Thursday, May 21, 2026

గిరి ప్రదక్షిణలో మహర్షికి ఎదురైన అనుభవాలు #spirituality #devotional #lordshiva #అరుణాచలం #education

గిరి ప్రదక్షిణలో మహర్షికి ఎదురైన అనుభవాలు #spirituality #devotional #lordshiva #అరుణాచలం #education

Author Name:ajju-baipalli

Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QS0L-7u_76U



Transcript:
(00:02) అరుణాచల గిరి ప్రదక్షణలో భగవాన్ రమణ మహర్షికి ఎదురైన వింత అనుభవాలు అని ఈ శీర్షిక పెట్టడానికి గల ప్రధాన కారణం ఇటీవల రమణ మహర్షికి సంబంధించిన కొన్ని పుస్తకాలు రమణ మహర్షి మీద ఉన్న బుక్స్ అండ్ కామెంటరీస్ కొన్ని చదవడం వల్ల ఆ అరుణాచల గిరి ప్రదక్షణంలో రమణ మహర్షికి ఎదురైన అనుభవాలు రమణ మహర్షి సాధువులతో గాని జంతువులతో గాని పక్షుల తో గానీ ముచ్చటించిన ముచ్చట్లు ఇవన్నీ చదివి నేను ఆశ్చర్యానికి గురయ్యాను.
(00:38) ఆ క్షణం అనిపించింది ఇది వీడియోగా చేస్తే బాగును చాలా మందికి వెళ్తుంది కదా ఒక అందమైన చందమామ కథలా ఉంది. కచ్చితంగా నలుగురికి తెలుస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. భగవాన్ రమణ మహర్షి అరుణాచల గిరి ప్రదక్షణ గురించి నిరంతరం చెప్తూ ఉండేవాడు. రమణ మహర్షికి అరుణాచల గిరి ప్రదక్షణ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మహర్షులకైనా జ్ఞానులకైనా ఎవ్వరికైనా సరే ప్రకృతితో కలవడం అంటే ప్రకృతిలో కలిసిపోవడం అంటే ప్రకృతిలో ఉండడం అంటే మహా ఇష్టం వాళ్ళకి సాధారణంగా జ్ఞానులు ఎవరికీ కూడా ఇష్టాలు అయిష్టాలు మంచి చెడు అని రెండు ఉండవు ద్వందం ఉండదు ఒక్కటే ఉంటుంది.
(01:22) కానీ ప్రకృతి అయితే వాళ్ళకి ఇంకా ఇష్టం ఆ ఇష్టం అనే మాట నేనేదో ప్రాపంచికంగా ఒక వర్డ్ అందరికీ తెలియాలని ఉపయోగిస్తున్నాను కానీ ఇష్టాలు అయిష్టాలు ఉండవు సరే రమణ మహర్షికి అరుణాచల గిరి ప్రదక్షణం అంటే కాసేపు ఇష్టమని అనుకుందాం. ఆయన దృష్టిలో రమణుల దృష్టిలో గిరి ప్రదక్షణం అంటే కేవలం నడక మాత్రమే కాదండి అదిఒక విడదీయలేని ఆధ్యాత్మిక అనుబంధం ఒక అనుభవం అయితే ఈ గిరి ప్రదక్షణలో రమణ మహర్షికి చాలా చాలా అనుభవాలు ఎదురయ్యాయి చాలా చాలా ఆశ్చర్యకరమైన సంభాషణలు జరిగాయి సంఘటనలు జరిగాయి వాటి గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.
(02:01) మొదటిగా రమణ లీల కృష్ణ భుక్షి రాసిన రమణ లీల అనే గ్రంథంలో ఒక సంఘటన ఉంది ఆ సంఘటన గురించి చెప్తాను ఒకసారి రమణ మహర్షి కొంతమంది శిష్యులతో కలిసి గిరి ప్రదక్షణ చేస్తున్నారు సాయంత్రం దాదాపు ఆరుఆరున్నర ఆ సమయంలో గిరి ప్రదక్షణ చేస్తుండగా మధ్యలో ఒక పెద్ద పాము ఎదురయింది. శిష్యులైతే వెంటనే భయపడ్డారు అయ బాబోయ్ ఇదేంటి ఇంత పెద్దగా ఉంది ఈ పాము అని శిష్యులు వెంటనే భయపడి వెనక్కి తగ్గారు కానీ భగవాన్ మాత్రం రమణ మహర్షి మాత్రం ప్రశాంతంగా నిలబడ్డారు ఏదో ఎదురుగా తన తల్లి వస్తే ఒక తన తల్లి వస్తే ఎంత ఆనందంగా బిడ్డ నిలబడతాడో ఎంత ఆశ్చర్యంగా
(02:42) నిలబడతాడో ఆనందంగా నిలబడతాడో అంత ఆనందంగా నిలబడ్డారు రమణ మహర్షి ఆ పాముని చూసి శిష్యులు మాత్రం కంగారుపడ్డారు. ఆ పాము ఆయన పాదాల దగ్గరికి వచ్చి తలెత్తి ఇలా నిలబడింది వెంటనే అనుకున్నారు అయ్య బాబోయ్ రమణ మహర్షిని కాటేస్తుందేమో చచ్చిపోతారేమో రమణ మహర్షి అని అది ఆ తలెత్తి రమణుల వైపు చూసి ఏమి అనలేదు దానికి ఏం పారవశ్యం పుట్టిందో రమణుల ముఖం వైపు చూసి వెళ్ళిపోయింది ఒక రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోయింది.
(03:11) వెంటనే రమణులు అన్నారు శిష్యులతో అది పోమనుకున్నారా శారీరకంగా అది పోమ అయి ఉండొచ్చు కానీ అది ఈ కొండ మీద తపస్సు చేసుకుని ఒక సిద్ధ పురుషుడు మనల్ని పలకరించడానికి వచ్చారయ్యా ఎందుకు మీరు భయపడతారు అని అంటారు శిష్యులతో అంటే ఆయన పామునే కాదండి పక్షినే కాదండి ఏ శరీరం మారుండొచ్చు శరీరం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు శరీరం ముఖ్యం కాదు ఆ శరీరం వెనకాల ఉన్న సాక్షి భావన అనేది ముఖ్యం అనే స్థితిని పట్టుకున్నారు కాబట్టి ఆయన ప్రతి ప్రతి దాంట్లో కూడా దాన్ని పట్టుకున్నారు.
