Thursday, May 21, 2026

దశాబ్దం గడిచినా నా మనస్సు గాయం మానలేదు. ఎందుకు? Even after a decade, I am still worrying. Why?

దశాబ్దం గడిచినా నా మనస్సు గాయం మానలేదు. ఎందుకు? Even after a decade, I am still worrying. Why?

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RI4BneKDuqE



Transcript:
(00:00) చాలామంది అద్భుతమైన జీవితాన్ని వాయిదా వేస్తూ కుంగిపోతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి కూడా అసలు భగవంతుడు జీవితాన్ని ఇచ్చింది కొన్ని అవకాశాలు ఇస్తున్నాను నీకు ఆ అవకాశాలను పట్టుకొని ఎదగవయ్యా అనిఅంటే కానీ మనం ఆ జీవన సూత్రాన్ని మనం పట్టుకోవడంలో విఫలం అయతున్నాం అంటే మనం మనం కాదులేండి చాలామంది ఇప్పుడు జీవితంలో ఒక బాధ కలిగినప్పుడు ఒక అనుబంధం తెగిపోయినప్పుడు ఒక అవమానం జరిగినప్పుడు ఒక వైఫల్యం ఎదురైనప్పుడు సాధారణంగా చాలామంది అనే మాట ఒకటే కాలం గడుస్తుంది [గొంతు సవరించుకోవడం] లేవయ్యా అన్ని మర్చిపోతావు కాలమే పెనేషియా
(00:45) అది అన్ని గాయాలని మానుపుతుంది అని ఒక వేదాంతం మాట్లాడుతారండి. కానీ ఇక్కడ నాదో ప్రశ్న ఉంది అదేంటంటే 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ నా గుండెలో ఎక్కడో సలుపుతూనే ఉందండి నిజంగా కాలం మానిపోయిందా లేదు కదా మనం దాన్ని అలాగే దాచిపెట్టామా నిజమే దాచిపెట్టి ఉండొచ్చేమో అందుకనే అప్పుడప్పుడు అది మన మనసుని గెలుపుతూ ఉంటుంది.
(01:16) ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు మనందరికీ గుర్తున్నాయి కదండ ఇరుపక్షాలని చూసిన తర్వాత [గొంతు సవరించుకోవడం] రథాన్ని మధ్యలో ఆపినప్పుడు అర్జునుడు యుద్ధభూమిలో కుంగిపోతాడు అసలు వీళ్ళనా నేను చంపవలసింది అసలు వీళ్ళతోనా నేను యుద్ధం చేయవలసింది అని చెప్పేసి అంటే బంధువులను చూసి గతాన్ని తలుచుకొని భవిష్యత్తుకు భయపడి నాకు చేత కాదు అని చెప్పేసి ధనస్సుని బాణాల్ని వదిలేస్తాను అని చెప్పేసి కింద కూలపడిపోతాడుండి కృష్ణుడు ఏమన్నాడు సరే అర్జున నువ్వు అలాగే కూర్చో కాలం గడుస్తూనే ఉంటుందిలే ఇబ్బంది ఏం లేదులే అని అన్నాడు అనలేదు కదా లే పని చెయి
(02:02) కర్తవ్యాన్ని నిర్వహించు అని రకరకాలుగా చెప్పాడు కదండీ మరి ఈ ఫిలాసఫీ మన జీవితానికి కూడా వర్తిస్తుంది కదా ఈ విషయం గురించి కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి నేను ఇక్కడ మనం మూడు విషయాలను గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిది ఏంటంటే సాక్షి భావన జీవితంలో ఏది జరిగినా సరే దాన్ని జస్ట్ అబ్సర్వర్ గా మారి చూడటం నేర్చుకోవాలి.
