తెలుగు సంతకం-7: మాటతోనే ప్రపంచాన్ని గెలవొచ్చు! | Iriventi Krishnamurthy | Pamidikalva Madhusudan
@dhatritvtelugu
365 likes
6.7K views
23 hours ago
Subscribe
Comments30
తెలుగు భాషా యజ్ఞంలో భాగస్వాములు అవ్వండి!
——
మన తెలుగు కేవలం భాష కాదు, మన సంస్కృతికి మూలం. ఆ వైభవాన్ని, అజ్ఞాత విశేషాలను పరిశోధనాత్మక రీతిలో నేటి తరానికి అందించడమే ధాత్రి టీవీ Dhatri TV లక్ష్యం.
ప్రతి వారం మా ప్రత్యేక కార్యక్రమాలు:-
* తెలుగు అడ్డా: ఆలోచింపజేసే పాడ్‌కాస్ట్.
* తెలుగు సంతకం: భాషా వికాసానికి కృషి చేసిన మహనీయుల పరిచయం.
* కాల చక్రం: భాష, సంస్కృతి, చరిత్రలను ప్రతిబింబించే డాక్యుమెంటరీలు.
* పద్య విశ్లేషణ: ప్రతి రోజూ ఒక పద్యం - భావయుక్త వివరణ.
పరిశోధనాత్మక కార్యక్రమాల నిర్మాణం ఎంతో శ్రమతో, వ్యయంతో కూడుకున్న పని. అంతరించిపోతున్న మన భాషా సంపదను, మాండలికాలను డిజిటల్ రూపంలో భద్రపరిచే ఈ ప్రయత్నానికి మీ తోడ్పాటు అవసరం.
మీరు ఎలా సహకరించవచ్చు?
మా ఛానల్ మెంబర్‌గా చేరడం ద్వారా ఈ యజ్ఞంలో భాగస్వాములు అవ్వండి.
మెంబర్‌షిప్ ప్రయోజనాలు:
✨ ప్రత్యేకమైన మెంబర్స్-ఒన్లీ వీడియోలు.
✨ కొత్త వీడియోలను ముందుగా చూసే అవకాశం.
✨ లైవ్ సెషన్స్‌లో నేరుగా సంభాషించే వీలు.
మీ Subscription, లైక్ , షేర్, కామెంట్లు కూడా మాకు ఎంతో విలువైనవి.
👉 నేడే “Join” బటన్ క్లిక్ చేసి ధాత్రి టీవీ కుటుంబంలో భాగమవ్వండి.
మన తెలుగును కాపాడుకుందాం...మన వారసత్వాన్ని గౌరవించుకుందాం!
ధన్యవాదాలతో,
మీ ధాత్రి టీవీ బృందం
Be a Partner in the Sacred Mission of Preserving Telugu!
—-
Our Telugu is not just a language; it is the very soul of our culture. At Dhatri TV, our mission is to bring the hidden wonders and profound legacy of our heritage to the modern generation through deep-rooted research.
Our Weekly Special Programs:
* Telugu Adda: A thought-provoking podcast.
* Telugu Santakam: Introducing the visionaries who shaped our linguistic growth.
* Kaala Chakram: Documentaries reflecting our language, culture, and history.
* Poem Analysis: A daily deep dive into the beauty and meaning of Telugu poetry.
Creating research-driven content is a journey of immense hard work and resources. We need your support to continue documenting vanishing dialects and preserving our linguistic treasures in a digital format for future generations.
How Can You Contribute?
Become a part of this mission by joining as a Channel Member.
Membership Benefits:
✨ Exclusive Access: Members-only videos.
✨ Early Access: Watch our new content before everyone else.
✨ Direct Interaction: Connect with us personally during Live Sessions.
Even your Subscription, Likes, Shares, and Comments hold immense value and keep us moving forward.
👉 Click the “Join” button today and become a part of the Dhatri TV family.
Let us protect our Telugu... Let us honor our heritage!