(03:43) ఇది ఒక సంభాషణ అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి రమణ మహర్షి గిరి ప్రదక్షణ చేస్తున్నప్పుడు ఒక ముసల ఆవిడ చాలా దాదాపు 90 95 సంవత్సరాలు ఉన్న ఒక ముసలా ఆవిడ కొండ కింద ఆయాసపడుతూ మెల్లగా నడుస్తుంది. అరుణాచల గిరి ప్రదక్షణం వెంటనే భగవాన్ చూసి భగవాన్ని ఆవిడ చూసింది కానీ గుర్తుపట్టలేదు అంటే 90 95 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఇంకేమి కళ్ళు సరిగ్గా కనిపిస్తాయండి కాస్త మసక మసక అవుతాయి కదా వెంటనే రమణ మహర్షిని ఆవిడ అడుగుతుంది నాయనా ఈ కొండ చుట్టూ తిరగడం వల్ల ఏమైనా పుణ్యం వస్తది అంటావా అని రమణ మహర్షిని అడుగుతుంది ఆ ముసలా ఆవిడ ఆ వృద్ధురాలు
(04:26) అన్నమాట నాయనా ఈ కొండ చుట్టూ తిరగడం వల్ల ఏమైనా పుణ్యం వస్తుందా అని అడుగుతుంది వెంటనే భగవాన్ నవ్వుతూ అమ్మ నీ మనసు భగవంతుని మీద ఉంటే పుణ్యం వస్తుంది లేదంటే కాళ్ళు నొప్పులు వస్తాయి దానికి ఎందుకు అంత ఆశ్చర్యం దానికి ఎందుకు అంత కంగారు అని అంటారు. అంటే చమత్కారంగా చెప్పారు గానీ నిజానికి అది కరెక్టే కదండీ ఈ శరీరం నేను ఈ శరీరానికి ఒక ఉద్యోగం కావాలి ఈ శరీరంకి ఒక సంతానం కావాలి అనుకుంటే పాపమో పుణ్యమో ఏవో వస్తాయి.
(04:55) ఈ శరీరమే నేను కాదు అనుకున్నప్పుడు ఏమ వస్తది ఏమీ రాదు పాపము రాదు పుణ్యము రాదు అసలు ఏమీ రాదు కాబట్టి చమత్కారంగా చెప్పిన నిజమే చెప్పారు భగవాన్ అలాగే ఇంకొక సంఘటన చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి శిష్యులు భగవాన్తో కలిసి గిరి ప్రదక్షణ చేస్తున్నారు భగవాన్ ముందు నడుస్తున్నారు వెనకాల శిష్యులు నడుస్తున్నారు సాధారణంగా శిష్యులకు చాలా ఇష్టం ఇక్కడ శిష్యులు గురువు అని ఇద్దరు లేరండి ఎందుకంటే రమణ మహర్షి ఎప్పుడు కూడా నాకు శిష్యులు ఉన్నారు అని ఎప్పుడూ చెప్పలేదు వెనకా వెనకాల ఉన్న వాళ్లే చెప్పుకునేవారు మేము రమణ మహర్షి యొక్క శిష్యులం పరివారం
(05:36) అని చెప్పుకునే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఎందుకంటే జ్ఞాని అలాంటి స్థితి అనుభవించేవారు ఎక్కడో కొన్ని వందల వేల సంవత్సరాలకు ఒకరు ఉంటారు అలాంటి వ్యక్తితో మేము ఉంటున్నాము అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఆనందం తప్పేముంది అలానే శిష్యులు భగవాన్ తో కలిసి నడవడానికి చాలా ఇష్టపడేవాళ్ళు కానీ రమణ మహర్షి మాత్రం చాలా చాలా వేగంగా నడిచేవాళ్ళండి ఒకసారి ఒక శిష్యుడు భగవాన్ మేము మీతో కలిసి నడవలేకపోతున్నాం కొంచెం మెల్లగా నడవండి అంత వేగంగా నడుస్తారు ఎందుకు అని అంటే రమణులు నవ్వుతూ అంటారు ప్రదక్షణ అంటే గిరి ప్రదక్షణ అంటే ఒక గర్భిణి స్త్రీ తన తలమీద
(06:13) నిండు కుండను పెట్టుకొని నడుస్తున్నంత జాగ్రత్తగా నిదానంగా చేయాలి. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్ల ఏంటంటే నేను మీతో మాట్లాడుతుంటే నాకు నా వేగమే తెలియడం లేదయ్యా ఈ శరీర వేగం నాకు తెలియడం లేదు నన్ను ఏం చేయమంటారు మీరు మాట్లాడటమా ఆపరు మీరు మాట్లాడుతుంటే నేను వేగంగా వెళ్ళిపోతున్నాను అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే గిరి ప్రదక్షణం చేసినప్పుడు మాట్లాడుతారు ఎందుకయ్యా మౌనంగా ఉండలేరా మీలో మీరు రమిస్తూ చేయలేరా అని ఒక భావనతో అన్నారు అంతే అంతేగాని మాట్లాడవద్దు అని ఉద్దేశం కాదురా మన మహర్షిది అలాగే ఇంకొక సంఘటన కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒక శిష్యుడు
(06:52) స్వామి కొండ చుట్టూ తిరిగితే ఏం లాభం మీరు ప్రతిరోజు గిరి ప్రదక్షణ చేస్తుంటారు కదా అసలు ఏం లాభం వస్తుంది అసలు దాని వల్ల ఏమైనా లాభం ఉందా అని ఒక ప్రశ్న రమణ మహర్షి ముందు పెడతాడు. అంటే ప్రతిరోజు ఈ క్యాన్సర్ రాకముందు వరకు కూడా సర్కోమా క్యాన్సర్ రాకముందు వరకు కూడా ప్రతిరోజు గిరి ప్రదక్షణ చేసేవాళ్ళు కదా చేస్తున్నారు కదా ఏమైనా లాభం వస్తుందా అదేదో హృదయంలో ధ్యానం చేసుకుంటే సరిపోదా గిరి ప్రదక్షణం చేయడం వల్లే నాకు ధ్యానం కుదురుతుంది అంటే అదే కరెక్టా ధ్యానం అనేది హృదయంలో చేసుకుంటే సరిపోదా ఆ భావన పెట్టుకుంటే సరిపోదా అనే ఒక ప్రశ్నని
(07:33) శిష్యుడు రమణ మహర్షి ముందు పెడతాడు. వెంటనే రమణ మహర్షి ఎంత చక్కగా సమాధానం ఇస్తాడో చూడండి. అయస్కాంతం ముక్క దగ్గరికి వెళ్తే ఇనుము ఎలా ఆకర్షితం అవుతుందో అరుణాచల కొండ చుట్టూ కూడా తిరిగితే మన మనసులో కోరికలు అహంకారం అలా మెల్లగా కరిగిపోతాయ్యా నీకు తెలియకుండానే అది నిన్ను నిశశబ్ధం వైపు తీసుకెళ్ళిపోతుంది. అమ్మను చూస్తే తల్లి అమ్మను చూస్తే బిడ్డ ఎలా అయితే చిన్నప్పుడు ఆనందాన్ని పొందుతాడో పెద్దయ్యాక బిడ్డను చూస్తే తల్లి ఎలా ఆనందపడుతుందో ఎక్కడో విదేశాల నుండి వచ్చిన బిడ్డను చూస్తే తల్లి ఎలా ఆనంద పడుతుందో అలా అరుణాచల గిరి ప్రదక్షణం
(08:08) చేస్తుండగా చేస్తుండగా ఈ శరీరము ఈ మనసు నేను కాదని ఆ కొండ నేను ఆ కొండలో ఉన్న స్థిరత్వం నాలో ఉన్న స్థిరత్వం ఒక్కటే అనే భావనకు వచ్చేస్తామ అయ్యా అది మనల్ని లాగేస్తుంది నీకు రావాల్సిన అవసరం లేదు అని చెప్తాడు రమణ మహర్షి నిజంగా ఎంత గొప్ప గొప్పగా చెప్పారు చూడండి. ఇంతే కాదండి ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయి. ఒకసారి గిరి ప్రదక్షణలో రమణ మహర్షి నడుస్తూ ఉండగా అంటే ఆ రోజు మొదలు పెట్టడమే బాగా సమయం ఆలస్యం అయిపోయింది దాదాపుఆరున్నరఏడు గంటలకు మొదలు పెట్టారు.