(02:32) ఇప్పుడు రమణ మహర్షి గారు అన్నట్టు నాకు నొప్పి వచ్చింది. నిజమే కానీ ఆ నొప్పి అనుభవంలో నేను ఉండిపోతున్నాను. నొప్పి వచ్చింది శరీరానికి తప్ప నాకు కాదు అని అన్నాడు అది సరే హైయర్ ఫిలాసఫీ అనుకోండి అది వేరు ఇకపోతే రెండో విషయం మార్పు తద్యం ఎల్లకాలం ఇవాళ ఉన్నట్టు ఉండదు కదండి అన్ని మారుతాయి ఆ మాటక వస్తే అన్ని అనిత్యం కదా ఈ నొప్పి శాశ్వతం కాదు ఆ మాటక వస్తే సంతోషం కూడా శాశ్వతం కాదు రెండు వెళ్ళిపోతాయి.
(03:07) అంటే ఇక్కడ మనం పొరపాటు పడొచ్చండి ఇది నిరాశవాదం ఏమో అని చెప్పేసి ఇది నిరాశవాదం కాదండి వాస్తవాన్ని అర్థం చేసుకోవడం అంతే మన జీవితంలో ఎన్నో వచ్చాయి ఎన్నో పోతాయి ఇకముందు కూడా ఎన్నో వస్తాయి ఎన్నో పోతూ ఉంటాయి. అలాగే మూడో విషయం ఏంటంటే కర్తృత్వ భావన నేనే అన్ని చేయాలి నేనే అన్ని నియంత్రించాలి అన్న అహంకారాన్ని వదలటం అండి మనం దాన్ని పట్టుకుంటున్నాం కాబట్టి మన మనసు ఖేదానికి గురవుతున్నది.
(03:33) మనం అనుకోవాల్సింది ఒకటేనండి మనం చేయగలిగింది చిత్త శుద్ధితో చేద్దాం. అది కూడా నువ్వు ప్రయత్న లోపం లేకుండా చేద్దాం. అంతకుమించి ఆలోచించిన చేయగలిగింది ఏముంది ఏమి చేయలేము అని చతరణ శుద్ధిగా నమ్మి కార్యచరణలోకి దిగడం తప్ప వేరే మార్గం లేదండి అంటే ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా గనుక ఆలోచించినట్లయితే ఆధ్యాత్మికత పట్టించుకోవద్దు అని చెప్పడం లేదు పట్టించుకోవద్దు అని చెప్పడం లేదు సరిైన దాన్ని అవసరమైన దాన్ని సరిైన విధంగా పట్టించుకో అని చెప్తున్నాయండి దీనికి మనం ఒక వాక్యాన్ని కూడా యాడ్ చేయొచ్చు అది ఏంటంటే సరిైన కాలంలో స్పందించు అని కూడా మనం చెప్పుకోవచ్చు.
(04:15) ఇప్పుడు ఒకటండి ప్రతిదాన్ని మనం నియంత్రించే ప్రయత్నం చేస్తాం. ఆ నియంత్రించడం వల్ల లోపల మనకు ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంటుంది. దుఃఖం ఇంకా ఎక్కువైపోతూనే ఉంటుంది అది మన ఆ రక్త ప్రసరణ వ్యవస్థని కండర వ్యవస్థని నరాల వ్యవస్థని కూడా దెబ్బతీస్తుందండి అవి కాబట్టి దుఃఖం వస్తున్నది తన్నుకు వస్తున్నది ఆపుకోవద్దు. మంచి ఆలోచన వచ్చింది రాయాలనిపించింది రాయండి ఇబ్బంది ఏముంది మాట్లాడాలని ఉంది మాట్లాడండి అసలు మాట్లాడితేనే కదా మీరు సరిగా మాట్లాడుతున్నారా లేదా అనేది తెలిసేది అంటే ఒకటండి మీరు ఏ పైనైనా చేయండి కానీ ఫలితాన్ని భరించడానికి సిద్ధంగా ఉండండి.
