Saturday, May 16, 2026

అవమానంలో కూడా సృజనాత్మకత A creative mind in shame

అవమానంలో కూడా సృజనాత్మకత A creative mind in shame

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pe9UzT0OId8



Transcript:
(00:01) ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ అండి ది యక్ట్ ఆఫ్ క్రియేషన్ దీన్ని రాసిది ఒక ఫ్రెంచ్ రైటర్ అన్నమాట ఆర్థర్ కస్లర్ అని ఏఆర్ టి హెచ్ యు ఆర్ కే ఓఈ ఎస్ టిఎల్ ఈ ఆర్ ఆయన ఒక రచయిత ఆర్ట్ ఆఫ్ క్రియేషన్ అనే ఒక కాన్సెప్ట్ ని కనిపెట్టి ప్రపంచానికి అందించాడు అన్నమాట సరే ఈ విషయం మీద ఆయన చాలా రాశడు అనుకోండి ఆప ఆ పుస్తకంలో ఒక కథ కూడా ఉందండి ఆ కథ కొత్త కొత్త ఆలోచనలు రేకిత్తిస్తుంది అన్నమాట ఎందుకంటే దాన్ని ఆలోచించే విధానం రెండు రకాలుగా ఉంటుంది సామాన్య మానవుడు ఒక రకంగా ఆలోచిస్తే ఓ పరిణితి చెందిన వ్యక్తి ఇంకొక రకంగా ఆలోచిస్తాడు అంటే హైయర్
(00:46) ప్లేన్ లో ఆలోచిస్తాడు అన్నమాట మనం ఆ హైయర్ ప్లేన్ ఏమన్నా పట్టుకోగలమా లేదా అన్నదే మనం ఆలోచించాలి ఇక్కడ అందుకే ఈ వీడియో చేస్తున్నానండి ఒక ఫ్రెంచ్ జనరల్ ఉన్నట్టుండి తన భవనానికి తిరిగి వచ్చేస్తాడు ఆ మెట్లు పైకి ఎక్కేసి తన సయ్యగారం అంటే బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. వెంటనే అక్కడ ఒక ఊహించని దృశ్యాన్ని చూస్తాడు అది ఏంటంటే అతని భార్య ఒక బిషప్ కౌగిల్లో ఆ అర్ధనగ్నంగా ఉండిపోతుంది అన్నమాట ఈ జనరల్ అలా చూస్తాడు కాసేపు వాళ్ళద్దరి వైపు వాళ్ళు కంగారుగా లేచి ఏదో బట్టలవి సర్దుకుంటారు.
(01:31) అలా సర్దుకుంటున్న సమయంలో అతను బాల్కనీలోకి వెళ్లి అలా రోడ్డు మీద పోతున్న వాహనాలని వ్యక్తుల్ని చూస్తూ ప్రశాంతంగా అందరినీ మే గాడ్ బ్లెస్ యు మే జీసస్ బ్లెస్ యు అని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాడు. ఇలా ఒక ఐదారు నిమిషాలు జరిగిన తర్వాత ఈ రాజుగారి భార్య బిషప్ ఇద్దరు కూడాను బట్టలవి వేసుకొని ఈయన ప్రవర్తనకి ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోతారు.
(01:59) బిషప్ మనసులో ఏమంటుందంటే రాజుగారు విషయం చూశారు కానీ బయటకి చెప్పుకోలేని విషయము అందుకని తగ్గిపోయి ఆయనక ఆయన సమాధాన పరుచుకుంటున్నాడు. అన్న ఒక ఆలోచనతో ఉంటాడు అది ఒక విధంగా బిషప్ ధైర్యం కూడా కావచ్చు మనం చెప్పలేం మనం చెప్పలేం. అంటే దీంట్లో కొంత నా విశ్లేషణ కూడా ఉంటుందండి కథ చిన్నదే ఆల్మోస్ట్ కథ అయిపోయినట్టే అప్పుడు ఈ బిషప్ వెళ్లి రాజుగారిని అడుగుతాడు ఏంటి మీరు చేస్తున్నది ఏంటి అని ఆ రాజు కాముగా ఏమంటాడంటే మీ పనిని నేను చేస్తున్నాను నా పనిని మీరు చేస్తున్నారు అంతే అంటాడండి [గొంతు సవరించుకోవడం]
(02:42) అనంగానే ఆ బిషప్ ఏదైనా ఒక పరిణితి చెందిన వ్యక్తి కదా సరే ఈ సంఘటన అనేది బలహీనమైన అక్షరాల్లో జరిగింది అనుకోండి అది వేరు ఆయన ఒక్కసారి సిగ్గుతో తలంచుకుంటాడు నిశశబ్దం అయిపోతాడు. వెంటనే రాజుగారు ఏం చేస్తారంటే ఆ బెడ్రూమ్లో ఆ ద్వారం దగ్గర నిలబడి అలా చేయి చూపెడతాడు మీరు వెళ్ళిపోవచ్చు అని అతను వెళ్ళిపోతాడు భార్య తలకాయ ఎంచుకొని ధైన్యంగా అపరాధ భావంతో నిలబడిపోతుంది అన్నమాట.
