లు గాని నూనె వేపుళ్లు గాని ఆయుర్వేద శాస్త్రంలో వీటిని తినేవాళ్ళు కుణపకాదకులు
(05:33) అంటే ఏంటండీ కుణపకాధకులు అంటారుట ఆయుర్వేద శాస్త్రంలో వీటిని తినేవాళ్ళని ఏమిటండీ కుణపకాదకులు అంటే అర్థం ఏమిటండి శవాలను తినేవారు అనేటటువంటి అర్థం కనుక ఇట్లాంటి వాళ్ళని కుణపఖాదకులు అని వ్యవహరింపబడతారు వారికి ఆయువు ఆరోగ్యము అల్పమై బ్రహ్మ వర్చస్సు నశ నశిస్తుందని చెప్పబడి ఉంది. బ్రహ్మ వర్చస్సు అంటే ఇంగ్లీష్ లో వైటల్ మాగ్నెటిజం అంటారండి ఇవి కాక గంజి వార్చిన అన్నము వార్పుడు కూరలు కూడా పనికిరావు కొన్ని కూరలు మీరు గమనించారో లేదో నీళ్ళల్లో ఉడకబెట్టి అవి వారుస్తారండి అంటే నీళ్ళల్లో బాగా ఉడకబెట్టి మళ్ళీ చిల్లుల పళ్లెల్లో వేసి ఆ
(06:21) నీళ్ళన్నీ పోయేట్టు చేసి తర్వాత ఆ పదార్థాన్ని కూరగా చేస్తారు. అలాగే అన్నము కొంతమంది గంజి వారుస్తారు ఇవి కూడా పనికిరావు అంటున్నారు వార్చిన అన్నాన్ని శాస్త్రంలో అన్నమలము అంటారు మర బియ్యం కూడా అనారోగ్యకరమే అంటే మర బియ్యం అంటే పాలిష్ పడతారు కదండీ ఆ బియ్యం అది అనారోగ్యకరమే పాండురోగులు బెరీ బెరీ వ్యాధితో బాధపడువారు ఔషధ సేవ చేసేటప్పుడు ప్రత్యేకంగా దంపుడు బియ్యపు అన్నము తవుడు తడు రొట్టెలు తవుడు టాబ్లెట్లు మున్నగు వాటిని వాడటం చూస్తూ ఉన్నాము కదా అంటే కొన్ని రోగాలు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి
(07:05) తవుడు రొట్టెలు తినిపిస్తారండి అట్లాగే తవడు టాబ్లెట్లు దంపుడు బియ్యం తినాలి వాళ్ళు చెట్టును గాని జంతువును గాని చంపకుండా ఆహారం తీసుకొనటం ఉత్తమము అని పైథాగరస్ నిర్ణయం వీటిని చంపకూడదండి చంపకుండా వాటి ఫలాలని స్వీకరించవచ్చు చెట్టు గాని జంతువు గాని చంపి తినే అభిలాష శారీరక మానసిక ఆరోగ్యాలకు వ్యతిరేకం జంతువులనో చెట్లనో చంపనిదే ఆహారం తీసుకొనటం అసాధ్యము అని కొందరి అభిప్రాయం ఏవండీ చంపకపోతే ఎట్లండి అని కొందరి అభిప్రాయం ఇది సరికాదు పాలు పెరుగు వెన్న స్వీకరించడంలో ఆవును గాని దూడను గాని చంపకుండా స్వీకరించవచ్చు
(07:54) చెట్ల నుండి పండ్లు కాయలు ఆకులు స్వీకరించడంలో చెట్లను చంపనక్కరలేదు ఇక దుంపల విషయంలో ఆ చెట్లకి దుంప తెంపక తప్పదు దుంపలు తినాలంటే తప్పదండి చంపక తప్పదు ఈ దుంప నాశనం అంగీకరించని కొందరు దుంపలను తినరు అంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి దుంపను చంపాలి కదా ఆ దుంప ఆ వాటిల్ని చంపాలి కదా అని కూడా కొంతమంది వాటిల్ని తినరటండి దుంప ఇన్ని రకాల పండ్ల చెట్లు కాయల చెట్లు ఉండగా దుంపలను తినకపోతే గడవదా అని వీరి మతం సృష్టిలో వృక్షాల కన్నా జంతువులు మానవులకు సన్నిహితమైన లక్షణం కలవి నొప్పి
(08:40) తెలియటానికి కావలసిన మనసు ఇంద్రియాలు వేరుగా ఏర్పాటై ఉన్నాయి అంటే ఇక్కడ మాస్టారు ఏవండీ నాన్ వెజిటేరియన్ తప్పేంటి మీరు కూడా వెజిటేరియన్ తింటున్నారు కదా ఈ వెజిటేరియన్ కూడా ఒక మొక్కని హింసించడం మే కదా అది కూడా తప్పే కదా వాటిలో కూడా సెల్స్ ఉంటాయి కదా ఇవెంతో ఈ జంతువులు ఎంతో వృక్షాలు అంతే కదా మరి ఇది తప్పయినప్పుడు అది కూడా తప్పే కదా ఇట్లా వాదిస్తారు కదండీ దీనికి సరైన సమాధానం మాస్టర్ ఇక్కడ ఇస్తున్నారు మనం జాగ్రత్తగా గమనించాలి.
