Friday, May 15, 2026

వ్యాసుడు జన్మ రహస్యం! | How Satyavati Became the Mother of Vyasa | Mahabharata EP-04 |In Telugu

వ్యాసుడు జన్మ రహస్యం! | How Satyavati Became the Mother of Vyasa | Mahabharata EP-04 |In Telugu

Author Name:Madan Gupta

Youtube Channel Url:https://www.youtube.com/@themadangupta

Youtube Video URL:https://www.youtube.com/watch?v=YkVgAhlTCKA



Transcript:
(00:00) తక్షకుడు రాలేదేమని అడిగాడు రాజు వాడు ఇంద్రుడి దగ్గర దాగున్నాడు అయితే ఇంద్రుడితో సహా ఈడ్చుకురండి అన్నాడు రాజు సైంద్ర తక్షకాయ స్వాహ తక్షకుడిని అక్కడే విడిచి పారిపోయాడు ఇంద్రుడు తక్షకుడు ఆకాశంలో విషం కక్కుకుంటున్నాడు. సుడిగాలిలో చిక్కుకున్న వాడిలాగా గిరగిర తిరుగుతూ తన్నుకుంటున్నాడు. తక్షకాయ స్వాహ అనడమే తరువాయి సరిగ్గా అదే సమయానికి ఆగిపోయింది యజ్ఞం అవును మహారాజా తక్షకుడి వల్లే మీ తండ్రిగారు కాలం చేశారు.
(00:37) [సంగీతం] సర్పయాగం జరగడానికి సర్వ సన్నద్ధుడుఅయ్యాడు జనమేజయుడు లెక్కలేనంత మంది బ్రాహ్మణులు సమావేశం అయ్యారు. స్వయంగా తానే అన్ని చూసుకుంటున్నాడు జనమేజయుడు హోమం ప్రారంభించారు. అగ్ని శికలు పైకి ఎగుస్తున్నాయి మంత్రోచ్చాటనతో ప్రాంగణం మాన్ రోగుతోంది మంత్రాలు వినబడుతున్న కొద్ది పాములు కనబడుతున్నాయి ఒక్కొక్కటి వచ్చి హోమగుండంలో పడిపోతున్నాయి పెద్ద పెద్ద పాములు కుప్పలుగా వచ్చి పడుతున్నాయి భయంతో ఒకదాన్నఒకటి పిలుచుకుంటున్నాయి విషం కక్కుకుంటున్నాయి తెల్లటివి నల్లటివి పచ్చటివి ఎర్రటివి రంగు రంగుల పాములు రకరకాల పాములు వచ్చి హోమగుండంలో [సంగీతం]
(01:14) పడిపోతున్నాయి. అలా పడి కాలుతూ ఉంటే పటేల్ పటేల్మని దారుణమైన శబ్దాలు వస్తున్నాయి. దుర్గంధం దుస్సహంగా ఉంది సర్ప ప్రళయంగా ఉంది సర్పయాగం సర్ప చక్రవర్తులందరూ జ్జరెల్లిపోయారు నాగలోకంలో ఏడుపులు పెడబొబ్బలు తప్ప ఇంకొక మాట వినిపించడం లేదు. కృష్ణార్జునుల గుణకీర్తనం పండు పెన్నెల భావాలు చంద్ర కిరణాలు ఇది వింటే అజ్ఞానం అనే చీకటి పటాపంచలు అవుతుంది.
(01:46) నమస్తే సదా వత్సలే మాతృభూమే నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్త భారతీయ సంస్కృతిని తెలుసుకోవడానికి మూలభూతమైన విజ్ఞాన సర్వస్వం మహాభారతం వేదాలలో చెప్పబడిన ధర్మాన్ని ఇతిహాస పురాణాల ద్వారా జనసామాన్యానికి అందించడం సమాజాన్ని ధార్మిక మార్గంలో నడపడం మన ప్రాచీన గ్రంథాల ధ్యేయం ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ధర్మాన్ని బోధిస్తూ చరిత్రను చెప్పడమే మహాభారతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
(02:17) అటువంటి మహాభారతాన్ని మన తెలుగు వారికి సరళమైన తెలుగు భాషలో వచన రూపంలో అందించాలని చేస్తున్న మహా ప్రయత్నం ఇది. మన నేటి తరం బిడ్డలు మహాభారతాన్ని గురించి తెలుసుకోవాలనే సత్సంకల్పంతో ఈ మహాభారత యజ్ఞాన్ని మొదలు పెట్టాం. పెద్దలు ఆశీర్వదించండి పిల్లలు విని ఆనందించండి మీకోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారనే తలుస్తాను.
(02:41) సుముఖస్చ కదంతస్ కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్ఞరాజో గణాదిప సరస్వతీ నమస్తుభ్యం సర్వదేవి నమో నమః శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః కృష్ణ ద్వైపాయనం వ్యాసం సర్వలోక హితేరతం వేదాభ్య భాస్కరం వందే సమాధి నిలయం మునిం అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకాయ చక్షురున్మీలితం యేనా తస్మై శ్రీ గురవే నమః మహాత్ములారా ఇప్పుడు పరీక్షిత్ మరణగాధ ఆది పర్వంలోని మూడో ఆశ్వాసంలోని వసు చరిత్ర మత్యగంధి మొదలైన భాగాలను చెబుతాను శ్రద్ధగా వినండి ఇక జనమేజయ చక్రవర్తి దగ్గరికి ఉదంకుడు వచ్చి పరీక్షిత్తుని తక్షకుడు చంపాడు అని చెప్పినట్టుగా ముందే
(03:27) చెప్పుకున్నాం కదా ఉదంకుడు చెప్పిందంతా విన్నాడు జనమేజయుడు ప్రశ్నార్థకంగా మంత్రుల్ని చూశడు అవును మహారాజా తక్షకుడి వల్లే మీ తండ్రిగారు కాలం చేశారు అని మంత్రులు కూడా చెప్పారు. కౌరవ వంశం నాశనమైన కాలంలో అభిమన్యుల వారికిన్ని ఉత్తరాదేవి గారికిన్ని పరీక్షిణ మహారాజు గారు జన్మించారు. ఉత్తరాగర్భంలోని పరీక్షిత్తును కృష్ణ పరమాత్ముడు బ్రహ్మాస్త్రం వారి నుండి రక్షించాడు.
(03:54) పరీక్షిన్ మహారాజు 60 సంవత్సరాలు ధర్మపాలన చేశారు. ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చూసుకున్నారు. పరీక్షితుల వారంటే పరాయి రాజులకు సింహ స్వప్నం మీ ముత్తాత పాండురాజుల వారిలాగానే వేట అంటే వెర్రి సరదా వారికి ఓనాడు మహారాణ్యంలో వేటాడుతూ ఓ లేడీని కొట్టారు దెబ్బ తిని బాణంతో సహా పారిపోయింది ఆ లేడీ పరీక్షితుల వారు దాన్ని వెంటబడ్డారు.
