Thursday, May 21, 2026

నీ నాలుకపైనే నీ లక్ష్మీదేవి ఉంది! | Chanakya Neeti Secrets For High Confidence | Satyagrahi

నీ నాలుకపైనే నీ లక్ష్మీదేవి ఉంది! | Chanakya Neeti Secrets For High Confidence | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0_wwpqrMcrk



Transcript:
(00:01) [సంగీతం] [సంగీతం] మీరు రోజుకి ఎన్ని వేల మాటలు మాట్లాడుతున్నారు ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నారావాట్ వాయిస్ నోట్స్ లో ఫ్రెండ్స్ తో చాటింగల్లో ఆఫీస్ మీటింగల్లో ఇంట్లో వాళ్ళతో గొడవలో ఇలా ప్రతి విషయం మీ నోరు నడుస్తూనే ఉంటుంది. కానీ నిజం చెప్పండి ఆ మాటల్లో ఎంత శాతం మీ జీవితాన్ని నిర్మిస్తున్నాయి? ఎంత శాతం మీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి? మన సనాతన ధర్మంలో ఒక అద్భుతమైన మాట ఉంది.
(00:33) యద్భావం తద్భవతి అంటే మీ భావన ఎలా ఉంటే మీ జీవితం అలానే తయారవుతుంది. ఆ భావానికి రూపం ఇచ్చేదే మీ నోటి మాట. మీరు రోజూ మాట్లాడే నెగిటివ్ మాటలు మీ చుట్టూ ఒక విషపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. పాపం చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు. చాలా మంది అనుకుంటారు మాట అనేది గాలిలో కలిసిపోయే ఒక శబ్దం మాత్రమే అని కానీ అది అబద్ధం మాట అనేది ఒక ఆయుధం అది ఒక సృష్టి శక్తి చాలా మంది యువత ఈ రోజుల్లో ఒక పెద్ద బ్రమలో బ్రతుకుతున్నారు.
(01:05) తమకు ఉద్యోగం రాలేదనో [సంగీతం] ప్రేమ ఫెయిల్ అయిందనో లేదా ఇంట్లో సమస్యలు ఉన్నాయనో నిరంతరం ఏడుస్తూ సనుగుతూ ఉంటారు. నా బ్రతుకు ఇంతే నాకు ఏది కలిసి రాదు. నేను దేనికి పనికి రాను ఇవే మాటలు పొద్దున లేస్తే మీ నోటి నుంచి వస్తూనే ఉంటాయి. మీ నోరు మీ జీవితానికి అతి పెద్ద శత్రువు మీరు ఎప్పుడైతే ఒక నెగిటివ్ మాటను గట్టిగా ఉచ్చరిస్తారో మీ మెదడు ఆ మాటని ఒక ఆర్డర్ లా తీసుకుంటుంది.
(01:32) చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో ఒక మాట అంటారు. నాలుక మీదనే లక్ష్మీదేవి ఉంటుంది. నాలుక మీదనే మిత్రులు ఉంటారు. నాలుక వల్లే బంధువులు నశిస్తారు. నాలుక వల్లే మరణం కూడా సంభవిస్తుంది. అంటే మీ సక్సెస్ మీ ఫెయిల్యూర్ రెండూ మీ నోటి చివర దాగి ఉన్నాయి. కానీ మీరు మాత్రం ఆ నాలుకని ఒక అదుపు లేని గుర్రంలా వదిలేశారు. నిజం ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రతి మాటకి ఒక వైబ్రేషన్ ఉంటుంది.
(02:00) మన చుట్టూ ఉన్న ప్రకృతి విశ్వం మీ మాటలు గమనిస్తూ ఉంటాయి. మీరు నిరంతరం మీ దరిద్రాన్ని మీ కష్టాలని మీ అనారోగ్యాన్ని నెమరిస్తూ మాట్లాడుతుంటే ఈ సృష్టి తదాస్తు అంటుంది. హిందూ ధర్మంలో శబ్దబ్రహ్మ అనే కాన్సెప్ట్ ఉంది. శబ్దమే దేవుడు శబ్దమే శక్తి అలాంటి శక్తిని ఈ పనికి రాని సోనుగుడు కోసం ఇతరులపై చాడీలు చెప్పడం కోసం ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం కోసం అసలు ఇతరుల గురించి మాట్లాడుకోవడం కోసం మీ సొంత జీవితాన్ని నిందించుకోవడం కోసం వాడుతున్నారు.
