ఇంట్లో శాపం - అరచేతిలో గాయం - అమ్మవారు చేసిన అద్భుతం Ramaa Raavi Best Moral Stories #idreammom
Author Name:iDream Mom
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamMom
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lt_Mf9swLBY
Transcript:
(00:05) నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు మనం రకరకాల దేవతలు దేవుళ్ళు ఇలాంటి స్టోరీలు చాలా వింటాం స్థల పురాణాలు చెప్పుకుంటాం కదా అట్లా ఏదైనా ఒక అమ్మవారి కథ చెప్పండి పూర్వం అట అది ఎక్కువ పూర్వం కాదు కొంచెం పూర్వం ఓ 100 80 ఏళ్ల క్రితం ఓ 80 100 అంతే 19వ దశకం ప్రారంభ దశలో అన్నమాట ఒకాయన భట్టాచార్య ఆయన పేరు ఈయన జ్యోతిష్యము వాస్తు అలాంటివి క్షుణణంగా చదువుకున్నాడు.
(00:37) అంత ఉపాసన కూడా ఉంది. ఎక్కడైనా ఒక ఎనర్జీ ఉంటే అది ఆయనకి తెలుసు మనం ముందు కూడా కొంతమందిని అట్లాంటి వాళ్ళని చూసేవాళ్ళం ఇటీవల కాస్త తక్కువ ఉన్నారు వాళ్ళు నిజం చెప్తున్నారో ఏదైనా వేషం వేస్తారో తెలియదు మనకి అవును కానీ భట్టాచార్య గారు కొంత మితభాషి అవసరమైన విషయం తప్పిస్తే మాట్లాడేవాడు కాదు.
(01:01) ఈ 19వ దశకం ప్రారంభ దశలో రేర్గా రైళ్లు ఉన్నాయి గానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కాలు నడకన వెళ్ళాలి. ఏవో ఎడ్ల బళ్ళలో ఏవో ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వెళ్తుంటే ఒంటెద్దు బళ్ళని గుర్రబళ్ళని ఉండేవి అవి కట్టించుకోవడం సొంతంగా అంటే ఏదో ధనవంతులకి కుదిరేది మామూలు పాటక జనము మా బ్రాహ్మలు వీళ్ళంతా కూడా సంచారంగా ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతూ ఉండేవాళ్ళు అయితే ఈయన ఆయన ప్రయాణం ఎక్కడికి మన ఏమంటారు దాన్ని పూర వైపుకి ప్రయాణం చేస్తున్నాడు పూరీ వెళ్ళాలని ఆదిశంకరులు ఎట్లా భారతదేశాన్ని చుట్టారో అట్లా ముందు ముందు పూరి చూసి తర్వాత రామేశ్వరం వెళ్దాం అనుకున్నాడు ఆయనక ఒక 40 సంవత్సరాలు 45 ఏళ్ళు అలా
(01:41) ఉంటాయి. సంసారం లేదు ఉన్నది ఆయన వెంటపెట్టుకొని తిరగడు అన్నమాట ఒక సంవత్సరం పాటు ఇట దేశంంతా తిరిగి వస్తానని ఇంటి దగ్గర చెప్పి కావలసిన ఏర్పాట్లు చేసి దేశం మీద పడ్డాడు ఆయన ఈ పూర వెళ్ళాలంటే ఇంత ఇంచుమించుగా విజయనగరము అవన్నీ దాటి వెళ్ళద్దు మనం ఒరిస్సా వెళ్ళాలంటే విజయనగరం మధ్యలో పాలాసా ఈ ఊళ్ళన్నీ వెళ్ళాలి. ఈ విజయనగరానికి కొద్దిగా ఇవతల ఇంకా తెలుగు బాగా క్షుణణంగా మాట్లాడుతున్న ప్రాంతమే ఒరిస్సా ఒరియాస రాల ఈ ప్రాంతాల్లో ఒక ఊర్లో ఆయన ఆగాడు.
(02:18) మామూలుగా ప్రయాణాల్లో ఏం చేసేవాళ్ళు ఇదంతా నడుస్తూ రాత్రిపూట చీకడ పడేసరికల ఏదో ఒక ఊరు చేరేవాళ్ళు ఆ కాలంలో ఏంటంటే బ్రాహ్మలయతే బ్రాహ్మణ కుటుంబాలే ఎవరో ఒకళ్ళు రాత్రికి ఒక ముద్ద పెట్టి వాళ్ళకి పడుకోవడానికి ఆసరా చూపించేవాళ్ళు ఈ నడిచి వెళ్లేవాళ్ళకి సత్రాలు ధర్మ సత్రాలు అవి దాటిపోయినాయి జమీందారులు ఉన్నవాళ్ళ కట్టినవి ఒకటో రెండో ఉండేవి రాజులు పోయారుగా 19వ దశ నాటికి బ్రాహ్మణ కుటుంబాలే ఆసర అయ్యేవి లేదా ఏదైనా పల్లెల్లు అయితే ఈయన అయ్యగారని ఏమనా ఒక కుండో రెండు కుండలో అప్పచెప్పి అయ్యగారు ఈ పంచలో వండుకోండిని వాళ్ళు అన్నం వండుకొని
(02:51) పడుకో అన్న ఏదైనా తిని పడుకోవడానికి వీలుగా ఏర్పరిచేవాళ్ళు కొంచెం పెద్ద ఊరయితే బ్రాహ్మణ అగ్రహారాలు ఏమనా దొరికేవి ఈయన ఒక సుమారైన ఊర్లో ఆగారు ఆగితే ఏమైంది ఆ ఇది ఈ బ్రాహ్మణ అగ్రహారంగా లేదు కానీ ఈ వీధింతా బ్రాహ్మలేనండి అని ఎవరో చెప్పారు. ఈయన పోయి ఆ ఊర్లో ఆ దారిలోకి ప్రవేశించి ఆ సందులోకి ఒక ఇంటి పాకితో కూర్చున్నాడు.
