““మీ అబ్బాయికి ఇది చెప్పారా?” అబ్బాయిలు చెప్పడానికి సిగ్గుపడే సమస్య #parentingtips #testis #puberty
Author Name:Harshavardhan Gangodi
Youtube Channel Url:https://www.youtube.com/@kidshealth_dr.harsha
Youtube Video URL:https://www.youtube.com/watch?v=IGFpFFLgaI8
Transcript:
(00:00) మీ ఇంట్లో మగపిల్లలు ఉన్నారా అయితే వాళ్ళకి చిన్నప్పటి నుండే ఈ నొప్పి గురించి అవగాహన కల్పించండి. ఇది వాళ్ళ టెస్టిస్ ని సేవ్ చేయగలదు. మగపిల్లలు చాలా మంది పేరెంట్స్ కి ఎస్పెషల్లీ మదర్స్ కి తెలియని ఒక డేంజరస్ అండ్ ఎమర్జెన్సీ కాంప్లికేషన్ ఉంది. ఇదే టెస్టిగల టోర్షన్ అంటే వర్షనాల మెలిక. టెస్టిస్ అనేవి తెరిగిపోవడం వలన రావాల్సిన రక్త సరఫరా అనేది ఆగిపోతుంది.
(00:19) అక్కడి నుంచే బాబుకు టైం స్టార్ట్ అయిపోతుంది.ఆరు గంటల లోపు సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఆ టెస్టిస్ అనేది పర్మనెంట్ డామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ అసలు సమస్య జబ్బు కాదు సిగ్గు. ఇది యూజువల్ గా 10 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లల్లో చూస్తూ ఉంటాం కొన్ని సార్లు పెద్దవాళ్ళకి కూడా ఇది రావచ్చు. పిల్లాడు పొద్దున్నే విపరీతమైన నొప్పితో నిద్రలేస్తాడు కానీ అమ్మ నాన్నకు చెప్పడు చెప్పాలంటే సిగ్గు అలానే సైలెంట్ గా నొప్పిని బరుస్తూ ఉంటాడు.
(00:40) కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పొద్దున చూద్దాంలే అని లేట్ చేస్తూ ఉంటారు కానీ అప్పటికే బాగా లేట్ అయిపోవచ్చు. కాబట్టి మీ బాబుకి సింపుల్ గా ఇలా చెప్పండి నాన్న నీకు అక్కడ ఏమన్నా నొప్పి వచ్చినా వాపు వచ్చినా ఎర్రగా ఉన్నా ఒకటి పైకి వెళ్ళినట్టు అనిపించినా నాకు వెంటనే చెప్పాలి అస్సలు సిగ్గుపడకూడదు అని చెప్పండి. ట్రీట్మెంట్ లేట్ అయితే ఫ్యూచర్ లో పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గిపోవచ్చు.
(00:58) మగపిల్లలు సైలెంట్ గా సఫర్ అవ్వకుండా చూడడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. కాబట్టి రియల్ ని మాక్సిమం షేర్ చేయండి మనం కలిసి మన పిల్లల ఫ్యూచర్ ని కాపాడదాం. [సంగీతం] మన ఛానల్ ని ఫాలో అవ్వకుండా మాత్రం వెంటనే ఫాలో చేయండి. నేను మీ డాక్టర్ హర్షవర్ధన్ థాంక్యూ.
No comments:
Post a Comment