With Gratitude, Team Dhatri TV
59:10
Go to channel Krishna Tatvam Telugu
Garikapati Latest | Sri Krishna Tatvam Telugu | | Sri Krishna | Krishna Tatvam | Krishna Telugu
Krishna Tatvam Telugu
Auto-dubbed
87K views
23:29
సుప్రీంకోర్టులో కేసు గెలిచిన జగన్..దేశం మొత్తం ఉలిక్కిపడి న్యూస్.!? |@PrajaChaithanyamPolitical
Praja Chaithanyam Political
New
86K views
11:32
7 Income Sources Everyone Must Build by 40 | మీరు కూడా ఇలాంటి సంపదను ఎలా సృష్టించవచ్చు?
Smart Money Mindset -Telugu
New
35K views
7:12
హౌరా స్టేషన్ లో బుల్డోజర్ల జాతర! 🚜 Howrah Station 50 Years Encroachments Cleared 🔥 1500+ Shops Out!
NEWS AKHANDA
New
121K views
32:32
చాణక్యుని గురించి మీకు తెలియని రహస్యాలు | Unknown Facts About Chanakya in Telugu | Chanakya History
VRV Facts In Telugu•163K views
41:53
పెళ్ళి మంత్రాల అర్థాలు ఇంత ఘోరమా ? PENMATHSA SUBBARAJU SPEECH
Bairi Naresh•817K views
9:58
Should I Buy Solar Panels? Or Not? Confusion Will Disappear After Watching This Video | Honest Re...
Telugu TechTuts
Auto-dubbed
400K views
58:40
PADMAVYUHAM New Episode || Advocate Ramya || Dr. Kalyan Chakravarthy || Sreevani || #padmavyuham
SumanTV Life Coach•568K views
7:33
పవన్ కు అమిత్ షా క్లాస్! | Home Minister Amit Shah Serious On Pawan Kalyan | YS Jagan | YNR
Journalist YNR
New
156K views
8:32
స్మితా సబర్వాల్ గారి ఆరోగ్య సమస్య ఏమిటి? | Smita Sabharwal Health
Dr M S S Mukharjee | Pulse Heart
New
38K views
14:08
జగన్ ఓడిపోవచ్చు కానీ ప్రజల హృదయాల్లో ఆయన రాజే.. | CM Revanth Reddy | @PrajaChaithanyamPolitical
Praja Chaithanyam Political
New
336K views
17:36
How to Generate Passive Income | Smart Investment | Real Estate vs Mutual Funds | Revanth Chalamala
Revanth Chalamala•52K views
----------------------------------------
https://youtu.be/AmObDloj45Q?si=ZZA4GWG3KZ5_HRz9
Transcript:
(00:00) విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా ఎయిట్ ప్లస్ బెస్ట్ ఛాయిస్ ఇప్పుడే సంప్రదించండి 996393699 [సంగీతం] కత్తి ఎత్తి పట్టిన శత్రువు గుండెనైనా కరిగించి నీరు చేయగల శక్తి దేనికి ఉందో తెలుసా ఆయుధానికి కాదు అద్భుతమైన మాటకు మాత్రమే ఉంటుంది. అందుకే వత్రుత్వం అంటే పబ్లిక్ స్పీకింగ్ కేవలం మాట్లాడడం కాదు అది ఒక అద్భుతమైన కళ ఒక గొప్ప విద్య పయటున్న అలంకారాలన్నీ క్షీణించిపోయేవే ఒక్క వాగ్భూషణమే మనిషికి నిజమైన శాశ్వతమైన భూషణం.
(00:46) సంస్కృతంలో భర్తృహరి చెప్పిన ఈ అమృత వాక్యాన్ని కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా తన జీవితాంతం పలికిన ప్రతి మాటలోనూ రాసిన ప్రతి అక్షరంలోనూ ఆచరించి చూపిన అరుదైన భాషా తపస్వి ఇరివెంటి కృష్ణమూర్తి గారు మహబూబ్నగర్ జిల్లాలో 1930 లో జన్మించిన ఇరువింటి కృష్ణమూర్తి గారు నికార్స అయిన తెలుగు అందాన్ని తెలంగాణ భాషా సౌరభాన్ని లోకానికి చాటిన మనిషి.