(03:22) కూర్చుంటే ఆ ఇంట్లో నుంచి ఒక అతను బయటికి వచ్చాడు. ఒకాయన కనిపించి ఏ ఊరండి ఏమిటండీ అని అడిగాడు. అడిగితే మంచి ఎండవేళ ఆ ఎండగా ఉంది నాయన ఈ ప్రయాణంతో భోజనం అరేందండి అన్నాడు ఆ లేదు ఇంకా చూసుకోవాలి అన్నాడు అనేటకాల ఆ ఇంటఆయన అన్నాడు మా పూటకి ఈ పూటకి మా ఇంట్లో భోజనం చేయండి మరి ఇంట్లో భోజనానికి ఏర్పాటు అవుతుంది వంట వంట అవుతుంది మీరు కాళ్ళు కడుక్కోవచ్చు అన్నాడు కాళ్ళు కడుకోవచ్చని ఈయన అన్నాడు నేను వచ్చేటప్పుడు పొద్దునే ఉదయం స్నానం అది చేసి వచ్చా కాబట్టి స్నానం కావాలంటే స్నానం చేయండి లేకపోతే కాళ్ళు కడుకుంటే కాళ్ళు కడుకుంటానని వెనకాల బావి వైపుకి
(04:00) వెళ్ళాడు సరే కాళ్ళు కడుకున్నాడు ఏం గోత్రం అండి ఏం ఊరండి ఎక్కడ బయల్దేరారు ఏ మాట్లాడుతున్నారు. ఇదిఇది బావిలో చేద వేసి నీళ్లు తోడుతూ ఉంటే ఆఖరి చేత వేసాడు ఈయన పైకి లాగేసరికల్లా ఆ తాడు సర్రని కోసుకుపోయింది వీళ్ళకి కోసుకుపోవటం ఏమిటి ఒక బొట్టు నెత్తురు బొట్టు టక్కిన కింద పడింది బావిగట్టు మీద అయ్యయ్యో అన్నాడు ఆయన ఇంటఆయన ఈయన కూడా అయ్యయ్యో అనుకున్నాడు.
(04:31) సో ఏముంది వేలు కాస్త తెగింది ఆ వేలు అదిం పట్టుకున్నాడు నీళ్లు తీసుకున్నాడు పోసుకుంటుంటే ఆయనకి ఏమనిపించింది నెత్తిటి బొట్టు పడింది కదా దాన్ని ఎవరో తీసి నాలిక్కి రాసుకున్నారు అనిపించింది. అది ఆ వేల నాలికో తెలియల ఏదో జరిగింది అక్కడ ఆ నెత్తుటి బొట్టు పడిన తర్వాత ఇంకేం లేదు మామూలుగానే ఉంది భోజనం చేశారు. భోజనం అయిన తర్వాత పంచలో వాకిలి వైపుకి ఈయన కాసాయాస భోజనం ఎక్కువైంది ఆ పూట ముందు రోజో వాళ్ళ ఇంట్లో ఏదో విశేషం కూడా ఉంది సరే లడ్డులు అవి చేశారు అవి కూడా వడ్డిచ్చారు తిన్నారు పడుకుంటే ఆయనకి ఆ ఇంట్లో కళ్ళు మూసుకోంగానే గజ్జలు చప్పుడు ఎట్లాంటిది
(05:16) అంటే గల్లు గల్లు కాదు గల్ అంటుంది అది ఎట్లా ఉంది బలమైన అడుగు పడుతున్న శబ్దం కళ్ళు మూసుకోంగానే గల్లు వినపడింది ఏదో ఎనర్జీ ఉంది ఇంట్లో అనుకున్నా బాగా నడిచి వచ్చాడు ఎండవేళ కదా మాగన్నుగా కొనుకు పెట్టింది. ఆయనకి ఎట్లా కనపడుతుంది నీలంగా ఉన్న పాదం దాని గజ్జలు పాంజేబులు అవి కూడా ఉన్నాయి. కానీ బరువైన పాదం అది స్త్రీ పాదమే కానీ దాని చేతిలో ఏవో ఆయుధాలు ఉన్నాయి.
(05:51) మ్ ఊరికే ఆడవాళ్ళ నాజుకు నడక వేరు బరువు మోస్తున్న ఆడవాళ్ళ నడక వేరు వాళ్ళ చేతిలో ఏదో ఆయుధం ఉంది. మళ్ళీ కళ్ళమంది కళ్ళురి చూసాడు ఏం లేదు లేచాడు సాయంకాలం అయింది వాళ్ళు ఏమన్నారు ఇంత ఎండల్లో ఉండండి ఇక ఏం వెళ్తారు ఈ పూటకి రాత్రి విశ్రమించండి రేపు తెల్లవారు జావనే నాలుగు గంటలకల్లా బయలుదేరితే మీరు ఇక్కడి నుంచి ఒక 11 గంటలు 12 గంటల లోపల మీకు ఇంకో ఊరు లభిస్తుంది ఇంకో ఊరు కనపడుతుంది ఆ ఊళలో పడుకోవచ్చు ఆ ఊరిలో భోజనం చేయొచ్చు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటే ఒకవేళ కుదిరితే ఇప్పుడు అలసిపోకుండా ఉంటేమూడున్నరనాలుగు గంటలకు మళ్ళీ బయలుదేరారు అనుకోండి బాగా చీకటి పడే
(06:32) వాళ్ళకి ఇంకో ఊరు చేరిపోతారు ఇవాళ మా ఇంట్లో ఉండండి మా ఇంట్లో ఉండండి అని వాళ్ళు నాలుగుైదు సార్లు చెప్పారు. సరే ఈయనకు కూడా ఉందామ అనిపించింది కనబడుతున్న ఒక అదృశ్యంగా ఏదో తెలుస్తోంది కదా అదేమిటో చూద్దాం అనుకున్నాడు ఆయన అనుకున్నాను మూడున్నర నాలుగు గంటలు అయ్యేసరికి అంటే కొంచెం పొద్దు వాటాడుతూ ఉన్న సమయానికి ఇంకా చీకటి పడలే పొద్దు కదులుతోంది.
