Friday, May 22, 2026

పక్కవారికి కండిషన్స్ పెట్టి సంపకు🌹కండిషన్స్, కండిషనింగ్స్ దరిద్రాలు🌹POSTCARD (81) from Kanthrisa

పక్కవారికి కండిషన్స్ పెట్టి సంపకు🌹కండిషన్స్, కండిషనింగ్స్ దరిద్రాలు🌹POSTCARD (81) from Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=xJl7EHSj8Z4



Transcript:
(00:02) నేను చెప్పేది చాలా చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకసారి ఆలోచించండి. ఈ జీవితానికి సంబంధించింది మన మానవ సంబంధాలకు సంబంధించింది. రకరకాల విషయాలతో ముడిపడిన అంశం ఇది మనం పుట్టినప్పటి నుంచి వేరే వాళ్ళు చెప్పే మాటల వల్ల మన జీవితం మొదలవుతుంది. మనం మొట్టమొదట మాటలే వింటాం ఆ తర్వాత ఆచరిస్తాం. అలా వేరేవాళ్ళు చెప్పే మాటలు విని అది మనం చేస్తూ వచ్చినప్పుడు ఒక కండిషనింగ్ ఏర్పడుతుంది.
(00:38) ఇంగ్లీష్ లో రెండు పదాలు ఉన్నాయి కండిషనింగ్ అండ్ కండిషన్ వేరే వాళ్ళ వల్ల మనలో కండిషనింగ్స్ ఏర్పడతాయి. మనం కరెక్ట్ అనుకున్న దాన్ని వేరే వాళ్ళకు చెప్పే ప్రయత్నంలో మనం కండిషన్స్ పెడతాం. వేరేవాళ్ళు మనక ఏం చెప్పారు చిన్నప్పటి నుంచి ఇలా కూర్చో అలా మాట్లాడొద్దు ఆవలిస్తే నోటికి అడ్డం పెట్టుకో అమ్మాయిలకైతే కాళ్ళ మీద కాలువేసుకొని కూర్చో వద్దు ఇలా ఆ ఇలా కూర్చోవద్దు అలా కూర్చోవద్దు ఇలా మొదటి ఇవన్నీ మంచికే అనిపిస్తాయి ఎందుకంటే మనకు ఆలోచించే సామర్థ్యం ఉండదు కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి చెప్పింది చేస్తాం.
(01:14) చేసి మెల్లమెల్లగా అవే మన వ్యక్తిత్వంగా మార్చేసుకుంటాం. సో ప్రమాదకరమైన విషయం ఏంటంటే అదే కరెక్ట్ అనుకొని అది మన పక్క వాళ్ళకి మనం కండిషన్స్ గా పెడతాం. సో ప్రేమ పేరుతో కేర్ పేరుతో మనం పక్కవాళ్ళని ఇబ్బంది పెడుతున్నామేమో వాళ్ళ స్వేచ్ఛను హరిస్తున్నామేమో డిసిప్లిన్ పేరుతో ఎదుటి వ్యక్తిని మనం వాళ్ళ జీవితాన్ని కాఠిన్యంగా మార్చేస్తున్నామేమో మనం చిన్నప్పటి నుంచి పెట్టిన కండిషనింగ్స్ ఒకసారి మీరు తలుచుకుంటే ఆశ్చర్యపోతారు ఎన్ని కండిషనింగ్స్ో పెద్దవాళ్ళ ముందు నవ్వొద్దు అబ్బాయివిరా ఏడుస్తావా నువ్వు
(01:59) అమ్మాయిలు గట్టిగా మాట్లాడకూడదు. పడుకొంది ముందు నవ్వితే ఏడుస్తారు మార్కులు ఎక్కువ వస్తేనే నీకు విలువ ఉంటుంది సమాజంలో అందరికీ నచ్చే విధంగా బట్టలు వేసుకో నువ్వు తప్పు చేశవ అనుకో మన కుటుంబం పరువుపోతుంది. ఎదుటివారు చూస్తే ఏమనుకుంటారు జాగ్రత్త? ఇట్లాంటివన్నీ వేల కండిషనింగ్స్ ఏర్పడతాయి మనసులో ఆ తర్వాత అవి మనం అన్కాన్షియస్ గా ఆచరిస్తూ దాంట్లో నిజానిజాలు ఏమున్నాయో తెలుసుకోకుండా చేయడం వల్ల ఒక రూల్ గా సెటిల్ అయిపోతాయి.
