Why There's No Cure for Cancer? | 55 ఏళ్లు...$300 Billion ఖర్చు...మందు ఎందుకు కనిపెట్టలేదు?
Author Name:Manoj Talks
Youtube Channel Url:https://www.youtube.com/@manoj_talks_telugu_lo
Youtube Video URL:https://www.youtube.com/watch?v=W6-SWYngn3o
Transcript:
(00:02) అది డిసెంబర్ 23 1971 వైట్ హౌస్ వాషింగ్టన్ డిసి అమెరికాకి రాష్ట్రపతి అయిన రిచర్డ్ నిక్సన్ ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ టేబుల్ చుట్టూ పాలిటీషియన్స్ సైంటిస్ట్ కూర్చునున్నారు. మీడియా వాళ్ళు చుట్టుముట్టేశారు. రిచర్డ్ నిక్సన్ ఒక పెన్ తీసుకుని ఒక పేపర్ పై సంతకం పెట్టారు. అలా సంతకం పెట్టి ఒక యుద్ధాన్ని డిక్లేర్ చేశారు.
(00:22) ఆయన ఒక దేశంపై యుద్ధం డిక్లేర్ చేశారు అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఆయన ఒక రోగంపై యుద్ధం డిక్లేర్ చేశారు. ఆ రోగం మరేంటో కాదు క్యాన్సర్ next to find ఆయన ద నేషనల్ క్యాన్సర్ యక్ట్ ని పాస్ చేశారు. 1.6 బిలియన్ డాలర్ ఈ క్యాన్సర్ రీసెర్చ్ కి కేటాయించారు. క్యాన్సర్ కి ఎలా అయినా మందు కనిపెట్టమని సైంటిస్ట్ కి చెప్పారు.
(00:50) అంత పెట్టుబడి జస్ట్ ఒక్క రోగంపై రీసర్చ్ కోసం ఆ రోజు వరకు ఎవ్వరూ పెట్టలేదు. నిక్సన్ ఒక ప్రామిస్ చేశారు. మనం పరమాణు బాంబ్ నాలుగేళ్లల్లోనే తయారు చేయగలిగాం. మూన్ పైకి చాలా తక్కువ సమయంలో వెళ్ళగలిగాం. అలానే మళ్ళీ కష్టపడి ఈ క్యాన్సర్ అనే రోగాన్ని నయం చేస్తామని అన్నారు. చాలా మంది సైంటిస్ట్ ఆ కాలంలో ఈ రోగాన్ని నయం చేయడానికి ఐదేళ్ళు మించిపోతే 10ఏళ్లు పడుతుంది అని అనుకున్నారు.
(01:10) కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా 55 ఏళ్ళు దాటేసింది. కానీ ప్రతి క్యాన్సర్ కి ఒక ప్రాపర్ క్యూర్ అయితే మన దగ్గర ఈ రోజుకి లేదు. ప్రతి సంవత్సరం కేవలం ఇండియాలోనే 15 లక్షల కొత్త క్యాన్సర్ కేసెస్ వస్తున్నాయి. 9 లక్షల భారతీయులు ఈ భయంకరమైన రోగంతో ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. అదే కాకుండా ప్రపంచంలో ప్రతి సంవత్సరం కోటి మంది ఈ వ్యాధితో చనిపోతున్నారు.
(01:32) హెచ్ఐవ ట్యూబర్క్లోసిస్ అండ్ మలేరియా లాంటి వ్యాధులని కలిపిన క్యాన్సర్ డెత్స్ కన్నా తక్కువే వస్తుంది. వేల కోట్ల డబ్బు వందల మంది సైంటిస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిపిన ఈరోజు వరకు మనకి క్యాన్సర్ కి విరుగుడు అనేది లేదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనం ఈరోజు వరకు ప్రతి క్యాన్సర్ ని ఎందుకు నయం చేయలేకపోతున్నాం రిచర్డ్ నిక్సన్ అంత పెట్టుబడి పెట్టిన ఎందుకు సైంటిస్ట్ ఒక మందు ఈరోజు వరకు కనిపెట్టలేకపోతున్నారు.
(01:55) అసలు క్యాన్సర్ యొక్క రూట్ కాస్ ఏంటి? ఈ వీడియోలో బోల్డ్ అని షాకింగ్ థింగ్స్ మీరు తెలుసుకోబోతున్నారు. ఈ ఒక్క వీడియోతో ఈ క్యాన్సర్ అనే క్యూర్ గురించి మీకు ఒక మంచి గ్రిప్ వస్తుంది. కానీ ఈ కథని మనం అర్థం చేసుకోవాలంటే డైరెక్ట్ గా వరల్డ్ వార్ వన్ కి వెళ్ళాలి. పదండి ఈ వీడియోలో క్యాన్సర్ ఏంటి అండ్ దాన్ని నయం చేసే స్టోరీ ఏంటా అని క్లియర్ అండ్ డీటెయిల్డ్ గా తెలుసుకుందాం.