(08:41) ఎంత వ్యాసవికాలం అయినా సరే కాస్త వెలుతురు ఉన్నా సరేఏడు గంటలు అంటే చీకట అనే కదా దాని అర్థం కాబట్టి కాస్త సాయంత్రం ప్రారంభించిన రమణ మహర్షి గిరు ప్రదక్షణ చీకటి పడిపోయింది రాత్రి అయిపోయింది. భగవంతున్ తన శిష్యులతో కలిసి ఒక చిన్న గుడిస దగ్గర ఆగారు. అంటే శిష్యులు కాళ్ళను నొప్పి పెట్టి వాళ్ళు అడిగారు భగవాన్ కాసేపు ఆగుదాం భగవాన్ అంటే రమణ మహర్షి ఆగారు కాసేపు సరే ఈ గుడిస దగ్గర కూర్చుందాం కాసేపు ఉండండి రెస్ట్ తీసుకోండి అని అక్కడ ఉన్న ఒక పేద రైతు రమణ మహర్షి దగ్గరికి వచ్చి కొంచెం గంజి ఇచ్చారు రమణ మహర్షికి తన శిష్యులకి అయ్యా కాస్త తాగండి కాస్త బలం వస్తుంది
(09:16) నీరసపడినట్టు ఉన్నారు అని భగవాన్ అది ఎంతో ఇష్టంగా తాగి అన్ని పలహారాల కంటే ఈ అమృతమే గొప్పది ఏది గంజిని పట్టుకొని అమృతం ఎందుకంటే అమృతం అని ఎందుకు అన్నారంటే ఆ టైం కి అదే అమృతం అండి 14 కిలోమీటర్లు నడుస్తూ నడుస్తూ ఒల్లు నీరస పడిపోతే ఆ క్షణంలో ఒంటికి బలం ఇచ్చేది ఏదైతే ఉందో అదే అమృతం దాన్ని అలా భావించు నీ శరీరం నిలబడింది నీ శరీరం నిలబడడానికి అది కారణం అయింది దాన్ని అమృతం అనుకోరాదా కాసేపు అందుకనే అంటారు రమణ మహర్షి చూడండి అన్ని పలహారాల కంటే ఈ అమృతమే గొప్పది ఈ గంజే గొప్పది ఎందుకంటే ఇందులో ప్రేమ ఉంది ఆ రైతు ఎంత ప్రేమతో ఇచ్చాడో పాపం ఎంత ఎం ఎంత
(09:56) కష్టపడిందో వాళ్ళ శరీరం అనే ఒక భావనతో ఇచ్చాడయ్యా అని అంటారు. రమణ మహర్షి దృష్టిలో అరుణాచలం అంటే రాయి కాదండి అది సాక్షాత్తు శివ స్వరూపం అందుకే ఆయన ఎప్పుడు కూడా కొండ వైపు చూస్తూ ఒక తల్లినో ఒక తండ్రినో చూస్తే ఎవరైతే ఎంత ఆనంద పడతారో బిడ్డ అంత ఆనంద పడిపోయారు రమణ మహర్షి అలాగే ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఒకసారి గిరి ప్రదక్షణలో ఒక శిష్యుడు నడవలేక ఆయాస పడుతున్నాడు భగవాన్ నా కాళ్ళు చాలా నొప్పులు అవుతున్నాయి విపరీతంగా పాదాలు ఈ కాళ్ళు మోచిప్పలు కూడా చాలా విపరీతమైన నొప్పు నొప్పు కొడుతున్నాయి ఇంకా ఎంత దూరం
(10:35) నడవాలి అని అడుగుతాడు చాలా నీరసపడిపోయి రమణలు నవ్వుతూ ఇలా అంటారు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయ కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని అంటున్నావు కదా ఆ కాళ్ళు నువ్వు అని నీకు అనిపిస్తుందా నొప్పులు కాళ్ళుకు వస్తున్నాయా నీకు వస్తున్నాయా నడిచేది శరీరం నువ్వు కేవలం చూసేవాడివి వయ్యా నువ్వు కేవలం సాక్షివు మాత్రమే అని అనగానే ఒక్కసారి ఆ శిష్యుడికి ఉన్న ఫలంగా కోటి రెడ్లు బలం వచ్చేసినట్టు అయిపోయింది అబ్బో నిజమే కదా నడుస్తున్నది ఈ శరీరం నేను కాదు కదా నొప్పులు వచ్చేది ఈ శరీరానికి ఈ కాళ్ళకి నాకు కాదు కదా అనే భావన వెంటనే కలిగింది.
(11:16) అంటే ఒక్కసారి ఇలాంటి ప్రశ్నలు మనం కూడా వేసుకుందాం అండి ఏదో ఒక పని చేస్తుంటాం ఆయాస పడిపోయాం ఆయాస పడిపోయేది ఈ శరీరమా నువ్వా అనే ప్రశ్న మనం వేసుకుంటే నిజంగా ఏ క్షణమైనా ఎప్పుడైనా ముక్తిని పొందొచ్చండి రమణ స్థితిని అలాంటి సంభాషణలు ఉన్నాయి రమణ మహర్షి జీవితంలో అలాగే ఇంకొక సంభాషణ చూసుకుందాం. [గురకలు] ఒకసారి గిరి ప్రదక్షణంలో అంటే ఆ గిరి ప్రదక్షణ మార్గం ఉంది కదా ఆ మార్గంలో పిచ్చయ్య అనే ఒక స్వాధువు ఉండేవాళ్ళండి అప్పట్లో రమణ మహర్షి యొక్క కాలంలో పిచ్చయ్య అనే ఒక స్వాధువు ఉండేవాడు ఆ పిచ్చయ్య అనే సాధువుకి రమణులు అంటే చాలా ఇష్టం ఒకరోజు రమణులు గిరి ప్రదక్షణ
(12:01) చేస్తుండగా పిచ్చయ్య ఎదురొచ్చి స్వామి మీరు ఎప్పుడు ఇలా కొండ చుట్టూ తిరుగుతూనే ఉంటారు కదా అసలు మీకు అలసట అనేదా రాదా రోజు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు కదా మీకు కాళ్ళు నొప్పులు గాని ఒంటికి నీరసం అనిపించడం గాన జ్వరం గాన అసలు ఏ జబ్బులు రావా నీరసం రాదా అని ఒక ప్రశ్న అడుగుతాడు. అడిగితే రమణలు అంటారు పిచ్చయ్య ఒక బండి చక్రం తిరుగుతుంటే ఆ చక్రం మధ్యలో ఉండే ఇరుసు యక్సెల్ అంటారు కదా ఇరుసు అది తిరుగుతుందా అది స్థిరంగానే ఉంటుంది కదా నా శరీరం తిరుగుతుంది నేను మాత్రం లోపల స్థిరంగానే ఉన్నాను అంటాడు.