(02:35) ఇప్పుడు మనిషి ఇవన్నీ ఉండి సహజంగా ఎట్లా జీవిస్తాడు ప్రతి క్షణం వాడికి ఏదో అలవాటైన విషయాన్ని వాడు ఆచరిస్తూ నేను బాగున్నాను అనుకుంటున్నాడేమో ఇదొకటయితే [గురకలు] వాడు కొంచెం పెద్దగా అయిన తర్వాత పక్కవాళ్ళకి కండిషన్స్ పెడతాడయ్యా కండిషన్ అంటే ఒక నియంత్రణ కండిషన్స్ పెట్టే ప్రతివాడు నియంత్రణ హిట్లరే చాలాసార్లు ప్రేమ పేరుతో చేస్తారు బాధ్యత పేరుతో చేస్తారు గౌరవాల పేరుతో ప్రతిష్ట పేరుతో వంశ గౌరవాలు ఇట్లా రకరకాల కండిషన్స్ పెడతారు సార్ ఇప్పుడు మనకు ఇంట్లో ఉండే రకరకాల కండిషన్స్ ఈ వస్తువు ఇక్కడ పెట్టాలి పడుకునే ముందు ఎట్లా చేయాలి నిద్ర లేవగానే గ్లాస్ ఇట్లా ఆ
(03:13) గ్లాస్ నీళ్లు తాగాలి ఎంత ఎన్ని సార్లు బుద్ధి లేదా గ్యాస్ ఇలాగే పెట్టాలి తుమ్మితే శబ్దం రాకూడదు ఉదయం లేవగానే ఇది చేయాలి తినేటప్పుడు అట్లా కూర్చోకూడదు ఇంట్లో నిశబ్దం ఉండలేవా నేను మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో రావద్దు నేను చెప్పిందే ఫాలో ఫాలో కావాలి నాకు ఇష్టమైన విధంగానే ఉండాలి. షూ గూట్లోనే పెట్టుకోవాలి. నేను చెప్పిన టైం కి నిద్రపోవాలి.
(03:41) నేను ఇంటికి రాగానే టీవీ బంద చేయాలి. ఇల్లు ఇట్లాగే ఉండాలి. నా వస్తువులు ఎవరో తాకొద్దు. బయటికి వెళ్లి నెంబడే రీచ్ అవ్వగానే నాకు మెసేజ్ పెట్టాలి. ఇట్లాగే డ్రెస్ చేసుకోవాలి పెళ్లికి వెళ్ళేటప్పుడు ఇట్లా ప్రవర్తిస్తున్నారా మనిషి అంటే ఇప్పుడు సినిమాల్లో కనబడే ఈ గొప్ప గొప్ప హీరోలు చెప్పే డైలాగులున్నీ పనికి రాని కండిషన్స్ే పక్కవాళ్ళకి చెప్పొద్దని కాదు కానీ కండిషన్ లా చెప్పకూడదు.
(04:09) వాళ్ళకి అది ఇబ్బంది కలుగుతుంది. నువ్వు చెప్పినట్టు వింటారు విధి లేక ఒక టైం వస్తుంది పెద్దగా అవ్వగానే ఉద్దురా బాబు అని వదిలేసి వెళ్ళిపోతారు. చాలా మంది తల్లిదండ్రులతో కలిసి ఉండకపోవడానికి కారణం ఆ చనిపోయే వరకు ముసలిగ అయిన తర్వాత కూడా ఈ పనికిరాని కండిషన్స్ పెట్టడమే. ఒక తండ్రి తన కొడుక్కి ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి పర్ఫెక్ట్ గా డ్రెస్ చేయాలి డ్రెస్ చేసుకోవాలి పర్ఫెక్ట్ గా పళ్ళు తోబాలి గ్లాస్ కింద పెడితే శబ్దం రాకూడదు తలుపు వేస్తే శబ్దం రాకూడదు బాత్రూమ్ నుంచి బయటికి రాగానే లైట్ బంద చేయాలి ప్రతిదాన్ని పర్ఫెక్ట్ పర్ఫెక్ట్
(04:41) పర్ఫెక్ట్ అతని ఉద్దేశం మంచిదే కానీ ఆ పిల్లవాడు ప్రతి పనికి భయపడే ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా మారిపోవచ్చు ఒక వ్యక్తిని మనం కాపాడడం వరకు ఓకే కానీ అది మనం మర్చిపోతాం. తద్వారా ఎదుటి వ్యక్తి మెల్లగా ఒత్తిలకి లోన అవుతాడు. ఏం చేస్తే ఏమవుతుందో ఏం మాట్లాడితే ఏమవుతుందో దేనికి ఏమంటారో అనే ఒక పిచ్చి భయాలన్నీ పట్టుకుంటాయి.