(01:22) ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యుడిగా ఆయన వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. కేవలం తరగతి గదికే పరిమితం కాకుండా తెలుగు వాణిని అక్షర రూపంలో పదిలపరచడానికి ఆయన నిరంతరం తపించారు. ఆయన కలం నుండి జాలువారిన ప్రతి రచనలోనూ ఒక స్పష్టత ఒక సామాజిక బాధ్యత శ్రోతలను పాఠకులను కట్టిపడేసేవి. శబ్ద శుద్ధి భావ పరిశుద్ధి ఆయన సాహిత్యానికి ప్రాణవాయువుగా నిలిచాయి.
(01:55) [సంగీతం] [సంగీతం] ఇరివెంటి కృష్ణమూర్తి గారి పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే మరో పవిత్రమైన పేరు యువభారతి 1960లలో యువతలో సాహిత్య అభిలాషను దేశభక్తిని సంస్కృతిని పెంపొందించడానికి కొందరు మిత్రులతో కలిసి ఆయన స్థాపించిన అగ్రగామి సాంస్కృతిక సాహిత్య సంస్థ ఇది యువభారతి పక్ష పక్షాన జరిగిన ఎన్నో సాహిత్య గోష్టులకు పక్ష సభలకు ఇరివెంటిగారు ప్రాణప్రదమై నిలిచారు.
(02:37) ముఖ్యంగా క్లుప్త గోష్టి అంటే చిన్న చిన్న మీటింగలు లాంటి వినూతన కార్యక్రమాల ద్వారా వేదిక ఎక్కడానికి భయపడే ఎందరో సామాన్యులను సమాజం మెచ్చిన అద్భుతమైన వక్తలుగా సిద్ధహస్తులైన వక్తలుగా తీర్చిదిద్దిన ఘనత ఇరివెంటి గారి మార్గదర్శకత్వానిది [సంగీతం] ఇరివెంటి గారు తెలుగు సాహిత్యానికి ఎన్నో అమూల్యమైన గ్రంథాలను కానుకగా ఇచ్చారు. తెలుగు సామెతలు కవి సమయాలు చాటువులు లాంటి అంశాలపై ఆయన చేసిన పరిశోధనలు రాసిన వ్యాసాలు అజరామరమైనవి అయితే ఆయన సాహిత్య ప్రస్థానంలో మకుటాయమానంగా నిలిచిన అద్భుత గ్రంథం ఇది.
(03:28) వాగ్భూషణం, భూషణం. వత్రుత్వ కళ అంటే ఆర్ట్ అఫ్ పబ్లిక్ స్పీకింగ్ పై తెలుగులో వచ్చిన అత్యుత్తమ మార్గదర్శక గ్రంథం ఏది? ఉపన్యాసం ఎలా ప్రారంభించాలి? శ్రోతలను ఎలా ఆకట్టుకోవాలి? సభా కంపం అంటే స్టేజ్ ఫియర్ ను ఎలా అధిగమించాలి? కంఠ ధ్వనిని అంటే మాట్లాడేటప్పుడు టోన్ ను, అభినయాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి? లాంటి అనేక విషయాలను వాల్మీకి మహర్షి రామాయణంలోని హనుమంతుడి సందర్భాన్ని కోట్ చేస్తూ శాస్త్రబద్ధంగా పరమ సులభంగా ఇందులో వివరించారు.
(04:07) ఈ పుస్తకం కేవలం వక్తలకే కాదు జీవితంలో ఉన్నతంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక దిక్సూచి పాల్కురికి సోమనాధుడు అన్నట్లు అల్పాక్షరములలో అనల్పార్త రచన చేయడం ఇరివెంటి గారి శైలి క్లుప్తత స్పష్టత సంస్కారం ఈ మూడింటి కలయకే ఇరివెంటి కృష్ణమూర్తి గారు అలాంటి రచయిత గురించి ప్రత్యేకించి ఆయన వాగ్భూషణం భూషణం పుస్తకం గురించి తెలుగు సంతకం ప్రత్యేక కథనం ఇది.