(12:39) అంటే ఇప్పుడు చూడండి ఒక బండి చక్రం తిరుగుతుంటే ఆ చక్రం తిరుగుతుందే అని అనుకుంటాం. నిజమే ఆ చక్రం తిరుగుతుంది కానీ ఆ చక్రం మధ్యలో ఉండే ఇరుసు ఉంది చూసావా ఆ ఇరుసు మాత్రం తిరగదు అది స్థిరంగా ఉంటుంది. అలాగే నేను అనే సాక్షి భావన ఉంది చూసారా అది స్థిరంగానే ఎప్పుడూ ఉంటుంది. తిరిగేది ఈ శరీరం అని ఒక సమాధానం ఇస్తారు. ఈ సమాధానం పిచ్చయ్య అనే సాధువుకి ఇవ్వాల్సిన అవసరం నిజానికి లేదు ఎందుకంటే ఆయన కూడా రమణ స్థితే కాకపోతే లోకానికి మనకు చెప్పడం కోసం ఇలాంటివి వస్తాయి తప్ప ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా అజ్ఞానంలో ఉండరండి పుట్టుకుతో ఏ మనిషి కూడా అజ్ఞాని కాదు
(13:16) ప్రతి మనిషి జ్ఞానే కాకపోతే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కొన్ని కొన్ని మాటలతో కొన్ని కొన్ని చేష్టలతో మనల్ని అజ్ఞానంలో తీసుకొచ్చేస్తారు కానీ ఏ మనిషి కూడా పుట్టుకతో అజ్ఞానికి కాదు అలాగే తేనిటేగల సంభాషణ అనేది నాకు చాలా ఇష్టమేనండి ఎందుకంటే ఒకసారి రమణ మహర్షి అరుణాచలం కొండపై నుండి క్రిందకు వస్తున్నప్పుడు అనుకోకుండా ఒక తేన పట్టు మీద అడుగు వేస్తారు రమణ మహర్షి అడుగు వేసిన వెంటనే తేన టేగలు చెల్లా చెదురైపోతాయి వెంటనే వెనకాల ఉన్న శిష్యులు కొండ వెనక్కి వెళ్లి దాక్కుంటారు అంటే చిన్న చిన్న బండరాలు ఉంటాయి కదా కొండ మీద ఆ బండరాలు వెనక్కి వెళ్లి దాక్కుంటారు
(13:55) అమ్మ బాబోయ్ తేనటేగలు కరిస్తే ఒళ్ళంతా వాచిపోయి చచ్చిపోయినా చచ్చిపోవచ్చు అని వెళ్లి దాక్కుంటారు కానీ రమణ మహర్షి మాత్రం తక్షణమే అంటారు అయ్యో ఈ కాలు తప్పు చేసింది ఈ కాలు మీ గూటిని చెడగొట్టేసింది కాబట్టి ఈ కాలు కాలు శిక్ష అనుభవించాలి అని ఆ కాలుని తీసుకెళ్లి ఒక బండరాయి మీద పెడితే తేనిటేగలు వచ్చి మొత్తం కుట్టేస్తాయండి.
(14:20) కనీసం అమ్మ అబ్బా నొప్పిగా ఉంది అని ఒక్క మాట లేకుండా అదే కాలు ఈడ్చుకుంటూ కిందకి వెళ్లి గిరి ప్రదక్షణం చేస్తారు. అంటే దేహ భ్రాంతి ఎలా ఉందో చూడండి అసలు శరీరం మీద భ్రాంతి అనేదే లేదు. నిజంగా ఏం చేస్తే వస్తుందండి ఇలాంటి దేహ భ్రాంతి రమణ స్థితిని అనుభవించడం పర్వాలేదు ఇది ఈజీయే కానీ శరీరం మీద భ్రాంతి కూడా పోవడం అంటే ఏం చేస్తే వస్తుంది అంటారు.
(14:53) అంటే ఇదొక గొప్ప సంఘటన రమణ మహర్షి జీవితంలో తేనటేగల సంఘటన అలాగే ఒకసారి గిరి ప్రదక్షణ చేస్తున్నప్పుడు రమణ మహర్షి కొందరు దొంగలు భగవాన్ వైపు రావడం చూసి శిష్యులు గమనించారు అన్నమాట రమణ మహర్షి వైపు వస్తున్నారు ఎందుకంటే రమణ మహర్షి ఎప్పుడు కూడా కాస్త వేగంగా ముందుగానే నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు ఎవ్వరి కోసం ఆగేవాళ్ళు కాదు ఆయన గిరి ప్రదక్షణ ఆయనదే ఆయన ఆకలి ఆయనది ఆయన నిద్ర ఆయనది అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక దొంగలో రమణ మహర్షి వైపు వస్తుండడం శిష్యులు గమనించారు వెనకాల ఉన్న శిష్యులు వారు భయపెడుతుంటే రమణులు చాలా ప్రశాంతంగా దొంగల దగ్గరికి వెళ్లి
(15:27) మా దగ్గర ఏముందని తీసుకోవడానికి రమణులు అంటున్నారు ఆ దొంగలతో మా దగ్గర ఏముందని తీసుకోవడానికి ఈ కౌపీనం ఈ కర్ర తప్ప కావాలంటే ఇవి తీసుకోండి అని నవ్వుతూ చెప్తారు అన్నమాట అంటే రమణుల యొక్క నిశ్చలత్వం చిరునవ్వు చూసి ఆ దొంగలు కూడా భయపడి పారిపోయారు ఎవరైనా కోప్పడితే పారిపోతారు లేకపోతే పోలీసులకు ఫోన్ చేస్తే పారిపోతారు రమణ మహర్షిలో ఉన్న ప్రశాంతత రమణ మహర్షి యొక్క చిరునవ్వు చూసుకోవడా దొంగలు పారిపోయారు చూడండి ఎంత సరదా సంభాషణ అలాగే మనకి కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పరమాచార్య నడిచే దేవుడు అని
(16:04) పిలుస్తుంటారు కదా ఆ కంచి కామకోటి పీఠాధిపతులు అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఒక వ్యక్తిని రమణ మహర్షి దగ్గరికి పంపుతాడండి దేనికి మౌనం అంటే ఏమిటి దాని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటో తెలుసుకో రమణ మహర్షిని అడిగి అని ఒక వ్యక్తిని పంపుతాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి రమణ మహర్షి దగ్గర ఒక భక్తుడిని ఆ భక్తుడు రమణ మహర్షి కరెక్ట్ గా గిరి ప్రదక్షణం ప్రారంభించిన కాసేపటికి వచ్చి గిరి ప్రదక్షణలో పాల్గొని రమణ మహర్షితో నడుస్తూ అడుగుతాడు.
