Sunday, May 17, 2026

Explainer | చిలుకూరు బాలాజీ ఆలయాన్ని టార్గెట్ చేసిన అమెరికా | USA | Chilkur Balaji Temple -TV9

Explainer | చిలుకూరు బాలాజీ ఆలయాన్ని టార్గెట్ చేసిన అమెరికా | USA | Chilkur Balaji Temple -TV9

Author Name:TV9 Telugu Digital

Youtube Channel Url:https://www.youtube.com/@TV9TeluguDigital

Youtube Video URL:https://www.youtube.com/watch?v=o5w_2LqOMEo



Transcript:
(00:00) హైదరాబాద్ లోని చిలకూరు బాలాజీ ఆలయాన్ని టార్గెట్ చేస్తూ అమెరికా సెనేటర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా హెచ్వన్బి వీసా కార్యక్రమంపై విమర్శలు గుప్పించిన అమెరికా రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ స్మిత్ చిలుకూరు బాలాజీ టెంపుల్ ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు [సంగీతం] సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసాయి. హైదరాబాద్ సమీపంలో ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని వీసా కార్టెల్ అంటే ఓ వీసా మాఫియాగా అభివర్ణించడం ఇప్పుడు ఇండో అమెరికన్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది.
(00:31) దీనిపై ఇటు భారత్లో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. [సంగీతం] అమెరికన్లకు ఉద్యోగాలు రాకుండా హెచ్వ వీసాల మాటున అమెరికాలోని ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారని మిస్సౌరి సెనటర్ ఎరిక్ స్మిత్ విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా వీసా కార్టెల్ నడుస్తుందని వారికి హైదరాబాద్లో ఓ వీసాల దేవాలయం ఉందని చినుకురు బాలాజీ దేవాలయాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు.
(01:01) భారతీయులపై ముఖ్యంగా హైదరాబాదీయులపై వరుస ట్వీట్లతో ఆయన అక్కసు వెల్లగక్కారు. అమెరికా ఉపాధి ఆధారిత వీసాల వ్యవస్థపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎరిక్ స్మిత్ కేవలం బాలాజీ ఆలయాన్ని మాత్రమే కాకుండా అమెరికాలోని ప్రస్తుత ఉపాధి ఆధారిత వీసా విధానంపై కూడా నిప్పులు జరిగారు.హెచ్వబిఎల్1ఎఫ్1 మరియు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపిటి వంటి వీసా ప్రోగ్రామలు అమెరికన్ మధ్య తరగతి ప్రజల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు.
(01:28) వాల్ స్ట్రీట్ జర్నల్ గతంలో ప్రచురించిన ఓ కథనాన్ని ఉటంకిస్తూ హైదరాబాద్ లోని చిలకూరు బాలాజీ ఆలయ ఫోటోను ఆయన షేర్ చేశారు. ఈ వ్యవస్థ ఎంతగా ఓ గేమ్ గా మార్చారో చెప్పడానికి ఇదే నిదర్శనం అని స్మిత్ పేర్కొన్నారు. ఈ వీసా కార్టెల్ కు హైదరాబాద్లో ఓ వీసా టెంపుల్ కూడా ఉంది. అక్కడ వేలాది మంది భారతీయులు తమ పాస్పోర్టులకు ఆశీర్వాదం తీసుకోవడం వీసాల కోసం ప్రదక్షణలు చేయడం కనిపిస్తుంది.
(01:51) ఇంతలా ప్రభావితం చేయబడిన వ్యవస్థతో మన అమెరికన్ కార్మికులు పోటీ పడాల్సి రావడం దురదృష్టం అన్నారు. నిజానికి మన కార్మికులు ఇలాంటి వారితో పోటీ పడాల్సిన అవసరమే లేదు అని స్మిత్ వ్యాఖ్యానించారు. మరో ట్వీట్ లో భారతీయ విద్యార్థులపై స్మిత్ అక్కసు వెల్లగక్కారు. విదేశీ విద్యార్థులో దాదాపు సగం మంది భారతీయులేనని వారికి అమెరికన్ పన్ను చెల్లింపుదరుల సబ్సిడీతో వర్క్ పర్మిట్లు లభిస్తున్నాయని స్మిత్ ఆరోపించారు.
(02:16) భారతీయ విద్యార్థులు హెచ్వబి గ్రీన్ కార్డుల వైపు వెళ్తుంటే భారీ విద్య రుణాలతో ఉన్న అమెరికన్ గ్రాడ్యుయేట్లు చౌకైన కార్మికులతో పోటీ పడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా భారతీయ వీసా హోల్డర్లు వీసా ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నలను పరస్పరం పంచుకుంటారని పెద్ద టెక్ కంపెనీలు ఈ వీసా వ్యవస్థల ద్వారా అమెరికన్ ఉద్యోగాలను మల్లిస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు.
(02:38) మెరిట్ స్థానంలో ఇప్పుడు జాతి ఆధారిత ప్రాధాన్యత చోటు చేసుకుందని ఎరిక్ స్మిత్ ఘాటుగా విమర్శించారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అమెరికా కల అంటే ముందుగా గుర్తొచ్చే పేరు హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ ఆలయం. వీసా ఇంటర్వ్యూ కి వెళ్ళే ముందు ఇక్కడ ప్రదక్షణలు చేయడం దశాబ్దాలుగా వస్తున్న ఆచారం. అయితే ఇప్పుడు ఈ పవిత్ర క్షేత్రాన్ని అమెరికాకు చెందిన సీనియర్ సెనేటర్ రాజకీయ వివాదంలోకి లాగడం వార్తల్లోకి ఎక్కింది.