(02:15) కథని వరల్డ్ వార్ వన్ నుంచి స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మనోజ్ టాక్స్ అది 1917 బెల్జియం అనే యూరోప్ లో ఉండే దేశం వరల్డ్ వార్ వన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. జర్మన్ సైన్యం ఒక కొత్త రకమైన ఆయుధాన్ని అలైడ్ ఫోర్సెస్ మీద ప్రయోగించింది. ఇక్కడ తెలియని వాళ్ళకి వరల్డ్ వార్ వన్ అలైడ్ మరియు యక్సెస్ ఫోర్సెస్ మధ్యన జరిగింది. అలైడ్ ఫోర్సెస్ లో బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ అండ్ జపాన్ ఉండేవి.
(02:34) అండ్ యక్సెస్ పవర్స్ లో జర్మనీ, ఆస్ట్రియా అండ్ హంగేరీ. సో ఈ యక్సెస్ పవర్స్ ఏమో ఆలెడ్ పవర్స్ మీద ఒక కొత్త కెమికల్ ఆయుధాన్ని వాడారు. దాని పేరే మస్టర్డ్ గ్యాస్. ఆ మస్టర్డ్ గ్యాస్ ని ఒక మనిషి పీల్చిన వెంటనే చర్మాన్ని బాగా అది ఇరిటేట్ చేస్తుంది. కళ్ళు ఇంకా కనిపించవు. ఊపిరి తెత్తలు పర్మనెంట్ గా పాడైపోతాయి. చాలా మంది సోల్జర్స్ ఈ గ్యాస్ వల్ల ఆ యుద్ధంలోనే చనిపోయారు.
(02:53) కానీ ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే మిగిలున్న వాళ్ళ యొక్క శరీరాలు ఎంత డ్ామేజ్ అయ్యాయి అంటే డాక్టర్స్ అలాంటి కేసులు అప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. మిలిటరీ డాక్టర్స్ ఒక వింత విషయాన్ని గమనించారు. ఏ సోల్జర్స్ అయితే మస్టర్డ్ గ్యాస్ ని పీల్చి వచ్చారో వాళ్ళ వైట్ బ్లడ్ సెల్ కౌంట్ చాలా తక్కువగా ఉందన్నారు. వాళ్ళ బోన్ మ్యారో డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్పారు.
(03:11) మన బోన్ మారోనే వైట్ బ్లడ్ సెల్స్ ని ఉత్పాదిస్తుంది. వైట్ బ్లడ్ సెల్స్ అనేది మన ఇమ్యూన్ సిస్టం లో ఒక భాగం. ఆ సెల్స్ ఏమో సపోజ్ ఒక ఫారెన్ బ్యాక్టీరియా గాని వైరస్ గాని మన బాడీలోకి ఎంటర్ అయితే మన వైట్ బ్లడ్ సెల్స్ దాన్ని చంపుతుంది. ఆ వరల్డ్ వార్ వన్ సోల్జర్స్ కేస్ అయితే తెలుసు కానీ ఆ కాలంలో అది క్యాన్సర్ తో ఎవ్వరూ కనెక్ట్ చేయలేదు.
(03:29) 20 సంవత్సరాల వరకు ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపడేవారు తప్ప అలా వైట్ బ్లడ్ సెల్స్ తక్కువ అవ్వడానికి మూల కారణం డాక్టర్స్ కి అర్థం కాలేదు. 20 ఏళ్ల తర్వాత 1942 లో అదే వరల్డ్ వార్ అప్పుడు ఏల్ యూనివర్సిటీలో ఒక విషయం జరిగింది. ఇద్దరు ఫార్మకోలజిస్ట్ లూయిస్ గాడ్ మన్ మరియు ఆల్ఫ్రెడ్ గిల్ మన్ ఒక సీక్రెట్ మిలిటరీ కాంట్రాక్ట్ పైన వర్క్ చేస్తున్నారు.