(16:37) భగవాన్ నన్ను ఇలా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పంపించారు కంచి కామకూటి పీఠాధిపతి నడిచే దైవం మౌనం అంటే ఏమిటి? దాని యొక్క అంతరార్థం ఏమిటి? అని మిమ్మల్ని అడిగి తెలుసుకోమన్నారు ఆ ప్రశ్నకు సమాధానం అని అంటాడు. [గురకలు] రమణులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ భక్తుడి కళ్ళల్లోకి చూస్తూ అలాగే నడుస్తూ ఉంటారు.
(17:00) ఆ గిరి ప్రదక్షణ పూర్తఅయ్యేసరికి ఆ భక్తుడికి మనసులో సమాధానం దొరికింది. చివరికి రమణలో అంటారు మౌనం అంటే మాటలు లేకపోవడం కాదయ్యా ఆలోచన లేకపోవడం ఆ ఆలోచనలు సాక్షిగా చూడడం అంతేగాని మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం అంటే అంతకన్నా లేకి మాట ఇంకొకటి లేదు ఏ శాస్త్రము ఏ గ్రంథము ఏ పురాణం ఏ దేవుడు కూడా మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం అని చెప్పలేదు ఆలోచనలు సాక్షిగా చూడడం మౌనం అంటే అంటారు ఇంతకన్నా ఏం కావాలండి అంతే చాలు ఇది పట్టుకుంటే చాలు ఇంతసేపు నా మాటల్లో రమణ మహర్షి యొక్క స్థితిలో ఈ ఒక్క మాట పట్టుకుంటే సరిపోదా మౌనం అంటే మాటలు లేకపోవడం కాదు ఆలోచనలు లేకపోవడం
(17:46) ఆలోచనలు సాక్షిగా చూడడం ఇదిఒక సంఘటన అయితే ఇంకొక సంఘటన గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఎండలో రమణ మహర్షి గిరి ప్రదక్షణ చేస్తుండగా ఒక ముసల ఆవిడ రమణులను చూసి నాయనా ఎండలో నడుస్తున్నావ్ కాస్త ఈ మధ్యకి తాగి వెళ్ళు అలా ఎంతసేపు నడుస్తావ్ అది కూడా ఇంత ఎండలో మిట్ట మధ్యాహ్నం అని రమణులని పిలుస్తుంది.
(18:11) పిలిస్తే రమణులు వెళ్తారు వెళ్లి ఆ మజ్జిగ తాగి అమ్మ నీ మజ్జిగ నా దాహాన్ని మాత్రమే కాదు నా మనసును కూడా తృప్తి పరిచింది అమ్మ చాలా మంచిది అంటారు. అంటే భగవాన్ రమణుల దృష్టిలో గిరి ప్రదక్షణ అంటే భగవంతుడు ఒడిలో నడవడం అండి అందుకే భగవంతుడు ఒడిలో ఉన్న ఎవ్వరైనా సరే భగవంతుని బిడ్డలే అది ఏ జంతువైనా ఏ శరీరమైనా అయి ఉండొచ్చు.
(18:38) అందుకే ఆయన పామును చూసిన పక్షిని చూసిన జంతువును చూసిన ఒకేలా ట్రీట్ చేశారు. అంటే రమణుల దృష్టిలో గిరి ప్రదక్షణం అంటే ఒక భగవంతుడు ఒడిలో నడవడం అండి అందుకే ఆ సమయంలో ఆయన ముఖంపై ఎప్పుడూ కూడా నవ్వు చిరునవ్వు ఉండేది నిరంతర ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఒకరోజు కుక్కలతో జరిగిన ఒక సంఘటన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పే ప్రయత్నం చేస్తాను.
(19:03) సాధారణంగా గిరి ప్రదక్షణ చేసేటప్పుడు కొన్ని కుక్కలు భగవాన్నను అనుసరిస్తూ ఉండేవి అంటే రమణ మహర్షి నడుస్తుంటే ఆయన వెనకాలు నడుచుకుంటూ వెళ్ళేవి ఒకసారి రమణలు చాలా వేగంగా నడుస్తూ హటాత్గా ఒకచోట ఆగిపోయారు సడన్ గా ఒకచోట ఆగిపోయారు ఉన్నఫలంగా వెనకాల ఉన్న శిష్యులు కూడా వచ్చి ఎందుకు ఆగారు భగవాన్ ఏమైంది మీకు నడవలేకపోతున్నారు ముందుకి అని అడుగుతారు రమణులు వెనకకు చూపిస్తూ పాపం ఆ కుక్కలు వెనకబడిపోయాయ్యా అవి వచ్చే వరకు మనం ఇక్కడే విశ్రమిద్దాం రెస్ట్ తీసుకుందాం కాసేపు అవి కూడా మనతో పాటే వస్తున్నాయి కదా అంటే మూగజీవాల పట్ల ఆయనకు ఉండే
(19:38) వాత్సల్యం చూడండి ఆయన దృష్టిలో కుక్కలు పక్షులు కోతులు మనుషులు జ్ఞానులు పండితులు ఇలాంటివి ఉండవండి నిజంగా రమణ స్థితిని అనుభవించిన వాడు ఎవ్వరైనా సరే నేను కాకుండా ఇంకొకరు ఉన్నారు అనే మాట సర్వసాధారణంగా రాదు ఒకవేళ వచ్చినా సరే ప్రాపంచికంగా అర్థం అవ్వడం కోసం లోకానికి ఆ మాట మాట్లాడతాడేమో గానీ నిజానికి దానికి ఆయన మనసులో మాత్రం ఆలోచనే రాదు.
(20:06) అలాంటి స్థితి అది అలాగే ఒకసారి గిరి ప్రదక్షణ మార్గంలో కొందరు వ్యక్తులు తక్కువ కులం ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఏముంది ఈ రోజుల్లో కూడా ఈ తక్కువ ఎక్కువ కులం అనే ఒక భేదభావన ఉంది కదా ఆ రోజుల్లో రమణ మహర్షి గిరి ప్రదక్షణ చేస్తున్న రోజుల్లో కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే ఒక తక్కువ కులానికి చెందిన వ్యక్తిని పక్కకు వెళ్ళమని భయపెడుతున్నారు.
(20:32) ఏంటయ్యా రమణ మహర్షి వస్తున్నారు కాస్త పక్కకెళ్ళు తక్కువ కులం కూడా అని చెప్పి ఇలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. తప్పేలా అండి అలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు అది చూసిన రమణ మహర్షి అక్కడే ఆగిపోయారు అంత పిచ్చ కోపం వస్తుందండి నిజానికి జ్ఞానులకు కోపం రాదు కానీ ఇలాంటి మాటలు వింటే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అది చూసిన రమణులు అక్కడే ఆగిపోయారు.