(03:03) ఆయన కేవలం ఆలయం పైనే కాకుండా విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో పని చేసుకునేందుకు వీలు కల్పించే ఓపిటి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆయన డైవర్సిటీ ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ విభాగాల్లో కూడా హెచ్వబి వీసాల దుర్వినియోగం జరుగుతుందని అధికారులకు లేఖరాశారు.
(03:23) అమెరికాలో ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ వలసదారులు విదేశీ కార్మికులపై ఇలాంటి దాడులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎరిక్ స్మిత్ అమెరికాలోని మిసోరి రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ పార్టీ సెనేటర్ అమెరికా ప్రాధాన్యత విధానాన్ని నమ్మే ఆయన విదేశీయులకు ఇచ్చే హెచ్వబి వీసాల వల్ల స్థానిక అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని భావిస్తున్నారు.
(03:43) అందుకే ఈ ప్రోగ్రాంను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీసా నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకొని తక్కువ జీతానికే విదేశీ కార్మికులను తెచ్చుకునేందుకు టెక్ కంపెనీలు కన్సల్టెన్సీలు కలిసి చేసే ప్రయత్నాన్ని ఆయన వీసా కార్టెల్ అంటే వీసా మాఫియాగా అభివర్ణించారు. ఇక చిలకూరు బాలాజీ ఆలయ చరిత్ర విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లాలో హిమాయత్ సాగర్ తీరంలోని ఈ పురాతన బాలాజీ ఆలయాన్ని భక్త రామదాసు మేనమామలైన అక్కన్న మాదన్నలు నిర్మించారని చరిత్ర చెబుతోంది.
(04:13) ఏట తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ఓ భక్తుడు అనారోగ్యం కారణంగా ఓసారి వెళ్ళలేకపోయాడు. ఆ భక్తుడికి వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి నీకు దగ్గరలో ఉన్న అడవిలోనే నేను ఉన్నానని చెప్పాడట. ఆ భక్తుడు అడవిలోకి వెళ్లి భగవంతుడు చెప్పిన ప్రాంతంలో వెతికాడు. అక్కడ ఓ పుట్టను తవ్వుతుండగా వెంకటేశ్వరుని విగ్రహం బయటపడింది. అయితే గొడ్డలితో తవ్వుతుండగా ప్రమాదవశాత్తు గొడ్డలి స్వామి వారి గడ్డం కింద చాతీపై తగిలి ఆ విగ్రహం నుంచి రక్తం కారింది.
(04:39) భక్తుడు ఆ దృశ్యాన్ని చూసి నమ్మలేకపోయాడు. వెంటనే పుట్టలో ఆవుపాలు పోయాలని ఆకాశవాణి ఆదేశించగా భక్తులు అలాగే చేయగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడింది. నాటి నుంచి ఆ స్వయంభువుకు పూజ కార్యక్రమాలు మొదలయ్యాయి. తర్వాత అక్కన్న మాదన్నలు ఇక్కడ ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో హుండి ఉండకపోవడం మరో విశేషం. భక్తుల నుంచి కానుకలు తీసుకోరు.
(05:03) ఇక్కడ వీఐపి భక్తుల కోసం ప్రత్యేక వ్యూ లైన్లు కూడా ఉండవు. చిలుకూరి బాలాజీ ఆలయంలో భక్తులు 108 ప్రదక్షణలు చేస్తూ కనిపిస్తుంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా 11 ప్రదక్షణలు చేసి తమ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటారు. తమ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ ఆలయానికి వచ్చి 108 ప్రదక్షణలు చేస్తారు. అమెరికా వీసా రాని వారికి ఇక్కడ మొక్కుకుంటే వీసా వచ్చిందని అనేకమంది భక్తులు చెప్పడంతో ఈ ఆలయం వీసా బాలాజీగా పాపులర్ అయింది.
(05:30) అమెరికాకు చదువు కోసం వెళ్లి అక్కడ స్థిరపడుతున్న భారతీయుల్లో తెలుగువారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ ప్రపంచంలోనే అత్యధిక వీసాలు జారీ చేసే కేంద్రాల్లో ఒకటి. అమెరికా జారీ చేసే హెచ్వబి వీసాలతో భారతీయుల వాట అధికంగా ఉంటుంది. మొత్తంహెచ్వబి వీసాల్లో 70 నుంచి 80% వరకు భారతీయులకే లభిస్తుండగా చైనా వాట సుమారు 12%ా ఉంది.
(05:53) అమెరికన్ సెనటర్ నేరుగా భారతీయ సంస్కృతిని ఆచారాలను వీసా మాఫియాతో పోల్చడం గమనార్హం. ఇది కేవలం వీసా విధానంపై చేసిన నిర్మాణాత్మకమైన విమర్శ మాత్రమే కాదు భారతీయుల నమ్మకాలను కించపరచడం కూడానని భారతీయ నిపునులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సెనటర్ వ్యాఖ్యలపై చిలకూరి ఆలయ అర్చకులు మరియు భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.
(06:14) భక్తి అనేది వ్యక్తిగత విషయమని దానికి వీసా నిబంధనలకు ముడిపెట్టడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామం రానున్న రోజుల్లో భారత్ అమెరికా సంబంధాలపై లేదా వీసా నిబంధనలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

No comments:

Post a Comment