(02:32) మీ కష్టాలకి కారణం మీరు పని చేసే యజమాని కాదు, మీ పేరెంట్స్ కారణం కాదు, మీ లక్కు కూడా కారణం కాదు. మీ పరిస్థితుల పట్ల మీరు వ్యక్తపరిచే మీ దరిద్రపు మాటలే మీ భవిష్యత్తును దరిద్రంగా మారుస్తున్నాయి. ఇంకా లోతుగా ఆలోచిస్తే అసలు సమస్య మీ చుట్టూ ఉన్న మనుషులు లేదా పరిస్థితులు కాదు. మీ ఆలోచనలకి మీ నోటికి మధ్య కనెక్ట్ కట్ అయిపోవడమే అసలు సమస్య.
(02:58) మనం రోడ్డు మీద వెళ్లే కుక్కనైనా అదుపు చేయగలం కానీ మన నోట్లో ఉన్న నాలుకను మాత్రం అదుపు చేయలేం. ఎందుకంటే దానికి ఎముక లేదు. ఇటు పడితే అటు తిరుగుతుంది. ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అంటే చాలు వెంటనే రియాక్ట్ అయిపోతారు. అవతలివాడు ఒక లెంపకాయ కొడితే వచ్చే నొప్పి కంటే ఒక దారుణమైన మాట అంటే వచ్చే మంట ఎక్కువ కాలం ఉంటుంది. అయినా సరే మనం మాత్రం ఇతరులను మాటలతో గాయపరచడానికి అస్సలు వెనకాడం.
(03:25) సనాతన ధర్మంలో వాక్సిద్ధి వాక్సిద్ధి అనే పదాలు ఉన్నాయి. పూర్వకాలంలో ఋషులు ఎందుకు శపించేవారో ఎందుకు దీవించేవారో తెలుసా వాళ్ళు నిరంతరం సత్యాన్నే పలికే వాళ్ళు అవసరమైనంత వరకే మాట్లాడే వాళ్ళు అందుకే వాళ్ళ మాటల్లో అంతటి సృష్టి శక్తి ఉండేది. కానీ ఈ రోజుల్లో మన పరిస్థితి ఏంటి? పొద్దున లేస్తే సోషల్ మీడియాలో ఎవరో ఒకరిని ట్రోల్ చేయడం కామెంట్ల రూపంలో విషం చెమ్మటం ఫ్రెండ్స్ తో కూర్చొని ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి చాడీలు చెప్పుకోవడం ఇదే మనకి టైం పాస్ అయిపోయింది.
(03:55) మీకు తెలియకుండానే మీ లోపల ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తాన్ని ఈ నోటి దోల వల్ల ఖాళీ చేస్తున్నారు. నిజం ఏంటంటే ఈ జనరేషన్ కి కంఫర్ట్ జోన్ ఎక్కువైపోయింది. చిన్న కష్టం రాగానే తట్టుకోలేరు. రూమ్లో కూర్చొని సిగరెట్ తాగుతానో మందు కొడుతూనో లైఫ్ గురించి పెద్ద పెద్ద ఫిలాసఫీలు మాట్లాడుతుంటారు. కానీ ప్రాక్టికల్ గా చూస్తే వాళ్ళ జీవితంలో ఏ ఒక్క పని క్రమశిక్షణతో చేయరు.
