Friday, May 22, 2026

Desire vs Peace 📈 కోరిక పెరిగితే దుఃఖం కూడా పెరుగుతుంది | కోరికల బంధనం | దుఃఖం మాయ కోరిక మూలం 💠 P-06

Desire vs Peace 📈 కోరిక పెరిగితే దుఃఖం కూడా పెరుగుతుంది | కోరికల బంధనం | దుఃఖం మాయ కోరిక మూలం 💠 P-06

Author Name:My Journey Sg

Youtube Channel Url:https://www.youtube.com/@SaiGaneshRudrakshala

Youtube Video URL:https://www.youtube.com/watch?v=y95abyzIyLw



Transcript:
(00:03) హాయ్ అండి అందరికీ నమస్కారం. ఈరోజు మన స్పిరిచువల్ టాక్ లో సిక్స్త్ ఎపిసోడ్ ఈరోజు చాలా అంటే చాలా సింపుల్ గా మాట్లాడుకుందాం. సో ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా ఒక 10 నిమిషాల్లో ఆ టాపిక్ ఫినిష్ చేసేద్దాం. ఈరోజు టాపిక్ ఇంకా కావాలి అనే కోరిక ఏదైతే ఉంటదో అదే దుఃఖానికి కారణం. ఇది టాపిక్ అన్నమాట. ఇంకా కావాలి ఇది మనం ఆశ కింద చెప్పొచ్చు ఇంకా అత్యాశ కింద కూడా చెప్పొచ్చు అన్నమాట ఇంకా కావాలి ఇంకా కావాలి అనే కోరికనే మన దుఃఖాలక అన్నిటికీ కారణం ఎగ్జాంపుల్ చూద్దాం మన ఎగ్జాంపుల్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పుకోవచ్చు అన్నమాట స్టోరీస్ ఒక మిడిల్ క్లాస్ ఫాదర్
(00:45) ఉన్నాడు సో అతని గోల్ ఏముంటది అంటే అతని లక్ష్యం ఏముంటది భార్య పిల్లల్ని చూసుకోవాలి మంచిగా ఉండాలి డబ్బు సంపాదించాలి వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి ఇది సాధారణంగా అందరూ అందరూ మధ్య తరగతిగా ఉండే వాళ్ళందరూ మనం కూడా ఈవెన్ నేను కూడా నేను కోరుకుంటా కదా అలాగే అది దానికి తప్పు లేదు. సో ఎక్కడ ఇంకా కావాలి అని వస్తది అంటే ఆశ పెరిగినప్పుడు ఇంకా కావాలి అనే కోరిక పెరుగుతూ ఉంటది అన్నమాట అంటే నాకు ఇంకా కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిన్నాం మనం తింటామండి ఏదనా బయట రెస్టారెంట్ కి వెళ్ళాం లేదంటే ఇంట్లోనే చేసుకున్నాం మనకి ఇష్టమైన కూర
(01:18) ఆలగడ్డ లేదంటే గోంగూర అంటే కొంతమందికి ఇష్టమైన కర్రీస్ ఉంటాయి కదా నాకు ఆలగడ్డ ఫ్రై అని గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా చికెన్లు మటన్లో సో చికెన్ ఆబవియస్ అందరికీ ఇష్టమయ్యే ఉంటది కొంతమందికి బిర్యానీ అంటే ఇవన్నీ ఏంటంటే ఇష్టమైన పదార్థం అంతే కదా మనం మామూలుగా రోజు తినే వంటకాల కంటే ఏదన్నా ఇంట్లో నాన్ వెజ్ ఉండినప్పుడో లేదా మనకి ఇష్టమైన కూర చేసినప్పుడో మన అమ్మ మనకి తెలియకుండానే ఒక ముద్ద ఎక్కువగా ఉంటుంది.
(01:48) ఎందుకంటే ఆ వాడికి అదంటే ఇష్టం రా వాడికి ఆలట అంటే ఇష్టం లేదంటే వాడికి చికెన్ అంటే ఇష్టం రా వాడు ఎక్కువ ముద్ద ఎక్కువ తింటాడు అని మా అమ్మకి తెలుస్తది కదా ఇప్పుడు మీరు గమనించండి అక్కడ మనం సరిపడా తినం ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటాం అంటే ఇంకా ఎక్కువ తినేస్తాం అన్నమాట సో అలాగే మన జీవితంలో కూడా సరిపడా డబ్బు సరిపడా సిరి సంపదలు ఎవరికీ చాల అన్నమాట ఒక లక్ష రూపాయలు ఉంటే లేదు మనకి ఇంకా కావాలి.