(20:53) ఎవరైతే ఆ భయపెడుతున్న వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులతో రమణులు అంటారు ఆయన శరీరం నుండి వచ్చే గాలి మనకు తగిలితే మల్లిమ అవుతామని అనుకుంటున్నారా? మరి ఈ కొండ నుంచి వచ్చే గాలి అందరినీ తాకుతుంది కదా ఆ గాలికి లేని అభ్యంతరం మనకఎందుకు భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే అనగానే వెంటనే కాళ్ళ మీద పడిపోయారు రమణ మహర్షి కాళ్ళ మీద కాదు ఆ ఎవరైతే తక్కువ కులం అన్నారో ఆ తక్కువ కులం వ్యక్తి కాళ్ళ మీద ఈ భయపెట్టిన వ్యక్తి వెళ్లి కాళ్ళ మీద పడ్డాడు అయ్యా క్షమించండి అని ఒక్క మాట అండి జ్ఞాని చెప్పే ఒక్క మాట చాలు మారిపోవడానికి అలాగే ఇంకొక సంఘటన గురించి చెప్పు చెప్పుకుంటే ఒకసారి రమణ మహర్షి గిరి
(21:33) ప్రదక్షణ చేస్తున్నప్పుడు అంటే ఆ రోజుల్లో గిరి ప్రదక్షణం చేసేటప్పుడు రోడ్లు అంతగా బాగుండేవి కాదు ఇప్పుడైతే రోడ్లు చాలా చక్కగా క్లీన్ గా ఉన్నాయి కానీ అప్పట్లో చాలా ముళ్ళు రాళ్ళతో ఉండేవి చాలా కఠినం గిరి ప్రదక్షణ చేయడం అప్పట్లో రమణ మహర్షి కాలంలో అయితే ఒకసారి ఒక శిష్యుడు దారిలో ఉన్న ముళ్ళను చూసి తిట్టుకుంటున్నాడు అప్పుడు రమణులు అన్నారు ముళ్ళ ఉన్నాయని బాధపడక మిత్రమా ఆ ముళ్ళ పొదలు లేకపోతే ఈ అందమైన పూల మొక్కలు మేకల బారి నుండి ఎలా రక్షించబడతాయి చెప్పు ప్రకృతిలో ఏది ఉన్నా దానికి ఒక కారణం ఉంటుండు వాటిని స్వీకరించు సర్దుకు పోకు దాన్ని అర్థం
(22:09) చేసుకో ముళ్ళ ఉన్నాయని ఎందుకు తిట్టుకుంటున్నావ్ ఆ ముళ్ళ ఉండడం వల్ల ఎన్ని ప్రాణులు బ్రతుకుతున్నాయో ఎన్ని మొక్కలు బ్రతుకుతున్నాయో వేరే వాటి నుంచి ప్రకృతి అలా నిర్ణయించింది దాన్ని ఆస్వాదించలేవా దాన్ని అంగీకరించలేవా ఎందుకు తిట్టుకుంటున్నావ్ అంటారు రమణ మహర్షి చూడండి ఇలాంటి సంఘటనలు వింటే అంటే ఏదో ఒక సంఘటన పట్టుకుంటుందండి మనసుకి ఇప్పుడు ఇన్ని చెప్పాను చూసారా ఇన్నిటిలో ఏదో ఒక సంఘటన పట్టుకుంటుంది నిజంగా కరెక్ట్ గా మనం మనసుపెట్టి వింటే ఆ మనసులో ఉన్న ఆలోచనలు సాక్షిగా ఉంటూ వింటే ఏదో ఒక సంఘటన పట్టుకుంటుంది మనల్ని అలాగే ఒకరోజు ఆ గిరి ప్రదక్షణ మార్గంలో ఒక
(22:51) చిన్న వినాయకుడు గుడి ఉండేదండి ఇప్పటికీ ఉందనుకోండి అయితే రమణులు అక్కడికి రాగానే ఆగి ఆ విగ్రహం వైపు చూస్తూ ప్రతిరోజు రోజు గిరి ప్రదక్షణ చేసేటప్పుడు ఆ విగ్రహం వైపు చూస్తూ మురిసిపోయేవాళ్ళు ఒకసారి ఒక చిన్న బాలుడు చిన్న పిల్లాడు ఆ విగ్రహానికి గుంజలు తీస్తుంటే రమణులు కూడా నవ్వుతూ ఆ పిల్లాడు పక్కన నిలబడి ఏరా వినాయకుడికి బాగా భయపడుతున్నావా ఆయన నీకు స్నేహితుడు భయపడకు ఏదో తప్పు చేశాను ఏదో దొంగతనం చేశాను అమ్మ నాన్నలకు తెలియకుండా ఏదో ఒక అల్లరి పని చేశాను నన్ను కొడతారేమో నన్ను క్షమించు అని దేవుడి దగ్గర గుంజీలు తీస్తున్నావా దేవుడు నన్ను క్షమించేయాలి
(23:24) మా అమ్మ నాన్న క్షమించేయాలి అని దేవుడు స్నేహితుడు రా నీకు ఆయన ఆయన ఎప్పుడు ఏమి అనడు అంటాడు. అంటే దేవుని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తున్నాడు చూడండి ఒక పిల్లాడిని చమత్కారంగా అనిపించొచ్చు కానీ ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి సంభాషణ అలాగే ఒకసారి గిరి ప్రదక్షణలో ఇది కంచి పరమా పరమాచార్య స్వామికి రమణ మహర్షికి డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా జరిగిన సంభాషణ కంచి పరమాచారి ఒకసారి అరుణాచలం వచ్చినప్పుడు రమణలు గిరి ప్రదక్షణలో ఉన్నారని తెలుసుకున్నారు ఇద్దరు మహానుభావులు అండి ఒకరికొకరు ఎదురు పడలేదు కానీ ఒకే సమయంలో గిరి ప్రదక్షణలో ఉన్నారు.
(24:06) రమణులు ఒక మార్గం గుండా గిరి ప్రదక్షణ చేస్తుంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఇంకొక మార్గంలో గిరి ప్రదక్షణ చేస్తున్నారు కానీ ఒకే సమయంలో చేస్తున్నారు కానీ ఎదురుపడలేదు. అయితే తర్వాత రమణలో శిష్యులతో ఇలా అన్నారు ఆయన ఇక్కడే ఉన్నారు ఆయన మౌనం నా మౌనం ఒక్కటే ఇక్కడ రెండు శరీరాలు ఉన్నాయి కానీ రెండు స్థితులు లేవయ్యా ఉన్నది ఒక్కటే స్థితి కాకపోతే ఒక స్థితి అక్కడ నడుస్తుంది ఒక స్థితి ఇక్కడ నడుస్తుంది అంతే తేడా అని అంటారు అంటే మాటలు లేకుండానే ఇద్దరు జ్ఞానులు ఒకరినొకరు ఎలా పలకరించుకున్నారో చూడండి ఇక్కడ ఈయన ఏ మాట అన్నారో అక్కడ ఆయన
(24:42) కూడా అదే మాట అన్నారు ఇద్దరు ఆ స్థితికి చెందిన వాళ్లే ఇద్దరు ఈ భూమి మీద నడిచిన వాళ్లే ఆ భూమి మీదే మనము నడుస్తున్నాం ఆ స్థితినే మనము అనుభవించే ప్రయత్నము చేస్తున్నాం ఎంత అదృష్టం అదృష్టం కూడా లేదనుకోండి అదృష్టం దురదృష్టం అనేవి కూడా లేవు. ఇలాంటి మాటలు వింటూ ఇంకా ఎంతకన్నా అదృష్టం దురదుష్టం అనుకోవడం ఏంటండి మాటలు వింటే చాలు అంతే [ఆశ్చర్యం] అలాగే ఇంకొక సంఘటన చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.
