Thursday, May 21, 2026

ఈవీడియో కచ్చితంగా ధైర్యాన్ని ఇస్తుంది,Krishanas motivational, @nandurihemamalini

ఈవీడియో కచ్చితంగా ధైర్యాన్ని ఇస్తుంది,Krishanas motivational, @nandurihemamalini

Author Name:nanduri hemamalini

Youtube Channel Url:https://www.youtube.com/@nandurihemamalini

Youtube Video URL:https://www.youtube.com/watch?v=lkkV-IhamXc



Transcript:
(00:00) శ్రీమాత్ర నమః మనల్ని ఎవరైనా మోసం చేసినా మనకి ఎవరైనా దూరమైపోయినా మనం అనుకున్నది సాధించలేకపోయినా ఏడుస్తాం కదా నేను అందరికీ మంచే చేశాను కదా నాకెందుకు ఇలా జరిగింది అని బాధపడతాం కుమిలిపోతాం. అర్జునుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో గాండీ వాన్ని పక్కన పడేసి దుఃఖించారు ఎందుకు ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ తన వాళ్ళు ఎలా తన వాళ్ళతో యుద్ధం చేస్తాను కులక్షయం అయిపోతుంది తన వల్ల కాదు అని బాధపడుతూ ఉంటే కృష్ణ పరమాత్మ అర్జునుని ఓదార్చలేదు గద్దించారు నీలో ఉన్న అజ్ఞానాన్ని వదిలిపెట్టు అని
(00:46) గద్దించారు అసోచ్య నన్వసోచస్త్వం ప్రజ్ఞావాదాంస్చ భాషసే గతాసు నగతాసుంస్చ నానుసోచంతి పండితాః వీడియో చూసే ముందు జై శ్రీ కృష్ణ అని ఒక్కసారి కృష్ణ పరమాత్మని మనం ధ్యానించుకొని కామెంట్ పెట్టేసి అప్పుడు వీడియో చూసేద్దాం సరేనా సరే కామెంట్ పెట్టేసి వచ్చి ఉంటారు కదా ఇప్పుడు వీడియో వినండి. దీనికి అర్థం ఏంటి ఈ శ్లోకానికి అర్జున నువ్వు బాధపడకూడని వాళ్ళ కోసం బాధపడుతున్నావు మళ్ళీ మాటలు మాత్రం చాలా పెద్ద పండితుల్లాగా చెప్తావు నిజమైన జ్ఞానులైన పండితులు ప్రాణం పోయిన వారి గురించి కానీ ప్రాణంతో ఉన్న వారి శరీరం గురించి కానీ ఎప్పటికీ బాధపడరు అని
(01:35) మనం కూడా చాలాసార్లు జీవితంలో ఇంతే మనకి ఏదైనా లభించలేదు అని అనుకోండి ఏడుస్తాం నమ్మినవాడు మోసం చేస్తే బాధపడతాం మనం భాగవతంలో చిత్రకేతు మహారాజు కథ ఒక్కసారి విన్నాము అని అనుకోండి మనకున్న మాయ అంతా తొలగిపోతుంది తొలగించుకోవడం చాలా కష్టం కానీ సాధన చేస్తే ఇదేమి అసాధ్యమైంది మాత్రం కాదు మనం సాధన చేయలేకపోవటం వల్లే మనకి అందించిన ధైర్యాన్ని అంటే కృష్ణ పరమాత్మ అందించిన భగవద్గీతను చదువుకోకపోవటం వల్లే ఇవన్నీ మనం మనం పేర్చుకుంటున్నాం ఈ దుఃఖాన్ని ఈ మాయని ఆ మాయ వదిలిపోవాలి అంటే కృష్ణ పరమాత్మ
(02:21) చెప్పిన నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలి. శ్రీమద్భాగవతంలో ఆరవ స్కంధంలో ఇది చిత్రకేతుడు సూరసేన దేశానికి రాజు ఆయనకి చాలామంది భార్యలు ఉన్నారు కానీ సంతానం లేదు సంపద ఉంది కానీ మనశశాంతి లేదు అయ్యో నాకు సంతానం లేదే అని వెలితి ఆయన్ని నిరంతరం బాధ పెడుతూ ఉండేది. ఆయన ముఖంలో ఎప్పుడూ సంతోషం ఉండేది కాదు ఒకసారి అంగీరస మహర్షి రాజ్యానికి వస్తారు.