(03:48) వాళ్ళ పని ఏంటంటే కెమికల్ ఆయుధాలు మానవ శరీరంపై ఎలా ప్రభావిస్తున్నాయా అని కనుక్కోవడం వాళ్ళకి ఆల్రెడీ ఎలా మస్టర్డ్ గ్యాస్ వల్ల వైట్ బ్లడ్ సెల్స్ తక్కువ అవుతున్నాయని తెలుసు. వాళ్ళకి ఇంకో విషయం ఏం తెలుసంటే లూకేమియా అండ్ లింఫోమా అనే రెండు రోగాలలో వైట్ బ్లడ్ సెల్స్ అన్కంట్రోల్డ్ గా పెరిగిపోతాయి. సో ఆ మస్టర్డ్ గ్యాస్ అనే కెమికల్ వెపన్ ఎందుకు లూకేమియాకి ట్రీట్మెంట్ గా వాడకూడదు అని అనుకున్నారు.
(04:08) అందుకు వాళ్ళు నైట్రోజన్ మస్టర్డ్ అనే కెమికల్ ని తీసుకున్నారు. లూకేమియా అనే క్యాన్సర్ అనే ఎలుకల మీద వాడారు. ఆ ఎలుకల్లో ట్యూమర్ అయితే షింక్ అయింది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. మస్టర్డ్ గ్యాస్ కదా వైట్ బ్లడ్ సెల్స్ ని తగ్గించింది. నైట్రోజన్ మస్టర్డ్ ని ఎందుకు వాడారని ఎందుకంటే మస్టర్డ్ గ్యాస్ ఎవరికి ఇచ్చినా అది చాలా డేంజరస్ అయిపోతుంది.
(04:26) కానీ నైట్రోజన్ మస్టర్డ్ కూడా ఒక కెమికల్ వెపనే అండ్ సిమిలర్ టు మస్టర్డ్ గ్యాస్ కానీ అది మనం మనుషుల మీద వాడొచ్చు. అది ఒక్కటే తేడా. సో 27 ఆగస్ట్ 1942 నైట్రోజన్ మస్టర్డ్ ని వాళ్ళు జేడి అనే ఒక 48 ఏళ్ల ఫ్యాక్టరీ వర్కర్ కి ఇచ్చారు. ఆ ఫ్యాక్టరీ వర్కర్ కి అడ్వాన్స్డ్ లింఫోమా ఉంది. ఆయనకి ఎంత పెద్ద ట్యూమర్ ఉందంటే అన్నం మింగలేకపోయేవారు.
(04:44) అతి కష్టం మీద మెడ తిప్పగలిగేవారు. ఆ కెమికల్ ని చాలాసార్లు జేడి కి ఇచ్చిన తర్వాత ఆ ట్యూమర్స్ ష్రింక్ అయ్యి అండ్ ఇంకా మాయమైపోయాయి. మొదటిసారి ఆ టైంలో ఒక కెమికల్ ని బాడీలో ఇంజెక్ట్ చేసి క్యాన్సర్ ని నయం చేశారు. కానీ ఆ డాక్టర్స్ యొక్క గెలుపు ఎక్కువ రోజులు ఉండలేదు. మూడు వారాల్లోనే ఆ ట్యూమర్ మళ్ళీ తిరిగి వచ్చింది. ఈసారి చెప్పాలంటే ఇంకా పవర్ఫుల్ గా మారింది.
(05:03) సరిగ్గా ఆ ఇంజెక్షన్ ఇచ్చిన మూడు నెలల తర్వాత ఫస్ట్ డిసెంబర్ 1942 న జేడి చనిపోయారు. కానీ ఆయన మీద చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల ఒక కొత్త ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ పుట్టబోతుంది అని ఆయనకి కొంచెం కూడా ఐడియా లేదు. అదే కీమోథెరపీ. 1942 తర్వాత కీమోథెరపీ చాలా పాపులర్ అయింది. ఈ రోజుకి కీమోథెరపీ లక్షల మంది ప్రాణాల్ని ప్రతి సంవత్సరం కాపాడుతుంది.
(05:23) కానీ కీమోథెరపీ అనేది చాలా కాస్ట్లీ. అలాంటి రోగం ఎవ్వరికీ రాకూడదు టచ్ కూడా నేను కోరుకుంటాను. కానీ సపోజ్ వస్తే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫ్యామిలీస్ భరించలేరు. ఎందుకంటే ఆ కీమోథెరపీ యొక్క ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు క్యాన్సర్ ట్రీట్మెంట్ కి ఇండియాలో 2.5 5 లాక్స్ నుంచి 20 లాక్స్ వరకు ఖర్చు అవుతుంది. క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉందా అన్న దానిపైన కాస్ట్ డిపెండ్ అవుతుంది.