(25:07) ఒకసారి గిరి ప్రదక్షణలో ఉన్నప్పుడు రెండు కోతులు రెండు కోతుల యొక్క గుంపులు గొడవ పడుతుండేవి సాధారణంగా కోతులు ఎక్కువ ఉన్నాయి అంటే ఒక కోతికి ఇంకొక కోతికి మధ్య గొడవ జరుగుతూనే ఉంటుంది అలాగే గొడవ జరుగుతుంది. శిష్యులు వాటిని వెళ్లగొట్టబోతుంటే రమణలు అన్నారు వద్దయ్యా వాటికి కూడా వాళ్ళ రాజ్యాలు సరిహద్దులు ఉంటాయి అవి వాటి సమస్యను అవే పరిష్కరించుకుంటాయి మనం ఏమైనా పరిష్కరించుతామా మనం ఏమనా వెళ్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తామా కోర్టులకు తీసుకువెళ్తామా వాటి సమస్యను అవే పరిష్కరించుకుంటాయి మనం మధ్యలో వెళ్తే అవి మన మీదకు వస్తాయి అని ప్రకృతిలో ఉన్న జీవన
(25:39) నియమాలు చెప్పారు చూడండి అక్కడన్న శిష్యులకి అంటే రమణుల జీవితంలో ప్రతి అడుగు కూడా ఒక పాఠమేనండి గిరి ప్రదక్షణలో ఆయన అడుగు వేస్తుంటే ఒక పవిత్ర యజ్ఞంలా సాగేది ఆయన చిరునవ్వు ఆయన చూసిన చూపు ఆయన చూపు ఎదురుపడిన ప్రతి వ్యక్తి ఒక గొప్ప శాంతిని పొందాడు. అలాంటి స్థితి అబ్బా ఇంతకన్నా ఏం కావాలండి ఇన్ని విషయాలు చెప్పుకున్నాను నాకే నాకే ఆనందం అంత ఆనందం వేస్తుంది.
(26:08) సరే ఇంకొక సంభాషణ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రమణ మహర్షి కొండ వెనుక భాగంలో ఒంటరిగా గిరి ప్రదక్షణ చేస్తున్నారు శిష్యులు ఇంకా బయలుదేరలేదు ఒంటరిగా గిరి ప్రదర్శన చేయడానికి సిద్ధపడిపోయాడు నడుస్తున్నాడు కూడా ఒక బాగా జటలు కాళ్ళ దాకా ఉన్న జటలు చేసిన ఒక సిద్ధుడు ఆయనకు ఎదురయ్యాడు అంటే సాక్షాత్తు శివుడులా ఉన్నాడు శివుడికి ఎలా అయితే బట్టలు లేకుండా పెద్ద జటాజూటం ఉంటుందో అలా ఉన్నాడు ఆ సిద్ధుడు రమణ మహర్షికి ఎదురయ్యాడు ఆ సిద్ధుడు రమణుల వైపు తీక్షణంగా చూస్తూ ఒక్క క్షణం ఆగి తన చేతిని రమణుల యొక్క హృదయంపై ఉంచారు.
(26:47) రమణులు కూడా అలాగే స్థిరంగా ఉండిపోయారు కొద్దిసేపటి తర్వాత ఆ సిద్ధుడు నవ్వుతూ తలలోకి వెళ్ళిపోయాడు. తర్వాత శిష్యులు అడుగుతారు ఏమైంది భగవాన్ అంటే ఆయన అంటారు ఆయన ఒక గొప్ప సిద్ధ పురుషుడు హృదయంలో ఉన్న జ్యోతిని పలకరించడానికి వచ్చారు మా మధ్య మాటలు లేవు కానీ సందేశం చేరింది. చూసారా ఉత్తరాలు లేవు కానీ వివరణ ఏంటో తెలిసింది అన్నంత కామెడీగా ఉంది కానీ నిజమే మనం చూడండి ఒక ఇద్దరు ప్రేమికులు ఎదురెదురుగా కూర్చుంటారు ఏమి మాట్లాడకపోయినా ఒకరి మనసులో ఒకరి మనసులో మాట ఇంకొకరికి తెలిసిపోతుంది ఆక్షయం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థితిని
(27:26) చాలా దగ్గరగా జరుపుకుంటారు కాబట్టి అంతకన్నా ఇంకో గొప్ప స్థితి ఇది అలాగే పలని స్వామితో జరిగిన ఒక సంఘటన ఉందండి ఆ ఇది గిరి ప్రదక్షణ లో గిరి ప్రదక్షణ మహత్యం అనే ఒక పుస్తకంలో ఉంటుంది. రమణుల యొక్క తొలి అనుచరుడు అంటే రమణుల నుండి రమణులు ఫస్ట్ నుండి ఫాలో అవుతున్న వ్యక్తి పలనే స్వామి ఎప్పుడూ కూడా రమణుల వెంట ఉండేవాళ్ళు ఒకసారి గిరి ప్రదక్షణలో పలనే స్వామికి చాలా ఆకలేసింది.
(27:57) నీరసించి కళ్ళు తిరిగి పడిపోయాడు ఆల్మోస్ట్ అప్పుడు దారిలో ఒక సాధువు కనిపించి ఒక పండును పలనే స్వామికి ఇస్తాడు అన్నమాట. అది చూసి రమణలు నవ్వుతూ చూసావా ఈ కొండ నిన్ను ఆకలతో ఉండనివ్వదు పలని ఇక్కడ ప్రతి సాధువు శివుడు రూపంలో తిరుగుతుంటాడు నీ ఆకలను చూస్తే తండ్రి ఒప్పుకుంటాడా వెంటనే తీర్చేయలేదా చూసావా అని అంటాడు. సో రమణులతో గడిపిన క్షణాలు పలనే స్వామికి దొరికాయి అలాగే ఇంకొక్కసారి గిరి ప్రదక్షణ మార్గంలో ఒక సాధువు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు.
(28:33) ఎన్నో శక్తులు ఉన్నాయని రమణుల దగ్గర చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు రమణులు అంతా విని ప్రశాంతంగా ఒక మాట అనేవాళ్ళు నాయనా నీకు శక్తులు వచ్చాయో లేదో నాకు తెలియదు కానీ నీలో నేను అంటే నేను ఈ శరీరం ఈ మనసు అనే ఒక అహంకారం ఉంది చూసావా అది మాత్రం చాలా బలంగా ఉందయ్యో కొండ చుట్టూ తిరగాల్సింది కాళ్ళతో కాదు నీ అహంకారాన్ని ఇక్కడ వదిలేయడానికి ప్రయత్నించు వెంటనే ఆ మాటలతో ఆ సాధువుకి ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసింది ఇందుకా అనే ఒక ఆలోచన వచ్చి ఉన్నపలంగా అహంకారాన్ని వదిలేస్తాడండి.