(06:53) ఎవరో వచ్చి వాకెట్లో కూర్చున్నారు. వీళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు. పొద్దున్నే ఈయన చెయి తెగింది అని చెప్పాడు మధ్యాహ్నం నీళ్లు తొడుతుంటే ఈయన వేలు తెగింది సర్రం తెగిపోయింది అని చెప్పాడు అయింది అన్నాడు ఆయన అవి వచ్చినాయన అర్థం కాలే అలాగా అనాలి అయింది అంటున్నాడు అంటే జరగాల్సింది ఏదో జరిగింది అంటున్నాడని అర్థమయింది. మ్ ఇంత ఆయన ఈ లోపల ఎవరో వాకెట్తో పాలే కాకేస్తే ఆయన లేచి వెళ్ళాడు.
(07:24) ఈ భట్టాచార్య గారు వాకెట్లో వచ్చి కూర్చున్నాడుగా ఆ ఊరు ఆయన ఒకడు ఆయన దగ్గరికి జరిగాడు. కాదండీ నా వేలు తెగితే అయ్యింది అన్నారు ఏమిటి ఇక్కడ అనేసరికి ఆయన అన్నాడు ఏమిటోనండి వీడు మావాడు అని ఈ ఇంటఆయన వీడు అమాయకుడు పాపం వీడికి తెలియదండి ఇది ఈ బ్రాహ్మణ గ్రహారం ఈ చివరి ఇల్లు ఈ ఇంట్లో రోజు నీ నెత్తురు పడందే కుదరదండి ఈ ఇల్లే అట్టాటిది వీళ్ళకి గమనం లేదు వాళ్ళు తెలుసుకోరు నాకు తెలుసు నేను 70 ఏళ్ల నుంచి చూస్తున్నా అన్నాడు ఆయన అనేసరికి అదేంటండి అని అవునండి పిల్లవాడి వేలు తెగుతుంది కనీసం లేదా ఇంటఆవిడ వేలు దిగుతుంది లేదా ఇంటాయన వేలు దిగుతుంది కాలు దిగుతుంది
(08:11) పుల్లు గుచ్చుకుంటుంది సూది గుచ్చుకుంటుంది తలుపు సందులో పడుతుంది. ఆ ఇంట్లో కుక్క ఒకటి వాకెట్లో కుక్క ఉంది కనీసం దానికైనా ఓ నెత్తుటి బొట్టు పడాల్సిందే అది పడితే గాని ఈ ఇంటికి శాంతం లేదండి ఇట్లాంటిది ఒకటి ఉందిరా అబ్బి అని నేను ఒకసారి రెండుసార్లు చెప్తే చాల్లే నేర్చుకుపోయావని వాడు తిట్టిపోస్తాడు నన్ను మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా నా చిన్నతనం నుంచి నాకు తెలుసు ఎవ్వరికీ ఏమ అవ్వలేదు అనుకోండి ఈ ఇంటికి వచ్చిన చుట్టానికైనా ఏదో ఒకడయి వాడి వాడి నెత్తురు ఇంట్లో పడాల్సింది.
(08:41) అట్లా ఎందుకు అవుతుందండి అలా ఎందుకుఉందండి అని అడిగాడు. ఏమోనండి తెలీదు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఇది మా తాత అనేవాడు వీళ్ళ తాత వినలే మా నాన్న అనేవాడు వీళ్ళ నాన్న వినలే ఇప్పుడు నేను పెద్దవాడిని వీడు అంత వయసు ఉన్నవాడు కాదు వీళ్ళు చాలా ఆలస్యంగా పుట్టాడు వీళ్ళు బాగున్నారు వీళ్ళ ఇంట్లో వంశాభివృద్ధి ఉంది ఆడపిల్లలు పుట్టారు ఆడపిల్లలకు చక్కగా పెళ్లిళ్లు అవుతాయి లక్షణంగా కాపరాలు చేసుకుంటారు వాళ్ళకి ఏ సమస్య లేదు ఇల్లు వాకిలి పుష్కలంగా ఉన్నాయి అన్ని గొడ్డు గోదా ఉంది.
(09:11) ఈ నెత్తుటి బొట్టుని కోరుతుంది తప్ప వీళ్ళకి ఇవ్వాల్సింది మొత్తం ఇచ్చేస్తుంది ఇల్లు ఇది మాత్రం జరగాలి ఇది ఇక్కడ విధాయకం మ్ అనేసరికి సరే అరుగు మీద కొస జరి కూర్చున్నాడు ఈయనతో మాట్లాడడం అనేసి కళ్ళు మూసుకున్నాడు. మెల్లిగా ధ్యానంలోకి వెళ్ళటం మొదలు పెట్టాడు భట్టాచారి గారు వెళ్ళగా వెళ్ళగా ఆయనకి పొద్దు నుంచి తనకి మధ్యాహ్నం అన్నం తిన్న దగ్గర నుంచి ఆయనక ఒకటి తెలిసింది.