(05:41) అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ ఇమ్యూనోథెరపీ మరియు టార్గెటెడ్ థెరపీ యొక్క ఖర్చు 30 లక్షల వరకు వెళ్తుంది. ఒక్క కీమోథెరపీ సైకిల్ 60,000 నుంచి 1 00ా000 వరకు ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ కి 6 నుంచిఎట్ సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ కావాల్సి వస్తుంది. దానితో పాటు హాస్పిటల్, రూమ్ రెంట్, ట్రావెలింగ్ ఇవన్నీ కలిపితే చాలా ఇండియన్ ఫ్యామిలీస్ అలాంటి ఖర్చుని భరించలేరు.
(05:59) మెడికల్ ఎమర్జెన్సీస్ అనేవి మనకి చెప్పిరావు. సడన్ గానే వస్తాయి ఎప్పుడైనా అండ్ మనం మొత్తం లైఫ్ సేవింగ్స్ ని ఒక్క హాస్పిటల్ బిల్ పైన పెట్టలేము కదా మీరే ఆలోచించండి. అండ్ నాకు బుద్ధి వచ్చి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకున్నాను. నాకు నా వైఫ్ కంబైన్డ్ హెల్త్ ఇన్షూరెన్స్ అది. అండ్ యusఎస్ లాగా హెల్త్ ఇన్షూరెన్స్ కాస్ట్లీ గా ఉండదు.
(06:15) ఇండియాలో చాలా అఫోర్డబుల్ గా ఉంది. అదే మనకి ఇక్కడ ఒక గుడ్ న్యూస్. కేవలం 400 నుంచి ₹500 లో మనం ఒక హెల్త్ ఇన్షూరెన్స్ కొనుక్కోవచ్చు. ఆ ఇన్సూరెన్స్ ఒక్కొక్కసారి లక్షలు లేదా కోట్ల బిల్స్ ని కూడా భరిస్తుంది. మీరు ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో దానిపైన అది డిపెండ్ అయి ఉంటుంది. పేపర్ వర్క్ నుంచి సెటిల్మెంట్ వరకు మీకు ఒక డెడికేటెడ్ హెల్త్ మేనేజర్ కూడా దొరుకుతారు.
(06:34) ఈ రోజు కొన్ని ప్లాన్స్ ఎలా ఉన్నాయ అంటే బిపి ఆస్తమా అండ్ హెర్నియా లాంటి డిసీజెస్ డే వన్ నుంచి కవర్ చేస్తున్నాయి. ఇంకొన్ని ప్లాన్స్ లో గ్లౌస్్ సిరింజస్ అండ్ పీపి కిట్స్ కూడా కవర్ అవుతున్నాయి. లేకపోతే అది నార్మల్ గా మీరు సపరేట్ గా కొనుక్కోవాల్సి వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ పైన ఉంది చూడండి. ఈ యాప్ కి వెళ్తే ఏ ఇన్సూరెన్స్ బెస్ట్ అని మీరు అనలైస్ చేసి తీసుకోవచ్చు.
(06:50) ఇన్షూరెన్స్ గురించి డీప్ గా తెలుసుకోవాలంటే లేబర్ లా అడ్వైజర్ చేసిన ఒక వీడియో నాకు చాలా ఇష్టం. అది లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అది తప్పకుండా చూడండి. ఇన్సూరెన్స్ యొక్క న్యూన్సెస్ చిన్న చిన్న కాన్సెప్ట్స్ మీకు అర్థమవుతాయి. అప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మీకు ఈజీ అయిపోతుంది.
(07:05) కానీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం జేడి అనే వ్యక్తి గురించి చూసే ముందే ఆయనకి క్యాన్సర్ నయమైంది కానీ తర్వాత అనుకోకుండా చనిపోయారు. క్యాన్సర్ అనే వ్యాధి ఎలా ప్రవర్తిస్తుందో మనం ఎప్పుడూ చెప్పలేము. సో అందుకే ఇక్కడ హెల్త్ ఇన్షూరెన్స్ తో పాటు మనకొక టర్మ్ ఇన్షూరెన్స్ కూడా కావాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అదొక సేఫ్టీ నెట్ లా పనిచేస్తుంది.
(07:21) హెల్త్ ఇన్షూరెన్స్ లాని ఇది కూడా కేవలం 400 నుంచి 500 పర్ మంత్ లో తీసుకోవచ్చు. దానితో పాటు యాక్సిడెంటల్ కవర్, క్రిటికల్ ఎల్నెస్ లాంటి కవర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ తీసుకుంటే టర్మ్ ఇన్షూరెన్స్ లో అప్ టు 15% డిస్కౌంట్ దొరుకుతుంది. అండ్ మరియు హెల్త్ ఇన్షూరెన్స్ లో అప్ టు 25% డిస్కౌంట్ దొరుకుతుంది.