(02:48) రాజు బాధని గమనించి యజ్ఞం చేయించి ఆ యజ్ఞ ప్రసాదాన్ని రాజు పెద్ద భార్యకి ఇవ్వమని చెప్తారు. అయితే మహర్షి ప్రసాదాన్ని రాజుకి ఇచ్చేటప్పుడు రాజుతో చెప్తారు. నీకు నీ పెద్ద భార్య వల్ల ఒక కొడుకు పుడతాడు ఆ కొడుకు నీకు అపరిమితమైన ఆనందాన్ని అంతే పెద్ద దుఃఖాన్ని కూడా కలిగిస్తాడు అని చెప్పి వెళ్ళిపోతారు. సరే మహర్షి చెప్పినట్లు ఒక అందమైన మగబిడ్డకు జన్మనిస్తుంది రాణి ఆ బాలుడిని చూసి చిత్రకేతే ఏమో పొంగిపోతాడు రోజంతా ఆ బిడ్డతోనే గడుపుతూ పెద్ద రాణి పైనే అమితమైన ప్రేమను చూపిస్తూ ఉంటాడు.
(03:19) ఇది చూసి మిగతా భార్యలకి చాలా అసూయ ద్వేషం పెరిగిపోతుంది. ఈ బిడ్డ పుట్టడం వల్లే కదా రాజు ఇలా మనల్ని దూరం చేశాడు ఈ బిడ్డ దూరమైపోతే రాజు మళ్ళీ మనకి దగ్గర అవుతాడని భావించి ఒకరోజు ఎవరూ లేని సమయం చూసి ఆ పసి బిడ్డకి పాలల్లో విషం కలిపేసి తాగించేస్తారు. ప్రాణం పోతుంది ఓ దాసి వస్తుందన్నమాట చూసేసరికి బిడ్డ ప్రాణం లేకుండా పడి ఉన్నాడు వెంటనే పెద్దరాణికి చెప్తుంది.
(03:45) పెద్దరాణి ఏడుచుకుంటూ వస్తుంది చిత్రకేత మహారాజు కూడా అక్కడికి వస్తాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు చిత్రకేత మహారాజు కూడా కానీ ఎన్నో యుద్ధాలు చేసి ఎందరో శత్రువులను ఎదిరించిన ఆ మహావీరుడు తన కొడుకు సేవాన్ని చూసి ఒక్కసారిగా వెలవెల్లాడిపోతాడు అంతే కదా నేనేం పాపం చేశాను స్వామి ముసలితనంలో ఇచ్చిన బిడ్డని ఇంత త్వరగా లాగేసుకుంటావా అంటూ ఆ శవాన్ని గట్టిగా కౌగలించుకుని పిచ్చివాడిలాగా ఏడుస్తూ ఉంటారు.
(04:12) అంతఃపురం అంతా కన్నీళ్లతో మునిగిపోయింది. రాజుకి ఎప్పటికీ శాంతి కలగలేదు శాంతించట్లేదు ఆ బిడ్డ సవాన్ని వదిలి పెట్టలేదు. రాజు పరిస్థితిని చూసి చలించిపోతారు అంగీరస్ మహర్షి తనతో పాటు నారద మహర్షిని కూడా తీసుకొని వస్తారు. నారదుడు రాజుతో చెప్తాడు రాజా నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావు ఈ చనిపోయిన శరీరం కోసమా లేక ఇందులో ఉన్న జీవుడు కోసమా అసలు ఈ జన్మకు ముందు ఈ బిడ్డ నీకు ఏమవుతాడు వచ్చే జన్మలో ఏమవుతాడు నీకు ఇదంతా కేవలం నాటకము అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఎంత నచ్చ చెప్పినా మరి తన కొడుకు కదా ఆ సమయంలో రాజుకి ఆ మాటలు అసలు ఎక్కవు రాజుకే కాదు