(09:39) మొదట పడిన నెత్తుటి బట్టుని ఎవరో తీసుకున్నారు మనిషి కాదు కచ్చితంగా పడుకున్నప్పుడు గల్లుమని వినపడుతుంది. ఏదో పాదం మాత్రం నీలం రంగులో ఉంది అది తెల్లటి పాద కాదు నలుపు నీలం మధ్యలో ఉంది. ధ్యానంలో కూర్చుంటే ఆయనకు కనపడింది ఒక పెద్ద స్వరూపం ఆయుధాలు ధరించి ఉన్నటువంటి ఒక శక్తి స్వరూపిని ఆ ఇంట్లో ఉంది. ఆయనకి ఎట్లా కనబడుతుందో అయితే బాగా తెలియటంలా వేగ్గా ఒక ఎనర్జీ ఉంది ఆయనకి ఆయుధాలు ఉన్నాయి అది సాత్విక స్వరూపం ఖచ్చితంగా కాదు.
(10:19) మ్ ధ్యానంలో నుంచి లేచేసాడు. ఆ ఇంట ఆయన వచ్చి కూర్చున్నాడు. ఏమిటండీ నిన్న మీ ఇంట్లో విశేషం అన్నాడు. ఆ నిన్న మేము లక్ష్మీ పూజ అమ్మవారికి పూజ చేసుకున్నాం నిన్న చాలా భక్షాలు అవి చేసాం అదే శెనగపిండి లడ్డు లడ్డుకి తప్పు లేదు కాబట్టి మీ పళ్ళమీ విస్తర్ట్లో వడ్డించింది మాత్రం భార్య అని చెప్పాడు పూజ చేస్తారా మీరు చేస్తామండి ఏమేమి పూజలు చేస్తారు ఆయన అన్ని పర్వదినాల వ్యవహారాలు చెప్పాడు ఏమేం చేస్తారు స్వామివారికి నివేదన గార్లు బూర్లు పాయసాలు పులిహారులు దద్దోజనాలు ఎంత చెప్పాడో ఎన్నో పదార్థాలు సోడచోపచారాలకి 16 పదార్థాలు నివేదన చేస్తాం అన్నీ
(10:57) చేస్తాం ఇన్ని నివేదనలు పెడుతుంటే ఈ ఎనర్జీ నెత్తుటి బొట్టును ఎందుకు కోరుకుంటుంది ఇన్ని పెడుతున్నాడు కదా అవన్నీ పుచ్చుకుంటుంది అవన్నీ మరి అమ్మవారికి ఆ ఇంట్లో ఉన్న గృహ దేవతకే కదా మొదట నివేదన చేసేది మనం ఒక దేవుణని పెట్టుకుంటామా ఏవో నాలుగు పటాలు పెడతారు విగ్రహాలు పెడతారు దేవతా అర్చన ఉంటుంది. ఆ అర్చనతో పాటు గృహ దేవతకి కూడా నివేదన అయిపోతుంది అక్కడన్న మొత్తం ఎనర్జీకి నివేదన మనం చేసేది వెంకటేశ్వర స్వామి పాటం పెట్టాం ఆయన ఒక్కడే తీసుకుంటున్నాడు అని అనుకోవడానికి వీలు లేదు అక్కడున్న ఎనర్జీ అంతా ఈ పదార్థాన్ని సూక్ష్మ రూపంలో
(11:32) తీసుకుంటుంది. ఈ పదార్థాలు చాలవ అన్నమాట అసలు ఈ ఊరు ఏమిటి ఈ ఇల్లు ఏమిటి ఈయనకి ఈ ఊళలోనుంచి వెళ్ళాలని లేదు తనకి శక్తి రూపంగా కనబడుతున్న ఆ సంగతి ఏమిటో తెలుసుకోవాలి ఆ మీకు ఎన్నేళ్ళండి అన్నాడు ఇప్పుడో ఎప్పుడో 50 వస్తుందండి అని అలాగా మీ ముందు మీ ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళని మా నాన్నగారు మా మేనత్తలు బాబాయిలు పెద్దనాన్నలు ఉన్నారు.
(11:58) వీళ్ళు వంశాన పారంపర్యంగా వచ్చింది. మీ తాతగారు ఎంతమంది అన్నదమ్ములు వాళ్ళు కూడా ముగ్గురో నలుగురో అన్నదమ్ములు మీ తాతగారుకి కూడా వంశ పారంపర్యంగానే కాదనుకుంటానండి మా తాతకి తాత వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారండి ఈ ఊరు మా వాళ్ళది ఈ ఊరు కాదు మా తాతలనాడే మేము ఈ ఊరు వచ్చాం ఏం దొరికిందిరా అంతకుముందు ఇక్కడ ఏదో ఉందఅనుకున్నాడు. అక్కడినుంచి మెల్లిగా పక్క ఇల్లవాళ్ళ నలుగురిని చూసొస్తాను అని చెప్పి లేచి పక్కఇల్లు వెనకెల్లు మూడు నాలుగు ఇళ్లల్లో చూశడు.
(12:29) వందఏళ్ళు దాటిన ముదివగ్గులు ఎవరింట్లో ఉన్నారో చూసుకున్నాడు ఆయన ఒక 100 సంవత్సరాల వయసున్న ఒక మామగారు రుక్మిణ్ గారు ఒక ఇంట్లో ఆ రుక్మిణ గారు చూసి వసేసరికి పెద్ద ముత్తు పెద్ద ఆవిడ ముత్తైదువు కాదు భర్త లేరు దండం పెట్టాడు దండం పెట్టి నేనేదో ఇటా యాత్రలకి వెళ్తున్నా వీళ్ళ ఇంట్లో దిగాను అని అమ్మ వీళ్ళు ఈ ప్రాంతానికి రావడం మీకు తెలుసా ఇదా అంటే ఆవిడ అన్నది అంటే నాకు ఓహచ్చాకే వాళ్ళు నా ఊహరాక ముందే వచ్చారు కానీ నాకు అప్పటినుంచే తెలుసు అన్నది అన్నాక ఇల్లు ఎవరిది ఏమిటి అని అడిగాడు అడిగేసరికల అయ్యో ఇదంతా బ్రాహ్మలు ఉండేవి ఇది కాదండి ఇది ఒక రాజుగారి దారులు
(13:08) ఇవన్నీను అయితే ఇప్పుడు ఈ వరస అంతా కూడా రాజుగారి దేవుడి ఉండేది దేవుడి ఉండి రోజు రాజుగారి పూజా గీజా చేసేవాళ్ళు ఈ వరస తొమ్మిది ఇల్్లు రాజుగారి దేవుడియే వాళ్ళంతా వెళ్ళిపోయాక వాళ్ళు తమతో పాటు ఉన్న బ్రాహ్మలకి ఇళ్ళ ఇచ్చారు మేము ఒకళ్ళం ఒకళ్ళని చూసుకొని మా ముతాతలనాడే ఒక్కొకళ్ళు ఒకొకళ్ళు వచ్చాం చివరి ఇల్లు మీరు దిగారు కదా ఆ ఇల్లు వాళ్ళు చిట్ట చివరికి వచ్చారు.