(07:35) టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ హెల్త్ ఇన్షూరెన్స్ రెండు కేవలం మీరు మంత్ కి 400 నుంచి 500 లోపనే కొనుక్కోవచ్చు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క కవరేజ్ అప్ టు క్రోర్స్ వరకు మీకు వెళ్తుంది. హాస్పిటల్ బెల్స్ అయినా ఫ్యామిలీ సెక్యూరిటీ అయినా రెండు మనకి ఇంపార్టెంటే ఈ ఇన్సూరెన్సెస్ తీసుకునే లింక్ పిల్డ్ కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చెక్ అవుట్ చేయడం మర్చిపోవద్దు.
(07:52) మళ్ళీ వీడియోలోకి వచ్చేద్దాం. జేడి యొక్క మరణం తర్వాత ఇంకో డాక్టర్ క్యాన్సర్ నయం చేస్తాను అని దావా చేశారు. అండ్ 1947 లో ఆయన ఏం చేశారో వింటే మీరు షాక్ అయిపోతారు. 1947 బాస్టన్ అమెరికా సిడ్నీ ఫార్బర్ అనే పాథాలజిస్ట్ ఒక పిల్లల హాస్పిటల్ లో బాస్టన్ లో పని చేస్తున్నారు. ఆ హాస్పిటల్ లో ఆయన పని ఏంటో తెలుసా? ఏ పిల్లలైతే లూకేమియా అనే వ్యాధితో చనిపోతున్నారో ఆ పిల్లల యొక్క అటాప్సీ చేయడం.
(08:14) లూకేమియాని సింపుల్ భాషలో వన్ ఆఫ్ ద బ్లడ్ క్యాన్సర్ అని చెప్పొచ్చు. ఆ కాలంలో పిల్లలకి ఈ రకమైన బ్లడ్ క్యాన్సర్ వస్తే మందు లేదు ట్రీట్మెంట్ అసలే లేదు. ఆ కాలంలో డాక్టర్స్ తల్లిదండ్రులకి ఏం చెప్పేవారంటే పిల్లల్ని ఇంటికి తీసుకొని వెళ్లి వెయిట్ చేయండి అని చెప్పేవారు. మిగిలిన కొంత సమయం ఏదైతే ఉందో వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేయండి అని చెప్పేవారు.
(08:29) కానీ ఆ సైంటిస్ట్ అదే ఫార్మర్ కి బాధగా అనిపించేది. అలా పిల్లలు చనిపోతూ చూడడం ఆయన సహించలేకపోయేవారు. ఆయనకి ముందు జరిగిన మస్టర్డ్ గ్యాస్ ఎక్స్పెరిమెంట్ తెలుసు. అదే జేడి అనే అతనిలో నైట్రోజన్ మస్టర్డ్ ఇంజెక్ట్ చేశారు కదా. సో ఫార్బర్ కూడా ఇండిపెండెంట్ గా ఎల్లప్రగడ సుబ్బారావు గారితో కలిసి రీసెర్చ్ చేసి అమినోప్టన్ అనే మందుని డెవలప్ చేశారు.
(08:47) ఆయన ఇంకో విషయం ఏం గమనించారంటే ఆ అమినోన్ డ్రగ్ మనిషిలో ఇంజెక్ట్ చేస్తే క్యాన్సర్ సెల్స్ చనిపోతున్నాయని అందుకు నవంబర్ 1947 న ఆయన ఆ డ్రగ్ ని 16 లూకేమియాతో చనిపోబోతున్న పిల్లలక ఇచ్చారు. అందులో 10 మందికి నయమైపోయింది. వాళ్ళ క్యాన్సర్ సెల్స్ మాయమైపోయాయి. వాళ్ళన్నీ నార్మల్ గా చేయడం మొదలు పెట్టారు. ఈ రిజల్ట్స్ ని ఫార్బర్ ద న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో పబ్లిష్ చేశారు.
(09:08) మెచ్చుకోవడం మానేసి ఆ టైంలో సీనియర్ డాక్టర్స్ అందరూ ఆ ఫార్బర్ అండ్ ఎల్లప్రగడ సుబ్బారావు గారిని క్రిటిసైజ్ చేశారు. నువ్వు ఒక పెద్ద తప్పు చేశవని చెప్పారు. అలా పిచ్చి పిచ్చి మందులు పిల్లలకి ఇచ్చి టార్చర్ చేస్తున్నావని అన్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కొన్ని నెలల్లోనే అందరి పిల్లలకి ఆ క్యాన్సర్ మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ ఆ అమినోప్టన్ వేస్తే అది పని చేయలేదు.
