పనులే కాదు మాటలు కూడా దరిద్రాన్ని తీసుకొస్తాయి అని తెల్సా@nandurihemamalini
Author Name:nanduri hemamalini
Youtube Channel Url:https://www.youtube.com/@nandurihemamalini
Youtube Video URL:https://www.youtube.com/watch?v=TJqoUDiMYWw
Transcript:
(00:00) శ్రీ మాత్రే నమః మన జీవితంలో ఎన్నో సమస్యలకి కారణం మన దురదృష్టము అని అనుకుంటాం కానీ మన మాట అని ఎప్పుడైనా ఆలోచించారా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు సరిగ్గా మాట్లాడరా సరిగ్గా మాట్లాడకపోతే దరిద్రం చుట్టుకుంటుంది అని నిజం అది దరిద్రం చుట్టుకుంటుంది అంటే ఏంటి అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక్క మాట ఒక మనిషిని దేవుడిలా నిలబెడితే అదే ఒక్క మాట జీవితాంతం గాయం కూడా చేస్తుంది.
(00:35) మనం రోజు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ అందులో ఎన్ని మాటలు అవతలి వాళ్ళ హృదయాన్ని గాయపరుస్తున్నాయి ఎన్ని మాటలు మనల్ని బలహీనులుగా మార్చేస్తున్నాయి ఒక క్షణం ఆలోచించండి. ఈ ప్రపంచాన్ని శాసించిన మహానుభావుల చరిత్రలు వింటుంటే అంత శక్తి ఎలా వచ్చింది అని అనుకుంటాం. స్వామి వివేకానంద వారు చికాగోలో మాట్లాడినప్పుడు అన్ని లక్షల మంది అక్కడ లేచి నిలబడి రెండు నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు అంటే ఆ శక్తి ఎలా వచ్చింది మనం మాట్లాడే ప్రతి మాట మన తలరాతని మార్చేస్తుంది ఇది నేను చెప్పట్లా శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పారు మనం ఎలా మాట్లాడాలో మన మాటని ఒక ఆయుధంగా
(01:22) ఎలా మార్చుకోవాలో ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్ప చెప్పారు అదే వాక్ తపస్సు ఈరోజు ఈ వీడియోలో మన జీవితాన్ని మన వ్యక్తిత్వాన్ని మార్చే ఆ పరమ పవిత్రమైన శ్లోకం గురించి తెలుసుకుందాం. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. మరి వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయడం మాత్రం మనం మర్చిపోకూడదు కదా ఎందుకంటే వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా మనం వదులుకోకూడదు కాబట్టి 17వ అధ్యాయంలో 15వ శ్లోకం అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవా వాంగ్మయం తపచ్యతే అనుద్వేగకరం
(02:06) అంటే బాధపెట్ట టని మాట నిజం చెప్పాలి కానీ అవమానించేలాగా కాదు మన మాటల వల్ల ఎదుటివారి హృదయం అస్సలు బాధ పడకూడదు. ఈ రోజుల్లో చాలామంది అంటుంటారు నేను నిజం మాత్రమే మాట్లాడతానండి అని నిజం మాట్లాడాలి కానీ ఆ నిజం ఎదుటివారిని బాధ పెట్టే విధంగా ఉండకూడదు అది ధర్మం కాదు అవతల వాళ్ళకి మనస్తాపాన్ని అవతల వాళ్ళకి భయం కలిగించేలాగా అస్సలు మాట్లాడకూడదు.
(02:39) సత్యం అంటే నిజమైన మాట. అబద్ధంతో కొంతకాలం గెలవచ్చు కానీ నిజం మాత్రమే శాశ్వతంగా నిలుస్తుంది. అంతే కదా మనం ఏదో గడిచిపోతుంది కదా అని అబద్ధం మాట్లాడేసాము అని అనుకోండి అది ఆ సమయానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ మన మాటకి గౌరవం ఉండాలి అంటే మనం ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడాలి. అబద్ధం కొంతకాలం మాత్రమే గెలుస్తుంది. ప్రియహితం మధురంగా అన్నమాట మేలు చేసే మాటలు కొన్ని మాటలు వినగానే మనసుకి శాంతి వస్తుంది ఎందుకంటే ఆ మాటల్లో ప్రేమ ఉంటుంది.