(02:13) అందుకే కదా కోటీశ్వరులు ఇంకా ఇంకా సంపాదించేది దేనికి అంటే ఇంకా కావాలి అన్న కోరిక చావదు. ఎప్పుడన్నా బిజినెస్ లో నష్టం వచ్చిన స్టాక్స్ పడిపోయినా అప్పుడు ఏమైద్ది అంటే అప్పుడు దుఃఖం వస్తదిఅన్నమాట బాధ ఇప్పుడు మనం ఇంకా కావాలి ఇంకా కావాలని పరిగెడుతూనే ఉన్నాం కదా ఇంకా కావాలి అన్న కోరిక ఎప్పుడోకప్పుడు ఫుల్ స్టాప్ పడిద్ది. ఎప్పుడైతే ఫుల్ స్టాప్ పడిద్దో అప్పుడు అదే ఇంకా కావాలి ఇంకా కావాలి అనే మన తపన ఏదైతే ఉంటదో అది ముగిసిపోద్ది.
(02:39) అప్పుడు మనకి దుఃఖం కలిగిద్ది అన్నమాట. ఇప్పుడు ఎలా చెప్పుకున్నామో డబ్బు ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఎవరైతే అనుకుంటా ఉంటారో మీరు గమనించండి ఎప్పుడు ప్రశాంతంగా ఉండరు. వాళ్ళకి ఇంట్లో మంచి ఏస ఉంటది మంచి ఏమంటారు టైల్స్ టైల్స్ మార్బుల్స్ వేస్తారు చూడండి పాలరాయలు వేసుకొని ఇంట్లో మంచిగా అలా ఉంటది సోఫాలు ఉంటాయి డైనింగ్ టేబుల్ ఉంటాయి పెద్ద టీవీలు ఉంటాయి మంచిగా మెత్తటి పరుపు ఉంటది అన్ని ఉంటాయి అన్ని సౌకర్యాలు ఉంటాయి మంచి ప్రశాంతంగా తిని పడుకోవచ్చు కదా పడుకోరు వాళ్ళకి నిద్ర పట్టదు ఎందుకంటే ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలనే కోరికి వాళ్ళకి నిద్ర పట్టదు
(03:14) ప్రశాంతంగా పడుకోలేరు. అంత మెత్తటి పరుపు ఉన్నా కూడా నిద్ర పట్టక చాలా మంది అటు ఇటు మిసులుకుంటూ ఒకటి రెండిటి వరకు ఉండేవాళ్ళు నాకు చాలా మంది తెలుసు ఈవెన్ చూడండి మీరు గమనించండి అక్కడ డబ్బు లేదా డబ్బు ఉంది తినడానికి తిండి లేదా తిండి ఉంది వాళ్ళు ఎంతు సుఖాలు ఉన్నా కూడా వాళ్ళకి అవి సరిపోవు ఇంకా కావాలనే ఆ కోరిక ఉంటది కదా ఇంకా కావాలి ఇంకా కావాలని సో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు అన్నమాట దీంట్లో మళ్ళీ మన ఇంట్లో వాళ్ళు లేదంటే బయట ఇంకా ఎవరు ఉంటారు కదా పోటీ ఇది పోటీ ప్రపంచం కదా సో వాళ్ళకంటే ఇంకా ఎక్కువ సంపాదించాలి అంటే వాళ్ళని మనం
(03:48) కొలవానంగా పెట్టుకుంటాం అన్నమాట అంటే వాడికన్నా ఎక్కువ మార్కులు నాకు రావాలి లేదంటే ఇది ఓకే ఇది పిల్లల విషయంలో ఇది కొంచెం మెచ్చుకోవచ్చు అంటే వాడికన్నా బాగా చదవాలన్న కోరిక తప్పు కాదు కదా కానీ ఇక్కడ మన జీవితాల్లో ఏమైపోయింది వాడికన్నా ఎక్కువ మనం డబ్బు సంపాదించాలి వాడు ఒక బిల్డింగ్ కట్టేసి మనం రెండు కట్టాలి వాడు రెండు అంతస్తులు కడితే మనం మూడు అంతస్తులు కట్టాలి.