(04:57) పిరికివాళ్ళ మటుకు ఉండొద్దు ప్రతి మనసులో దాచుకుంటే మనలో పిరికివాడు బయటికి వస్తున్నాడని అర్థం అండి. ఇంకోటి ఆధ్యాత్మికత ఏం చెప్తున్నది అంటే ప్రతి నొప్పి ప్రతి బాధ ప్రతి కష్టం కూడా మనక ఏదో నేర్పించడానికి వచ్చింది. కాబట్టి ఈ అనుభవం నుంచి నేను ఏమి నేర్చుకోగలను అన్న ప్రశ్న మనం వేసుకుంటూ ఉండాలంటే అయితే ఎంతోమంది ఉన్నారండి ఎవరు నా బాధని అర్థం చేసుకోవట్లేదని మనం అందరం అనుకుంటూనే ఉంటాం కదా నేను కూడా అనుకుంటూనే ఉంటాను.
(05:30) మీకు నిజంగా అర్థమయి మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కళ్ళఇద్దరు చాలండి జీవితానికి వాళ్ళని అన్వేషించాలి మనం వాళ్ళని ఏర్పరచుకోవాలి. అటువంటి వ్యక్తులు దొరకడం చాలా కష్టం అండి దొరికితే మటుకు ప్రతి విషయానికి మనకి ఏదో ఒక రకంగా ఉపశాంతి లభిస్తూ ఉంటుంది ఒక్కొకసారి సొల్యూషన్ కూడా లభిస్తూ ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి ఈ లోకం ఉంది చూసారా ఇంతకుమించిన గురువు లేదండి అసలు మనల్ని అనడానికే ఉంది అననివ్వండి నేను ఒక రెండు వీడియోలో కూడా చెప్పాను ఈ ప్రపంచం మనల్ని మనలా ఉండనివ్వకుండా కుట్ర పన్నుతూ ఉంటుంది ఆ కుట్రని చేదించి
(06:08) గలవగలిగినాడే మళ్ళీ అదే ప్రపంచం వచ్చి మన భుజం తడుతుంది శబాష్ అని చెప్పేసి అని [నవ్వు] అయితే ఒకటి లోకం మనల్ని నిందించిందండి అప్పుడు మనకు గాని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే బాధపడటం అవసరమా లేదా అన్నది నిర్ణయించుకోవాల్సింది మటుకు మళ్ళీ మనమే అంటే మనందరం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే అంటే చాలా మంది లేండి ప్రతి విషయాన్ని కాలంతో ముడిపెట్టి కాలం తన పని అది చేసుకుపోతుందిలే అని సమాధాన పరుచుకోవడం అన్నమాట అట్లా సమాధాన పరుచుకోకూడదండి కాంప్రమైజ్ కాకూడదు మనం అలా గనక అనుకుంటే నేను ఇందాక చెప్పినట్టు మనలో పిరికివాడు బలంగా ఉన్నట్టు లెక్క
(06:52) అన్నమాట వాడు ఏ పని చేయనివ్వడు అలా కూర్చోపెట్టేస్తాడు భయపెడుతూ ఉంటాడు అన్నమాట ఒక్కటి మటుకు వాస్తవం అండి ఒక్కటి మటుకు వాస్తవం దీన్ని మటుకు జాగ్రత్తగా పట్టుకోండి జాగ్రత్తగా ఆలోచించండి మీలాగా ఇంకొకడు పుట్టలేదు పుట్టబోడు అని మీకు మీరు నిజాయితిగా నమ్మినప్పుడు మిమ్మల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇతరులతో పోల్చుకోరు బికాజ్ యు ఆర్ యూనిక్ ఆన్ దిస్ మదర్ ర్త కదా ఇక్కడే మీ ఆత్మ శైరం బయటపడుతూ ఉంటుంది.