(03:24) అమ్మ మాట ఎందుకు మనకి భగవంతుడి మాటలా అనిపిస్తుంది చెప్పండి ఎందుకంటే ఆ మాటల్లో ప్రేమ ఉంటుంది. ఆ మాటల్లో మనకి మేలు చేసేది ఉంటుంది అందుకే అమ్మ మాట మనకి మధురంగా అనిపిస్తుంది. స్వాధ్యాయం అంటే శాస్త్ర పఠనం ప్రతిరోజు మంచి మాటలు వినడం గ్రంథాలు చదవడం దైవనామ స్మరణ చేయటం ఇవి మన మాటలని పవిత్రం చేస్తాయి.
(03:55) అంటే ఈ శ్లోకానికి అర్థం ఏంటి? వాక్ తపస్సు చేయాలి వాక్ తపస్సు మన జీవితాన్ని మారుస్తుంది అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. వాల్మీకి మహర్షి జీవితం తీసుకోండి ఒకప్పుడు ఆయన బోయేవాడు కదా రత్నాకరుడు అనే బోయేవాడు కానీ ఆయన సప్తఋషుల ఆదేశంతో మరా మర అంటూ రామ నామంగా మార్చుకున్నారు అంతే కదా మర మరా మర అంటే రామ రామ అయిపోయింది కదా నిరంతర నామ జపం స్వాధ్యాయభ్యసనం అన్నమాట నిరంతర నామ జపం చేశారు.
(04:26) ఇది ఆయన వాక్కును పవిత్రం చేసింది. రామకృష్ణ పరమహంస తీసుకోండి ఆయన పెద్దగా చదువుకున్నారా కానీ ఆయన నోటి నుంచి వచ్చే మాట ఒక అమృతంలా ఉండేది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ అసత్యం పలకలేదు ఎవరిని నొప్పించలేదు. అందుకే ఆయన వాక్కులో భగవత్తత్వం ఉండేది. ఆయన మాటలకు అందుకే లోకం దాసోహం అని చెప్పింది. స్వామి వివేకానంద వారు 1893 సెప్టెంబర్ 11న చికాగో పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్ లో స్వామి వివేకానంద మాట్లాడిన మొదటి ఐదు మాటలు అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అని అంతే అక్కడున్న వేలాది మంది లేచి నిలబడిపోయారు.
(05:08) రెండు నిమిషాల సేపు చప్పట్లు కొట్టారు ఏ అంతకుముందు ఎంతో మంది ఉపన్యాసకులు మాట్లాడారు కదా మరి స్వామి వివేకానందకి మాత్రమే లేచి ఎందుకు నిలబడి చప్పట్లు కొట్టారు అది కూడా పరాయి దేశంలో పరాయి వాళ్ళు ఎందుకంటే వివేకానందుని మాటల్లో సత్యం ఉంది. అవతల వాళ్ళని కలుపుకునే ప్రియత్వం ఉంది. విశ్వ మానవ కళ్యాణాన్ని ఆకాంక్షించే హితం ఉంది. ఇది అక్షరాల కృష్ణుడు చెప్పిన వాక్ తపస్సు మనం అనుకుంటూ ఉంటాం కదా పురాణాల్లో అబ్బా సాధువులు ఆ మాట అంటే నిజమైపోతుంది అని కదా పరమాచార్య స్వామి వారు ఏదైనా మాట అన్నారు అనుకోండి అది నిజమైపోతుంది.
(05:49) రమణ మహర్షి ఏదైనా చెప్పారని అనుకోండి అది నిజమైపోతుంది ఇలా ఎవ్వరి జీవితాల్లో అయినా ఒకసారి చూడండి వాళ్ళు మాట్లాడితే అది నిజమైపోతుంది అది జరిగిపోతుంది. దానినే వాక్ సిద్ధి అంటారు. నిరంతరము సత్యాన్నే పలుకుతూ వాక్ తపస్సు చేస్తే ఈ శక్తి వస్తుంది. మనం కూడా నిరంతరము సత్యాన్నే పలికాము అని అనుకోండి మన వాక్కుకి కూడా శక్తి వస్తుంది.
(06:15) ఇది మన జీవితానికి అన్వయించుకుంటే కోపంలో ఉన్నప్పుడు అస్సలు మాట్లాడొద్దు ఆవేశంలో ఉన్నప్పుడు మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళని దూషించే మాటలు వచ్చేస్తాయి. మనం మాట్లాడే మాట అవతల వాళ్ళని మానసికంగా కృంగదీసేలాగా ఉండకూడదు. అందుకే కోపంలో ఉన్నప్పుడు అసలు మాట్లాడద్దు అని చెప్పి మన పెద్దవాళ్ళు అంటారు. ఒక మాట మాట్లాడేస్తాం కానీ ఆ మాట మన నోట్లోనుంచి వచ్చేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేం.