(03:14) రాజుగారు ఆమెని చూసి ఒకటే మాట అంటాడు. నువ్వు తప్పు చేసిన మాట వాస్తవమే నువ్వు పశ్చాత్తాప పడుతున్నట్టుగా నాకు కనిపిస్తున్నది. నిజానికి నువ్వు పశ్చాత్తాప పడుతున్నావో లేదో నాకు తెలియదు. అసలు ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతున్నదో కూడానో నాకు తెలియదు. ఏది ఏమైనా ఇప్పుడు నీ మీద కోపం తెచ్చుకొని నేను చేసేది ఏమి లేదు. నిన్ను శిక్షించి నేను సాధించేది ఏమి లేదు.
(03:46) కానీ రాజుగా నా మీద బాధ్యతలు చాలా ఉన్నాయి. ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కొంత ఆలోచన నీ మీద కూడాను నేను పెట్టాను. కాబట్టి నాకు ఇప్పుడు ఏమనిపిస్తున్నది అంటే నిన్ను నేను తప్పు పట్టను నువ్వు తప్పు చేశవా లేదా అన్నది నీకు తెలుసు అది నీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఒక పని చేస్తాను ఇక నుంచి నేను నిన్ను చూడను నువ్వు కూడా నన్ను చూడవలసిన అవసరం లేదు.
(04:19) కానీ విశాలమైన ఈ పెద్ద రాజభవనంలో నీకు చక్కటి ఏర్పాటు చేస్తారు. దేనికి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది ఏదనా ఉంది అంటే ఇంక జీవితకాలంలో నువ్వు నన్ను చూడలేవు నేను నిన్ను చూడలేను నీకు అన్నీ నడిచిపోతూనే ఉంటాయి. ఇంకా ప్రజా బాహుళంలోకి నాతో పాటు నువ్వు రాలేవు సభల్లో కూడా నువ్వు పాల్గొనలేవు. కాబట్టి దయచేసి నీకు ఏర్పాటు చేయంగానే చెప్పేస్తాను నువ్వు అక్కడికి వెళ్ళిపోయి ఉండు ఎందుకంటే రాజుగారి భార్యగా నీకు కొంత మర్యాదని నేను ఇవ్వాల్సి ఉంది.
(04:52) అంతే అని చెప్పేసి వెళ్ళిపోతాడండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆమె కూడాను అలా నిరత్తురాలై నిశబ్దంగా ఉండిపోతుంది ఎందుకంటే రాజుగారి మనస్తత్వం అంటే భర్త మనస్తత్వం తెలుసు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్టే దానికి కట్టుపడిపోతాడుని తర్వాత కొన్ని గంటల తర్వాత ఆమె కూడాను ఒక విధంగా ఆమె ఆమె సమాధాన పరుచుకుంది ఏమనింటే విషయం ఎటు బయటికి పొక్కటం లేదు నా పరువు ఏది పోవటం లేదు.
(05:22) రాజ సౌధంలోనే ఉంటాను నీకి తగిన ఏర్పాటు నా భర్త ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆయనను సాధించి ప్రయోజనం లేదు ఆయన తలుచుకుంటే నా మీద శిక్ష వేయగలడు. అని చెప్పేసి సపరేట్ అకామిడేషన్ కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకుందండి కాకపోతే ఆమెలో గిల్టీ ఉంది తప్పు చేశనన్న అపరాధ భావన కూడా ఉంది. కానీ పరిస్థితి విపరీత పరిణామాలకు దారి తీస్తుందేమో అన్న భయపడి ఈయన ఈమె చివరికి ఈ విధంగా ముగిసినందుకు ఒక విధంగా దేవుడికి కూడా మొక్కుందేమో మనసులో మనకు తెలియదు.