(04:46) [సంగీతం] పశువుకు మనిషికి ఉన్న అసలైన తేడా ఏంటి? రూపం కాదు కేవలం నోటి మాట మాత్రమే మనలో అనంతమైన మనశశక్తి మాట రూపంలో బయటకు వచ్చి సమాజాన్ని శాసించడమే నిజమైన వక్తృత్వం. సృష్టికర్త ఆహారం కోసం నోటిని శ్వాస కోసం ముక్కును ఇస్తే మనిషి తన తెలివి తేటలతో ఒక అద్భుతాన్ని సృష్టించుకున్నాడు అదే భాష భాష సహజంగా వచ్చింది కాదు అది మనం అలవాటు చేసుకున్న ఒక నైపుణ్యం కాలంతో పాటు మారే ఈ భాషపై పట్టు సాధించడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.
(05:25) వక్తృత్వం శ్రద్ధతో నిరంతర సాధనతో అలవడుతుంది. ప్రతి మనిషిలోనూ ఈ శక్తి దాగి ఉంటుంది. మన అన్ని శక్తులకు కేంద్రం మనసే అందులో నిద్రపోతున్న శక్తులను మేలుకొల్పినప్పుడు మనిషి మంచి వక్తగా మారుతాడు. జీవితంలో ఎదగాలంటే ఇతరులపై ఆధారపడడం మానేసి మన ప్రత్యేకతను చాటుకోవాలి. సమాజంలోని అపోహలను సమస్యలను తొలగించడానికి మౌనం కంటే భాషణమే గొప్ప సాధనం ధైర్యం చేసి మాట్లాడకపోతే మనిషి బానిసత్వంలోనే నలిగిపోతాడు.
(05:58) మన కష్ట సుఖాలను సమాజానికి సరైన పద్ధతిలో చెప్పడం వల్ల వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది. నాకు దైవంపై విశ్వాసం లేని వాడి కంటే ఆత్మవిశ్వాసం లేని వాడిని చూస్తేనే ఎక్కువ బాధ అంటారు స్వామి వివేకానంద. మనసు వాక్కు శరీరం ఏ దారిలో నడుస్తాయో మన అదృష్టం కూడా అలాగే రూపుదిద్దుకుంటూ ఉంటుంది. అందుకే ప్రయత్నమే అసలైన తపస్సు ఈ మాట్లాడే కళను ఎవరైనా నేర్చుకోవచ్చు వ్యాపారులు వైద్యులు న్యాయవాదులు అకౌంటెంట్లు సామాజిక కార్యకర్తలు ఇలా ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా ఈ వక్తృత్వ కళను అంటే పబ్లిక్ స్పీకింగ్ ను సాధన చేసి తమ భవిష్యత్తును బంగారు బాటగా మార్చుకోవచ్చు. బాగా మాట్లాడే కళ
(06:42) నేర్చుకోవడానికి ఏం చదవాలి దీనికి సరైన సమాధానం చెప్పడం కష్టం ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు చదివిన విద్వాంసులు కూడా సభల్లో మాట్లాడలేక తడబడుతూ ఉంటారు. కానీ కొద్దిపాటి అక్షరజ్ఞానం ఉన్న సాధువులు ఫకీరులు మందులమ్మేవాళ్ళు చదువురాని గ్రామీణులు సైతం తమ మాటల వల విసిరి శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటారు. వారి మాటలను జనాలు ఎంతో శ్రద్ధగా వినడం మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.