(13:37) ఓహో అట్లాగ అమ్మా ఆ చిట్ట చివరి ఇదివరకు ఏ ప్రాంతంలో ఏమ ఉండేది అంటే అక్కడ వీరలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఉండేది. ఓహో ఉన్నది ఈ వీరలక్ష్మి అంటే ఇప్పుడు రాజుగారిది కోట దేవిడి అంటే పెద్ద జమీందారి ప్రాంగణం అన్నమాట దాంట్లో చిట్ట చివరికి ఈశాన్యానికి ఒక పెద్ద స్థలము అందులో ఒక వీరలక్ష్మి అమ్మవారు అంటే ఏమండీ విగ్రహాలు ఉండేవా వాళ్ళు ఏం పూజ చేసేవాళ్ళు అని అడిగాడు ఆ విగ్రహాలు అవి కాదండి రెండు కటారులు ఉండేవిట రెండు కటా ఇట్లా నేలలో పాతి ఉండేవి ఆ రాజుగారు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా వేటక వెళ్ళాలన్నా పై ఊరు వెళ్ళాలన్న దేవిడి దాటాలంటే అమ్మవారికి బలి ఇచ్చి
(14:19) ఓహో ఊరు దాటేవాళ్ళు ఆ రాజుగారు వాళ్ళు తొమ్మండుగురు సంతానం ఈ లోపల ఈ రుక్మిణ అమ్మగారి మేనగోడలు ఒక ఆవిడ ఒక ఐదఆరు ఏళ్ళు చిన్నది ఒక ముస్సల ఆవిడ వచ్చింది భర్త కూడా ఉన్నాడు ఆవిడ భర్త ఇద్దరు వచ్చారు అబ్బో ఆది దంపతులు ఇద్దరు వచ్చారు ఇంటిల్లిపాది వాళ్ళని కూర్చోబెట్టుకున్నారు 90 ఏళ్ళు దాటిన వాళ్ళఇద్దరు ఆ ముసలాయన ఈ కథ అంతా చెప్పడం మొదలు పెట్టాడు వీరలక్ష్మికి చాలా విశేషమైన ఇదండి పేరుకి లక్ష్మి గానీ ఆవిడ ఆయుధాలు ధరించి ఉండేది ఆమెకి ఇక్కడ బల్లులు ఇచ్చేవాళ్ళు రాజుగారు దేవుడి అంతా కాదు చివరి భాగంలోనే అది జరిగేది తర్వాత రాజుగారు వెళ్ళిపోయారు
(15:01) అంతా పోయారు తర్వాత ఇవన్నీ ఇల్లు పడ్డాయి ఊరంతా పెరిగిపోయింది మొత్తం ఊరు పెరిగిపోయింది. ఇది ఎప్పుడు జరిగింది 100 సంవత్సరాల పైమాట ఈ కథ జరిగి ఓకే ఆ చివరి ఇంట్లో ఉన్న కుటుంబం బాగా వృద్ధి చెందింది వాళ్ళు కూడా కానీ అని ఆయన మీతో చెప్పకూడదు మీరు పై ఊరు వాళ్ళు ఆ ఇల్లు నెత్తురు కోరుకుంటుందండి అక్కడ అదే జరిగేది అమ్మయో అన్నాడు అబ్బే ప్రాణాలు గీనాలు తీసుకోదండి ఆవిడ ప్రాణాలు తీయదు కానీ కానీ దానికి ఏమన్నా శాంతి చేయగలమా ఎందుకంటే అప్పటికీ కొన్ని తరాలుగా ఒక 30 తరాలు రాజుల ఏలుబడిలో ఉండి 30 తరాల నాడు
(15:48) ప్రతిష్ట చేయబడినటువంటి వీరలక్ష్మి ఉన్నది అక్కడ ఇప్పుడు ఉన్నది బ్రాహ్మణ కుటుంబం వీళ్ళు పులిహారు పెడతారు దద్దోజనం పెడతారు గార్లు పెడతారు బూర్లు పెడతారు అవేం సరిపోతాయి చాలదు చాలదు చాలదు ఆమె ప్రతిష్ట మాత్రం అక్కడే ఉంది ఇప్పుడు ఈ వేర లక్ష్మి ఎక్కడ ఉంది ఈయన మెల్లిగా వెనక్కి వచ్చాడు. దీన్ని వీళ్ళకి చెప్పాలా వద్దా అట్లా ఆలోచిస్తున్నాడు.
