Thursday, May 21, 2026

 "నమ్మకద్రోహం ''ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ బాధ కలిగించేది ఏదైనా ఉంది అంటే ఆ పదమే "నమ్మకద్రోహం ".
దీనికి గురైన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. బయటినుంచి ఉండి చూసే వాళ్లకి తెలియదు..కానీ జీవితంలో ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరి చేతుల్లో ఈ నమ్మకద్రోహానికి గురి అయ్యి ఉంటారు... ఆ క్షణాల్ని తలచుకున్నప్పుడు గుండెలో ఏర్పడ్డ గాయం ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటుంది. ఇలాంటి నమ్మకద్రోహం చేసే వ్యక్తులను చూసినప్పుడు భయంగా అనిపిస్తుంది . వీళ్ల వల్ల మంచి వ్యక్తులను కూడా సందేహంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు నమ్మకద్రోహానికి గురయ్యారా ? అంటే దాని అర్థం మనుషులని ఇంకా బాగా ఎరిగి నడుచుకోమని అంతేగాని మనుషులను చూసి భయపడి పారిపొమ్మని కాదు... మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉంటే ఇటువంటి నమ్మకద్రోహం చేసే వ్యక్తులను మనం పసిగట్టి ఆపొచ్చు . మళ్లీ ఇటువంటి బాధకి గురికాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు... ఏమంటారు.... మీ సునీత

http://youtube.com/post/UgkxhaPv5uY01PZAZ0H0G9Djn-vlDTBPphxW?si=LJqmua-SYWmDU6QP

No comments:

Post a Comment