స్త్రీ పురుషుల శృంగారంలో తత్వాన్ని వెతికిన వేమన పద్యాలు|| Vemana Padyalu with bhavam
The nagraj show
https://www.youtube.com/watch?v=8_YZ0Mwn46Q
Transcript:
(00:01) [సంగీతం] శుక్లకణము రక్తము స్త్రీ పురుషులు శృంగారము ఈ భావనలను వాడుకొని ఎవరైనా తత్వం చెప్పగలరా అవును వేమన గారు చెప్పారు వేమనగారు స్పృషించని అంశం లేదు వాడుకోని అంశం లేదు. మానవ జీవితానికి సంబంధించినటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తన పద్యాలలో వాడుకొని అద్భుతమైన తత్వాన్ని వేమన గారు చెప్పారు.
(00:31) అది కేవలం వేమన గారికి మాత్రమే సాధ్యం. నమస్కారం ది నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే ఈ రెండు పద్యాలు శుక్రకణాలు రక్తము స్త్రీ పురుషుల మధ్య శృంగార సంబంధాలను పోలుస్తూ వేమన గారు అద్భుతంగా చెప్పినటువంటి తత్వాన్ని తెలియపరుస్తాయి. అది కూడా అందరికీ అర్థమయ్యేంత సరళంగా ఎలాంటి వెటకారము వ్యంగ్్యము ఎలాంటి తప్పుడు భావన లేకుండా ఎంతో అద్భుతంగా వేమన గారు చెప్పిన ఈ రెండు పద్యాలను ఆశాంతం పూర్తిగా వినండి.
(01:09) శుక్లమరసి చూడ శుభ్రవర్ణము తెలుపు నరయ శోనితంబు నయము నెరుపు తెలుపు లేరుపు రెండు తేజరిల్లునాత్మ విశ్వదాభిరామ వినురవేమ శుక్ల మరసి చూడ శుభ్ర వర్ణము తెలుపు నరయ శోనితంబు నయము నెరుపు తెలుపులెరుపు రెండు తేజరిల్లునాత్మ విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం విశ్వదాభిరామ వినురవేమ అనేది ఆయన పద్యం యొక్క మకుటం దాన్ని వదిలేస్తే శుక్లం వీర్యమును అరసి చూడ పరిశీలించి చూస్తే శుభ్ర వర్ణము దాని స్వచ్ఛమైన తెల్లని రంగు తెలుపు అంటే తెల్లనిది అని ఇస్ వైట్ అని శోనితంబు రక్తమును శోనితంబు అంటే ఇక్కడ రక్తము నరయ పరిశీలించి చూస్తే తెలుసుకుంటే
(02:13) నయము సహజముగా స్పష్టంగా చక్కగా అని ఎరుపు ఎరుపు రంగులో ఉంటుంది తెలుపులు ఈ తెలుపులు అంటే ఇక్కడ ఈ తెలుపులు అంటే ఏంటి శుక్లకణాలు ఎరుపు ఈ ఎరుపు ఎరుపు అంటే ఏంటి శోనితం బ్లడ్ రెండు ఈ రెండును ఆత్మ ఆత్మ యందు జీవుని యందు శరీర శరీరం లోపల తేజరిల్లు ప్రకాశిస్తాయి నివసిస్తాయి కలిసి ఉంటాయి. ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని విందాం.
(02:47) ఓ వేమ విను మానవ శరీరంలో ఉండే శుక్లకణం అంటే వీర్యం దాన్ని పరిశీలిస్తే స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటుంది. అలాగే రక్తాన్ని పరిశీలిస్తే అది సహజంగా ఎరుపు రంగులో ఉంటుంది. ఈ తెలుపు మరియు ఎరుపు అనే రెండు జీవుని ఆత్మలో లేదా శరీరంలో ఈ తెలుపు ఎరుపు ఏంటి శుక్లము రక్తము అనే ఈ రెండు జీవుని ఆత్మలో కలిసి ప్రకాశిస్తూ ఉంటాయి. ఆత్మలో అంటే శరీరంలో కలిసి ప్రకాశిస్తూ ఉంటాయి లేదా మనుగడకు ఆధారంగా ఉంటాయి.
(03:27) ఈ పద్యం యొక్క భావాన్ని మనం కూలంకశంగా పరిశీలిస్తే ఈ పద్యం ఉపరితలంపై శరీరంలోని రెండు ముఖ్యమైన ద్రవాలైన శుక్లము మరియు రక్తము ఈ రెండింటి గురించి చెబుతున్నట్లు అనిపించినా దీనిలో లోతైన తాత్విక అర్థం ఉంది. శరీర నిర్మాణం మరియు జీవం పురుషుని శుక్లం మరియు స్త్రీ యొక్క రజస్సు యొక్క రక్తం కలయిక ద్వారా జీవం ఆవిర్భవిస్తుందని ఒక భావన ఈ రెండు పదార్థాలు జీవి మనుగడకు శరీర నిర్మాణానికి మూలం అని వేవన సూచిస్తున్నాడు.