(04:10) ఆ వాళ్ళ వాళ్ళ కూతురికి ఇంత కట్టన ఇచ్చాడు వాడికి ఎక్కువ ఇయ్యాలి. ఇంకా మంచాలన్నీ పట్టుక రావాలి. వాడు గవర్నమెంట్ జాబ్ ఉన్నడికి ఇస్తే మనం కలెక్టర్ కి ఇచ్చేసేయాలి అంటే అన్నిటికన్నా పెద్ద పోస్ట్ కి ఇచ్చేసేయాలి. సాఫ్ట్వేర్ జాబ్ లో మన హైదరాబాద్ లో ఎవరికనా ఇచ్చారనుకోండి సంబంధానికి మనం అమెరికా అమెరికాలో ఉన్న అతన్ని పెళ్లి చేయాలన్నమాట.
(04:27) సో ఇలా మనం ఒకరితో ఒకరు పాటు పడి ఇంకా మనం గొప్పగా బతకాలి ఇంకా వాళ్ళకంటే ఎక్కువ బతకాలి ఇంకా మనకే ఆ కోరిక చావదన్నమాట. ఇప్పుడు మనం తిండి విషయంలో చూడండి సరిపడా తింటేనే అది కరెక్ట్ గా అరిగిద్ది ప్రశాంతంగా ఉంటది కడుపు. మనం ఎక్కువ తినేసామ అనుకోండి అది అరగదు ఇబ్బంది పడతాం. అలాగే అవసరం ఉన్నంత డబ్బు ఉన్నప్పుడే మనం ప్రశాంతంగా నిద్రపోగలం.
(04:50) మన అవసరానికి మించి డబ్బు ఉన్నది అంటే అది మనం ప్రశాంతంగా పడుకోం పడుకోనివ్వదు ఆ డబ్బు చాలా సింపుల్ కదా సో ఇప్పుడు మన చెప్పుల సైజు చూసుకోండి ఇప్పుడు నా చెప్పు సైజు తొమ్మిది అనుకోండి నేను తొమ్మిదే వేసుకోవాలి. చిన్నది వేసుకున్నా సరిపోదు పెద్దది వేసుకున్నా కూడా లూస్ అయిపోద్ది. మన చెప్పు సైజు ఎలా అయితే కరెక్ట్ గా చూసి వేసుకుంటామో మన జీవితంలో కూడా కష్ట సుఖాలు అలాగే వస్తాయి ఎంతవరకు రావాలి ఎంతవరకు ఉండాలి అవి అలాగే వస్తాయి వాటిని అలాగే అనుభవించాలి అలాగే నిరాశ చెందకుండా దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళాలి.
(05:23) ఒకరితో ఒకరు కంపేర్ చేసుకొని అరే వాడు చెప్పులు వేసుకున్నాడు వాడు 10వ సైజు పెద్ద సైజు వేసుకున్నాడు కదా నేను అలా వేసుకుంటా నాకు అలాంటిదే కావాలి అనుకుంటే మూర్ఖత్వం ఎందుకంటే నీ కాలు సైజు ఎంత నీ కాలు సైజు తొమ్మిది నువ్వు 10 ఎలా వేసుకుంటావ్ అది వేసుకుంటే నువ్వే జారి పడతావ్. ఇంకా చాలామంది అదే అదే తప్పు చేస్తా ఉంటారు అన్నమాట పక్కనోళ్ళు వాళ్ళుఏదో కొనుక్కుంటేనో లేదంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయనో వాళ్ళు కారు కొనుక్కున్నా లేదంటే ఇల్లు పెద్దగా కట్టుకున్నా ఇంకా వాళ్ళ అబ్బాయి ఏదనా పెద్ద ఉద్యోగం చేస్తున్నా మన ఇంట్లో ఉన్న మన అబ్బాయిని ఏదో అంటా ఉంటం లేదంటే వాళ్ళు
(05:53) చూడండి అలా అలా సెటిల్ అయ్యారు మనం ఇంకా సెటిల్ అవ్వలేదు ఇది ఇది అని ఉంటది కానీ వాళ్ళు వాళ్ళకి ఏం పనులు వర్కవుట్ అయ్యాయి వాళ్ళు ఏం చేశారు అలా అందరికీ జరగలని లేదు కదా సో మీకు మీరు ఉన్న దాంట్లో ఇంకా కావాలి ఇంకా కావాలి అని మితిమీరిపోకుండా ఉండి సంతోషంగా ఉంటే చాలు కదా మనం ఎప్పుడైతే ఇంకా కావాలి ఇంకా కావాలి అని అనుకుంటా ఉంటామో ఉన్నదాంట్లో కూడా సంతృప్తిగా ఉండలేం.