(09:11) సృష్టిలో వృక్షాల కన్నా జంతువులు మానవులకు సన్నిహితమైన లక్షణం కలవి అంటే జంతువులకి మనకి సన్నిహిత లక్షణం ఉన్నదట అండి ఏది వృక్షాల కన్నా కూడా నొప్పి తెలియటానికి కావలసిన మనసు ఇంద్రియాలు వేరుగా ఏర్పాటు అయి ఉన్నాయి ఎవరికి జంతువులకి మరి చెట్లకో చెట్లకు అలా వేరుగా ఇంకా ఏర్పడలేదు అంటే చెట్లకు నొప్పి తెలియదు మత్తు మందు ఇచ్చిన వాడికి నొప్పి ఎలా ఉంటుందో వృక్షాలకు అలాగే ఉంటుంది అదండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఏమయ్యా మరి నువ్వు వృక్షాలను కూడా చంపుతున్నావు కదా అంటే వాటికి నొప్పి తెలియదయ్యా మనసు వాటి కథల వేరుగా ఉంటుంది మత్తుమందు ఇచ్చిన వాడికి ఎలా ఉంటుందో
(09:57) వాటిని కోస్తున్న ఈ వృక్షాలకు అలా ఉంటుందట లోపల ఉన్న పదార్థాన్ని బట్టి చూస్తే వృక్షాలైనా జంతువుల శరీరాలైనా మానవుడికి ఆహార పాత్రల వంటివి టిఫిన్ ప్యాకెట్ల వంటివి రెండిటిని ఆహారంగా వాడుకొనటంలో సమానమైన హక్కు మానవుడికి ఉన్నదని అనుకుంటే తప్పులేదు. ఆ సంస్కారం కొంత ఇలా అనుకొనటంలో అసత్యం లేదు. ఇక సంస్కార దృష్టిా చూస్తే ఇంచుమించుగా మానవుడికి తెలిసినంత నొప్పి జంతువులకు కూడా తెలుస్తూనే ఉంటుంది అంటే నువ్వు చంపటానికి ప్రయత్నిస్తున్నావు ఒక జంతువుని చంపడానికి ప్రయత్నిస్తున్నావు అప్పుడు దానికి నొప్పి తెలుస్తుంది కదండీ ఇది మానవుడికి ఎంత ఉంటుందో నొప్పి జంతువులకు
(10:42) కూడా ఉంటుంది అలానే ఉంటుంది అంటున్నారు ఇంచుమించుగా చంపే సమయంలో చెట్లకు నొప్పి మానసికంగా తెలియదు చెట్లకు తెలియదుటండి మానసికంగా తెలియదుట ఎవడన్నా రాక్షసుడు తనను విరుచుకొని తింటాడని అలా తింటాడంటే మానవుడికి జంతువుల కన్నా ఎక్కువ బాధగా ఉంటుంది. చంపేటప్పుడు ఎక్కువ బాధ కొంచెం భయం జంతువులకు ఉంటాయి. మానవుడికి చంపబడబోతున్నాడని తెలియగానే బాధ కన్నా భయం ఎక్కువగా ఉంటుంది.