(04:48) ఎవరికీ ఆ మాటలు ఎక్కవు అప్పుడు నారద మహర్షి తన ఆ తపశక్తితో ఆ బాలుడి శరీరం నుంచి వెళ్ళిపోయిన జీవాత్మని తిరిగి మళ్ళీ అక్కడికి రప్పిస్తారు. ఆ ఆత్మతో నారద మహర్షి మాట్లాడతారు. ఓ జీవుడా చూడు నీ తల్లితండ్రులు నువ్వు వెళ్ళిపోయావు అది తట్టుకోలేక ఏడుస్తున్నారు నువ్వు మళ్ళీ ఈ శరీరంలోకి ప్రవేశించి నీ తండ్రి ఇచ్చిన రాజభోగాలను అనుభవించు అని చెప్పి చెప్తారు.
(05:11) అప్పుడు ఆ జీవాత్మ అందరికీ వినపడేలాగా మనుష్య వానితో నవ్వు అంటుందన్నమాట. మహర్షులారా దేవ మనుష్య పశుపక్షాదులుగా ఎన్నో కోట్ల జన్మలను ఎత్తాను కాలచక్రంలో తిరుగుతున్న నాకు ఈ చిత్రకేతుడు ఏ జన్మలో తండ్రి పోయిన జన్మలో ఈయనే నాకు శత్రువు కావచ్చు లేదా వచ్చే జన్మలో ఈయనకి నేను తండ్రిగా పుట్టొచ్చు ఒక అంగడిలో వస్తువులు ఎలా అయితే ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతికి మారుతూ ఉంటాయో ఆత్మలు కూడా ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి బంధాలని మార్చుకుంటూ ఉంటాయి.
(05:38) ఆత్మకు తల్లి లేదు తండ్రి లేదు చావు లేదు కేవలం ఈ శరీరానికి మాత్రమే బంధాలన్నీ అలాంటప్పుడు నేనెందుకు మళ్ళీ ఈ చిన్న శరీరంలోకి రావాలి అని చెప్పి ఆ ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న చిత్రకేతు మహారాజుకి ఒక్కసారిగా తను గుండెల్లో ఉన్న అజ్ఞానపు పొరలన్నీ ఒక్కసారిగా వీడిపోతాయి. నేను ఎంతకాలం మోహంలో పడి ఏడ్చింది ఒక నశించిపోయే చొక్క లాంటి శరీరం కోసమా అని గ్రహిస్తాడు.
(06:06) భార్యలతో సహా అప్పటివరకు తను ఎవరికోసం అయితే బాధపడుతున్నాడో దాన్ని కూడా వదిలేసి నారద మహర్షి ఇచ్చిన మంత్రోపదేశంతో తపస్సు చేసుకోవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పరమ పదాన్ని పొందుతారు. కన్నీళ్ళకి కరిగిపోయేంత బలహీనమైనది కాదు నీ జీవితం సమస్య వచ్చినప్పుడు ఏడవడం పెరికితనం దాన్ని ఎదుర్కొని నువ్వు అనుకున్నది సాధించడమే గీతాసారం.
(06:31) నీ కళ్ళలో నుంచి కారే ప్రతి కన్నీటి చుక్క నీ శత్రువుకి బలాన్ని ఇస్తుంది. అదే నీ కళ్ళల్లో కనిపించే పట్టుదల నీ సమస్యల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది ఏడవడం ఆపేయ్ గెలవడం మొదలుపెట్టు ఈ ప్రపంచం నీ కన్నీళ్ళను చూసి జాలిపడదు పైగా నవ్వుతుంది కానీ అదే నువ్వు పట్టుదలతో సాధించి చూపిస్తే ఈ ప్రపంచమే నీ వెనుక నడుస్తుంది. సమస్య వస్తే ఏడవడం కాదు చరిత్ర సృష్టించడం నేర్చుకో నీ బలం ఏంటో నీకు తెలియనంత వరకే సమస్య నిన్ను భయపెడుతుంది.