(16:14) ఈయన మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాడు. కూర్చుంటే నీసాన్యంలో బావి ఉంది. ఆ బావికి అటు ఇటుగానే భూమిలోకి దిగిపోయి ఉన్న రెండు కటార్లు ఆయన కనపడ్డాయి. ఈయన మెల్లిగా ఇంటి ఇంటఆయన్ని పిలిచాడు మీకు ఒక విషయం చెప్పాలి అని నిదానంగా కూర్చోబెట్టి ఈ ఇల్లు ఎప్పుడు కట్టారు ఎప్పుడు చేశారు ఏం చేశారు ఇవన్నీ కనుక్కున్నాడు. కనుక్కున్నాక ఈయన ఏం చెప్పాడు ఇదంతా బ్రాహ్మణ్ మా ఇల్లు అవతల నుంచి మామూలు వాళ్ళు మామూలు మిగిలిన వాళ్ళంతా నాలుగో వర్ణం వాళ్ళ ఇల్లు ఉన్నాయండి మా గోడకి అటువైపు వాళ్ళు అమ్మవారిని పెట్టుకున్నారు అక్కడ ఏదో చేసుకుంటారు వాళ్ళ పూజ వాళ్ళు నేను బాగా ఆలోచించి మీకు ఒక మంచి మాట
(16:58) చెప్తానండి ఇదేం మీకు చెడు కాదు మీకు ఇది కాదు ఇక్కడ జరుగుతోంది ఇది నాకు కనపడింది నేను వీళ్ళందరినీ కనుక్కున్నాను కాబట్టి ఒక పని చేద్దాం ఈ గోడని నూతి దగ్గరికి జరిపేసేద్దాం ఈ ప్రహరి గోడని అప్పుడు వాళ్ళు చేస్తున్నారుగా పూజ ఆ పూజ ప్రాంతంలోకి ఇది వెళ్ళిపోతుంది. అనేసరికి ఈయన ఆలోచించడం మొదలు పెట్టాడు పెద్ద ప్రాంగణం అది బావి నుంచి కొద్దిగా ఎనిమిది అడుగులు అవతలికి ఉన్నాయి కటార్లు ఈయన కనపడుతున్నాయి.
(17:30) ఇటు జరిపేస్తే బావి దగ్గరికి గోడ జరిపేస్తే ఈ ఎనిమిది అడుగులు గోడ బయటకి వెళ్ళిపోతాయి గోడ బయటికి వెళ్ళిపోతాయి ఈ గోడ బయట మిగిలిన జాతల వాళ్ళు ఇల్లు ఉన్నాయి ఒకళ్ళఇద్దరు రాజుల కుటుంబాలు కూడా ఆ ఊళలో ఉన్నాయి వాళ్ళు ఎవరు ఏం చేయరు ఇక్కడ ఈ లోపల ఎప్పుడైతే ఈయన మాట్లాడటం మొదలు పెట్టాడు ముందు ఇద్దరు భార్యా భర్తతో మాట్లాడా మాట్లాడాడు కదా వాళ్ళు ఇట్లా కొంత కొంతమంది వచ్చి కూర్చున్నారు.
(17:56) పైగా ఈ ఊళ్ళలో అరుగుల మీద మాట్లాడుకుంటుంటే ఐదారుగురు చేరిపోతారు అవును నిదానంగా వినటం మొదలు పెట్టారు. అప్పుడు సాకల్యంగా రోజుకఒకళ్ళ చెయ్యి ఇక్కడ తెగుతుంది అనేది బయటికి వచ్చేసింది. మ్ చెయ్యి తెగుతుంది కాలు తెగుతుంది వేలుకి ఎదురు దెబ్బ తగులుతుంది ముందుకు బోక పడి చిన్నగా చిట్లి నెత్తురు పడుతుంది ఆ రక్తం పడ్డాక అది ప్రశాంతంగా ఉంటుంది.
(18:17) ఇంకేం చేయదు. మ్ ఆ ఒక్కటి కోరుతోంది ఆమెక అట్లా అలవాటు ఉంది. సరే బాగా ఆలోచించుకొని కట్టేద్దాం గోడ అన్నారు ఊరి ఊరంతా తయారైపోయింది ఈ 15 ఏళ్ల బ్రాహ్మణ్యము దానికి సిద్ధపడిపోయింది. చకచక గోడ కట్టేశారు. వెనకాల మిగిలిన వాళ్ళని ఆ ఒక ఇద్దరు ముగ్గురు రెడ్ రెడ్లు వాళ్ళు కాస్త నాయకులుగా ఉన్నారు. తర్వాత వీళ్ళ పొలాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు యాదవులు అందరినీ పిలిచి ఇవాల్టి నుంచి ఈ బావి దాకా స్థలం మేము ఉంచుకుంటాం బావి వెనక స్థలం మీకు ఇచ్చేస్తున్నాం ఊరుమ్మడిది మీరు అమ్మకు పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో ఇక్కడ మామూలుగా గోడ అవతలే మీరు
(18:54) చేస్తున్నారు కదా అవేవో ఇక్కడ చేసుకోండి అని చెప్పారు ఇప్పుడు మామూలుగా ఉన్న స్థలానికి ఒక ఎనిమిది అడుగుల వెడల్పు బాగా ఒక పాతక 30 అడుగుల పొడుగు ఉన్న స్థలం అందుబాటులోకి వస్తే ఎవరికి మాత్రం వద్దు అదే కదా ఇది చాలా బాగుంది అనుకున్నారు ఒక మూడు నాలుగు రోజులు జరిగింది గోడ కట్టే లోపల వీళ్ళు చూసుకుంటున్నారు పని చేసేవాడికి ఒకడికి వేలు తెగింది ఒకడికి ముక్కులోంచి రక్తం వచ్చింది ఒకడికి మొహం బొప్పి కట్టింది కొడుతూ ఉంటే ఒక రాయి ఎగిరి మొహాని పడి చిన్నగా చిల్లుబడింది నాలుగు రోజులు ఒక్క చుక్క చుక్క చుక్క భూమి మీద పడుతూనే ఉంది ఐదో రోజుకి గోడ