(11:21) ఇంగిత జ్ఞానంతో పాటు భయం కూడా జంతువుల కన్నా మానవునికి ఎక్కువ ఇంకిత జ్ఞానం అంటే కామన్ సెన్స్ అండి ఈ కామన్ సెన్స్ జంతువుల కన్నా మానవులకు ఎక్కువ అట ఈ ప్రకృతి సత్యాలను గమనిస్తే మానవుడికి మాంసాహారం కన్నా శాకాహారమే ప్రకృతి ఏర్పాటు చేసిన సహజమైన ఆహారమని అనిపించక తప్పదు చాలా క్లియర్ గా ఇస్తున్నారండి ప్రకృతి మానవుడికి సహజంగా ఏర్పాటు చేసిన ఆహారం ఏమిటి అది శాఖహారం య్యా మాంసాహారం కాదు ఈ శాఖహారం అనేది ప్రకృతి మనకు ఏర్పాటు చేసింది సహజమైన రీతిలో తక్కువ బాధాకరమని మానవుడు విశ్వసిస్తున్నప్పుడు వృక్షాన్ని చంపి తినటం అంతకన్నా తక్కువ బాధాకరమని మానవుడు
(12:08) అంగీకరించి తీరాలి ఈ వృక్షాన్ని చంపి తినటం ఈ జంతువును చంపి తినడం కన్నా తక్కువ బాధాకరం కనుక ఉన్నంతలో శాఖహారం సహజ ఆహారము మరి మనకు ఉన్నంతలో అది శాకాహారం కరెక్టు మరొక దృక్పథంతో చూస్తే మాంసాహారం అన్నమయ్య కోసానికి ఎక్కువ పుష్టిని ఇస్తుంది అన్నమయ్య కోసం అంటే ఫిజికల్ బాడీ అండి. ఈ మాంసాహారం ఏం చేస్తుంది? ఈ ఫిజికల్ బాడీకి ఎక్కువ పుష్టిని ఇస్తుంది.
(12:40) అందుకనే ఏమంటారు కొవ్వు పెరిగిన వారిని రక్తపోటు మొదలైన రోగాలు కలవారిని నెయ్యి వెన్న మానమని వైద్యులు సలహా ఇస్తారు. శాఖహారం ప్రాణమయ కోసానికి పుష్టిని ఇస్తుంది. అంటే ఏ ఆహారము దేనికి పుష్టిని ఇస్తుంది చెప్తూ ఉన్నారండి. మాంసాహారంఏమో అన్నమయ కోశానికి ఎక్కువ పుష్టినిస్తుంది శాఖహారం ప్రాణమయ కోశానికి పుష్టినిస్తుంది. క్రమశిక్షణ సదాచారం మనోమయ కోశానికి పుష్టినిస్తాయి.
(13:14) సత్సాంగత్యం సద్గ్రంథ పఠనం విజ్ఞానమయ కోసానికి పుష్టినిస్తాయి. యోగాభ్యాసం భూతదయ సత్యం సౌచం ఆనందమయ కోసానికి పుష్టినిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ కోశానికి ఏవి పుష్టినిస్తాయి చాలా క్లియర్ గా ఇచ్చారు మాస్టారు మళ్లా మళ్లా తప్పకుండా చదువుకోవాల్సినటువంటి మాటలుండి ఇవన్నీ కూడా తప్పకుండా వినాలి తప్పకుండా చదువుకోవాలి. మానవుడు మిగిలిన జంతువుల కన్నా వివేకంతో జన్మిస్తాడు కనుక ఈ మార్గాలలో జీవితాలను మలచుకొనటం అతగాడి బాధ్యత పైన చెప్పిన కోశాలలో ఏ కోశానికి పుష్టి కోరినవారు ఆ కోశానికి సంబంధించిన ఆహారాన్ని నియమంతో
(13:59) స్వీకరించవచ్చు అందులో తప్పేమీ లేదు జన్మ సంస్కారానికి నచ్చిన ఆహారాన్ని నియమంతో స్వీకరించడం ఆరోగ్యశాస్త్ర సమ్మతం అంటూ మాస్టరు చక్కగా మనకు తెలియజేశారు స్వస్తి వాసుదేవా

No comments:

Post a Comment