(05:11) సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిసిప్లిన్ అవసరమే కానీ అతి అయితే మనిషి యొక్క వ్యక్తిత్వం చచ్చిపోతుంది. మనకు సరిగా సరిగ్గా అనిపించిన ప్రతిదీ పక్కవాడికి సరిగ్గా అనిపించాల్సిన అవసరం లేదని మనక ఎందుకు ఆలోచించము ఒక ఇద్దరి మధ్యన ప్రేమ లేదా సమానత్వం లేని చోట అది ఇల్లు కాస్త జైలుగా మారిపోతుంది. కండిషనింగ్ అంటే ఏంటి బయట వాళ్ళ ఆలోచనలు మన మనసులో తిష్ట వేసుకొని కూర్చోవడం కండిషన్ అంటే ఏమిటి మన ఆలోచనని వేరే వాడి మనసులో తిష్ట వేసేలా ప్రయత్నించడం.
(05:47) సో మనిషి తన సహజ స్వభావాన్ని కోల్పోయి ఎంతసేపు పక్కవాడి దృష్టిలో ఎట్లా ఉండాలన్న ఒక అసహజ ప్రవృత్తిలోకి దిగిపోతున్నాడు. నీకు నచ్చిన విధానం సత్యం ఏమీ కాదు. ఒక ముసుగ అది మరి దీనికిఏంటి అక్కడే కమ్యూనికేషన్ స్కిల్స్ నిజమైన కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి మాట్లాడక తప్పదు ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పక తప్పదు ఉదాహరణకు చెప్తాను ఇది ఇక్కడే పెట్టాలి అని చెప్పే బదులు నువ్వు ఇలా గనుక పెడితే ఇద్దరికీ బాగుంటుంది ఆలోచించు అని చెప్పాలి.
(06:23) నువ్వు అలా మాట్లాడొద్దు అని చెప్పే బదులు ఇలా మాట్లాడావ అనుకో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందిరా కాస్త ఆలోచించుకో పర్వాలేదులే ఏముంది అని చెప్పాలి నువ్వు మారి తీరాలి అని చెప్పే బదులు ఇలా ఉంటే నీకు బాగుంటుందేమో చూసుకో అని చెప్పాలి పెళ్లికి వెళ్తున్నావ్ ఇలాగే బట్టలు వేసుకునేవాళ్ళు ఏదైనా మంచి బట్టలు వేసుకోవాలిరా నీకు నచ్చింది చూసుకో పర్వాలేదు కానీ జస్ట్ కొంచెం మంచిగా ఉందాం ఏమంటావ్ అలాగే నా డ్రెస్ బాగుందా ఏమనా మార్పులు చెరుపులు చేసుకోవాలా అట్లాంటి అట్లా చెప్పాలి.
(07:00) నా మాటే వినాలనే బదులు సరే నేను చెప్పాల్సింది చెప్తాను నీ అభిప్రాయం కూడా చెప్పు ఏదో ఒకటి దొరుకుతుంది మార్గం అని చెప్పాలి. ఇలా మనం పక్క వ్యక్తికి పెట్టే కండిషన్స్ కాస్త రూపాంతరించింది ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనుక చేస్తే ఎదుటి వ్యక్తి నీ ఎదురుగా నీ ముందు నటించడు. భయపడడం ఆపేస్తాడు. తను స్వేచ్ఛను అనుభవిస్తూ నువ్వు పెట్టిన వాటిని నువ్వు పెట్టిన కండిషన్స్ ని అర్థం చేసుకొని తనకు తగ్గట్టుగా మార్చుకుంటాడు.
(07:28) అప్పుడు మనుషులు సహజంగా ఉంటారు. సో మానవ సంబంధాలు అంటే పక్కవాడిని నియంత్రించడం కాదు బాయసాబ్ ఒకరికొకరికి ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఒకరికి ఒకరు ఊపిరిని ఇచ్చుకోవడం అవునా చిన్న ఉదాహరణ చెట్టు పెరాలంటే నీళ్ళు కావాలి కానీ నీళ్ళు పోస్తూ పోయేవాళ్ళను చెట్టు చచ్చిపోతుంది. మానవ సంబంధాలు కూడా అంతే అతిగా పట్టించుకుంటే ఆ సంబంధం చెడిపోతుంది.
(07:57) పక్కవాళ్ళు తింటుంటే నేను చూశను చాలాసార్లు సావకొడతారు అసలు అట్ట తింటంది మంచిగా కలుపుకో కంచంలో మధ్యలో ఉండాలి మెతుకు కింద పడకూడదు గ్లాస్ పెడితే శబ్దం రాకూడదు అలా చప్పరిస్తావ ఏంటి చావకొడతారు అసలు అట్లాంటి వాళ్ళ నుంచి దూరం పారిపోదాం అంటే ఆ పిల్లలకు వేరే ఇల్లు ఉండదు. ఉంటేనేమో చావకూడతారు ఎట్లా చచ్చేది తద్వారా పెద్దవాళ్ళ మీద గౌరవం పోతుంది.