(04:20) వెంటాడి వెంటాడి బాగా అలిసిపోయారు. అపరిమితమైన దాహంగాను ఉంది. ఇలా వెళ్ళగా వెళ్ళగా ఒకచోట శమీకముని ఏకాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. అయ్యా నేను కొట్టిన లేడీ బాణంతో ఇలా వచ్చింది ఎటు వెళ్ళిందో చెప్పండి అని అడిగాడు మీ తండ్రిగారు మనోర్రతంలో ఉన్నాడు శమీకముని ఉలుకు పలుకు లేదు. మహారాజుకు కోపం వచ్చింది. పక్కనే చచ్చిన పాము ఒకటి ఉంటే ధనుస్సు కొనతో దానిని తీసి ముని మెడలో వేశడు.
(04:51) అయినా కదలలేదు శమీకముని హస్తినాపురం వచ్చేసాడు మీ తండ్రి గారు శమీకమునికి శృంగి అని ఒ కుమారుడు ఉన్నాడు. కృషుడు అనే ముని వల్ల తండ్రి మెడలో మహారాజు పాము వేసిన సంగతి విన్నాడు ఈ శృంగి కోపంతో ఊగిపోయాడు. ఏమిటి నిర్జనారణ్యంలో అందులోనూ మౌనంగా తపస్సు చేసుకుంటున్న మహా వృద్ధుడు నా తండ్రి దూడలు పాలు తాగాక పొదుగులో మిగిలిన పాల నురుగుతో తప్ప ఇంకో ఆహారం తీసుకొనివాడు నా తండ్రి అలాంటి మహామునిక ఈ అవమానం అంటూ జలాన్ని చేతిలోకి తీసుకున్నాడు.
(05:29) ఈ పరీక్షిత్తుని ఇవాల్టి నుండి ఏడవ రోజు పూర్తి అయ్యేసరికి దక్షక [గురకలు] సర్పం కరిసి చంపుగాక అని శాప జలాన్ని విడిచిపెట్టాడు వెంటనే తండ్రి దగ్గరకు పరిగెత్తాడు మెడలో వేలాడుతున్న సంగతే తెలియదు శమీకమునికి పామును తీసి పారేసాడు శృంగి కొడుకు వచ్చాక కళ్ళు విప్పాడు శమీకుడు కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు శృంగి తలవంచి తండ్రికి నమస్కరించి జరిగిందంతా చెప్పాడు.
(05:54) అంతా విని చాలా నొచ్చుకున్నాడు శమీకుడు మౌనం విడిచిపెట్టి ఇలా అన్నాడు ఎంత పని చేసావు నాయనా ఇంత క్రోధం మనకు తగునా క్రోధం తపస్సుకు హాని క్రోధం అష్టసిద్ధుల నాశన హేతువు క్రోధం సమస్త ధర్మాలకి చెదపురుపు మనం తాపసులం క్రోధం మనకు తగదు క్షమ చూపించాలి క్షమలేని వాడి తపస్సు గర్వపోతైన ధనికుడి ధనం ధర్మం లేని రాజు రాజ్యం పగిలిన కుండలోని నీళ్ళులాగా వ్యర్థమే విడవరాని క్షమను విడిచిపెట్టావు ఇహపరాలను దూరం చేసే క్రోధాన్ని చేపట్టావు మంచి చెడ్డ మరిచిపోయావు చక్రవర్తిని శపించావు చక్రవర్తి ఉంటేనే కదా మన తపస్సు నిర్విజ్ఞంగా కొనసాగుతుంది.
(06:37) మన పాలకుడిని మనం శపించడం పాతకం కాదా పోనీ పరీక్షిత్ మహారాజు సామాన్యుడా వీళ్ళ మీద లెక్కించదగిన ధర్మ ప్రభువు రాముడు మాందధాత భగీరథుడు ఎంత చల్లగా పాలించారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ మహారాజు పాలిస్తున్న పాలనను చూస్తూ ఉన్నాం. మరి వేట తమకంలో ఉన్నాడు చక్రవర్తి అలిసిపోయాడు దాహంతో ఉన్నాడు అలాంటి స్థితిలో తెలియక ఏదో చిన్న పొరపాటు చేశాడు అంత మాత్రానికి ఇంత దారుణమైన శాపం పెట్టావు.
(07:09) నేను సహించాను నువ్వు మాత్రం సహిస్తే ఏం పోతుంది అయిందేదో అయింది లే ఇప్పుడైనా శాపం మళ్ళంచు అన్నాడు. తలవంచుకున్నాడు శృంగి కోపంతో అనవలసింది ఏదో అనేశాను నా మాటకు తిరుగు లేదు ఈసరికే తక్షకుడు సిద్ధపడుతుంటాడు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. శమీకముని గౌరముకుడు అనే శిష్యుని పిలిచి విషయంఅంతా చెప్పి తక్షకుడి వల్ల ప్రమాదం రాకుండా ఏదైనా ఉపాయం చూసుకోమని చెప్పి పంపించాడు.
(07:40) విని ఎంత విచారించాలో అంతా విచారించారు మీ తండ్రి గారు మా అందరితోనూ చేయవలసిన ఆలోచన అంతా చేశాడు. వేలాది శిల్పుల్ని సమర్ధులైన వాళ్ళని నియోగించారు. దట్టమైన దిట్టమైన ఒంటి స్తంభం మేడను కట్టించారు. చిన్న చీమ కూడా దూరడానికి వీలు లేకుండా కాపలా పెట్టించాడు. మంత్ర తంత్రాలలో ఆరితేరిన విషవైద్యుల్ని నమ్మకమైన సేవకుల్ని మంత్రుల్ని మాత్రం దగ్గర పెట్టుకొని ఆ మేడలో నివాసం పెట్టాడు.
(08:14) మేమంతా కంటి మీద రెప్ప వేయకుండా వెయి కళ్ళతో కాసు కూర్చున్నాం. ఆ ఒంటి స్తంభం మేడలో ఎలా దూరడమా అని మన హస్తిన పట్టణం సరిహద్దుల్లో తిరుగడం మొదలు పెట్టాడు తక్షకుడు ఇలా ఆరు రోజులు గడిచిపోయాయి. ఏడో రోజు ఆ రోజే ఈ ఘోరం జరిగిపోయింది. ఆ రోజు చాలా దూరం నుండి ఒక బ్రాహ్మణుడు మన పట్టణానికి వస్తున్నాడు. తక్షకుడు అతన్ని చూశడు. ఓ ముసలి బ్రాహ్మణుడి వేషంలో అతన్ని కలుసుకున్నాడు.