(06:00) సో ఇది జరిగిందండి సరే మన అందరికీ తెలుసు కదా రాదు తగిన ఏర్పాట్లు ఇట్లా చేసేస్తాడు. ఇక్కడ మనం ఏం ఆలోచించాలి ఈ విషయం గురించి అని ఇతను ఆర్థర్ కెష్లర్ ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తాడు. అంటే ఆ పుస్తకంలో ఇది ఒక కథ మాత్రమే అంతే ఈ కథ ఎందుకో నాకు నచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నా ఆయన చేసిన ప్రతిపాదన ఏంటంటే ఒక్కొక్కసారి మనిషి అన్నవాడు ఒక నెగిటివ్ ఆలోచనని ఒక పాజిటివ్ ఆలోచనని కూడాను ఒకే టైంలో భరించాల్సి వస్తుంది ఘర్షణకు లోన అయతాడు.
(06:36) సామాన్య మానవులు అయితే కుంగిపోతారు. కానీ పరిణతి చెందిన వ్యక్తి అయితే దాని నుంచే కొత్త విషయాన్ని ఆవిష్కరిస్తాడు అలా తన జీవితాన్ని సార్ధకం చేసుకుంటాడు అని చెప్తాడండి అని చెప్తాడు. మనం సింపుల్ గా చెప్పాలి అంటే ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ వైర్ ఇలా కలిసినప్పుడు ఒక వెలుగు వచ్చేస్తుంది కదా వెలుగు వచ్చేస్తుంది కదా దాన్ని ఆయన ఆయన భాషలో చెప్పాడు.
(07:05) సో ఇక్కడ నేను ఏమంటానఅంటే మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే రాజుగారికి రాణి గారికి మధ్య జరిగింది చాలా పెద్ద విషయమే కానీ మన నిత్య జీవితంలో కూడాను వ్యక్తుల ద్వారా అంటే జీవిత భాగస్వామి ద్వారా మనం కూడాను అంటే మిత్రుల ద్వారా బంధువుల ద్వారా లేకపోతే ఉద్యోగం చేస్తున్నప్పుడు లేకోతే వ్యాపార నిర్వహణలో మనం ఒక్కొకసారి ఇటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది మన మనసు చెప్తుంది మనకి ఎస్ కరెక్టే నీది కరెక్టే కానీ అవతల వాళ్ళు మోసానికి వడికట్టారు.
(07:39) పార్ట్నర్ మంచివాడు అని చెప్పేసి పార్ట్నర్షిప్ ఫర్మ్ లో చేర్చుకుంటే అతను మోసానికి వడికట్టాడు. ఈ సీక్రెట్స్ అన్ని బయటికి పంపించి ఆయన సెపరేట్ కంపెనీ పెట్టుకున్నాడు. అని అనుకోవచ్చు. సో ఇట్లా మోసానికి గురైనప్పుడు నెగిటివిటీతో మనం రగిలిపోతూ ఉంటాం. కానీ రగిలిపోయి చేసేది ఏమిటి? అలా గనుక రేగిలిపోతే నువ్వు అక్కడే ఆగిపోతావు కానీ నీ జీవితం అక్కడ ఆగకూడదు కదా కాబట్టి ఒక విన్నూతనమైన నిర్ణయం తీసుకోవాలి కదా ఎందుకంటే నీ దగ్గర ఉన్నవి రెండే రెండు ఆప్షన్లు ఆగి బాధపడుతూ అలాగే నిలబడి కూలబడిపోతావా లేకపోతే అంతటితో ఆ విషయానికి స్వస్తి చెప్పేసి
(08:22) కొత్త ఆవిష్కరణ చేసుకుంటూ కొత్త ఆలోచన చేసుకుంటూ ముందుకు సాగుతావా ఎందుకంటే భరించే కొద్దే విషయం బరువెక్కుపోతూ ఉంటుంది బరువు ఎక్కిపోతూ ఉంటుంది. చేతిలో పట్టుకున్న చిన్న నీళ్ల గ్లాస్ లాగా ఈ అంతసేపు పట్టుకుంటావు చెయ్యి నొప్పి పుట్టేదాకా పట్టుకుంటావు. ఇంకా ఒక రోజుంతా పట్టుకుంటుంటే నేను నర్వస్ వ్యవస్థ దెబ్బ తినేసి నీకు నర్వస్ ప్రాబ్లం వస్తుంది.