(07:12) వక్తృత్వం అంటే పబ్లిక్ స్పీకింగ్ అసలైన లక్ష్యం శ్రోతలకు నమ్మకం కలిగించడం ఇంతటి ఉన్నతమైన కళ పట్ల నేటి విద్యార్థులు నిర్లక్ష్యంగా ఉండడం విచారకరం. చదువు లేకపోయినా మాట్లాడడం సాధ్యమే కావచ్చు కానీ విజ్ఞానం లేని వక్తృత్వం ఎక్కువ కాలం నిలబడలేదు. మాటల్లో గాంభీర్యం సంస్కారం తర్కం ఉండాలంటే కనీసం చదువు విజ్ఞానం అవసరం సాహిత్యం చరిత్ర రాజకీయం సామాజిక శాస్త్రాల పరిచయం ఉన్నప్పుడే ఒక వక్త ఉపన్యాసం సజీవంగా ప్రభావవంతంగా మారుతుంది.
(07:48) [సంగీతం] [సంగీతం] ఆదికవి వాల్మీకి రాసిన రామాయణం కేవలం కథ కాదు అక్షరబద్ధమైన ధర్మబోధిని ఇందులో వకృత్వ లక్షణాలను వాల్మీకి ఎంతో సుందరంగా వివరించాడు. సీతాన్వేషణలో ఉన్న రామ లక్ష్మణులను కలిసేందుకు సుగ్రీవుడి మంత్రి హనుమంతుడు వస్తాడు. అప్పుడు హనుమంతుడు మాట్లాడిన తీరును చూసి రాముడు లక్ష్మణుడితో అన్న మాటలు నేటికి వక్తృత్వానికి ప్రాతిపదికలు రాముడు ఇలా అంటాడు లక్ష్మణ ఇతడు వేదాలు చదివినవాడు వ్యాకరణం తెలిసినవాడు అందుకే ఇంతసేపు మాట్లాడిన ఒక్క తప్పుడు పదం అంటే అపశబ్దం కూడా దొర్లలేదు మాట్లాడేటప్పుడు కళ్ళు నుదురు కనుబొమ్మల్లో ఎలాంటి దోషం లేదు
(08:38) శరీర కదలికలు హావ భావాలకు తగ్గ తగ్గట్టుగా ఉన్నాయి తక్కువ మాటల్లోనే స్పష్టంగా వినసొంపుగా గొంతు ఎక్కువ తక్కువలు కాకుండా మధ్యమ స్థాయిలో మాట్లాడాడు. ఈ సంస్కారవంతమైన వాణి వింటే శత్రువు హృదయమైనా కరిగిపోతుంది. అద్భుతమైన ఈ సత్యాన్ని ఇరివెంటి గారు తన పుస్తకంలో చాలా లోతుగా విశ్లేషించారు. సామాజిక జీవితంలో మాట ప్రాధాన్యం చాలా గొప్పది.
(09:08) మనం మాట్లాడే సామర్థ్యాన్ని పెంచుకున్నప్పుడే మన మంచి భావాలను ఇతరులకు పంచగలం. అందమైన పదాలు సరైన హావభావాలు మాట విలువను పెంచుతాయి. ప్రజా జీవితంలో రాణిస్తున్న నాయకులు వ్యాపారస్తులు అధ్యాపకులు తమ వకృత్వ నైపుణ్యం వల్లే ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఎవరైతే తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని అందిస్తారో వాళ్ళు ఏ రంగంలో అయినా రాణిస్తారు. ముఖ్యంగా ప్రజాస్వామ్య సమాజంలో ప్రతినిధుల సభల్లో కాగితం చూసి చదివితే ఆకట్టుకోదు.
(09:39) నలుగురికి నచ్చ చెప్పగల వచో నైపుణ్యం ఉన్నవాడే సదస్సుల్లో బహిరంగ సభల్లో విజయం సాధిస్తాడు. [సంగీతం] స్నేహితులతో గంటల కొద్ది కబుర్లు చెప్పేవాడు కూడా 10 మంది ముందు నిలబడగానే వణకిపోతాడు తడబడతాడు. దీన్నే తెలుగులో సభాకంపం అంటారు ఇంగ్లీష్లో స్టేజ్ ఫియర్ అంటారు. ఎంతో మంది గొప్ప రచయితలు ఈ స్టేజ్ ఫియర్ వల్ల కీర్తిని పొందలేకపోయారు.