(08:45) అయ్యా ఎవరు మీరు ఎక్కడికి మీ ప్రయాణం అని ప్రశ్నించాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు అయ్యా నేను సర్ప వైద్యుడిని మంత్రవేత్తను కాశ్యపుడిని హస్తినాపురం వెళుతున్నాను ఈరోజు పరీక్షిత్తుల వారిని తక్షకుడు కాటు వేస్తాడు అని విన్నాను. నా మంత్ర ప్రభావంతో మహారాజును బ్రతికిస్తాను. భూలోకంలో ప్రాణుల్ని పాములు తమ విషపు కోరలతో చంపడం చూసిన కశ్యప ప్రజాపతికి విరుడు మంత్రాలు ఉపదేశించాడు బ్రహ్మ ప్రజాపతి దగ్గర నేను నేర్చుకున్నాను మహారాజుని బతికిస్తాను నా దరిద్రం అన్నా తీరుతుంది అన్నాడు కశ్యపుడు పక్కున నవ్వాడు ముసలి బ్రాహ్మణుడి రూపంలోని తక్షకుడు ఇంత వెర్రివాడిని నిన్నే చూశాను
(09:26) పిడుగుకైనా మంత్రం ఉంటుందేమో కానీ తక్షకుడి కాటుకు మంత్రం ఏమిటి నేనే తక్షకుడిని నీ మందు మందులు మాకులు మంత్రాలు నా మీద పని చేయవు ఎందుకు వ్యర్థంగా శ్రమపడతావ్ వచ్చిన దాటిన వెళ్ళిపో కాదంటావా ఇదిగో చూడు ఈ మర్రి చెట్టును కరుస్తాను నా విషం అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. చెట్టును బతికించావా పరీక్షిత్తుని బ్రతికిస్తావా అని నమ్ముతాను అంటూ పక్కనే ఉన్న మర్రి చెట్టును కరిచాడు.
(09:54) బ్రహ్మాండమైన మర్రి చెట్టు అది కాటు పడిందో లేదో అంత చెట్టు మచ్చు కన్నా లేకుండా మాడి మాడి బుగ్గయింది. ఆ బూడిదంతా పోగు చేశడు కాశ్యపుడు మంత్రం వేశడు ఉత్తర క్షణంలో పూర్వం మరి చెట్టు ఎలా కళకళలాడుతూ ఉండిందో అలాగే కళకళలాడుతూ మరలా కళ్ళ ముందు నిలబడింది. తక్షకుడు ముక్కు మీద వేలు వేసుకున్నాడు. నాలిక కరుచుకున్నాడు. నువ్వు మహామాంత్రికుడివి నీకు జోహార్ట్లు నువ్వు ఎంతకైనా సమర్థుడివి కానీ మహానుభావ శృంగి శాపం వ్యర్థం కాకూడదు కదా నీకు కావలసింది ధనం కదా ఎంత కావాలో అంతా ఇస్తాను తీసుకొని నువ్వు తిరిగిపో అన్నాడు తక్షకుడు అప్పుడు కాశ్యపుడు అవును విషం తప్పించగలను కానీ బ్రాహ్మణుడి
(10:36) శాపం తప్పించకూడదు అన్నాడు తక్షకుడి దగ్గర అపారమైన ధనం తీసుకుని తిరిగి ఇంటి ముఖం పట్టి వెళ్ళిపోయాడు. అయితే నిర్జరారణ్యంలో జరిగిన సంఘటన నీకు ఎలా తెలిసింది అని ప్రభువులు అడగవచ్చు పట్నంలోని బ్రాహ్మణుడు ఒకడు కట్టెల కోసం వెళ్లి ఆ మరి చెట్టు పైనే ఉన్నాడు తక్షకుడి కాటుకు చెట్టుతో సహా భసం అయిపోయాడు కాశ్యపుడి మంత్రబలంతో తిరిగి చెట్టుతో సహా బతికాడు అతడే వచ్చి అందరికీ ఈ విషయం చెప్పాడు.
(11:09) కాశ్యపుడిని మళ్ళంచి నాగకుమారులను పిలిచాడు తక్షకుడు మీరంతా బ్రాహ్మణ కుమారుల వేషం వేయండి మంచి పళ్ళు పువ్వులు మోదుక దొప్పల్లో పట్టుకొని పరీక్షిత్తు దగ్గరకు వెళ్ళండి అని నియోగించాడు. తాను కూడా అదృశ్యంగా వాళ్ళతో బయలుదేరాడు చక్కని బ్రాహ్మణ యువకుల్లాగా తయారయ్యారు నాగకుమారులు వేదరుక్కులు వల్లిస్తూ వచ్చారు ఒంటి స్తంభం మేడ ముందు నిలబడ్డారు వారిని చూసి ఎదురు వెళ్ళారు ప్రభువులు వాళ్ళు ఇచ్చినవన్నీ పుచ్చుకున్నారు అందరినీ సత్కరించాడు.
(11:40) ఎంతటి వాళ్ళకైనా కాలం తప్పించుకోవడం కష్టం ప్రభు సాయంకాలం కాస్తుంది. గడయకో క్షణానికో సూర్యుడు అస్తమిస్తాడు అస్తినాపుర సూర్యుడే అస్తమించే సాయంకాలం ఇది నాగకుమారులు తెచ్చిన పళ్ళు తినాలని బుద్ధి పుట్టింది ప్రభువులకు దగ్గర ఉన్న వాళ్ళను చూసి పొద్దు గుంకిపోతోంది శాప సమయం గడిచిపోయినట్టే రండి ఈ పళ్ళు తిందాం అన్నాడు. అందరికీ పళ్ళు పంచారు.
(12:04) వారు ఒక పండు తీసుకొని తనపోయారు. అందులో సన్నటి నలక లాంటి చిన్న క్రిమి నల్లగా కనబడింది. చూస్తూ ఉండగానే ఎర్రగా రెండింతలు అయింది క్రమంగా రెండింతలు నాలుగింతలు పదింతలుగా పెరిగింది. బ్రహ్మాండమైన నాగుగా ప్రత్యక్షమయ్యాడు తక్షకుడు విషం కక్కుతూ బుసలు కొట్టాడు ప్రభువులు వారిని కాటు వేసి మాయమయ్యాడు. అతన్ని చూడగానే పరివారంఅంతా పారిపోయారు.