(04:19) మీ నోటి నుంచి వచ్చే మాట మీ హృదయానికి అద్దం లాంటిది. మీ లోపల అసూయ, ద్వేషం, నిరాశ నిండి ఉంటే మీ నోటి నుంచి వచ్చే మాటలు కూడా అలానే సమాజాన్ని మిమ్మల్ని నశింపచేస్తాయి. సమస్య ఎక్కడఉందో ఇప్పుడు మీకు అర్థమైందా? బయట కాదు మీ లోపలే ఉంది. అసలు ఈ నాలుక అదుపు తప్పడానికి నోటి నుంచి నిరంతరం ప్రతికూల బయటకి రావడానికి గల మూల కారణం ఏంటో తెలుసా మీ మైండ్ సెట్ మన సనాతన ధర్మంలో ఒక బ్రహ్మాండమైన సత్యం ఉంది.
(04:47) మన యేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అంటే మీ మనసే మీ బంధానికి మీ మోక్షానికి కారణం. మీ హృదయంలో మీ మెదడులో ఎలాంటి ఆలోచనలు నింపుకుంటే నోటి నుంచి అలాంటి మాటలే వస్తాయి. ఈ రోజుల్లో యువత ఎదుర్కుంటున్న అతి పెద్ద జబ్బు ఏంటంటే క్లారిటీ లేకపోవడం లోపల గందరగోళం భయం మరో పక్క అభద్రత భావం అంటే ఇన్సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం మాటల రూపంలో బయటిక వస్తుంది.
(05:17) జీవితంలో ఒక దెబ్బ తగలగానే చాలా మంది విలవెల్లాడిపోతారు. రిస్క్ తీసుకోకుండా లైఫ్ లో ఎప్పుడూ ఒకేలా ప్రశాంతంగా సాగిపోవాలనుకోవడమే మీ మొదటి తప్పు. ఎప్పుడైతే అనుకున్నది జరగదో వెంటనే మీలో ఉన్న నెగిటివిటీ మేలుకుంటుంది. పక్కవాడి సక్సెస్ ని చూసి కొళ్ళకోవడం [సంగీతం] మీ వైఫల్యానికి వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం మొదలు పెడతారు. చాణక్యుడు చాలా క్లియర్ గా చెప్పాడు ఎవడైతే వాడి ఓటమికి కారణం ఇతరులు అని చెప్పేసి ఎప్పుడు నిందిస్తూ ఉంటాడో వాడు ఎప్పటికీ పైకి రాలేడు.
(05:47) మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీతో మీరు మాట్లాడుకునేటప్పుడు మీ సెల్ఫ్ టాక్ అనేది ఎంత దరిద్రంగా ఉంటే మీ రియాలిటీ కూడా అంతే దరిద్రంగా తెరవుతుంది. దీనికి తోడు ఈ కాలంలో ఇన్స్టంట్ గ్రాఫికేషన్ అనే ఒక పెద్ద భ్రమ ఉంది. ప్రతిదీ ఒక క్లిక్ తో ఐదు నిమిషాల్లో అయిపోవాలి. సక్సెస్ కూడా అంతే స్పీడ్ గా రావాలి. అది రానప్పుడు వచ్చే నిరాశ తట్టుకోలేక నోటికవచ్చినట్లు మాట్లాడటం మొదలు పెడతారు.
(06:11) సమాజాన్ని తిడతారు, సిస్టం ని తిడతారు చివరికి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని కూడా తిడతారు. ఈ మానసిక బలహీనత వల్లే మీ మాటల వెనుక ఉన్న అసలైన శక్తి నశించిపోతుంది. మీ ఎనర్జీ అంతా సనుగుడు గుణగుడులోనే వేస్ట్ అయిపోతుంది. ఇక జీవితంలో అనుకున్నది సాధించడానికి మీ దగ్గర ఏం మిగులుతుంది? మన మనస్తత్వ శాస్త్రాన్ని ఒకసారి నిశ్చితంగా గమనిస్తే ఇదంతా ఒక సైకిల్ లాంటిది.
(06:34) దీనినే మోడర్న్ సైకాలజీలో సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ అంటారు. అంటే మీ మెదడు ఏ విషయాన్నైతే నిజమని నమ్ముతుందో మీ నోరు దాన్నే పలకడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే మీరు నేను ఈ పని చేయలేను నా వల్ల కాదు అని నోటితో అంటారో మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని లాక్ చేస్తుంది. ఆ తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా మీ శరీరం మీ బుద్ధి ఆ [సంగీతం] పనికి సహకరించవు.