(09:26) క్యాన్సర్ ఆ మందుని ఎలా ఎదుర్కోవాలో నేర్చేసుకుంది. బేసిక్ గా ఆ డ్రగ్ కి క్యాన్సర్ రెసిస్టెంట్ అయిపోయింది. మళ్ళీ సేమ్ పాటర్న్ రిపీట్ అయింది. కానీ అక్కడ ఫార్మబర్ ఒక్క విషయం మాత్రం ప్రూవ్ చేశారు. ప్రాబ్లం్ ఏంటని ఎగ్జాక్ట్ గా ఆయనకి తెలిసింది. రోగం తిరిగి రావడమే ప్రాబ్లం్ ని ఆయన అర్థం చేసుకున్నారు. సో ఇప్పుడు రోగం అయితే ఆయన నయం చేయగలుగుతున్నారు.
(09:42) కానీ తిరిగి రాకుండా చూసేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. 1971 లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక మనిషిని చంద్రుడిపై పంపింది. యాంటీబయోటిక్స్ ఫుల్ స్వింగ్ లో మానుఫ్యాక్చర్ అవుతున్నాయి. వ్యాక్సిన్స్ వల్ల పోలియో వ్యాధి జనాల్ని ఇంకా బాధించట్లేదు. అమెరికాకి విజ్ఞానంతో అన్ని సాల్వ్ చేసేయొచ్చు అని నమ్మకం వచ్చేసింది. క్యాన్సర్ అనే రోగాన్ని ఎలా అయినా నయం చేయమని ప్రజలు గవర్నమెంట్ ని కోరారు.
(10:02) అప్పట్లో అమెరికాకి రాష్ట్రపతి అయిన రిచర్డ్ నిక్సన్ ని సెలబ్రిటీస్ కూడా మోటివేట్ చేశారు. డిసెంబర్ 23, 1971 న రిచర్డ్ నిక్సన్ నేషనల్ క్యాన్సర్ యాక్ట్ ని సైన్ చేశారు. 1.6 బిలియన్ డాలర్స్ క్యాన్సర్ రీసెర్చ్ కోసం కేటాయించారు. లాజిక్ సింపుల్ మనం మూన్ పైకి వెళ్ళడానికి ఎంత ఎఫర్ట్ పెట్టామో క్యాన్సర్ ని క్యూర్ చేయడానికి కూడా అంతే ఎఫర్ట్ పెట్టాలని ఇలా చేస్తే 10ఏళ్లలోనే మనం ఈ రోగాన్ని అదుపులోకి తెచ్చుకోవచ్చు అని అనుకున్నారు.
(10:25) ప్రపంచ నలుమూల నుండి డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ ఈ రోగానికి మందు కనిపెట్టడానికి ఏకమయ్యారు. ఒక టైంలో కొత్త డ్రగ్స్ టాప టపా రావడం స్టార్ట్ అయ్యాయి. ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. అయినా క్యాన్సర్ తో అంతే మంది జనాలు చనిపోతున్నారు. ఇయర్ బై ఇయర్ ఇంప్రూవ్మెంట్ అయితే రావట్లేదు. స్క్రీన్ పైన ఉన్న చార్ట్ చూడండి.
(10:43) 1970 నుంచి 1990 వరకు క్యాన్సర్ వల్ల డెత్స్ అయితే తగ్గలేదు. చెప్పాలంటే కొంచెం పెరిగాయి. హార్ట్ అటాక్స్ తో ఎంతమంది చనిపోతారో ఆ నెంబర్ తగ్గిన క్యాన్సర్ తో మాత్రం తగ్గట్లేదు. 1980స్ కల్ల రిచర్డ్ నిక్సన్ ని ఒక పెద్ద ఫెయిల్యర్ అని అందరూ అనడం మొదలు పెట్టారు. ఆ ఫెయిల్యర్ కి కారణం మెల్లిగా సైంటిస్ట్ కి అర్థం అవ్వడం మొదలయింది.
(11:00) క్యాన్సర్ అనేది ఒకే రోగం అనుకొని సైంటిస్ట్ క్యూర్ కనపెడుతున్నారు. కానీ అదే వాళ్ళ పెద్ద తప్పు. క్యాన్సర్ గురించి సైంటిస్ట్ అండ్ డాక్టర్స్ అపార్థం చేసుకున్నారు. క్యాన్సర్ అనేది ఒక్క రోగం కాదు అది 200 కన్నా ఎక్కువ రోగాలు బ్రెస్ట్ క్యాన్సర్ మరియు లంగ్ క్యాన్సర్ ఒకటి కాదు లంగ్ క్యాన్సర్ ఇంకా బ్లడ్ క్యాన్సర్ ఒకటి కాదు. బ్లడ్ క్యాన్సర్ అండ్ పాంక్రియాటిక్ క్యాన్సర్ ఒకటి కాదు.