(06:17) నా పాయింట్ అర్థమయిందా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఫుడ్ పెట్టారండి మీకు ఇష్టమైన ఆలగడ్డ కర్రీ అనుకోండి అంటే నాకు ఆలగడ్డ అంటే ఇష్టం కాబట్టి అది ఎగ్జాంపుల్ చెప్తున్నా సో ఆలుగడ్డకు ఫ్రై అంటే ఇష్టం మీకు ఆలుగడ్డ కర్రీ పెట్టారు. మీరు ఎంతవరకు తినగలరు మీ కడుపులో సరిపోయేంత వరకు తినగలరు లేదా ఒక ముద్ద ఎక్స్ట్రా తినగలరు అంతే కదా మీరు ఆ కూర మొత్తం అవ్వగొట్టాలి అని కూర కూర తిన్నా కూడా మీకు రుచి అర్థం కాదు.
(06:39) నా పాయింట్ అర్థమైందా మనం ఇంకా కావాలి ఇంకా తినేయాలి అన్న కోరిక ఏదైతే ఉందో అలా తిన్నా కూడా మీకు రుచి అర్థం కాదు మీ కడుపులో ఉంటది మీరు తినేస్తారు అది అరగడానికి చాలా టైం ఉంటది మీరు ఇబ్బంది పడతారు. మీరు ప్రశంతంగా తినలేరు కదా ఇప్పుడు చాలా మంది మిడిల్ క్లాస్ లో కొంతమంది నాకు చాలా పర్సనల్ గా తెలిసినమాట ఒగ్గుమస్తగా చేస్తా ఉంటారు ఒక బాబాయి వచ్చేది తక్కువే డబ్బులు కానీ ఇద్దరు పిల్లల్ని చదివిస్తూ ఉన్నాడు ఇంట్లో ఖర్చు లేక చూసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు.
(07:08) అంటే హ్యాపీగా అంటే సర్దుకుపోతున్నారు అంతా ఓకే అంటే ఉన్నదాంట్లో చాలా హ్యాపీగా అంటే ఎప్పుడు చిరునవ్వుతో అంటే ఒక మందలిస్తే పలకరిస్తే అంటే కష్టాలు చెప్పకుండా పొద్దాక అది ఇది ఉంది ఇది ఏం చెప్పకుండా చాలా ప్రశాంతంగా సరిపోతున్నాయి సరిపచ్చుకుంటున్నాం అంటే అలాంటి ప్రశాంతతగా ఉండాలి ప్రతి ఒక్కలకి ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకునే దాంట్లోనే మనకి కష్టం ఉంటది దాంట్లోనే దుఃఖం ఉంటది.
(07:33) పుట్టిన దాంట్లో కూడా మనం సంతోషంగా ఉండలేం. ఎప్పుడైతే ఈ విషయం అర్థం అవుద్దో ముందు ఫస్ట్ ఎవరితో కంపేర్ చేసుకోము అంటే వాళ్ళకి ఇది ఉంది మనకి ఇది లేదు ఇలా అనుకున్నప్పుడే మనం తక్కువగా కనిపిస్తాం మనకి మనం ఇలా మనం ఒకరితో పోల్చుకున్నప్పుడే మనం తక్కువగా కనిపిస్తాం అంతే కదా ఇప్పుడు వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది కాబట్టి మనకి పెద్ద ఇల్లు లేకపోతే మనం తక్కువైపోతామా మనం ప్రశాంతంగా ఉన్నామా మనకి ఆరోగ్యం అందరికీ బాగుందా ఇంట్లో అందరూ బాగున్నారా ఆరోగ్యంగా ఉన్నారా పిల్లలు చదువుకుంటున్నారా మంచి నడవడికి ఉందా చాలు పిల్లల తర్వాత వాళ్ళే సంపాదిస్తారు.
(08:04) వాళ్ళకి ఇల్లు ఉంది అని ఇంట్లో మనం ఉన్ని కొనుక్కుంటూ ఉంటే ఇప్పుడు ఉన్న ఇంట్లో కూడా మనం ప్రశాంతంగా పడుకోలేం. చాలా మందిని గమనించండి ఉన్నదాంట్లో సంతోషం ఉండలేరు. మనక ఎప్పుడైతే ఎక్స్ట్రాగా అది కావాలి ఇది కావాలి అనుకుంటామో ఒక మైండ్ లో ఉంటది కదా సో నేను ఇప్పుడు ఆలగడ్డ కర్రీ తింటాన్నాను అనుకోండి. నాకు చికెన్ మీద మనసు ఉందనుకోండి ఇప్పుడు ఈ ఆలగడ్డ కూర తినేది కాబట్టి నేను ఆనందించలేను.