(07:30) అది ఎప్పుడూ క్రియారూపం దాలుద్దామా అని ఊరుతూ ఉంటుంది. అంతే కదండీ నాలాంటివాడు ఈ భూమండలం మీద లేడు ఐ యమ స్పెషల్ వై షుడ్ ఐ కంపేర్ మై సెల్ఫ్ విత్ అదర్స్ ఇది అప్పుడప్పుడు అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండండి. జీవితం అద్భుతంగా ఉంటుందండి. ఇంకొక విషయం అదేంటంటే చాలామంది భవిష్యత్తు గురించి బెంగపడుతూ ఉంటారు ఏదేదో ఊహించుకొని అంటే రాని రేపటి గురించి ఇప్పుడే కుంగిపోవడాన్ని దయచేసి ఎట్టి పరిస్థితిలో ప్రాక్టీస్ చేయద్దండి ఆ టైం వచ్చినప్పుడు మన ఆలోచన ప్రకారం మనం ఏదో పని చేస్తూ ఉంటాం పోతూ ఉంటాం అంటే ఇలా కుంగిపోవడం అనేది ఎలా ఉంటుందంటే వెలగలి దీపాన్ని చూసి చీకటి భయపడినట్టు
(08:12) ఉంటుందట ఎంత మంచి పోలిక అండి నోట్స్ రాసుకుంటూంటే నాకు దొరికింది ఈ వాక్యం ఒక్కటేనండి ఒక్కటే ఇప్పుడు ఇప్పుడు చేయగలిగిన దాన్ని చిత్తశుద్ధితో ప్రయత్నం లోపల లేకుండా చేయటమే అదే మన ప్రస్తుత కర్తవ్యం అలా గనక చేయగలిగితే రేపు అనేది మీకు తనంతట తానే దారిస్తుంది. ఒకసారి ప్రయత్నం చూడండి ప్రయత్నం చేసి చూడండి. చాలా మంది బిజీగా ఉన్నాను బిజీగా ఉన్నాను అంటూ ఉంటారు కదా ఈ బిజీగా ఉన్నాను అన్న ఎక్స్ప్రెషన్ పక్కన పెట్టండి.
(08:43) కొంచెం సీరియస్ గా పని చేస్తున్నాను అన్న భావనకి తాపివ్వండి అన్న భావనకి తాపి ఇవ్వండి. ఇప్పుడు చెక్క గుర్రం ఉంది కదా అది కదులుతూనే ఉంటుంది కానీ అది ముందుకు పోదు కదండి అట్లాగే చాలామంది జీవితం కూడా నువ్వు ఆలోచిస్తూ ఆలోచిస్తూ బాధపడుతూ పొంగిపోతూ అలాగే ఉంటారు కానీ ప్రయత్నించే ఒ చిన్న దీపాన్ని వెలిగించరు అది వాళ్ళు చేస్తున్న పెద్ద పొరపాటండి అంటే బాధ్యతని విస్మరించడానికి బాధను మర్చిపోవడానికి అలాగే నిశశబ్దానికి భయపడుతున్నప్పుడు ఇప్పుడున్న ఈ కొత్త తరం ఏం చేస్తున్నది అంటే ఈ టెక్నాలజీ ఎక్స్ప్లోషన్ ఎరోలో ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తూ రిలాక్స్
(09:26) అయిపోతున్నదండి అలా రిలాక్సేషన్ పొందకూడదండి చేతిలో ఉండాల్సింది ఎట్టి పరిస్థితులో కూడాను మొబైల్ కాదండి బాధలు ఇతరులతో పంచుకోవడానికి మొబిలిటీ ఉండాలంటే కార్యాచరణకి అడుగులు వేయాలి మనం చేతిలో ఉండాల్సింది రిమోట్ కాదండి మన రొటీన్ మన చేతిలో ఉండాలి నాకు ఇక్కడే గౌతమ బుద్ధుని వాక్యాలు బాగా గుర్తుకొస్తున్నాయి నీవు దుఃఖించిన యెడల నీ కష్టములు తీరినచు దుఃఖించుము అంటూ ఉంటాడు.