(11:19) ఒకదానికి ఇంకోదానికి ఎంత తేడా ఉందంటే మలేరియాకి డయాబెటీస్ కి ఉన్నంత తేడా అని చెప్పొచ్చు. అన్ని క్యాన్సర్స్ లో ఒక కామన్ ఫీచర్ ఏంటంటే అన్కంట్రోల్డ్ సెల్ గ్రోత్ అండ్ అదే కాకుండా సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ A కి అండ్ పేషెంట్ బి కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందంటే పేషెంట్ A యొక్క క్యాన్సర్ వన్ సెట్ ఆఫ్ జెనెటిక్ మ్యూటేషన్స్ తో వస్తే సేమ్ స్టేజ్ క్యాన్సర్ ఉన్న ఇంకో పేషెంట్ యొక్క స్టార్టింగ్ పాయింట్ పూర్తిగా వేరేగా ఉండొచ్చు.
(11:43) సపోజ్ ఒక డ్రగ్ పేషెంట్ ఏ కి పని చేస్తే పేషెంట్ బి కి పని చేయాలనేది రూల్ ఏం లేదు. క్యాన్సర్ తో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్ ఏమో బ్యాక్టీరియా గాని వైరస్ సెల్స్ అయితే కాదు. అవి మీ సొంత సెల్సే మీ సొంత DNAన్ఏ నే అందులో ఉంటుంది. మీరు తినే ఫుడ్ే ఆ క్యాన్సర్ సెల్స్ కి ఆహారం కూడా మీ బ్లడ్ తోనే అవి సర్వైవ్ అవుతాయి. నార్మల్ సెల్ కి క్యాన్సర్ సెల్ కి తేడా ఎక్కడ వస్తుందంటే క్యాన్సర్ సెల్ లో DNAన్ఏ మ్యూటేషన్ అవుతుంది.
(12:05) అంటే DNAన్ఏ సీక్వెన్స్ మారుతుంది. ఆ మ్యూటేషన్ ఆ సెల్ కి ఏం చెప్తుందంటే నువ్వు కంటిన్యూస్ గా డివైడ్ అవ్వు ఇంకా ఆగక అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తుంది. అందుకు యాంటీబయోటిక్స్ క్యాన్సర్ సెల్స్ పైన పని చేయవు. ఎందుకంటే యాంటీబయోటిక్స్ ఏమో బాడీలో ఎంటర్ అయిన డిఫరెంట్ బ్యాక్టీరియల్ సెల్స్ ని టార్గెట్ చేస్తాయి. కానీ క్యాన్సర్ మీ బాడీలో ఒక భాగమే కదా క్యాన్సర్ సెల్స్ ని చంపాలంటే మీ బాడీ యొక్క సొంత సెల్స్ ని చంపాలి కానీ సెలెక్ట్ చేసుకొని చంపాలి.
(12:28) రీసర్చర్స్ ఈ రోజు వరకు 200 కన్నా ఎక్కువ మేజర్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ని డిటెక్ట్ చేశారు. జెనెటిక్ లెవెల్ లో చూసుకుంటే అది వేలల్లోకి వెళ్ళిపోతుంది. ప్రతి ట్యూమర్ యూనిక్ గా ఉంటుంది. అందుకే నిక్సన్ యొక్క సైంటిస్ట్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. క్యాన్సర్ 200 డిఫరెంట్ టైప్స్ అయితే ఉంది. కానీ క్యాన్సర్ కి ఇంకో ప్రాబ్లం కూడా ఉంది.
(12:45) అది మీ బాడీలోనే రియల్ టైం లో ఎవాల్వ్ అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే కంటిన్యూస్ గా మారుతూనే ఉంటుంది. ఇమాజిన్ చేయండి ఒక మనిషి లంగ్స్ లో ఒక ట్యూమర్ ఉంది అండ్ అందులో మిలియన్స్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి. ఆ మిలియన్ సెల్స్ ఒకేలా ఉండవు. అవి వేరే వేరే సెల్స్ వేరే వేరే టైప్స్ లో ఉంటాయి. కొన్నిటిలో మ్యూటేషన్స్ ఒకలా ఉంటాయి ఇంకొన్నిటిలో ఇంకోలా ఉంటాయి.
(13:02) కొన్ని ఫాస్ట్ గా గ్రో అవుతాయి కొన్ని స్లో గా గ్రో అవుతాయి కొన్ని దాంకుని ఉంటాయి. ఇంకొన్ని ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతాయి. దీన్నే సైంటిస్ట్ ట్యూమర్ హెట్రోజెనిటీ అని అంటారు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి ఒక డాక్టర్ ఒక మనిషికి కీమోథెరపీ ఇస్తున్నారు. ఆ కీమోథెరపీ డ్రగ్ ఏమో క్యాన్సర్ సెల్స్ డిటెక్ట్ చేసి చంపడం మొదలు పెడుతుంది.