(06:44) అంటారు కదా సామెత కాలు జారినా పర్వాలేదు గానీ నోరు జారకూడదు అని కాలు జారింది అనుకోండి కాలికి దెబ్బ తగులుతుంది తర్వాత మానిపోతుంది కానీ మాట జారేసాము అని అనుకోండి ఎదుట వాళ్ళ మనసు గాయపడుతుంది. మనల్ని ఎవరైతే ఏ మాట అంటే మనం బాధ పడతామో అదే మాట ఎదుటి వాళ్ళని కూడా అనకూడదు అని మనం కూడా ఆలోచించాలి కదా అలాగే సత్యమే మాట్లాడండి అని చెప్పారు కదా అబద్ధాలు మాట్లాడి తాత్కాలికంగా తప్పించేసుకుంటే సరిపోతుందా సత్యం మాట్లాడే వాడి మాటకే సమాజంలో గౌరవం విలువ ఉంటుంది.
(07:21) మన మాట మీద మనకే నిలకడ లేకపోతే చెప్పండి అది నేను చెప్తున్న మాట కాదు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు మన మాటల వల్ల ఒకరికి మంచి జరగాలి కానీ కీడు ఎప్పటికీ జరగకూడదు. కాబట్టి మాట అనేది ఒక పదునైన కత్తి లాంటిది దానిని ఇతరుల హృదయాలను గాయపరచడానికి వాడతారా లేదా స్వామి వివేకానందల లోకాన్ని గెలవడానికి వాడతారా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కోపంలో మాట్లాడేటప్పుడు ఒక్క 10 సెకండ్లు ఆలోచించండి.
(07:53) ఇంట్లో పిల్లలతో ప్రేమగా మాట్లాడడం నేర్చుకోండి. భార్య భర్తల మధ్య గౌరవం ఉండాలి తల్లిదండ్రులతో కఠినంగా మాట్లాడొద్దు ఎందుకంటే మాటలు తిరిగి రావు అవి ఇచ్చిన గాయం మాత్రం జీవితాంతం ఉండిపోతుంది. మనిషి అందం ముఖంలో కాదు మాటల్లో ఉంటుంది. నోరు మంచిదైతే విధి కూడా మంచిదవుతుంది. దేవుడి ఇచ్చిన గొప్ప వరం మాట అండి దాన్ని ఆశీర్వాదంగా మార్చుకుంటారు లేదా శాపంగా మార్చుకుంటారా అనేది మన చేతుల్లో ఉంది.
(08:26) ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. నేను మాట్లాడే ప్రతి మాట ఎవరిని బాధ పెట్టకూడదు. నా మాట వల్ల ఎవరికైనా ధైర్యం రావాలి శాంతి రావాలి భగవంతుడు గుర్తుకు రావాలి అదే నిజమైన తపస్సు అని కృష్ణ పరమాత్మ చెప్పారు కదా అని మనం నిర్ణయం తీసుకోవాలి. గుర్తుంచుకోండి మనం పలికిన మాటలు గాలిలో కలిసిపోవు అవి మన కర్మగా తిరిగి మన జీవితానికే వస్తాయి.
(08:54) ఇప్పుడు చెప్పండి మనం మాట్లాడిన మాటల వల్ల మనకి దరిద్రం వస్తుంది అంటే మనం మాట్లాడిన చెడు మాటల వల్ల మనకి చెడు జరిగితే అది దరిద్రం కాదంటారా ఇప్పుడు చెప్పండి మనం మాట్లాడే మాట దరిద్రాన్ని తీసుకుని రాదా మనం మాట్లాడే మాట మంత్రంగా మారాలి అంటే ఎప్పుడు మంచి మాటల్నే మాట్లాడాలి. ఇంట్లో కొన్ని వస్తువులు లేదు అని చెప్పకూడదు అంటారు.
(09:22) లేదు అనద్దు నిండుకున్నాయి అనిమంటారు అంటే నెగిటివ్ గా మాట్లాడద్దు అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు నిజమే మనం నెగిటివ్ గా మాట్లాడితే ఆ నెగిటివ్ ఎక్కువైపోతుంది. కాబట్టి సాధ్యమైనంతవరకు పాజిటివ్ గానే మాట్లాడదాం. మన తలరాతని మనమే మార్చుకుందాం. మన దారిద్రాన్ని మనమే పోగొట్టుకుందాం. ఏమంటారు
No comments:
Post a Comment