(08:23) అందుకని ఇది సలహా కాదు ఆలోచించాల్సిన విషయం మనం ప్రేమని ఇద్దాం పద్ధతిని కాదు పద్ధతి చెబదాం ఇది నా పద్ధతిరా ఆల్మోస్ట్ అదే రిజల్ట్ వచ్చే విధంగా నీ పద్ధతి నువ్వు తయారు చేసుకో అని చెప్తే బాగుంటుంది. మనిషిని అర్థం చేసుకో అవకాశాన్ని సమయాన్ని కానీ ఇప్పుడే మారాలని బలవంత పెట్టుకు మనిషి తన స్వేచ్ఛలో తాను ఎదిగే అవకాశాన్ని ఇవ్వాలి.
(08:49) ఒక మనిషిని ప్రేమించడం అంటే వాడిని మనలా మార్చడం కాదు అతను అతనిలా ఉండటానికి మనం ఒక అవకాశం ఇయడం ఏమంటారు కరెక్ట్ అనిపిస్తుందా మీరేమైనా తెలుసో లేదో కండిషన్స్ పెడుతున్నారా ఆలోచించండి చాలామంది ప్రేమ పేరుతో చేసేది అది దాని వల్ల మానవ సంబంధాలు దెబ్బ తింటాయి ఎప్పుడు ఎవరికీ కండిషన్స్ పెట్టొద్దు ఎక్స్ప్లెయిన్ నేను చదువుకుంటున్నాను అసలు దూరం వెళ్లి ఆడుకో అని చెప్పు నేను చదువుకుంటుంది వాడుకోవద్దు అని చెప్పకు మరి వాడు ఆడుకుంటూ నువ్వు చదువుకుంటావా గూట్లే నేను చూసాను ఒక ఇంట్లో తండ్రి మెడిటేషన్ చేస్తుంటే అందరికీ టిక్కురు మనకు కూర్చోవాలి.
(09:28) ఒకసారి నేను వెళ్ళా ఆయన మెడిటేషన్ చేసుకొని నేను పాట పాడుతున్నా నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను అన్నాడు నేను పాట పాడుకుంటున్నాను అన్నాను. అరే నీకు ధ్యానం ఎంత ఇంపార్టెంటో నాకు పాడడం అంత ఇంపార్టెంట్ రెండు నేను పాటను ధ్యానంలా పాడుతున్నాను నువ్వు ధ్యానాన్ని పనిలా చేస్తున్నావ్ డ్యూటీలా చేస్తున్నావ్ నిన్ను హింసించుకుంటున్నావ్ చుట్టుపక్కల ఎన్ని రణగణ ధ్వనులు ఉన్నా నీ ఫోకస్ బ్రీత్ మీదే ఉండని ఏ శబ్దాలు లేని చోట నువ్వేందిరా నిశబ్దం అనుభవించేది అట్లా కొన్నిసార్లు అవకాశం ఉన్న చోట ఆలోచింపచేసే విధంగా నేను ఏదో చేస్తాను కానీ అన్ని సార్లు చేయడ కుదరదు అందుకని
(10:08) పోస్ట్ కార్డు మాధ్యమంగా మీకు చెప్తున్నాను. ఒక వారం రోజులు మీ కుటుంబ సభ్యులు ఎలా ఉంటే అలా ఉండనివ్వండి. అప్పుడు వాళ్ళు మీ పట్ల ప్రేమను ప్రదర్శిస్తారు మీ ముందు నటించరు. చిన్న పిల్లలాగా ఎగిరి గంతులు వేస్తారు. కిక్కి కిక్కి అని నవ్వుతారు. డోంట్ కంట్రోల్ టూ మచ్ ఓకే ఆలోచించండి. సో మళ్ళ ఒకసారి ఆ రెండిటి నిర్వచనాలు చెప్పి ముగిస్తాను కండిషనింగ్ అంటే వేరేవాళ్ళు వాళ్ళ ఆలోచనలని మనలో నిలబెట్టడానికి చేసే ప్రయత్నం అది కండిషనింగ్ కండిషన్స్ అంటే మనము కరెక్ట్ అనుకున్న దాన్ని ఆ ఆలోచనని వేరే వాళ్ళ మనసులో ప్రతిష్టించేరు ప్రయత్నం చేయడం
(10:46) మొదటిది తప్పదు రెండోది అనవసరం అక్కడే రియలైజేషన్ వస్తుంది. రిసర్వస్

No comments:

Post a Comment