(12:32) ఒంటి స్తంభం మేడ ప్రభువులతో సహా భస్మమైపోయింది. పురోహితులు పరలోక క్రియలు నిర్వహించారు. ఈ దారుణం జరిగే నాటికి మీరు ఇంకా చాలా చిన్న వయసులో ఉన్నారు. చిన్నతనంలోనే మీకు పట్టాభిషేకం జరిగింది రాజ్యభారం పైన పడింది. ఒక బ్రాహ్మణుడు కోపంగా అన్న మాట మీద ఇంత ఘోరానికి ఒడిగట్టాడు తక్షకుడు. ప్రభువును తప్పకుండా సర్పయాగం చేయవలసిందే తక్షకుడిని వాడి వంశాన్ని మలమలా మార్చిన పాపం లేదు అన్నాడు ఆ మంత్రి తండ్రి మరణ వృత్తాంతం దారుణం అనిపించింది జనమేజయుడికి దుఃఖంతో కోపంతో కళ్ళు చెమల్లి ఎర్రబడ్డాయి వెంటనే పురోహితులను పిలిపించాడు ఋత్విజనులను రప్పించాడు తండ్రిని ఎలాగైతే
(13:16) తక్షకుడు దహించాడో అలాగే వాడిని వాడి వంశాన్ని బంధు మిత్రులతో సహా భస్మం చేయాలి. స్వర్గంలో ఉన్న నా తండ్రిగారు సంతోషిస్తారు. ఈ ఉదంకముని కూడా తృప్తి పడతాడు అంచేత సర్పయాగం అనేది శాస్త్రాల్లో ఉందో లేదో చూడండి అన్నాడు జనమేజయుడు ఉంది మహారాజా ఇది పురాణ ప్రసిద్ధి అని చెప్పుకుంటారు. అయితే ఇంతవరకు ఈ యజ్ఞం చేసిన వారంటూ ఎవరు లేరు ఇదే మొదటిసారి మీకోసమే దేవతలు దీన్ని ఏర్పాటు చేశారేమో అన్నారు ఋత్విజు సర్పయాగం జరగడానికి సర్వ సన్నద్ధుడయ్యాడు జనమేజయుడు కాశీరాజు సువర్ణవర్మ కుమార్తె ఒపుష్టదేవి జనమేజయుడు ధర్మపత్ని ఆమెతో సహా యజ్ఞ దీక్షకు
(13:58) సిద్ధమయ్యాడు మహా విద్వాంసులైన శిల్పాచార్యులు వచ్చి యజ్ఞశాలను నిర్మించారు పూచికపుల్లయనా లోటు లేకుండా ఎక్కడ చూస్తే అక్కడ యజ్ఞ సంభారాలతోను ధనధాన్యాలతోను పరిపూర్ణంగా ఉంది యజ్ఞశాల. ఎవరికీ నియమించబడినటువంటి పనుల్లో వాళ్ళు తీరిక లేకుండా ఉన్నారు. లెక్కలేనంత మంది బ్రాహ్మణులు సమావేశం అయ్యారు. స్వయంగా తానే అన్ని చూసుకుంటున్నాడు జనమేజయుడు ఇంతలో వాస్తుశాస్త్రం తెలిసినటువంటి లోహితాక్షుడు అనే పండితుడు యజ్ఞశాల నిర్మాణంలో ఏదో లోపం కనిపెట్టి రాజు దగ్గరకు వచ్చాడు.
(14:33) మహారాజా ఈ యాగం సలక్షణంగానే జరుగుతుంది. కానీ సగంలో మాత్రం ఆగిపోతుంది అన్నాడు. జనమేజయుడు ఆ మాటలు విని విననట్లే ఉన్నాడు అనుకున్న సమయానికి ఆరంభమైంది యజ్ఞం చమర వంశస్తుడైన చండ భార్గవుడు హూత హోత అంటే ఋగ్వేదం చదివేవాడు దేవతలను పిలిచేవాడు పింగళుడు అధ్వరుడు అధ్వరుడు అంటే యజుర్వేదం చదివేవాడు యజ్ఞాన్ని నడిపేవాడు శాద్యరవుడు బ్రహ్మ బ్రహ్మ నాలుగు వేదాలు చదివేవాడు అన్ని తెలిసి పనులు సరి చూసుకునేవాడు కాచ్యుడు ఉద్గాత అంటే సామవేదం చదివేవాడు యజ్ఞం మొదలైనప్పటి నుండి యజ్ఞం పూర్తి అయ్యేంతవరకు ఉద్గాత సామవేదాన్ని ఆలపిస్తూనే ఉంటాడు. వ్యాసుడు వైసంపాయనుడు
(15:19) పైలుడు జైమిని సుమంతుడు శుఖుడు శ్వేతకేతువు మౌద్గల్యుడు ఉద్దాలకుడు మాండవ్యుడు కౌశికుడు కౌండిన్యుడు శాండిల్యుడు క్రామరుడు కోహలుడు అసితుడు దేవలుడు నారదుడు పర్వతుడు మైత్రేయుడు ఆత్రేయుడు కుండజరుడు కాలఘటికుడు వాక్చు్యుడు శృతశ్రవుడు దేవశర్మ శర్మదుడు గోముడు శోదంకుడు హరితుడు రుడు పులోముడు సోమశ్రవుడు మొదలైన మునులంతా అక్కడ సదస్యులయ్యారు.
(15:50) మహారాజు నిర్ణయం ప్రకారం ఎవరికి నిర్దేశించిన స్థానాలలో వాళ్ళు కూర్చున్నారు. నల్లని వస్త్రాలు కట్టుకొని అగ్ని రగిలించారు యాగ్నీకులు పొగతో ఎర్రబడుతున్న కళ్ళతో హోమం ప్రారంభించారు. అగ్ని శికలు పైకి ఎగుస్తున్నాయి మంత్రోచాటనతో ప్రాంగణం మార్ రోగుతోంది. మంత్రాలు వినబడుతున్న కొద్ది పాములు కనబడుతున్నాయి.
(16:16) ఒక్కొక్కటి వచ్చి హోమగుండంలో పడిపోతున్నాయి. పెద్ద పెద్ద పాములు కుప్పలుగా వచ్చి పడుతున్నాయి. భయంతో ఒకదాన్నఒకటి పిలుచుకుంటున్నాయి. విషం కక్కుకుంటున్నాయి తెల్లటివి నల్లటివి పచ్చటివి ఎర్రటివి రంగు రంగుల పాములు రకరకాల పాములు వచ్చి హోమగుండంలో పడిపోతున్నాయి. యోజనాల తరబడి పొడవైనవి స్థూల అతి స్థూలమైనవి వచ్చి హోమగుండంలో పడుతున్నాయి.