(08:47) సో మనం ఎదురైతున్న సమస్యల గురించి మనం ఇలాగే ఆలోచించి నా జీవితం నాది నా భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి ఎందుకంటే నేను భవిష్యత్తులో జీవించబోతున్నాను కాబట్టి ఇటువంటివి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. క్షమించేస్తే సరిపోతుంది మనసుకు తీసుకోకూడదు అని అనుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నది నా భావన అండి నా భావన ఇక్కడ రాజుగారు అసలు ఫ్రెంచ్ జనరల్ కి ఎదురైన అనుభవం అసలు చాలా అనైతికతకి పరాకాష్ట మన జీవితంలో అటువంటివి జరగకపోవచ్చు చాలా మంది జీవితాల్లో జరుగుతూ ఉండవచ్చు.
(09:25) సరే కొంతమంది దాన్ని కోర్ట్లో ఆశ్రయిస్తారు పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తారు లేకపోతే వాళ్లే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ అంత [గొంతు సవరించుకోవడం] పెద్ద విషయాన్ని పక్కన పెట్టండి. కానీ నిత్య జీవితంలో మనకు జరిగే చిన్న చిన్న విషయాలని పట్టుకొని అలాగే నిలబడిపోయి మనం నేరసించిపోయి ఇక క్రియాశీలత్వాన్ని కూడాను మర్చిపోయి మనల్ని మనం తక్కువ చేసుకుంటే చివరికి మనం సాధించేది ఏం లేదండి మనకు ఒరిగేది కూడా ఏమీ లేదు కాబట్టి మన జీవితాన్ని ఎప్పుడైతే ఒక ప్రయోజనానికి ముడిపెట్టామో ఆ ప్రయోజనం వెంబడి పడటమే మన జీవిత కర్తవ్యం
(10:06) అండి ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు కొన్ని వీడియోలో చెప్తూ ఉంటాను మనిషి జీవితం ఆ తర్వాత కష్టాలు వస్తూనే ఉంటాయి సమస్యలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. ఏ సమస్య గాని ఏ కష్టం గాన మన జీవితం అంతా వయసు ఉండదు వాటికి అలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఈ వాస్తవం తెలిసినప్పుడు దాన్నే పట్టుకొని వేలాడితే నష్టపోయేది మనమే అంటే ఎందుకో ఈ కథ గురించి నాకు చెప్పాలనిపించిందండి దీన్ని మనం మన జీవితానికి ఎందుకు అన్వయించుకోకూడదు అని ఇక్కడ రాజుగారు ఏ నిర్ణయం తీసుకున్నారంటే ఇక నా భార్య గురించి నేను ఆలోచించవలసిన పని లేదు నేను ఫ్రీ బర్డ్ ని ఇక నా జీవితంలో ఆమె
(10:50) లేదు కాబట్టి నేను ప్రజాపాలనని మరింత బాధ్యతగా నిర్వర్తిస్తాను. రాజుగా నా స్వధర్మాన్ని నేను ఇంకా అద్భుతంగా పాటిస్తాను. ఎందుకంటే నా ఆలోచనలో నా భార్య ఒక భాగం అయిన తర్వాత ఇప్పుడు ఆమె లేదన్న తర్వాత ఆ భాగాన్ని కూడాను నేను ప్రజల శ్రేయస్సు కోసమే వాడతాను. అని చెప్పి నిర్ణయించుకున్నాడండి నిర్ణయించుకున్నాడు మనిషి అన్న తర్వాత ఉంటుంది కదా కొంత బాధ కానీ ఒక అద్భుతమైన [గొంతు సవరించుకోవడం] నిర్ణయం తీసుకున్న తర్వాత మనసు తేలిక పడుతుందండి తేలిక పడుతుంది.
(11:25) సో దీన్ని మనం మన జీవితాలకి ఎందుకు అన్వయించుకోకూడదు అన్నదే ఇది ప్రధానమైన విషయంఅండి. అంతే ఈ నా భావనలో ఈ నా కంక్లూషన్ లో ఈ నా ఆలోచనలో తప్పు ఉండవచ్చు కాక మరి సబ్స్క్రైబర్స్ గా మీతో పంచుకోకపోతే నేను ఇంకెవరితో పంచుకుంటాను చెప్పండి. అందుకని ఆ కథ ఆధారంగా నేను కూడాను కొంత విశ్లేషణ చేసి కొంత జోడించి మీకు చెప్పడం జరిగిందండి ఇంతేనండి ఈ వీడియోలో ఉన్న సంగతి వినందుకు కృతజ్ఞతలు నమస్కారం

No comments:

Post a Comment