(09:56) అది కుదరదు కాబట్టి కార్యాచరణ తప్ప వేరే మార్గం లేదండి ఒకటి కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. వాటిని మనం అనుభవిస్తూ ఉండాల్సిందే ఎదుర్కొంటూ ఉండాల్సిందే కాకపోతే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి అటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈ పరిస్థితి నా ప్రశాంతతను పెంచుతుందా నా చైతన్యాన్ని విస్తరిస్తుందా లేదు నా మానవత్వాన్ని బలపరుస్తుందా ఈ మూడు ప్రశ్నలకి సమాధానం ఎస్ ఎస్ ఎస్ అని వచ్చింది అనుకోండి అయితే పట్టించుకోండి లేకపోతే అది ఎంత పెద్ద విషయం అనిపించినా కాలం దాన్ని దుమ్ములో ఎగరేసిపోతూ
(10:40) ఉంటుందండి మీరేం వరి కావక్కర్లేదు. ఇక్కడ నేను ఏమంటానంటే జీవితంలో ప్రతి విషయానికి స్పందించడం అనేది పెద్ద విజ్ఞత కాదండి అది తెలివి కాదు ఏది పట్టించుకోవాలో ఏది పట్టించుకోకూడదో తెలుసుకోవడమే ఒకే విధంగా పరిపక్వత అన్నమాట నేను మొట్టమొదటలో ఒక మాట అన్నాను గుర్తుందా కొంచెం ఓపిక పట్టవయ్యా కాలం అన్కాయలను మానుపుతుంది అని అంటారు అది తప్పుని నేను చెప్పడానికే వీడియో చేస్తున్నాను.
(11:07) ఒక్కటండి కాలం కేవలం అవకాశం మాత్రమే దాన్ని సద్వినియోగ పరుచుకోవడం అనేది మన చేతిలో ఉన్న పని కాలం ఎలవేళలా మందు కాదండి మనమే మన సొంత వైద్యులం వ హవ్ టు క్యూర్ అవర్ సెల్వ్స్ అండి చివరిగా ఒక మాట అండి జీవితంలో ఎంత పెద్ద గాయమైనా సరే మిమ్మల్ని నిర్వచించదు గాయం ఎప్పుడు మనల్ని నిర్వచించదు ండి దానికి మనం ఇచ్చే రెస్పాన్స్ే మనల్ని నిర్వచిస్తుంది. అవసరమైతే సమాజంలో గొప్ప వ్యక్తిగా మనల్ని నిలబడుతుందండి.
(11:45) కాలం మనకోసం ఎదురు చూస్తూ ఉంటుందండి కాకపోతే మొదలు పెట్టాల్సింది మనమే ఈ విషయాన్ని బట్టి గట్టి పరిస్థితులో మర్చిపోకూడదండి కార్యాచరణ కర్తవ్య భావన తప్ప వేరే మార్గం లేదండి దుఃఖిస్తూ కూర్చుంటావా రోజులు వారాలుగా వారాలు నెలలుగా నెలలు సంవత్సరాలుగా గడిచిపోతూనే ఉంటాయండి చివరికి జీవితం ముంచుకవచ్చేస్తుంది అన్నమాట సో సో ఇదండి వీడియోలో సంగతి మీనందుకు కృతజ్ఞతలు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.
(12:21) సబ్స్క్రిప్షన్ అంటారా మీ ఇష్టం కానీ రెండు పనులు చేయాలండి. మంచి మెసేజ్ని పెట్టండి అంతే అంతకంటే ఏం లేదండి తర్వాత దీని మీద ఇంకా కొంచెం క్లారిటీ కావాలి కరణ గారు అని మీరు అనుకున్నట్లయితే నాకు ఫోన్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 9491063089 మీరు YouTube లోకి వెళ్లి ఎంఆర్టహ్ఐ స్పేస్ హచ్కే ఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పిఓఆర్ యు ఆర్ అని చెప్పేసి [గొంతు సవరించుకోవడం] నా పేరు వస్తుందండి అదే నా YouTube ఛానల్ అన్నమాట సో ఇదండి వీడియోలో సంగతి నమస్కారం ఆ

No comments:

Post a Comment