(04:12) ఈ రెండు ప్రాణశక్తికి ప్రతీకలు. తెలుపు మరియు ఎరుపు రంగులు పరస్పర విరుద్ధమైనవి. తెలుపు స్వచ్ఛత, శాంతి జ్ఞానం అంటే సాత్విక గుణాన్ని కలిగి ఉంటుంది. లేదా పురుష తత్వానికి ఎరుపు శక్తి ఆవేశం రజోగుణం లేదా ప్రకృతి అంటే స్త్రీ తత్వానికి ప్రతీకలుగా భావించవచ్చు. ఆత్మ ఈ రెండు గుణాలను తత్వాలను తనలో ఇముర్చుకుంటుంది. అంటే జీవుడు శాంతి ఆవేశం జ్ఞానం శక్తి వంటి ద్వంద్వాల కలయక అని అర్థం ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపం ఏంటంటే ఈ భౌతికమైన తెలుపు ఎరుపు అనేవి కేవలం భౌతిక శరీరానికి సంబంధించినవి కావచ్చు కానీ అవి ఆత్మ యందు తేజరిలుతాయి అని చెప్పడం ద్వారా ఈ భౌతికమైన ఉనికికి ఆధారమైన చైతన్యమే ఆత్మ
(05:12) అని వేమన పరోక్షంగా చెబుతున్నాడు. ఆత్మ ఈ భౌతికమైన అంశాలను ధరించి వాటి ద్వారా వ్యక్తమవుతుంది. ఆత్మ ఈ ద్వంద్వాలకు అతీతమైనది. కానీ వాటిని తనలో కలిగి ఉంటుంది. వేమన సమాజంలోని లేదా ప్రకృతిలోని విభిన్న అంశాలను వేరువేరుగా కాకుండా ఒక సమగ్ర దృష్టితో చూడాలని సూచిస్తున్నాడు. తెలుపు ఎరుపు లాంటి భిన్నత్వంలో కూడా ఏకత్వం ఉంది.
(05:49) ఆ ఏకత్వమే ఆత్మ లేదా జీవం యొక్క సారం అని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పద్యం మానవ శరీరం జీవం యొక్క మూలాలు మరియు వాటి వెనుక ఉన్న తాత్వికమైన ద్వంద్వాల ఐక్యతను సరళమైన భాషలో వివరిస్తుంది. అలాగే మరో అద్భుతమైన పద్యం అది కూడా ఇలాంటిదే కానీ ఎంతో అద్భుతంగా సరళంగా వేమన గారు రాశారు. శోనితము కామసతులకు ప్రాణితముగా శుక్లమగును బహుపురుషులకు ప్రాణమే తెలుపెరుపు గలయగానగు విదేహ గంధి గనుడగువేమా శోనితము కామసతులకు ప్రాణితముగా శుక్లమగును బహుపురుషులకు ప్రాణమే తెలుపెరుపు గలయగానగు విదేహ గంధి గనుడగు వేమా ఈ పద్యం యొక్క ప్రతిపదార్థతా తాత్పర్యం ఏంటంటే విదేహ గంధి గనుడగువేమ విదేహ స్థితిని శరీర స్పృహ లేని
(06:56) జ్ఞాన స్థితిని పొందినవాడా లేదా విదేహరాజు అంటే జనకుడు ఆయన వంటి జ్ఞానం కలవాడా గొప్పవాడైన ఓ వేమా అని తనను తాను సంబోధించుకుంటూ పద్యాన్ని చెబుతున్నారు. శోనితము అంటే రక్తము లేదా స్త్రీల విషయంలో ఆర్థవం అంటే మెన్షస్ కామసతులకు కామముతో కూడిన స్త్రీలకు సృష్టి కార్యం కోసం లేదా స్త్రీలకు అని అర్థం ప్రాణితముగా ప్రాణము వలె ముఖ్యమైనదిగా జీవనాధారముగా శుక్లం వీర్యం అగును అయి ఉంటుంది బహు పురుషులకు పురుషులకు సాధారణంగా పురుషులకు తెలుపు తెలుపు అంటే ఏంటి శుక్లం ఎరుపు ఎరుపు అంటే శోనితము రజస్సు అని గలయగాన్ కలిసినప్పుడు కలవడం వలన
(08:02) ప్రాణమే జీవమే ప్రాణమే అని అగు అంటే ఏర్పడుతుంది పుడుతుంది. పద్యం యొక్క తాత్పర్యాన్ని విందాం. విదేహ జ్ఞాన సంపన్నుడైన ఓ వేమ స్త్రీలకు వారి శరీరంలోని శోనితం అంటే రక్తం ఆర్థవం ప్రాణాధారమైనది అలాగే పురుషులకు వారి శుక్లం అంటే వీర్యం ప్రాణాధారమైనది. ఈ తెలుపు మరియు ఎరుపు అంటే శుక్లము శోనితము కలవడం వలననే జీవం ప్రాణం ఏర్పడుతుంది.