(19:29) తయారైపోయింది తయారైపోయిందా ఈ ఎప్పుడైతే ఇంత స్థలం పెరిగింది కాబట్టి ఊర్లో వాళ్ళు అమ్మవారికి కొలుపులు చేసుకుందాం అనుకున్నారు వాళ్ళకి అక్కడ అమ్మవారు ఎవరో ఉంది మాచమ్మ లాంటి ఒక అమ్మవారు మాచమ్మ అనే పేరు ఉంది అక్కడ ఒక వేప చెట్టు ఉంది వీళ్ళు మామూలుగా వేప చెట్టుకి పసుపు రాసి బొట్టు పెట్టి చీర కడతారు కట్టి అమ్మవారికి ఒక బలి ఇస్తారు వీళ్ళ ఇంట్లో లేదు ఆ స్థలం వీళ్ళు కూడా గోడకి పునాదులు అవి కట్టి అక్కడ కొబ్బరికాయలు కొట్టి చేసేసారు మొత్తం స్థలం బయటికి వచ్చేస్తుంది కదా ఈ భట్టాచారి గారు ఏం చెప్పాడంటే ఇంకొక రెండు రోజులు ఉండి నేను పూరీ ప్రయాణాన్ని
(20:01) ముందుకు తీసుకెళ్తాను అంటే ఆ ఊరు రాజుగారు ఒకాయన మా దగ్గర సవారి బండి ఉందండి మీరు ఇంత ప్రయత్నం చేసి బ్రాహ్మణ కుటుంబానికి ఇంత సహాయం చేశారు. సవారి బండిలో మిమ్మల్ని నేను పూరి పంపిస్తాను. మీరు తిరిగి వచ్చేటప్పుడు మా బండి మా దగ్గర దిగవిడిచి మీరు ముందుకు వెళ్ళిపోదురు గాని ఇది చూడు ఎంత మంచిదే కదా లేకపోతే ఆయన 15 రోజులైనా నడవాల్సి వచ్చేది బండిలో ఒక మనిషి ఉంటాడు తోడు ఒక కర్ర పట్టుకొని ఒకడు ఉంటాడు మీకు బాగుంటుంది అంటే సరి ఒప్పుకున్నాడు.
(20:26) [గురకలు] మర్నాడు పొద్దున గురువారం నాడు అక్కడ కొలుపులు చేయటానికి పెట్టుకున్నారు. తెల్లారింది ఊళలో అంతా రామడోళ్ళు అవి ఇవి మోగిస్తారు ఇప్పుడు అమ్మవారి కొలుపులు చేసేటప్పుడు మనం చూస్తాం కదా జాతర్లు అప్పుడు రామడోళ్ళు మోగుతున్నాయి ఒక గొర్రెని ఒక ఆ కోడిని తీసుకొచ్చారు ఇంకా కొంతమంది బలి ఇవ్వడానికి మరి అక్కడ పద్ధతి అది ఎప్పుడైతే ఈ మాచమ్మ దగ్గర ఈ గొర్రెని కొట్టారో కొట్టేసరికల ఈ నెత్తురు ఎగిరి ఇట్లా ఎగిరి పడింది జనం చూస్తూ ఉండగానే మట్టులో నుంచి రెండు కటార్లు ఇట్లా పైకి వచ్చేసినయి ఒక్కసారి భూమిలో నుంచి పైకి ఆ గోడ నుంచి ఎనిమిది అడుగులు ఇవతలకు
(21:05) ఉన్నాయి కదా ఒక్కెత్తున వచ్చేసింది ఇంకా వదిలిపెట్టారు స్థలం వాళ్ళు ఈ పైకి రావటం ఏమిటి వెంటనే ఈ రామడోళ్ళు మోగిన శబ్దానికి ఈ గొర్రె నెత్తురు పడేసరికాల ఆ రెండు ఎట్లా కనబడుతున్నాయి అంటే ఎంత పాతవో అప్పటికి 30 తరాల క్రితం పాతి పెట్టబడిన ఆ శక్తి అట్లా బయటికి వచ్చింది జనమంతా నిర్ఘాంత పోయారు ఆ కనుంచి 100 మంది పరిగెత్తుకుంటూ వెళ్లి బ్రాహ్మణ గొర్రెలు బర్లిచ్చేటప్పుడు వాళ్ళని ఎవరిని పిలుస్తారు అయ్యగారు ఇక్కడ ఏదో కనబడుతున్నాయండి రెండు ఇట్లా నిలబెట్టే ఉన్నాయి కటార్లు లాగా ఉన్నాయ అంటే అందరూ పరిగెత్తుకొని వచ్చారు.
(21:39) వచ్చి ఇవతల నుంచుంటే ఈయనకి అక్కడ అవి రెండు పాదాలుగా నీలంగా ఉన్న పాదాలు కనిపిస్తున్నాయి ఆ పాదాలకి మువ్వలు కిందకి పాంజేబులు పైకి ఇట్లా బలంగా కట్టబడిన గజ్జలు ఆ కటార్ల మీద నుంచి పైకి ఇక నీలం రంగులో ఉన్నటువంటి ఒక శక్తి స్వరూపం నాలుగు ఆయుధాలే ధరించి ఉంది ఆవిడ మామూలుగా ఇట్లా ఇలా రెండు చేతులుండి వెనక రెండు చేతుల్లో ఆయుధాలు ఉంటాయి సాధారణంగా కాదు ఇవి ఇవి నాలుగు ఆయుధాలే కింద చేతిలో ఒక కత్తి ఈ చేతిలో ఆయుధం కాదు ఎడం చేతిలో ఒక శిరస్సు ఉంది.