(10:12) మాట్లాడే నైపుణ్యం లేకపోతే భయంతో తప్పులు దొర్లి నవ్వుల పాలు అవుతారు. ఎంత తెలివితేటలు ఉన్నా స్టేజ్ మీద సరిగ్గా మాట్లాడకపోతే ఏమీ తెలియని వాడనే అపప్రదం మూట కట్టుకోవాల్సి వస్తుంది. మీకు పెద్ద చదువులు లేదా డిగ్రీలు లేవని బాధపడుతున్నారా అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రపంచాన్ని శాసించిన ఎందరో గొప్ప వక్తలకు డిగ్రీలు లేవు కేవలం మాట్లాడే ధైర్యం మాత్రమే ఉంది.
(10:38) ఒక్క శబ్దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే అది మీ జీవితాన్నే మార్చే కామధేనువు అవుతుంది. మీకు కొద్దిపాటి చదువు కొంచెమే అనుభవం ఉన్నా సరే మీరు అద్భుతంగా మాట్లాడొచ్చు. సాధారణంగా మాట్లాడడం వేరు సభల్లో మాట్లాడడం వేరు. స్టేజ్ ఎక్కినప్పుడు ఒక్కోసారి బాగా గుర్తున్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటాం. సభలో మీకంటే ఎక్కువ తెలిసిన శ్రోతలు ఉన్నా వారు మాట్లాడే సాహసం లేక మౌనంగా ఉంటారు.
(11:08) అందుకే ఎక్కువ చదువుకోలేదని సభలో ఒక మూల నక్కి కూర్చోకండి అది మీ వ్యక్తిత్వాన్ని చంపుకోవడం అవుతుంది. మీకు ఒక ఆలోచనా విధానం ఉంది. మీ అభిప్రాయాన్ని అందరి ముందు చెప్పే హక్కు కూడా మీకు ఉంది. సరళమైన భాషలోనే మీ భావాలను ధైర్యంగా చెప్పడం ప్రాక్టీస్ చేయండి. మాట్లాడడానికి నిలబడినప్పుడు మీ వేషాన్ని మీ స్థితిని మర్చిపోయి కేవలం చెప్పే విషయం పైనే మనసు పెట్టండి.
(11:36) వక్త ఎంతగా లీనమై మాట్లాడితే శ్రోతలు అంత శ్రద్ధగా వింటారు. ఒక వక్తకు పదజాలంపై పట్టు ఉండాలి మాటలో వాచ్యార్థం కంటే వ్యంగ్్యార్థం అంటే ధ్వని ఉన్నప్పుడే ఆ ఉపన్యాసం ఉత్తమమైనదిగా మారుతుంది. చమత్కారంగా పర్యాయ పదాలను వాడుతూ స్పష్టమైన వాక్యాలతో మాట్లాడే సామాన్యుడు కూడా ఈ దేశానికి నాయకుడు కాగలడు. సభలో మాట్లాడకపోవడానికి అసలైన శత్రువు భయం భయాన్ని సంకుచిత మనస్తత్వాన్ని బిడియాన్ని వదిలేయండి మీరేం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు అనే కంగారు లేకుండా ధారా ప్రవాహంగా మాట్లాడండి నిర్భయుడే అజయుడు [సంగీతం] సహృదయంతో ప్రజల మనసులను అర్థం చేసుకుని చేసే ఉపన్యాసం సమాజంలో పెద్ద మార్పు
(12:27) తెస్తుంది. కొన్ని ఉపన్యాసాలు విన్నప్పుడు ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. అగ్ని పర్వతాలు బద్దలవుతాయి కార్యోన్ముఖులను చేస్తాయి. మహాభారతంలో శ్రీకృష్ణుడు చేసిన ప్రసంగం చికాగోలో స్వామి వివేకానంద ఉపన్యాసం గెటిస్బర్గ్లో అబ్రహం లింకన్ స్పీచ్ అలాగే మన స్వాతంత్ర సమరంలో బిపిన్ చంద్రపాల్ మౌలానా ఆజాద్ సుభాష్ చంద్రబోస్ నెహ్రూ లాంటి ధీరోదాత్తుల ఉపన్యాసాలు చరిత్రలో నిలిచిపోయాయి.