(06:57) ఎందుకంటే మీ నోటి మాటతో మీరే మీ మెదడుకి ఒక నెగిటివ్ కండిషనింగ్ చేసేసారు. భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అనుద్వేగక కారం వాక్యం సత్యం, ప్రియహితం చయత్ అంటే మనం మాట్లాడే మాట అవతలి వాడికి ఉద్వేగాన్ని గురి చేయకూడదు. అది సత్యమై ఉండాలి. ప్రియంగా ఉండాలి. హితాన్ని కోరేదై ఉండాలి. కానీ ఈరోజు మనకి ఇవన్నీ అవసరం లేదు. మన అహంకారం తృప్తి చెందడం కోసం మనలోని కోపాన్ని చల్లార్చుకోవడం కోసం ఎదుటి వారిని ఎంత మాట అయినా సరే అనేస్తున్నాం.
(07:27) మీరనే ప్రతి మాటని సమాజం ఎప్పుడూ పాజిటివ్ గా తీసుకోదు. అలా సమాజం పాజిటివ్ గా తీసుకోనప్పుడు నష్టపోయేది మీరే సమాజం కాదు. ఈ సమస్య రావడానికి మరో ముఖ్య కారణం మౌనం యొక్క విలువ తెలియపోవడం. ఈ రోజుల్లో ఎవరికీ సైలెన్స్ గా ఉండడం నచ్చట్లేదు. చేతిలో ఫోన్ లేకపోయినా పక్కన మనిషి లేకపోయినా ఏదో ఒక శబ్దం వింటూనే ఉండాలి. లేదా ఏదో ఒకటి వాగుతూనే ఉండాలి.
(07:51) నిశశబ్దం మిమ్మల్ని భయపెడుతుంది. ఎందుకంటే మీరు ఒంటరిగా నిశశబ్దంగా ఉన్నప్పుడు మీ లోపల ఉన్న అసలైన నిజాలు మీ బలహీనతలు మిమ్మల్ని వెక్కిరిస్తాయి. ఆ భయాన్ని దాచుకోవడానికి మీరు నిరంతరం సంభాషణల వెనుక పనికి రాని సోషల్ మీడియా డిబేట్ల వెనుక దాక్కుంటున్నారు. ఈ అభద్రత భావమే మీ నోటిని అదుపు తప్పేలా చేస్తుంది. నోటిని అదుపు చేయడం మాట తీరును మార్చుకోవడం అంటే ఏదో సాఫ్ట్ స్కిల్ క్లాస్ కి వెళ్లి నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకోవడం కాదు ఇదొక మైండ్ గేమ్.
(08:22) మీ లోపల ఉన్న అరాచకాన్ని ఆపకుండా మీ నోటిని మీరు అదుపు చేయలేరు. కుక్కతోక పట్టుకొని గోదారి ఎదలేం కదా అలాగే లోపల కుళ్ళు పెట్టుకొని పైకి మంచి మాటలు మాట్లాడటం అసాధ్యం. దీనికి మొదటి స్టెప్ కాసేపు ఆ నోరు మూసుకొని మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. మన సనాతన ధర్మంలో మౌన వ్రతం అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. అది కేవలం దేవుడి కోసం చేసేది కాదు మీ మెదడుని మీ నాలుకని రీబూట్ చేయడానికి పెట్టిన ఒక సైంటిఫిక్ పద్ధతి.
(08:49) రోజులో కనీసం ఒక గంట సేపు ఏ శబ్దం చేయకుండా ఎవరితో మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చోవడం అలవాటు చేసుకోండి అప్పుడు మీ ఎనర్జీ ఎంతలా సేవ్ అవుతుందో మీకే అర్థం అవుతుంది. రెండవది చానికుడు చెప్పిన ఒక సూత్రాన్ని మీ గుండెకి హత్తుకోవాలి. ఆలోచించకుండా మాట్లాడేవాడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే రకం మీరు ఏదైనా మాట్లాడే ముందు ఒక క్షణం ఆగండి.