(16:41) వందలు వేలుపే లక్షలుప లక్షలు హోమాగ్నిలో పడి మాడి మసి అవుతున్నాయి. అలా పడి కాలుతూ ఉంటే పటేల్ పటేల్మని దారుణమైన శబ్దాలు వస్తున్నాయి. దుర్గంధం దుస్సాహంగా ఉంది కోటీశుడు మానసుడు పూర్ణశలుడు హలీమకుడు పిచ్చలుడు కౌనవుడు చక్రుడు కాలవేగుడు ప్రకాలనుడు హిరణ్యబాహుడు శరణుడు కక్షకుడు కాలదంతుడు మొదలైన వాసుకీ సంతతి నాగులు పుచ్చాకుడు మండలుడు రణభేకుడు ఉచ్చికుడు శరభుడు భంగుడు బిల్వతేజుడు వరోహణకుడు శిలీశంకరుడు మూకుడు సుకుమారుడు ప్రవే పనుడు ముద్గరుడు శిశురోముడు సులోముడు మహానుడు మొదలైన తక్షక వంశనాగులు
(17:28) పారావతుడు పారిజాతుడు పారణుడు హరిణుడు కృషుడు విహంగుడు శరబుడు మోదుడు ప్రమోదుడు సంతాపనుడు మొదలైన ఐరావత సంతతి నాగులు ఏరకుడు కుండలుడు వేణి వేణీస్కందుడు కుమారకుడు బాహుకుడు ధూర్తకుడు శృగబేరుడు పాత్రుడు రాతకుడు మొదలైన కౌరవ్య కులం నాగులు శంకుకర్ణుడు పిరకుడు, కుటారుడు, సుఖశేచకుడు, పూర్ణాంగదుడు, పూర్ణముఖుడు, ప్రహసేనుడు, అవ్యయుడు, భైరవముండు, వేదాంగుడు, పింగళుడు, చోదప్రారకుడు, ఋషభుడు, వేగవంతుడు, పిండారకుడు, మహాసేనుడు, రక్తాంగుడు, సర్వసారంగుడు, చిత్రవేగికుడు, పరాశరుడు, తరుణకుడు,
(18:15) మణిస్కంధుడు, అరుణి మొదలైన దృతరాష్ట్ర సంత సంతతి నాగులు కట్టలు కట్టలుగా జట్లు జట్లుగా వచ్చి స్వాహా అవుతున్నాయి. సర్ప ప్రళయంగా ఉంది సర్పయాగం సర్ప చక్రవర్తులందరూ జ్జరిల్లిపోయారు. నాగలోకంలో ఏడుపులు పెడబొబ్బలు తప్ప ఇంకొక మాట వినిపించడం లేదు. తక్షకుడు గుండెల్లో దడపట్టుకుంది. తన మిత్రుడైన దేవేంద్రుడి దగ్గరకు పరిగెత్తాడు.
(18:42) రక్షించు రక్షించు అంటూ కాళ్ళ మీద పడ్డాడు. బ్రహ్మ దగ్గర విని జరగబోయేదంతా ముందే తెలుసు దేవేంద్రుడికి భయపడకు అని అభయంఇచ్చాడు చేరదీసి దగ్గర పెట్టుకున్నాడు ఇలా తన సంతతి తమ్ముల సంతతి దగ్దమైపోతూ ఉంటే భరించలేకపోయాడు వాసుకి ఏడుస్తూ పరిగెత్తాడు చెల్లెలు జరత్కారు దగ్గరికి చెల్లి మరొక్క నిమిషం ఆలస్యమైతే మన జాతి జాతి నాశనం అయిపోతుంది.
(19:07) నీ కొడుకుని పరిగెత్తించు నిన్ను ఇచ్చి జరత్కారుడికి ఈ ఆశతోనే పెళ్లి చేశాను. ఆ రోజు ఏలా పుత్రుడు చెప్పింది నువ్వు కూడా విన్నావు కదా అన్నాడు వాసుకి బాబు మామగారి మాట మన్నించు వెంటనే బయలుదేరు సర్పయాగాన్ని ఆపించి వంశాన్ని రక్షించు అంది కొడుకుతో జగత్కారు ఇప్పటివరకు గతించిన వారు గతించారు. ఇక ఒక్కరిని కూడా చావనివ్వను భయపడకండి అంటూ బయలుదేరాడు అస్తికుడు వేద వేదాంగ పారంగతులైన బ్రాహ్మణులను వెంటపెట్టుకున్నాడు వచ్చి యజ్ఞశాలలో జనమేజయుడు ముందు నుంచున్నాడు.
(19:42) స్వస్తి వాక్యాలతో చక్రవర్తిని స్తోత్రం చేశాడు. మహారాజ పవిత్రమైన చంద్రవంశంలో పుట్టావు భూలోక చక్రవర్తివి రాజఋషివి మాంధాత భగీరథుడు దశరధుడు శ్రీరాముడు ధర్మరాజు అర్జునుడు మొదలైన మహనీయులను మరిపించిన ధర్మ ప్రభువువి ప్రజల నోములు పండి పాండవ కులంలో ప్రభవించావు విశాలమైన రాజ్యలక్ష్మిని వరించావు అఖండమైన యజ్ఞాలు చేశవు చేతికి ఎముక లేకుండా అడిగిన వాళ్ళకు ఐశ్వర్యాన్ని పంచిపెట్టావు నల చక్రవర్తి చేసిన యజ్ఞం ధర్మరాజు రాజ జసూయం ప్రయాగంలో ప్రజాపతి చేసిన యాగం వరుణుడు చంద్రుడు వ్యాసముని జరిపిన మహా యజ్ఞాలు ఎంత గొప్పవో అంత గొప్పది నీ యజ్ఞం ఇది నడిపిస్తున్న
(20:26) రుత్విజులు బ్రహ్మతో సమానమైనవారు యజ్ఞ కార్యాల్లో హేమహేమీయులు తపోధనులు పండితులు విద్యానిధి [గురకలు] త్రిలోక పూజ్యుడైన వ్యాసముని శిష్యులతో సహా సదస్యుడుగా వచ్చాడు అంటే ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది నిజానికి రాజుల్లో విష్ణువు అంతటి వాడివి కనుకనే అతనే అగ్నిదేవుడు స్వయంగా జ్వాలాహస్తాలతో హవిస్సులను అందుకుంటున్నాడు నీ కోరికలను చెల్లిస్తున్నాడు అన్నాడు అస్తీకుడు అస్తీకుని మాటలు చక్రవర్తిని సదస్యులను ఆనందంలో ఓలలాడించాయి.