(08:28) మళ్ళ ప్లేట్లో పెట్టేసారు ఆలుగడ్డ కూర వడ్డించారు మంచిగా నీకు ఇష్టమే ఆలగడ్డ ఇష్టమే నీకు చికెన్ గుర్తొచ్చింది అనుకోండి నాన్ వెజ్ అది అది గుర్తొచ్చింది అనుకోండి మీరు ఇది ప్రశాంతంగా తినగలరా తినలేరు అలాగే ఇప్పుడు మీరు ఉన్నదాంట్లో సంతృప్తిగా ఆనందంగా దాన్ని అనుభవించాలి అన్నా కూడా ఇంకా కావాలి అనే మితిమీరిన కోరిక ఉండకూడదు.
(08:50) అదేంటి ఇలా ఉండకుండా ఎలా ఉంటది అందరికీ ఉంటది కదా అంటే ఉండాలి ఎలా ఉండాలి అరే మనం దీనికి ఏం చేయాలి ఇప్పుడు ఆ డబ్బు సంపాదించాలని చాలా మందికి ఉంటది కదా సో దానికి ఏం చేయాలి కొంచం ఖర్చు తగ్గించుకోవాలి ఎక్కడైతే అవసరం ఉంటదో అక్కడే ఖర్చు పెట్టాలి అలా అని బలవంతంగా డబ్బులన్నీ దాచేసుకున్న ప్రయోజనం లేదు. దాన్ని తెలివిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి.
(09:09) ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఏదో పెద్ద షేర్ మార్కెట్లు అన్నీ చేసేయాలని కాదు ఇప్పుడు చూడండి బంగారం ఒక రెండు సంవత్సరాల క్రితం 50,000 40,000 ఉండింది 2023 ఆ టైం కి మరి ఇప్పుడు 2026 టైం కిలక్షన్నర దాటింది. చూడండి అంటే మీకు అప్పుడు అంటే అంత ఐడియా ఉంంటే బంగారం ఎప్పుడైనా విలువైందాగా ఎన్ని సంవత్సరాలైనా తరతరాలు తాగారు బంగారానికి ఉండే వీళ్ళు బంగారానికే ఇప్పుడు చాలా మంది ఎవరో ఆలోచించారు కదా అంటే ఇంత 50,000 లక్ష రూపాయలు పెరిగింది ఒకేసారి ఎవరు అనుకోరు కదా అలా అనుకుంటే అప్పుడే అందరూ కొనేవాళ్ళు మంచి కిలోలు కిలోలు కనుక్కొని పెట్టుకునేవాళ్ళు బిస్కెట్లు అప్పుడు అంత
(09:41) తెలియదు తెలివిగా పెట్టుబడి పెట్టడం లేదంటే ఆ డబ్బులు దాచుకోవడం పిల్లల భవిష్యత్తుకి ఉపయోగించడం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలు బాగా చదువుకు చదువుకోవాలి ఇలా అనుకుంటా ఉంటారుఅన్నమాట వాళ్ళకి అవసరమైన పుస్తకాలు కొనేయటం ఇప్పుడు ప్రతిది డబ్బు కోసమే అని కాదు కదా సో మీరు పిల్లల మీద వాళ్ళకి ప్రేమతో అలా కొనిచ్చిన వాళ్ళు ఒకానొక టైంలో అరే మా నాన్న నాకు ఇది కొనిచ్చాడురా నేను ఇప్పుడు మా నాన్న కొనేయడం వల్ల నేను ఇంత గొప్పవాడిని అయ్యాను ఇలా చదువుకోగలను అన్న కృతజ్ఞత కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో డబ్బును దాచుకోవడం ఎంత ముఖ్యమో అలాగే
(10:13) అవసరమైన వాటికి ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం. అందుట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే కంపారిజన్స్ మానేయాలి అంటే ఒకరితో పోల్చుకొని నాకు ఇంకా కావాలి అంటే ఉన్నదాంట్లో సరిపచ్చుకోకుండా ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటా ఉంటే మనక ఎప్పుడు ఈ దుఃఖం వెంటాడుతూనే ఉంటది. ఇప్పుడు పరమేశ్వరుడు ఒకదానికి అంట ఉండడానికి ఏ లోటు లేదు తినడానికి అరే నీకు ఎప్పుడు ఆకలి నన్ను పిలు నిన్ను ఒక ముద్ద పెడతాను నీకు ఒక చిన్న ఇల్లిస్తాను ఆ ఇంట్లో అన్ని ఉంటాయి.