(09:13) ఆపండి అర్జెన్సీని అవతలివాడు ఏదో అనగానే వెంటనే కౌంటర్ ఇచ్చేయాలని మీ ఈగోని పక్కన పెట్టి మీరు మాట్లాడే మాట వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా లేదా ఆ మాట మీ లైఫ్ ని ఏమైనా బెటర్ చేస్తుందా అని ఒక్క సెకండ్ ఆలోచించి ఆ తర్వాత నోరు తెరవండి. నిజం ఏంటంటే సగం సమస్యలు మనం మాట్లాడే మాటల వల్లే వస్తాయి. మాట్లాడలేకపోవడం వల్ల ఏ సమస్య రాదు. మూడవది మీ సెల్ఫ్ టాక్ మీతో మీరు మాట్లాడుకునే విధానం మార్చండి.
(09:40) మీ పరిస్థితులు దరిద్రంగా ఉన్నా సరే మీ నోటి నుంచి వచ్చే మాటలు మాత్రం పవర్ఫుల్ గా ఉండాలి ఉద్యోగం రాలేదా ఈసారి రాకపోతే ఏంటి నాకంటూ ఒక మంచి ఉద్యోగం ఎక్కడో ఉండే ఉంటుంది. ఆ ఉద్యోగం నా దగ్గరికి రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందని మీకు మీరు ధైర్యం చెప్పుకోవాలి. అంతేకానీ నా బ్రతికింతే నాకు అంత సీన్ లేదని చెప్పేసి ఏడవడం ఆపండి.
(10:03) హిందూ ధర్మంలో ఒక నమ్మకం ఉంది. రాత్రి పగలు కలిసే సంధ్యా సమయంలో దేవతలు ఆకాశంలో తిరుగుతూ తదాస్తు అంటారని మీరు ఏడ్చే ఆ దరిద్రపు క్షణాల్లోనే ఆ దేవతలు తదాస్తు అంటే మీ లైఫ్ ఏమైపోవాలో ఒకసారి ఆలోచించండి. మీ నోటిని మీ కంట్రోల్ లో తెచ్చుకోవడం అంటే మీ భవిష్యత్తుని మీ చేతుల్లోకి తీసుకోవడమే కాకపోతే ఈ విషయం ఎవరికీ అర్థం కావట్లేదు. నాలుకని లొంగ తీసుకోవడానికి నాలుగో సూత్రం సన్యాసిలా మారటం కాదు స్మార్ట్ గా మారటం.
(10:29) లైఫ్ లో నీకు నచ్చని వాడు కనిపిస్తే వాడితో [సంగీతం] గొడవ పడకు జస్ట్ స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపో ఎందుకంటే వాడికి సమాధానం చెప్పడానికి నువ్వు వాడే ప్రతి మాట నీ బాడీలో ఉన్న ఎనర్జీని తినేస్తుంది. క్షానికుడు తన నీతి శాస్త్రంలో ఒక గంభీరమైన నిజం చెప్పాడు. మూర్ఖుడితో వాదించడం అంటే బురదలో రాయవేయడమే ఆ బురద మీ మీదే పడుతుంది.
(10:51) సమాజంలో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు లేదు. మీ నోటి మాట చాలా కాస్ట్లీ దాన్ని రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కడి కోసం వేస్ట్ చేయకండి. ఐదవది మీ హృదయాన్ని దైవికమైన సనాతనమైన ఆలోచనలతో నింపండి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు ఏది జరిగినా అది మన మంచికే అనుకోవడం అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే మీ అంతరంగంలో ఒక స్థిరత్వం అంటే స్ట్రాయిక్ మైండ్సెట్ వస్తుందో అప్పుడు మీ నోటి నుండి భయంతో [సంగీతం] కూడిన మాటలు రావు.