(29:11) అలాగే ఇంకొక సంఘటన చూద్దాం ఒకరోజు గిరి ప్రదక్షణలో రమణులకు ఒక ముసలవాడు పండు ముసలివాడు వచ్చి ఒక గిన్నెలో పాయసం వేసి ఇస్తాడు రమణులకి రమణులు అది తినేసి ఆ గిన్నెని తిరిగి ఇవ్వడానికి చూసే సమయానికి ఆ సాధువు అక్కడ ఉండడం చుట్టుపక్కల ఎక్కడ ఆయన జాడ అనేది అసలు కనిపించదు కూడా ఏంటి మనిషి ఇప్పుడే కదా నాకు చేతిలో పాయసం పెట్టాడు గిన్నెతో ఉన్నఫలంగా మాయమైపోయాడు ఏంటి అంటే అంతే కనిపించలేదు వెంటనే రమణలు అంటారు శిష్యులతో కొందరు సిద్ధులు ఇలాగే వస్తారు వారి పని ముగేయగానే మాయమైపోతారు ఈ అరుణాచలం అలాంటి మహిమలకు నిలయం అంటారు.
(29:52) ఒక విషయం చెప్పనండి అరుణాచలమే కాదు నువ్వు చూడగలిగితే సాక్షి భావనతో సమస్త ప్రపంచము కూడా మహిమలకు నిలయమే ఎందుకంటే అంతటా అంతటా ఈశ్వరుడు ఉన్నాడు అంతటా శ్రీ మహావిష్ణువు ఉన్నాడు అంతటా కృష్ణుడు ఉన్నాడు అంతటా రాముడు ఉన్నాడు అంతటా భగవంతుడు ఉన్నాడు నువ్వు కాకుండా భగవంతుడు వేరుగా ఉన్నాడా సమస్తము నువ్వే అయి ఉన్నావు కదా సమస్తము విష్ణువే కదా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటారు కదా అలాగే విశ్వం విష్ణుహు అంటారు కదా అంటే మొత్తం విశ్వమంతా విష్ణువే అయినప్పుడు మళ్ళీ కేవలం అరుణాచలంలో ఉండడం ఏంటండి ఆయనక అక్కడ ఆ యొక్క అనుభూతులు లభించాయి అంతే అంతటా
(30:33) ఉన్నాడు అలాగే ఇంకొక సంభాషణ చూసుకుంటే కొండపైన ఉండే ఒక గుహలో ఒక స్వాది ఉండేవాళ్ళు ఆయన రమణులను చూడగానే కిందికి దిగివచ్చి రమణులకి సాష్టాంగ నమస్కారం కాళ్ళ మీద పడిపోయేవాడు స్వామి మీరు ఎక్కడి రావడం మాద మా అదృష్టం మా జన్మ ధన్యం అయిపోయింది అనేవాళ్ళు వెంటనే రమణులు నవ్వుతూ నేను రావడం ఏంటయ్యా మనం ఎప్పుడూ ఇక్కడే ఉన్నాం కదా ఈ కొండ మీద అందరం ఒకే ఆత్మ స్వరూపులం అని ఒక అద్వైత సత్యాన్ని చెప్పారు.
(31:05) శారీరకంగా చూడొద్దు శారీరకంగా మీరు వేరు నేను వేరు అందరూ వేరే కానీ ఆధ్యాత్మికంగా మనం బ్రతుకుదాం ఈ భూమి మీదకు వచ్చింది ప్రతి మనిషి ఆనందంగా బ్రతకడానికి అయ్యా వేరు వేరు బేద భావాలు పెట్టుకొని బ్రతకడం కోసం కాదు అంటాడు ఎంత గొప్ప మాట అండి ఆ స్థితిని అనుభవించినా సరే అలాగే ఇంకొక సంఘటన కూడా చూద్దాం రమణులు తరచుగా ఒక మాట చెప్పేవాళ్ళు ఈ కొండ మీద తిరిగే కోతులు కుక్కలు నెమలు ఇవి కేవలం కేవలం జంతువులు కావు గత జన్మలో సాధన చేసి ఏవి ఈ శరీరాలు సాధన చేసి ఈ జన్మలో రమణుని చెంత చెంద ఉండాలని వచ్చిన సిద్ధులు ఒకసారి ఒక నెమల ఆయన చుట్టూ నాట్యం చేస్తుంటే రమణులు దానితో
(31:50) మాట్లాడుతూ అంటారు ఏమయ్యా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు నీకు కావాల్సిన ఆహారం దొరికిందా ఏంటి అని ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడేవాళ్ళు రమణ మహర్షికి సిద్దులు అంటే ఎక్కడో ఆకాశంలో ఉండేవారు కాదండి రమాణ మహర్షి దృష్టిలో సిద్ధులైనా భగవంతుడైనా దేవతలైనా దెయ్యాలైనా ఏవైనా సరే అవి ఆకాశంలోనూ పాతాళంలోనూ కొన్ని లక్షల కిలోమీటర్ల తర్వాత ఉన్న లోకంలోనూ కాదండి ఎదురుగా ఉన్న ప్రతి ప్రాణిలోనూ ప్రతి చెట్టులోనూ ప్రతి రాయిలోనూ అవే ఉంటాయి.
(32:24) అనే ఒక సాక్షి భావనని ఒక చూపుని ఒక దృష్టికోణాన్ని మనకి కనిపిస్తుంది ఆయన యొక్క మాటల్లో అందుకే ఆయన గిరి ప్రదక్షణ ఎప్పుడు ఎప్పుడు కూడా ఒక ఆధ్యాత్మిక ఉత్సవంలో ఉండేది. ఇలాంటి గిరి ప్రదక్షణ ఇలాంటి సంభాషణలు ఇలాంటి సంఘటనలు మన జీవితంలో కూడా జరగాలి జరుగుతాయి మనకి జరుగుతుంటాయండి కాకపోతే మనం గుర్తించమ అంతే మనం ఎంతసేపు మనల్ని మనం తక్కువగా చూసుకుంటాం రమణ మహర్షికి అయితే అవుతుందిలే మనక ఎందుకు అవుతుంది రమణ మహర్షి ఏదో నక్షత్రంలో పుట్టాడు మనం అలా పుట్టామా ఏంటి అని ఒక భావనలో బ్రతుకుతుంటాం అది తీసేసి చూడు మిత్రమా రమణ మహర్షి నువ్వు నేను అందరం ఒక్కటే
(33:07) కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి అయితే ఇవి చాలు ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడైనా వీలైతే మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇప్పటిదాకా మీరు విన్న ఈ గిరి ప్రదక్షణలో రమణ మహర్షికి ఎదురైన వింత వింత అనుభవాలు వింత వింత సంఘటనలు అందరిని కూడా అందరి మనసుల్ని కూడా అందరి యొక్క ఆలోచనల్ని కూడా స్థిరంగా సాక్షిభావనగా అటువైపు మల్లేటట్టు చేశాయని భావిస్తూ ఏదో ఒక సంభాషణ గాని సంఘటన గాని మీ మనసును పట్టుకొని మీ మనసుని సాక్షి భావన స్థితిలో నింపి మీరు కూడా రమణ స్థితిని అనుభవించేలా చేయాలని కోరుకుంటూ ఇట్లు మీ అజ్జు బైపల్లి
(33:47) అరుణాచల శివ

No comments:

Post a Comment