(10:40) ఆ ఆ ఇంట్లో అన్ని ఉంటాయి అన్ని సదుపాయాలు నువ్వు పడుకోడానికి చాపు ఉంటది మెత్తు ఉంటది ప్రశాంతంగా నిద్ర కూడా వచ్చింది ఫ్యాన్ ఉంటది అన్నీ ఉంటాయి కరెంట్ బిల్లు కూడా నేనే కడతారా సో నీ బాధ్యత నాది నీ బాధ్యత నీ కుటుంబం బాధ్యత నాది నువ్వు ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకో హ్యాపీగా ఉండని వరం ఇచ్చాడుఅన్నమాట పరమేశ్వరుడు ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేయాలి అలా వరం ఇస్తే డబ్బుకి ఆశపడకుండా ఇంకా వేరే వాళ్ళ దగ్గర దోసేద్దాం పెద్ద కంపెనీ పెడదాం ఇలా ఆశ పడకుండా ప్రశాంతంగా అర్రే పరమే నాకు ఒక ముద్ద పెడతా అన్నాడు కదా నాతో ఉన్నవాళ్ళకి నాకు పెట్టిన నాకు ఆకలి అవుతుందంటే పరమేశ్వరుడు పెడతాడు కదా సో
(11:14) ఒకవేళ నాతో ఉన్నవాళ్ళకి పెట్టాల్సిన స్థితి వస్తే నేను నా ఆకలి తీర్చుకోవడం కంటే వాళ్ళకి నా ముద్దు ఇచ్చేస్తే నేను మళ్ళీ పరమేశ్వరుడుని అడగొచ్చు కదా పరమేశ్వరుడు నాకు ఇస్తాడు కదా అన్నాడు కదా పరమేశ్వరుడే నీకు ప్రామిస్ చేశడు అరే నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నన్ను పిలువుని నిన్ను నేను చూసుకుంటా కదా ఇలా అన్నప్పుడు అతను ఏం చేయాలి ఎక్కువ ఇంకా కావాలి ఇంకా కావాలని ఆలోచించకుండా సో స్వామి నువ్వు ఉన్నావు కదా సో నేను వీళ్ళందరికీ నేను చేయాలనుకుంటున్నాను నా దగ్గర ఏం లేదు ఇలా పరమేశ్వరుడిని అడిగితే పరమేశ్వరుడు ఇవ్వడా నీకున్న దాంట్లో ఒక ముద్ద నువ్వు పెడితే
(11:48) నీ ఆకలి తీర్చకుండా ఎందుకు ఉంటాడు పరమేశ్వరుడు సో ఇలా ధైర్యంగా నిలబడ్డ రోజు అది నీకు దుఃఖానికి కారణం కాదు నీకు ఆకలి అవుతుంది నీకు అన్నం దొరికిద్ది ఎక్కడున్నా దొరికిద్ది స్వామి వివేకానందకి అలాగే కదా దొరికింది రెండు రోజులు పస్తు నుండి కళ్ళు తిరిగి పడిపోతే ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఆకలి తీర్చేవాళ్ళు స్వామి నేను మిమ్మల్ని కళలో చూశాను నాకు రాముడు కనిపించి చెప్పాడు ఇలా చెప్పేవాళ్ళు ఎందుకు అలాంటి స్థితి అలాంటి స్థితి మనకు కలగాలి కదా ఈ విశ్వమే మన ఇల్లు ఇక్కడన్న ప్రతి జీవిది మనదే బాధ్యత కదా మనం ఒక్కలమే మన కడుపు నింపుకుంటూ స్వార్థంగా మనమే
(12:22) సంపాదించేసుకోవాలి మనమే దోషేసుకోవాలి అనే ఆలోచన ఎంత మూర్ఖమైనది ఉంటే మనం 50 ఏళ్ళ వందఏళ్ళు ఉంటాం ఈ రోజుల్లో ఎప్పుడఏమైదో తెలియట్లే ఎప్పుడైనా చనిపోవచ్చు ఎప్పుడైనా శరీరం విడిపోవచ్చు మన నుంచి ఎంత గొప్పగా బతకాలి సరదాగా నవ్వుకుంటూ అందరితో ఎవరైనా కష్టాల్లో ఉంటే మనకి మనం చేయగలిగిన స్థితిలో ఉంటే ఆ పరమేశ్వరుడే మనల్ని పరీక్షించడానికి వచ్చాడు మనం సహాయం చేద్దాం ఒక జీవి ఆకలి తీరుద్దాం.