(11:19) పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా మీ నోరు మాత్రం నేను దీన్ని దాటుకొని వెళ్తాను నా వెనుకు నా ధర్మం ఉందని మాత్రమే పలకాలి. నిజం ఏంటంటే మీ నోరే మీ అదృష్టాన్ని డిసైడ్ చేస్తుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు మీ నోటి నుంచి కేవలం గ్రాటిట్యూడ్ మరియు నమ్మకం మాత్రమే రావాలి. ఎప్పుడైతే ఈ ప్రపంచం పట్ల మీకున్న సనుగుడు మారిపోతుందో అప్పుడే మీ కర్మ సిద్ధాంతం కూడా మారుతుంది.
(11:45) మీ నోటిని కంట్రోల్ చేయడం అంటే మీ నోటికి టేప్ వేసుకోవడం కాదు మీ ప్రతి మాటని ఒక పవర్ ఫుల్ బుల్లెట్ లా మార్చడం ఇంకా అసలు విషయానికి వస్తే మాటల వెనుకున్న పవర్ ఏంటో తెలిసింది. సమస్య ఎక్కడుందో అర్థమైంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలుసుకున్నారు. కానీ దీనివల్ల మీ ప్రాక్టికల్ లైఫ్ ఎలా మారుతుంది. మీ జీవితాన్ని మీరు నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకెళ్ళాలి జ్ఞానం అనేదిగగు లో దొరుకుతుంది.
(12:10) కానీ దాన్ని ఎవడైతే లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తాడో వాడే రియల్ హీరో. మీ మాటతీరుడు మార్చుకోవడం ద్వారా మీ కెరియర్ ని మీ రిలేషన్షిప్ ని మీ ఎకనామికల్ స్టేటస్ ని అన్నిటిని మార్చుకోవచ్చు. ఎలా మారుతాయో ఇప్పుడు చూద్దాం. మొదటిది మీరు వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మీ మాటలే మీ బ్రాండ్. క్షాణిక్యుడు ఒక అద్భుతమైన మాట అంటారు.
(12:31) మధురమైన మాటలు మాట్లాడే వ్యక్తికి శత్రువులు ఉండరు. ఒకవేళ ఉన్న వాళ్ళు కూడా మిత్రులు అవుతారు. మీరు ఆఫీస్ కి వెళ్ళినప్పుడు లేదా ఒక క్లైంట్ తో మాట్లాడేటప్పుడు మీ నోటి నుంచి వచ్చే ప్రతి పదం నమ్మకాన్ని క్లారిటీని ప్రతిబింబించాలి. ఎప్పుడు మీ కష్టాల గురించి పై అధికారుల గురించి ఆఫీస్ క్యాంటీన్ లో కూర్చొని కుళ్ళు ముచ్చట్లు పెట్టకండి.
(12:51) ఆ నెగిటివ్ డిస్కషన్స్ వల్ల మీ ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది. దానికి బదులు ఏ సమస్య వచ్చినా దీనికి ఒక సొల్యూషన్ ఉంది మనం చేయగలం అనే ఆప్టిమిస్టిక్ మాటలు వాడండి. లీడర్ అంటే నోటితో ఆర్డర్లు వేసేవాడు కాదు తన మాటలతో చుట్టూ ఉన్న వాళ్ళల్లో ధైర్యాన్ని నింపేవాడు. రెండవది మీ వ్యక్తిగత జీవితం మరియు బంధాలు ఈ రోజుల్లో సగం ప్రేమ కథలు ఆ తర్వాత పెళ్లిళ్లు ఎందుకు పెటాకులు అవుతున్నాయో తెలుసా? కేవలం ఆవేశంలో అదుపు తప్పే మాట్లాడే ఆ మాటల వల్లే ఆ క్షణంలో మీ ఈగో శాంతించవచ్చు కానీ ఆ మాట అవతలి వాళ్ళ మనసులో ఎంత పెద్ద గాయాన్ని చేస్తుంది.