(08:42) ఈ పద్యం కూడా మునుపటి పద్యం వెలనే జీవం యొక్క మూలాల గురించి వివరిస్తుంది. కానీ మరింత స్పష్టంగా స్త్రీ పురుషుల జీవశక్తులను మరియు వాటి కలయిక ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. జీవాధారాలు స్త్రీలలోని శోనితం ఇక్కడ ఆర్థవంగా కూడా భావించవచ్చు. ఇది సంతానోత్పత్తికి సూచిక మరియు పురుషులలోని శుక్లం వారి జీవశక్తికి ఆరోగ్యానికి మరియు సంతానానికి మూలమని వేమన గుర్తిస్తున్నాడు.
(09:17) ఇది కేవలం ద్రవాలు కావు అవి వారి ప్రాణశక్తికి ప్రతీకలు సృష్టి రహస్యం ఏంటంటే జీవం ఎలా ఆవిర్భవిస్తుందో వేమన చాలా సరళంగా వివరిస్తున్నాడు. స్త్రీ పురుషుల కలయక ద్వారా వారి జీవశక్తులైన తెలుపు అంటే శుక్లం మరియు ఎరుపు అంటే శోనితం రజస్సు ఆ సంయోగం చెందినప్పుడే ప్రాణం లేదా కొత్త జీవం పుడుతుందని స్పష్టం చేస్తున్నాడు. ఇది జీవశాస్త్రపరమైన సృష్టి ప్రక్రియకు తాత్వికమైన వర్ణన.
(09:53) ప్రకృతి పురుషుల సంయోగం తాత్వికంగా చూస్తే ఎరుపు అంటే శోనితం ప్రకృతికి స్త్రీ తత్వం శక్తి పదార్థం తెలుపు అంటే శుక్లం పురుషునికి చైతన్యం శివం ఎరుపు స్త్రీకి ప్రతీక తెలుపు పురుషునికి ప్రతీక ఈ రెండింటి కలియక లేకుండా సృష్టి జరగదు చైతన్యం అంటే పురుషుడు మరియు శక్తి అంటే ప్రకృతి కలిసినప్పుడే జీవం వ్యక్తమవుతుంది అంటే ప్రాణం పుడుతుంది.
(10:31) సమతోల్యత యొక్క ప్రాముఖ్యత స్త్రీ పురుషులు ఇద్దరూ సృష్టికి సమానంగా అవసరమని వారి జీవశక్తులు రెండు కీలకమైనవని ఈ పద్యం సూచిస్తుంది. ఒకరి శక్తి మరొకరి శక్తితో కలిసినప్పుడే సంపూర్ణత జీవం ఏర్పడతాయి. ఇది కేవలం శారీరక కలయకే కాక ప్రకృతిలోని విభిన్న శక్తుల సమతోల్యత మరియు పరస్పర ఆధారపడటాన్ని కూడా సూచిస్తుంది. విదేహ గంధి అనే పదాన్ని వాడాడు.
(11:06) ఈ పద్యం ముగింపులో వాడిన విదేహ గంధి ఘనుడగు వేమ అనే సంబోధన ఇంతటి ప్రాథమికమైన భౌతికమైన సృష్టి రహస్యం గురించి చెప్పిన వేమన ఆ భౌతికతకు అతీతమైన జ్ఞాన స్థితిని విదేహ శక్తి కూడా పొందిన గొప్పవాడని సూచిస్తుంది. స్థూలమైన శరీరం దాని ప్రక్రియల గురించి వివరిస్తూనే సూక్ష్మమైన ఆత్మజ్ఞానం వైపు కూడా వేమన దృష్టిని కలిగి ఉన్నాడని తెలియపరుస్తుంది.
(11:41) ఈ పద్యం జీవం యొక్క భౌతిక మరియు తాత్విక మూలాలను స్త్రీ పురుషుల ప్రాముఖ్యతను మరియు వారి కలయక ద్వారా జరిగే సృష్టి అద్భుతాన్ని వివరిస్తుంది. స్త్రీ పురుషుల కలయకలో కూడా తత్వాన్ని వెతకడం వేమనకు మాత్రమే సాధ్యమైంది. ఇలాంటి మరింత అద్భుతమైన వేమన గారి పద్యాలను ఇంతవరకు మనం ఎప్పుడూ విని ఉండని వేమన పద్యాలను సేకరించి మరో వీడియోలో మీ ముందుకు వస్తాను.
(12:14) అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్. [సంగీతం]
No comments:
Post a Comment