(12:47) అలా బతికిన రోజు మనకి దుఃఖం మన దగ్గరికి కూడా రాదు. చూడండి ఇప్పుడు మీరు మంచిగా తింటున్నారు అనుకోండి ఇంట్లో ఒక్కొక కుక్క బయట అన్నం వెతుక్కుంటూ కనబడతాయి కదా రోడ్డు మీద మనకి అలా అన్నం వెతుక్కుంటూ అటు ఇటు చెత్త మొత్తం పిచ్చి పిచ్చిగా చేస్తుంటే మీరు ఎలా తినగలరు మీకు అది కనిపించింది అది ఆకలితో అలమటిస్తుంది తిరుగుతుంది అటు ఇటు మీరేమో మంచిగా పల్లలు అన్నం పెట్టుకొని మంచిగా తింటూ ఉన్నారు అలా ఎలా తినగలరు దానికి ఒక ముద్ద పెడితే ఏమైంది మీకు ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు కదా అలాంటి నమ్మకం అలాంటి ధైర్యం ఉన్న రోజు మీ ఆకలి తీరకపోయినా పర్లేదు ఒక జీవి ఆకలి
(13:24) తీర్చాలని మీ దగ్గర ఉన్న ఒక ముద్ద తీసుకొని దానికి పెట్టేస్తారు. ఇది చూసి పరమేశ్వరుడు మిమ్మల్ని చెప్తున్నా కదా ఇది గమనించిన పరమేశ్వరుడు అసలు అల్టిమేట్ అన్నమాట మిమ్మల్ని ఏ స్థాయిలో మీ జీవితాన్ని నిలబెడతాడో తెలియదు అంత ఉత్తమమైన జన్మ ఇవ్వగలడు అంత ఉత్తమమైన స్థితి ఈ జన్మలో కల్పించగలడు. అరే వీడు వీడికి లేకుండా ఇచ్చాడురా వీడికి మనం ఇంకా ఐశ్వర్యాన్ని ఇచ్చేద్దాం వీడు టెస్ట్ పాస్ అయిపోయాడు.
(13:49) వీడికి ఐశ్వర్యం ఇచ్చేస్తే వీడు వీడికి జీవితాంతం వీడు ఇలాగే చేస్తా ఉంటాడు. వీడికి వీడు ఒక్కడికి మనం ఒక ముద్ద పెడితే వీడు ఒక 10 జీవులు ఆకలి తీర్చగలడు మనం వీడికి ఇంకా ఎక్కువ ఇద్దాం ఇలా ఆలోచిస్తాడు పరమేశ్వరుడు అంతే కదా ఎవరైతే మంచిగా చూసుకోగలరో వాళ్ళకే కదా బాధ్యతలు అప్ప చెప్పేది. సో మీరు అంత నిష్కల్మషంగా ఉంటే పరమేశ్వరుడే మీకు ఆ బాధ్యతని ఇస్తాడు కదా మనం ఏదో ఇంకా కావాలి ఇంకా తినేయాలి దోసేసుకోవాలి ఇలాంటి కోరికలు ఉంటే ఎలా వేస్ట్ కదా సో ఆ అబ్బాయి విషయంలో చూడండి అలా గుడ్డిగా పరమేశ్వరుడు ప్రామిస్ చేశడు నాకు నేను డబ్బుకు ఆశపడను డబ్బుకి పరిగెత్తాను ఆ ఒక పని చేస్తున్న
(14:25) దాన్ని మనస్ఫూర్తిగా చేస్తా అని నిలబడితే ఆ పరమేశ్వరుడే తోడుంటాడు. నిన్ను కొనడానికి ఎవరు సరిపోరు నీకు ఒక కోటి రూపాయలు ఇచ్చి లేదంటే నేను మొత్తం తిప్పుతా నేను ఈ ప్రపంచం మొత్తం తిప్పుతా నీకు ఇన్ని డబ్బులు ఇస్తా మీ కుటుంబ బాధ్యత నేను చూసుకుంటా నీకుేమనా ఖర్చులు ఉంటే నేనే చూసుకుంటా అని చెప్పి నీకు ఒక లక్ష రెండు లక్షలు ఇస్తా ఈ అబద్ధం చెప్పు నాకోసం అని చెప్పిన ధర్మానికి తప్ప దేనికి తలవంచడు పరమేశ్వరుడి మాటకు తప్ప దేనికి విలువని ఇవ్వడు అలా బ్రతికిన నాడు అలా బ్రతికితే అసలు ఆ పరమేశ్వరుడు ఇచ్చే ఆ కౌగిలిందా అసలు ఇన్ని జన్మలైనా నువ్వు