(07:09) ఒక్కసారి నువ్వు భయాన్ని వదిలేసి పోరాటం మొదలు పెడితే నీ సమస్యే నిన్ను చూసి పారిపోతుంది. గుర్తుపెట్టుకో నువ్వు నశించిపోయే శరీరం కాదు అజయమైన ఆత్మవి రాయి దెబ్బలక ఏడిస్తే శిల్పం అవ్వదు. మట్టి మంటకు భయపడితే కుండ అవ్వదు నీకు వచ్చిన సమస్య నిన్ను ముక్కలు చేయడానికి రాలేదు నీలో దాగున్న విజేతను బయటకి తీయడానికి వచ్చింది ఏడవకు సాధించి చూపించు గెలిచిన వాళ్ళందరినీ చూసి వాళ్ళకి సమస్యలు లేవు అని అనుకుంటాం కానీ సమస్యల మధ్యలో కూడా ఆగకుండా వాళ్ళు ముందుకు వెళ్ళారు కాబట్టే గెలిచారు కృష్ణుడు అర్జునుడికి
(07:54) చెప్పింది ఒకటే భయపడకు లే నిలబడు నీ ధర్మం నువ్వు చెయ్ అని నిన్ను కింద పడేసిన బాధే ఒకరోజు నిన్ను శిఖరానికి తీసుకెళ్తుంది. ఎవరో వచ్చి నీ జీవితాన్ని మార్చరు ఒకరోజు నువ్వే మారాలని నిర్ణయించుకోవాలి. అర్జునుడు కూడా ఒక్క క్షణం బాధపడ్డాడు కానీ కృష్ణ పరమాత్మ మాటలు విన్నాక తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు చరిత్ర సృష్టించాడు.
(08:25) బాధ పడడం సహజం కానీ బాధలోని ఆగిపోవటం అత్యంత ప్రమాదకరమైనది. నీ కష్టాల గురించి నీ బాధల గురించి ప్రపంచం అడగదు కానీ నువ్వు సాధించిన విజయం మాత్రం గుర్తించుకుంటుంది. సమస్యలు వచ్చాయిని ఏడవకు ఎందుకంటే ప్రతి తుఫాన్ తర్వాతే ఆకాశం మరింత ప్రశాంతంగా కనిపిస్తుంది. బాధల్లో ఏడ్చేవాడు బలహీనుడు కాదు అక్కడి నుంచి లేవని వాడే బలహీనుడు కష్టం వచ్చినప్పుడు భగవంతుడు మనల్ని వదిలేసాడు అని బాధపడకూడదు.
(09:02) మనల్ని ఇంకా అద్భుతంగా తీర్చి దిద్దుతున్నాడు అని అనుకుంటే ఆ బాధని కొంచెమైనా మరిచిపోతాం. మన కన్నీటి కథ ముగింపు కాకూడదు. కొత్త ప్రారంభానికి నాంది కావాలి. కింద పడిపోయిన నువ్వే విరిగిపోయిన నీ మనసే కచ్చితంగా గెలుస్తుంది నువ్వు గెలుస్తావు ఒకరోజు గొప్పగా ఈ ప్రపంచం ముందు నిలబడతావు. మనం కూడా మనతో ఎవరో మాట్లాడలేదని మనకు దక్కాల్సింది దక్కలేదని నమ్మిన వాళ్ళు మోసం చేశారని బాధపడుతూ ఉన్నాం కదా బాధపడుతూనే ఉంటాం.
(09:43) ఇలా బాధపడుతున్న వాళ్ళకి నన్ను మోసం చేశారు అని ఏడుస్తున్న వాళ్ళకి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు లే నీ కన్నీళ్లు తుడుచుకో లే నీ బాధ్యతని నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్ నువ్వు ఫలితం కోసం ఆశించకు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు పోగట్టుకున్న దాని కోసం ఏడవడం ఆపేసిన రోజే మన జీవితంలో గెలవాల్సింది ఏంటో మనకి కనిపిస్తుంది. సమస్యలు అందరికీ వస్తాయి కానీ ఆ సమస్యను చూసి ఏడ్చేవాడు సామాన్యుడు సమస్య వెనుక ఉన్న పరమార్థాన్ని చూసి ముందుకు సాగేవాడే పండితుడు వద్దు ఏడవద్దు కన్నీళ్లుు ఆపేసి కృష్ణ పరమాత్మ చిరునవ్వుని మన హృదయంలో నింపుకుంటే ధైర్యం వస్తుంది అంతే కదా ఎవరు
(10:28) మనల్ని ఉద్ధరించగలరు భగవంతుడు తప్ప

No comments:

Post a Comment