(13:25) సనాతన ధర్మంలో ఒక సామెత ఉంది. నరికిన చెట్టు మళ్ళీ చిగురుస్తుంది కానీ మాటలతో విరిచిన బంధం మళ్ళీ అతుక్కోవడం చాలా కష్టం. మీ ఇంట్లో వాళ్ళతో మీ పార్ట్నర్ తో మాట్లాడేటప్పుడు కొంచెం గౌరవాన్ని ప్రేమను చూపించండి. మీ నోటి నుంచి వచ్చే ప్రశంస ఒక మనిషి జీవితాన్ని మార్చేయగలదు. ఎవరినైనా విమర్శించాల్సి వస్తే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కాకుండా కేవలం ఆ తప్పుని మాత్రమే సాఫ్ట్ గా చెప్పడం అలవాటు చేసుకోండి.
(13:53) మూడవది మీ మానసిక ఆరోగ్యం మరియు వ్యక్తిత్వ వికాసం మీరు గొప్ప అని మీకు అనిపిస్తే చాలు ప్రపంచం ఏమనుకుంటే మీకు ఎందుకు ఈ కాన్ఫిడెన్స్ మీకు రావాలంటే మొదట మీ నోటితో మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడూ ఇతరుల ముందు మిమ్మల్ని మీరు తక్కువ చేసి మాట్లాడుకోకండి నాకు అదృష్టం లేదు నేను అందంగా లేను నాకు టాలెంట్ లేదు ఈ దరిద్రపు మాటల్ని మీ డిక్షనరీ నుండి తీసేయండి.
(14:15) మన సనాతన ధర్మంలో అహం బ్రహ్మాస్మి అంటే నాలోనే ఆ దైవత్వం ఉంది అని ఊరికే అనలేదు కదా మీ లోపల అపారమైన శక్తి ఉంది. దాన్ని మీ నోటి మాటలతో తట్టి లేపండి. మీ నోరు ఎప్పుడు గెలుపు గుర్రం లాంటి మాటలనే పలకాలి. నాలుగోది మీ కర్మలని శుద్ధి చేసుకోవడం. హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతం చాలా పవర్ఫుల్ మీరు చేసే పనులే కాదు మీరు మాట్లాడే మాటలు కూడా మీ ఖాతాలో కర్మలుగా రికార్డు అవుతాయి.
(14:42) ఒకరి గురించి చెడుగా మాట్లాడిన [సంగీతం] ఒకరి పతనాన్ని కోరుకుంటూ శాపనార్థాలు పెట్టిన ఆ నెగిటివ్ ఎనర్జీ తిరిగి మీకే చుట్టుకుంటుంది. చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో క్లియర్ గా చెప్పాడు. ఇతరులకు కీడు తలపెట్టే మాటలు మాట్లాడేవాడు తన ఇంటికి తానే నిప్పు పెట్టుకున్నట్లు అని కాబట్టి మీ నోటిని ఒక పవిత్రమైన స్థలంగా మార్చుకోండి. మీ నుంచి వచ్చే ప్రతి మాట ఒక దీపం లాగా అవతల వాడి జీవితంలో వెలుగులు నింపాలి కానీ వాడి ఇల్లు తగలబెట్టే నిప్పు కనిక కాకూడదు.
(15:10) మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూశారంటే కచ్చితంగా మీకు ఈ మాటలు నచ్చుంటాయి. అందులోనూ మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూసినా కూడా అదే పనికిరాని సనుగుడు అదే చాడీలు అదే ప్రతికూల మాటలు మాట్లాడితే మీ జీవితం ఎప్పటికీ మారదు. మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రండి. మీ నోటిని మీ కంట్రోల్ లోకి తెచ్చుకోండి. పరిస్థితులు మీకు అనుకూలంగా లేనప్పుడు కూడా విశ్వాసంతో ధైర్యంతో కూడిన మాటలే పలకండి.
(15:36) అప్పుడు ఈ సృష్టి ఈ సనాతన ధర్మం, మీ కర్మ అన్నీ మీకు దాసోహంగా ఉంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి మీకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే [సంగీతం] సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.
(15:54) ఒక మంచి ఫ్రెండ్ లా మీకు తోడుంటాను. [సంగీతం] [సంగీతం] [సంగీతం] హ

No comments:

Post a Comment