(12:56) మాట్లాడేటప్పుడు కళ్ళు చేతులు కదపడం సహజంగానే ఉంటుంది. కొందరు స్తంభంలా నిలబడి మాట్లాడినా వారి మాటల్లోని పవర్ మాత్రం తగ్గదు. గంటల కొద్ది మాట్లాడడం గొప్ప వక్త లక్షణం కాదు ఐదు నిమిషాలే మాట్లాడిన శ్రోతలు మరింతసేపు మాట్లాడితే బాగుండు అనుకునేలా చేయడమే ఉత్తమ వక్త లక్షణం అని అబ్రహం లింకన్ అన్నారు. నాటకంలోని అభినయం కంటే వక్తృత్వంలోని అభినయం ఎంతో భిన్నమైనది శక్తివంతమైనది భావానుగుణమైన కంఠధ్వని సముచితమైన అంగవిన్యాసం అంటే బాడీ లాంగ్వేజ్ తోడైనప్పుడే ఆ ఉపన్యాసం శ్రోతల హృదయాలను తాకుతుంది.
(13:34) విషయ పరిజ్ఞానం లేని వక్త ప్రసంగం ఎప్పుడైనా తడబడొచ్చు అందుకే ప్రసంగానికి ముందే పుస్తకాలు చదవండి పత్రికలు పరిశీలించండి అనుభవజ్ఞులతో మాట్లాడి ఏ పుస్తకంలో మంచి విషయం కనిపించినా దాన్ని రాసి పెట్టుకోండి మాట్లాడదలుచుకున్న విషయాన్ని ముందుగా రాసుకుంటే తడబాటు లేకుండా ధారాశుద్ధితో ప్రసంగం సాగిపోతూ ఉంటుంది. పోతన భాగవత వచనాలు పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి ఉపన్యాసాల లాంటి లయబద్ధమైన వచనాలను గొంతెత్తి చదవడం వల్ల మంచి వచో వైఖరి అలవడుతుంది.
(14:10) మొదట్లో మీకు నచ్చిన కొద్దిమంది మిత్రుల ముందు పిల్లల ముందు మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. అద్దం ముందు ఏకాంతంగా నిలబడి మాట్లాడడం లేదా నదీ తీరంలో కొండలపై ప్రకృతిని ఉద్దేశించి ఏకాంతంగా మాట్లాడడం వల్ల భయం పోతుంది. సభలో ఎవరైనా మనవైపే చూస్తూ తలాడిస్తుంటే అతన్ని మాత్రమే ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు భావిస్తే భయం పోతుంది. పాల్కురికి సోమనాధుడు చెప్పినట్టు అల్పాక్షరములందు అనల్పార్థ రచన చేయడమే వక్తృత్వ రహస్యం పెద్ద పెద్ద వాక్యాలు శ్రోతలకు చికాకు కలిగిస్తాయి.
(14:44) మన ప్రసంగ ప్రారంభం హృదయంగమంగా ఉండాలి. ముగింపు చాలా స్పష్టంగా ఉత్సాహంగా సంక్షిప్తంగా మన నిశ్చిత అభిప్రాయాన్ని తెలిపేలా ఉండాలి. ఏ విషయం మాట్లాడాలి దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి ఏ అంశాలను మళ్ళీ మళ్ళీ చెప్పాలి అనే విషయాలపై వక్త ముందుగానే ఒక స్పష్టమైన ప్రణాళిక అంటే ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. నైరాస్యాన్ని వీడండి వాక్ చాతుర్యాన్ని పెంచుకోండి భర్తృహరి అన్నట్లు నగలు స్నానాలు అలంకారాలు ఇచ్చే అందం తాత్కాలికం లోకంలో మిగతా అలంకారాలన్నీ కాలంతో పాటు కరిగిపోవచ్చు కానీ మనం మాట్లాడే పవిత్రమైన సంస్కారవంతమైన మాట మాత్రమే మనకు నిరంతర సౌందర్యాన్ని ఇస్తుంది. మన మహర్షి
(15:30) వాల్మీకి చెప్పినట్లు రామదూత హనుమంతుడి భాషణంలో ఉన్న సమగ్ర జ్ఞానం పరిశుద్ధమైన భాష స్పష్టత హృదయాన్ని ఆకట్టుకునే స్వర సంపత్తే మనందరికీ ఆదర్శం కావాలి. వక్తృత్వం కేవలం వేదికల మీద గెలవడానికి మాత్రమే కాదు అజ్ఞానాన్ని జడత్వాన్ని రూపుమాపి సమాజంలో చైతన్యాన్ని నింపడానికి అక్షర రూపంలోనూ ఉపన్యాస రూపంలోనూ ఈ అద్భుతమైన వక్తృత్వ కళను మనకు అందించిన ఇరివెంటి కృష్ణమూర్తి గారి అడుగుజాడల్లో నడుద్దాం.