(14:59) ఇలాగే ఉంటావు పరమేశ్వరుడి దగ్గర ఉంటావు అలా పడి ఉంటావు పరమేశ్వరుడి దగ్గర అంతే ఆ స్థితి ఆ స్థితి ఎప్పుడైతే వస్తదో నీకు దుఃఖంతో పని లేదు అసలు దుఃఖాన్ని నువ్వు పట్టించుకోవు అది దుఃఖం అని కూడా నువ్వు పరమేశ్వరుడు నీకు తెలియంది ఇవ్వడు నీకు ఎన్ని దుఃఖాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఆ ఎలా ఉంటదంటే ఒక ఒక సంఘటన ఉంటది అన్నమాట ఆ శైవులు వైష్ణవులు కొట్టుకునేటప్పుడు ఎవరైతే శివుడిని పూజిస్తారో వాళ్ళందరినీ ఇలా టార్చర్ పెట్టడం ఇట్లా కొట్టడం జరుగుతా ఉంటది సో అలాంటప్పుడు ఒకాయన రాళ్లుు పట్టుకొని శివుడి మీద ఇసిరేస్తా ఉంటాడు అన్నమాట అది పూజ అనుకుంటాడు ఆయన అంటే నేను ఇలా
(15:34) మనస్ఫూర్తిగా నేను పూలు వేస్తే నన్ను కొడతాన్నారయ్యా సో నేను తిడతా ఉంటా తిట్టుకుంటే నీ మీదకి రాళ్ళు ఇసిరేస్తా ఇవే నిన్ను నీకు చేసే పూజ అని చెప్పేసి అన్నమాట అప్పుడు ఆ రాళ్ళన్నీ పరమేశ్వరుడి మీద పూలుగా మారిపోతాయి అతను ఏదైతే కోపంతో తిడతా ఉంటాడో అంటే నువ్వు ఇది ఇది నువ్వు అది స్మశానంలో ఉంటా అది ఇది అని తిడతా ఉంటాడు అందరి ముందు కాకపోతే అక్కడ శివుడిని స్తుతిస్తున్నాడు ఆయన మీరు చూడండి బయటకి కనిపించడానికి ఎలా ఉంది నువ్వు వేసింది రాళ్ళు నువ్వు తిడుతున్నావు శివుడిని కాకపోతే అక్కడ శివుడిని పూజిస్తున్నట్టే అది ఇంత జ్ఞానం మనం మన కర్మలో ఇమిడుచుకుంటే మనం చేసే
(16:05) ప్రతి పనికి ఆ పరమేశ్వరుడే సాక్షి అక్కడ వెళ్ళిన ప్రతి రాయి పువ్వైపోయింది ఇతను తిట్టిన ప్రతి తిట్టు పరమేశ్వరుడిని నింద చేసినట్టు కాదు అది పరమేశ్వరుని స్తుతించినట్టు అలా మనం ఇంకా కావాలని కోరికలని ఎప్పుడైతే వదిలేస్తామో మీరు ఏమి అడగకపోయినా మీ జీవితంలోకి అన్ని వస్తా ఉంటాయి మనమైతే ఇంకా కావాలి ఇది కావాలనుకుంటాం అది వచ్చినా బాధపడతాం రాకపోయినా బాధపడతా ఉంటాం బాధ కామన్ మనకి దుఃఖం అనేది కామన్ ఒకవేళ వస్తేనేమో దాన్ని హ్యాండిల్ చేయలేం.
(16:35) ఒక రాలేదు అనుకోండి మనం ఏం చేస్తాం మనం బాధపడతా ఉంటాం అమ్మ నాకు రాలేదు వాళ్ళు బాగుపడిపోతున్నారు మనం బాగుపడిపోవట్లేదు ఇలా ఉంటది. సో ఇవన్నీ వదిలేసి ప్రశాంతంగా ఇంకా కావాలన్న కోరికని వదిలి చూడండి. ఉన్నదానిలో సంతృప్తిగా ఉంటారు చాలా అంటే చాలా బాగుంటారు. అలాంటి స్థితిని మీరందరూ అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమఃశివాయ సర్వం శివం జగత్ వచ్చే వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుసుకుందాం.

No comments:

Post a Comment