(20:59) అతడి తేజస్సు వాగ్ధోరణి అందరిని ఆకట్టుకున్నాయి అతని [గురకలు] మాటలు సమ్మోహనం కలిగిస్తున్నాయి. ఓ ఋషి పొంగవా ఏం కావాలి నీకు నువ్వు ఏం కోరుకుంటే అది ఇస్తాను సంకోచించకుండా చెప్పు అన్నాడు జనమేజయుడు సత్యవాక్కు నీది ఆడి తప్పని వాడివి సర్పయాగం విర్రమించు ఇదే నాకు కావలసింది అనుగ్రహించు ఇంతో శాంతించు మిగిలిన నా బంధువులకు ప్రాణదానం ప్రసాదించు అన్నాడు ఆస్తికుడు యజ్ఞశాలలోని సదస్యులందరూ ముక్త కంఠంతో కాదనకు మహారాజా అతని కోరిక చెల్లించు అన్నా న్నారు ఇచ్చిన మాట తప్పలేడు సదస్సుల మాట కాదనలేడు తప్పనిసరియై సర్ప యాగానికి స్వస్తి పలికాడు జనిమేజేయుడు
(21:43) [ఆశ్చర్యం] అస్త్రీకుడు యజ్ఞం దగ్గరకు వచ్చేసరికి హోమాగ్నిలో పడడానికి సిద్ధంగా ఉన్నాడు తక్షకుడు అతడు ఇంద్రుడి రక్షణలో వెళ్ళాడని చెప్పాను కదా ఎన్ని పాములు వచ్చినా అసలు శత్రువు తక్షకుడు రాలేదేమని అడిగాడు రాజు వాడు ఇంద్రుడి దగ్గర దాగున్నాడు అన్నారు దివ్య దృష్టితో చూసిన రుత్వికులు అయితే ఇంద్రుడితో సహా ఈడ్చుకరండి అన్నాడు రాజు ఆహ్వాన మంత్రాలు చదివారు రుత్వికులు సైంద్ర తక్షకాయ స్వాహ అని అనబోతున్నారు తక్షకుడిని అక్కడే విడిచి పారిపోయాడు ఇంద్రుడు తక్షకుడు ఆకాశంలో విషం కక్కుకుంటున్నాడు సుడిగాలిలో చిక్కుకున్న వాడిలాగా గిరగిర తిరుగుతూ
(22:25) తన్నుకుంటున్నాడు తక్షకాయ స్వాహ అనడమే తరువాయి సరిగ్గా అదే సమయానికి ఆగిపోయింది యజ్ఞం బతికిపోయావు భయపడకు అంటూ తక్షకుడిని మళ్ళంచాడు అస్తికుడు తక్షకుడు బతికిపోయాడు. ఇటు నాగవంశము అటు యావార వంశము రెండింటిని ఉద్ధరించాడు అస్తికుడు పాముల్ని ప్రళయం నుండి బ్రతికించడం చేతనే అతడి పేరు చెబితే సర్పభయం ఉండదు అని ప్రజలు విశ్వసిస్తున్నారు.
(22:54) ఇక్కడితో ఆదిపర్వం రెండో ఆశ్వాసం పూర్తఅయింది. ఇప్పుడు ఆదిపర్వం మూడో ఆశ్వాసంలోకి మనం అడుగు పెడదాం. ఇదంతా అయ్యాక ఒకనాడు పండిత గోషలో కూర్చున్నాడు జనమేజయుడు కవులు పండితులు మునలతో సభ నిండి ఉంది. ఎత్తైన రత్నాల పీట పైన కూర్చున్నాడు వ్యాస మహర్షి ఎవరి స్థానాల్లో వాళ్ళు ఆసీనులయనారు శిష్యులు అర్గ్యము పాద్యము ఇచ్చి పూజించాడు చక్రవర్తి చేతులు జోడించి ఎన్నాళ్ళ నుండో అడగాలనుకుంటున్నాను.
(23:26) మీరు భీష్మ పితామహులు రాజ్యం పంచిపెట్టారు కదా మా తాతలకి ఎవరి వంతుకు వచ్చిన రాజ్యం వాళ్ళు ఆనందంగా రాజ్యం చేసుకుంటూ జీవించవలసింది. అది మాని వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు చంపుకొని అంత జనక్షయం చేయడంలో ఆంతర్యం అర్థం కావడం లేదు నాకు మీరన్నా కుటుంబ కలహం మానిపించలేకపోయారా అని ప్రశ్నించాడు జనమేజయుడు. శిష్యుడైన వైశంపాయనుడు వైపు చూశడు వ్యాసమహర్షి మన మహాభారతాన్ని మహారాజుకు వినిపించు అన్నాడు గురువు పాదాలకు నమస్కరించాడు వైశంపాయనుడు పండితుల వైపు చూసి తలమంచి నమస్కరించాడు వాళ్ళ అనుమతి తీసుకున్నాడు భరతజాతి ఇతిహాసం మహాభారతం విష్ణుకల్పుడు వ్యాసమహర్షి
(24:13) హిమాలయ సానుల పైన కూర్చొని మూడేళ్ళు శ్రమించి రచించిన వీరగాధ రసబ్రహ్మం పంచమవేదం అలాంటి మహాభారతాన్ని జనమేజయ చక్రవర్తి సభలో వినిపించాడు వైశంపాయనుడు ఈ మహాభారతం లక్ష శ్లోకాలలో రాశారు మా గురువుగారు ఆయన మేధస్సు మహాసముద్రం అందులోంచి ఉదయించిందే ఈ మహాభారత చంద్రబింబం కృష్ణార్జునుల గుణకీర్తనం పండు వెన్నెల భావాలు చంద్ర కిరణాలు ఇది వింటే అజ్ఞానం అనే చీకటి పటాపంచలు అవుతుంది అంటూ అందుకున్నాడు కథ కథారంభానికి ముందు గ్రంథకర్త వ్యాసముని చరిత్ర అతడి పుట్టు పూర్వోత్తరాలు చెప్పాడు అదే వసు చరిత్ర చేది దేశాన్ని పూర్వం వసువు అనే రాజు
(24:59) పాలిస్తూ ఉండేవాడు. ఈ వసువు శ్రీరామచంద్రుడి కుమారుడు కుషుడికి విదర్భరాజ కన్యకి పుట్టిన నాలుగవ కుమారుడు అతడు ఒకనాడు వేటకని వెళ్లి అడవిలో ఒక ఋషి ఆశ్రమం చూశడు ఆయన అక్కడ మునీశ్వరులను చూసి వైరాగ్యం కలిగింది అతడికి ధనుస్సు బాణాలను వదిలి అక్కడే తపస్సులో కూర్చున్నాడు. కొన్నాళ్ళకు సపరివారంగా ఆయన దగ్గరకు దేవేంద్రుడు వచ్చేసాడు అంత రాజ్యాన్ని ప్రభుత్వాన్ని విడిచి తపస్సు చేస్తున్నావు రాజ్యాన్ని ఎంత ధర్మంగా పాలించావో తపస్సు కూడా అంత నిష్టతోనే చేస్తున్నావు సంతోషంగా ఉంది నాకు నీతో స్నేహం చేయాలని వచ్చాను నీకు ఒక రత్న విమానం ఇస్తాను దాని మీద నా
(25:40) దగ్గరకు వస్తూ వెళ్తూ ఉండు ఇదిగో ఈ కలువ పువ్వుల దండ ఎప్పుడు వాడిపోదు ఇది ఇదిగో ఇది ఇంద్రమాల ఇది నీ మెడలో ఉంటే ఎలాంటి ఎలాంటి ఆయుధమైనా శరీరానికి తగలదు ఇంకా ఇదిగో ఈ వెదురు బెత్తం చెడ్డవాళ్ళను శిక్షిస్తుంది ఇది మంచివాళ్ళను రక్షిస్తుంది ఇవి పెట్టుకొని సుఖంగా రాజ్యపాలన చెయ్ అని చెప్పి అవి వసురాజుకి ఇచ్చి ఇంద్రుడు వెళ్ళిపోయాడు.