(22:17) వెనకాల రెండు ఆయుధాలు పాశాంకుశాలు ధరించి ఉన్న స్వరూపం ఆయనకు కనిపించింది. కనపడేసరికి ఆ అనే తెలిసింది ఆయనకి విపరీతమైన ఉద్రేకం వచ్చింది. వచ్చేసరికల ఆయన వీళ్ళంతా కంగారుపడ్డారు భట్టాచారి గారికి ఉద్రేకం వస్తుంది పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి అన్నారు ఈ బ్రాహ్మణ సమాజం అంతా పట్టుకుంటున్నప్పుడు నేను వీరలక్ష్మిని నన్ను ఇవాల్టికి బ్రాహ్మణుల నుంచి విడిపించి ఊర్లో కలిపారు ఇది ఊరి దేవత ఆవిడే ఈ రోజు నుంచి ఇక్కడ ఏం జరుగుతుందో అది దీంతో పాటుగా శుక్రవారం శుక్రవారం బ్రాహ్మల ఇంటి నుంచి పాయసం పులహోర కావాలి నాకు ఎందుకంటే మరి 100 సంవత్సరాలుగా వాళ్ళు అది అలవాటు చేశారు
(22:55) అది అది ఎప్పుడు దా పెడుతూనే ఉన్నారు 16 నైవేద్యాలు పెట్టేవాళ్ళట 16 పాయసం పులహార గార్లు మొత్తం లిస్ట్ చెప్పాడు ఆయన ఇవన్నీ కావాలి పెరుగన్నంతో సహా శుక్రవారం నాడు నాకు నివేదన పెట్టండి. అనేసరికి ఇక రామడోళ్ళు మోగినాయి ఈ ప్రజలంతా ఇదయపోయారు ఈ ఊళలో ఇంత కాలం నుంచి ఇలాంటిది ఉండి కూడా మాకు తెలియకుండా అయిపోయిందని ఈ ఒక భట్టాచారి రావడం వల్ల కదా ఇది బయటికి వచ్చింది లేకపోతే ఇంకా ఎంతకాలం ఇట్లా జరిగేదో అప్పుడు ప్రతి వాళ్ళు వీళ్ళ ఇంట్లో పని చేయడానికి వచ్చినప్పుడు ఎట్లా తన నెత్తురు ఆ ఇంట్లో పడిందో వందల మంది కథ చెప్పారు ప్రతివాళ్ళు
(23:35) మా నెత్తురు చెవి చూసిందమ్మ మా నెత్తురు చెవి చూసిందమ్మ ఎక్కువ తీసుకోల ఒక బొట్టు ఒక బొట్టు అయినా తీసుకుొని సంతృప్తి పడి ఇంత అన్నం పెడుతున్న బ్రాహ్మణుని ఏమి చేయకుండా ఇన్నేళ్ల నుంచి 100 సంవత్సరాల నుంచి ఈ కుటుంబాన్ని వృద్ధి చేసింది రక్షించింది కానీ తనకు కావలసింది ప్రతి రోజు తీసుకుంది.
(23:58) అక్కడి నుంచి ప్రతి శుక్రవారం ఆ బ్రాహ్మణ సమాజం ఇంట్లో వాళ్ళు ఆ ఇళ్లల్లో వాళ్ళంతా ప్రతి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కుటుంబం చొప్పున 16 16 నివేదనలు తెచ్చిపెట్టేవాళ్ళట ఆ తర్వాత వాళ్ళ పద్ధతి ఉంది కదా ఊళలో వాళ్ళు బలి ఇచ్చే రోజు ఉంది ఆ రోజున కావలసిన బలి వాళ్ళు ఏమఇస్తారో అది ఇచ్చేసేవాళ్ళు ఇప్పటికీ అంటే ఈ కథ చెప్పేనాటికి ఈ కథ ఇట్లాగే జరుగుతూ ఉంది ఇప్పటికీ కొన్ని ఊళ్ళలో అమ్మవారికి ఆ రోజున అది ఈ రోజున ఇది సమర్పిస్తూనే ఉంటారు.
(24:26) కథకంచికి మీ ఇంటికి ఎంత బాగుందో రమ్మగారు సూపర్ నమస్తే అండి అంటే ఇప్పుడు నీకు ఇంకొక విషయం చెప్పాలి చెప్పండి రమ్మగారు ఈ కథ అక్షరాల నాది రమ్మగారు మీరు రాసిన కథ నేను రాసిన కథ అబ్బా ఎంత అద్భుతంగా ఉందో రమ్మగారు నిజంగా అదే కదా చాలా బాగుంది రమ్మగారు బోలడని చదివి చదివి చదివి కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు రాస్తూ ఉంటే ఎప్పటినుంచో ఉన్న ప్లాన్ ఇవాల్టికి వర్కవుట్ అయింది.
(24:51) వావ్ రమగారు కథ చెప్పటమే కాదు రాయటంలో కూడా దిట్టని అనిపిస్తుంది రమగారు ఏమో ఏం తిట్టో తెలిీదు అద్భుతంగా చాలా మటుకు ఇప్పుడే నేను చెప్పాను అంటే మీరు చెప్తుంటే ఎట్లా అయిపోయామ అంటే మేమంతా కూడా ఇక్కడ నాతో పాటు ఇద్దరు కెమెరామన్స్ ఉన్నారు నేను ఉన్నా కదా అలా లీనమైపోతున్నాం మీరు చెప్తుంటే ఊహలోకి వెళ్ళిపోతుంది అదే కదా నాకైతే మరీ ముఖ్యంగా చాలా బాగుంది రమ్మగారు మరిన్ని కథలు రాయండి మీరు ఇలాంటివి ముఖ్యంగా దేవుళ్ళకి సంబంధించినవి నమస్తే అండి చాలా చాలా బాగుంది అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(25:25) ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న [సంగీతం] నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు.
(25:56) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా [సంగీతం] వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాక కొద్ది పడేసా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి
(26:37) అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యస్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటాను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా ఊరికే కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా ఆ తిట్టేద్దామే నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలలో నేను 6 లక్షలు కట్టాను.
(26:58) బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ యస్ డిఫికల్ట్ స్ రైడింగ్ ఎట్ టైగర్.
No comments:
Post a Comment