(16:06) మన వాక్శక్తిని పెంచుకుంటూ సమాజంలో విజేతలుగా నిలుద్దాం. ఈ కథనానికి ఆధారం ఇరివెంటి కృష్ణమూర్తి గారి వాగ్భూషణం భూషణం. ఇది చాలా చిన్న పుస్తకం మహా అయితే 20 22 పేజీలు మాత్రమే ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుబట్టి ఈ పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ తరఫున ప్రచురింప చేశారు. నిజానికి కేసీఆర్ గారి ఉపన్యాసం చాలా గొప్పగా ఉంటుంది పద్యాలు సామెతలు తెలంగాణ మాండలికానికి సంబంధించిన అందమైన విషయాలను అలవోకగా ఒక గోదావరి ప్రవాహం లాగా వాడుతూ చెబుతారు అలా ఆయనకు స్ఫూర్తిని ఇచ్చిన చిన్న గ్రంథం ఇది అని ఆయన చాలా
(16:54) సందర్భాల్లో చెప్పుకున్నారు. అదే వర్షక్రమంలో ఈ కథనంలో నేను ప్రస్తావించాను ఒక్క మాట కూడా మార్చలేదు ఇందులో ఏవైనా గుణాలు ఉంటే అవన్నీ కూడా ఇరువెంటి కృష్ణమూర్తి గారివి దోషాలు ఉంటే నావి అని అనుకోండి ఈ ఈ రచయిత యువభారతి తరపున చేసిన సేవ అంటే పుస్తకాలు ప్రచురించడం యువకుల్లో వచనము బాగా మాట్లాడే కళను బాగా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నించడం ఎలా ఉన్నా ఈ పుస్తకం రాయడం వెనక క ఎంత ఆర్తి ఉందంటే అందంగా మాట్లాడడం ఎలాగా అందంగా రాయడం ఎలాగా మనకున్న వెయ్యేళ్ళు 1500 సంవత్సరాల తెలుగు సాహిత్యంలో నుంచి గొప్ప గొప్ప మాటలను ఎలా కోట్ చేయాలి మనకున్న
(17:40) సంస్కృత పురాణాలను ఎలా వాడుకోవాలి ఆధ్యాత్మిక ప్రస్తావనే లేకుండా లౌకిక ప్రపంచంలో ఎవరైనా సరే అందంగా మాట్లాడడం ఎదుటి వాళ్ళను కట్టి పడేసేలాగా మాట్లాడడం ఎలా అనడానికి ఎంత లోతైన పరిశోధన చేసి మరీ పెద్ద గ్రంథం కూడా కాదు 20 పేజీలు ఈ 20 పేజీలనే ఐదు భాగాలుగా నేను ఇందులో వాడుకున్నాను. మరో తెలుగు సంతకం ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.
(18:09) అంతవరకు సెలవు ముగించే ముందు ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ధాatి టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Facebook, Instagram, ఎక్స్ లో ధాత్రేని ఫాలో అవ్వండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. పక్కనఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.
No comments:
Post a Comment