(26:08) అది మొదలు విమానం మీద ఉపరివేధను సంచరించేవాడు వసురాజు అందుచేతనే అతన్ని ఉపరిచర వసువు అనే పేరు వచ్చింది అతడికి వెదురు బెత్తం ఇంద్రమాలికల ప్రభావంతో ఇంద్ర వైభవంగా రాజ్యం వెలుతూ అప్పుడప్పుడు స్నేహితుడైన ఇంద్రుడి దగ్గరకు ఇంద్రలోకం వెళ్లి వచ్చేవాడు ప్రతి సంవత్సరం ఇంద్రోత్సవం చేసేవాడు అప్పటి నుండే రాజులందరూ ఇంద్రోత్సవం మొదలు పెట్టారు.
(26:35) ఇంద్రప్రసాదం వల్లనే బృహద్రదుడు మణివాహనుడు సౌబలుడు యదుడు రాజన్యుడు అని ఐదుగురు కుమారులను కన్నాడు వసుమహారాజు వారిని ఐదు రాజ్యాలకు రాజులుగా అభిషేకించాడు. ఆ ఐదుగురు ఐదు వంశాలకు మూల పురుషులయ్యారు. చేది నగరం సమీపంలో ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంది దాని పేరు శుక్తిమతి ఆ ప్రక్కనే కోలాహల పర్వతం సుక్తిమతిని కోలాహలుడు ప్రేమించాడు.
(27:03) ఆమె ప్రవహించకుండా మధ్యనే అడ్డుకున్నాడు నదీ ప్రవాహం నిలిచిపోయింది. అది చూసాడు వసురాజు తన పాదంతో కోలాహలుడిని పక్కకు తోసాడు. కోలాహల పర్వత సంగమం వల్ల శుక్తిమతికి ఇద్దరు పిల్లలు కలిగారు. ఒక బాలుడు ఒక బాలిక బాలుడు వసుపదుడు బాలిక గిరిక కృతజ్ఞతా సూచకంగా వారిద్దరిని వసురాజుకు కానుకగా ఇచ్చింది శుక్తిమతి వసుసేనుడిని సేనా నాయకుడిగాను, గిరికను భార్యగాను చేసుకున్నాడు వసురాజు.
(27:38) ఒకనాడు ఋతుమతిగా ఉంది గిరిక. ఆమెకు లేడి మాంసం పెట్టమన్నారు పుత్రు దేవతలు. వేటకు బయలుదేరాడు వసురాజు అడవిలో ఉన్నాడే కానీ అతడి మనసంతా గిరిక మీదనే ఉంది. కుదురైన ఆమె స్థనద్భయం బిగువైన యవ్వనం ఆమె వయ్యారం సౌకుమార్యం తలుచుకొని మనసు మనసులో లేదు అతడికి తలుచుకొని తలుచుకొని చివరకు వీర్యస్కలనం అయింది. అమోఘమైన తన వీర్యం వృధా కాకూడదని దాన్ని ఒక ఆకు దున్నెలో భద్రపరిచాడు.
(28:05) ఒక డేగక ఇచ్చి దాన్ని గిరికకు ఇవ్వమని పంపించాడు. ఆకు దున్నె నోట కొర్చుకొని ఆకాశ మార్గాన వెళ్తుంది డేగ దారిలో మరో డేగ చూసింది అది మాంసం ఏమో అనుకని కలబడింది. రెండిటికీ పోరాటం జరిగింది. ఆ పోరాటంలో రెండవ దాని ముక్కు తగిలి ఆకు దొన్నె చీలికాయింది. వసురాజు వీర్యం క్రింద పడింది. గాలికి చెదిరి అందులో నుండి రెండు చుక్కలు యమునా నదిలో పడ్డాయి.
(28:34) అద్రిక అనే అప్సరస శాపవశాన యమునలో చేపగా తిరుగుతూ ఉంది. ఆ రెండు చుక్కల వీర్యాన్ని ఆ చేప మెంగింది. అది గర్భం దాల్చింది. 10 మాసాలు నిండాయి ఒకనాడు జాలరి వాళ్ళ వలలో ఆ చేప చిక్కుకుంది. వాళ్ళు దాన్ని కోసేటప్పటికి దాని కడుపులో నుండి ఇద్దరు పిల్లలు బయటకు వచ్చారు. ఒక మగపిల్లవాడు మరొక ఆడపిల్ల ఇద్దరిని తీసుకువెళ్లి దాశరాజుకి ఇచ్చారు జాలర్లు మనిషి పిల్లలను కనడంతోటే అద్రికకు శాప విమోచనం అయి ఆమె దేవలోకానికి వెళ్ళిపోయింది.
(29:06) చేపకు పుట్టిన పిల్లవాడిని మత్యరాజు అన్నారు. పెరిగి ప్రయోజకుడై మత్య దేశానికి రాజయ్యాడు ఈ మత్యరాజు. పిల్లకు సత్యవతి అని పేరు పెట్టారు. ఆమె శరీరం చేపల కంపు కుట్టేది. అందుకనే ఆమెకు మత్యగంధి అనే పేరు కూడా వచ్చింది. ఆమెకు [గురకలు] కాళి అనే మరో పేరు కూడా ఉంది. ఆమెను కూతురుగా పెంచుకున్నాడు దాసరాజు తండ్రి నియమించిన ప్రకారం యమునలో పడవ నడిపేది మత్యగంధి ఒకనాడు పరాశర మహాముని తీర్థయాత్రకు వెళ్తూ యమున దారిన వచ్చాడు.
(29:36) యమునను దాటడానికి చూశడు. అక్కడ మచ్చగంది పడవ కనిపించింది. పడవ మీద ఒంటరిగా ఉంది ఆమె బాటసార్ల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంకొక మనిషి లేడు రేవులో పరాశరుడు మచ్చగంది దగ్గరకు వెళ్లి నది దాటించమన్నాడు సరే అంది మచ్చగంది పడవలో కూర్చున్నాడు పరాశరుడు పక్కన పడుచు పిల్ల పడవ నడుపుతోంది ఉయ్యాల లలుగుతూ పడవ నడుస్తోంది.
(30:02) అద్భుతమైన వాతావరణం ఆమెను చూడడంతోటే చెల్లించిపోయాడు మహర్షి ఆయన మనసు మనసులో లేదు ఆమె ప్రతి కదలిక ఆయనలో కోరికలను రేపుతున్నాయి. ఎంత ముని అయినా మనిషే కదా అయితే మునుల చర్యలకు ఒక కారణం ఒక ప్రయోజనం ఉంటుంది. ఏకాంతం చల్లగాలి పడుచు పిల్ల ఎలా భరించడం చివరికి మనసులో మాట మచ్చగధితో అనేసాడు. మత్యగంది భయపడింది కాదంటే శపిస్తాడేమో తండ్రి చాటు పిల్లని జాతిలో జాలరి దాన్ని శరీరం చేపల కంపు ఇలాంటి నా మీద మీరు మనసు పడుతున్నారా మీరు చూస్తే మహర్షి ఏం చేయాలి కోరరాని కోరిక కోరారు.
(30:41) కన్నేరికం భంగమైతే ఇంటి ముఖం ఎలా చూడాలి అంది. భయపడకు కన్నెరికం కలుషితం కాదు నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు జాలరదారివి కాదు వసురాజు వీర్యంతో అద్రిక గర్భాన పుట్టావు ఇక చేపల వాసన అంటావా యోజనాల తరబడి పరిమలిస్తావు నువ్వు అని వరమించాడు పరాశరుడు ఆయన నోటి మాట బయటకు వచ్చే లోపలే ఆమె శరీరం పరిమళాలు వెరజల్లింది. మచ్చగంది యోజన గందిగా మారింది.
(31:08) చూస్తుండగానే ఆమె పొట్టె కోక మాయమయింది. దివ్య వస్త్రాలు దివ్యాభరణాలు ఆమె శరీరం మీదకు వచ్చాయి. యమునా నది మధ్యలో ఒక ఇసుక దిబ్బ చేరుకుంది పడవ చుట్టూ ఇంత బయలుగా ఉంది అని తాల్చుకుంది సత్యవతి తెరలు వేసినట్టు చుట్టూ కమ్ముకున్నాయి మంచు తెరలు యోజనగందితో కలిశడు పరాశరుడు ప్రజాపతి సమానుడు పరాశరుడు అతడి సంగమం వల్ల సత్యవతికి సజ్యోగర్భంలో పుత్రోదయం అయింది.
(31:35) కోరిన వరాలుఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు పరాశరుడు వ్యాసుడు సత్యవతి కుమారుడే ఆ వ్యాసుడే కృష్ణ ద్వైపాయనుడు మహాభారత గ్రంధకర్త పుట్టుకతోనే కపిల జడలు వేలాడుతున్నాయి జింక చర్మం వస్త్రంగా ఉంది కమండలం యోగదండం చేతిలో ఉన్నాయి నమస్కరించి తల్లి ముందు నిలుచున్నాడు వ్యాసముని అమ్మ అవసరం వచ్చినప్పుడు నన్ను తలుచుకో తలచిన వెంటనే మీ ముందు ఉంటాను అని చెప్పి తపోవనానికి వెళ్ళిపోయాడు వెళ్లి ఘోరమైన తపస్సు చేశాడు లోకోత్తరుడుఅయ్యాడు వేదాలను విభాగించాడు పంచమ వేదమైన మహాభారతాన్ని వ్రాశాడు భారత యుద్ధంలో పాల్గొన్న భారత వీరులంతా దేవ రాక్షస యక్ష పక్షి
(32:18) గంధర్వాదుల అంశలతో పుట్టిన వాళ్లే వాళ్ళ అందరి వివరాలు చెప్పాలి అంటే వెయి నోళ్ళు చాలవు లోడ పరశురాముడు దండెత్తి 21 మార్లు క్షత్రియుడు అన్నవాడిన అల్లా చంపాడు భర్తలు లేని క్షత్రియ స్త్రీలు ధర్మం తప్పకుండా తిరిగి మునుల ప్రసాదం వల్ల సంతానవంతులయ్యారు. కొడుకులని కూతుర్లని కన్నారు. క్షత్రియ సంతతి మరలా దేశవ్యాప్తమయింది.
(32:43) ప్రతి చోట రాజులు ఏర్పడ్డారు ధర్మ మార్గంలో రాజ్యాలు పాలించారు జారభయం చోరభయం లేకుండా ప్రజాశాంతి ఏర్పడింది. యధాపూర్వంగా వర్ణాశ్రమాలు నడిచాయి. ఎక్కడ పడితే అక్కడ యజ్ఞాలు అవి సాగాయి. ఇంద్ర ధర్మం ప్రకారం కోరినప్పుడు వర్షాలు కురిసాయి పాడి పంటలతో దేశాలు సుభీక్షమయ్యాయి జనసంఖ్య కోట్ల నుండి అర్బుదాలకు పెరిగింది ప్రజల ఆయు ప్రమాణము హెచ్చింది భారం మోయలేకపోతుంది భూదేవి వెళ్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో మొరపెట్టుకుంది.
(33:17) ప్రజాక్షయంతో కానీ సమస్య పరిష్కారం కాదు ప్రజాక్షయం కావాలి అంటే ఒక మహా యుద్ధం జరగాలి అందుచేత బ్రహ్మ మాట ప్రకారం విష్ణువు ఇంద్రుడు మొదలైన వాళ్ళు తమ తమ అంశల్లో భూలోకం మీద అవతరించారు. రాక్షసులు యక్షులు వాళ్ళ వాళ్ళ అంశల్లో పుట్టి ప్రజాకంటకులయ్యారు. దేవతల అంశల్లో పుట్టిన వాళ్ళు పాండవుల పక్షం రాక్షసుల అంశల్లో పుట్టిన వాళ్ళు కౌరవుల పక్షం ఇలా రెండు పక్షాలై పరస్పరం పోట్లాడి మరణించారు.
(33:45) లెక్కలేనంత జనక్షయం జరిగింది బరువు తేలికైంది భూదేవికి స్వస్తి దేవతలు పుట్టుక దానవుల యుద్ధాలు మొదలైన విశేషాలను తర్వాతి భాగంలో మనం విందాం. మిత్రులారా అనేకమంది ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు అందరికీ మా ధన్యవాదాలు మీ సహకారమే మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. మరింత బాధ్యతను మాకు గుర్తు చేస్తూ ఉంది. మీ ఆర్థిక సహాయాన్ని కొనసాగించండి.
(34:12) స్క్రీన్ పైన చూపిస్తున్న అకౌంట్ కు మీ సహాయధాన రాశిని అందించవచ్చు. మిత్రులారా మన వీడియోలు చూస్తున్న వాటిలో 70% మంది సబ్స్క్రైబ్ చేయని వారే చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అది మీరు మాకు ఇచ్చే గొప్ప ప్రోత్సాహం ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ది మదన్ గుప్త ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి, షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో మాతో పంచుకోండి.
(34:39) మమ్మల్ని మీరు మదన్ గుప్తఫేస్బుక్ లోనూ భారతీయులు అనే Facebook పేజీలోనూ మదన్ గుప్తఇస్గ లోనూ ఫాలో కావచ్చు మీ మిత్రులకు కూడా మన ది మదన్ గుప్త ఛానల్ను పరిచయం చేయండి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు ఓం శాంతి శాంతి శాంతిహి మరో ఎపిసోడ్ లో మళ్ళా కలుద్దాం అప్పటివరకు సలవా మరి జై హింద్ జై మాభారతి నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్త ఆ

No comments:

Post a Comment