(13:17) డాక్టర్ చూసి పర్లేదు కీమోథెరపీ వర్క్ అవుతుంది అంటారు. కానీ ఆ కీమోథెరపీ అన్ని సెల్స్ ని చంపలేదు. కొన్ని మిగిలిపోతాయి. డ్రగ్ కి రెసిస్టెంట్ గా ఉన్న క్యాన్సర్ సెల్స్ బ్రతికి మళ్ళీ డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కొన్ని నెలల్లోనే ట్యూమర్ మళ్ళీ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ గా ఇదే పరిస్థితి చాలా పేషెంట్స్ కి అవుతుంది అండ్ ఇంకా అవుతూనే ఉంది.
(13:35) 1942 లో జేడి అనే వ్యక్తికి కూడా ఇదే జరిగింది. క్యాన్సర్ సెల్స్ డ్రగ్ ని ఎలా రెసిస్ట్ చేయాలో నేర్చుకుంటాయి. బేసిక్ ఎవల్యూషన్ ఇన్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ అనే కాన్సెప్ట్స్ే ఇక్కడ అప్లై అవుతుంది. ఒక సెల్ ప్రతిసారి డివైడ్ అయినప్పుడు ఒక కొత్త మ్యూటేషన్ చేస్తుంది. మళ్ళీ డివైడ్ అయ్యి మళ్ళీ మ్యూటేషన్ చేస్తుంది. సో అలా క్యాన్సర్ సెల్ ని చంపడం చాలా కష్టమైపోతుంది.
(13:52) ఎందుకంటే బేసిక్ గా అది కంటిన్యూస్ గా డివైడ్ అవుతూ వెళ్తుంది. అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉందో మనకుి తెలియట్లేదు. సిడార్ సినాయ అనే ఒక అమెరికన్ మెడికల్ సెంటర్ లో ఒక రీసెర్చర్ ఒక పేషెంట్ లో 2000 డిఫరెంట్ మ్యూటేషన్స్ చూశారు. ఒక్క ట్యూమర్ లోనే చాలా జెనెటిక్ పాటర్న్స్ చూశారు. క్యాన్సర్ అనేది ఒక్క రోగం కాదు. మల్టిపుల్ డిఫరెంట్ డిసీసెస్ ఇన్ వన్ పర్సన్ అది.
(14:09) ప్రతిరోజు మారే రోగం అది. దశాబ్దాల పాటు క్యాన్సర్ కి కేవలం మూడు రకాల ట్రీట్మెంట్స్ ఇచ్చేవారు. సర్జరీ రేడియేషన్ అండ్ ఇంకా కీమోథెరపీ సర్జరీలో అయితే క్యాన్సర్ ని కట్ చేసి తీసేస్తారు. రేడియేషన్ లో అయితే దాన్ని కాల్చేస్తారు. కీమోథెరపీ అయితే బేసికలీ క్యాన్సర్ సెల్స్ కి విషం ఇచ్చేయడం. ఈ మూడు ట్రీట్మెంట్స్ లో ఒక్క విషయం అయితే కామన్.
(14:27) ఈ క్యాన్సర్ సెల్స్ తో పాటు ఈ మూడు ట్రీట్మెంట్స్ హెల్దీ సెల్స్ ని కూడా డిస్ట్రాయ్ చేసేస్తాయి. కీమోథెరపీ అయితే పేషెంట్ యొక్క ఇమ్యూన్ సిస్టం, జుట్టు, గట్ లైనింగ్ అండ్ బోన్ మారో ని కూడా డిస్ట్రాయ్ చేసి పడేస్తుంది. రేడియేషన్ తో ట్యూమర్ అయితే కాలిపోతుంది. కానీ దాని చుట్టూ ఉన్న ఏరియా కూడా కాలిపోతుంది. సైంటిస్ట్ కి తప్పకుండా ఒక బెటర్ ఉపాయం ఉండొచ్చు అని అనిపించింది.
(14:45) 1890స్ లో ఒక చిన్న గ్రూప్ ఆఫ్ రీసర్చర్స్ ఒక కనీ విని ఎరుగని ఐడియా పై పని చేయడం మొదలు పెట్టారు. అలా చేస్తున్నారని చాలా మందికి తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారంటే క్యాన్సర్ సెల్స్ కి విషం ఇవ్వడం బదులు ఆ పేషెంట్ యొక్క ఇమ్యూన్ సిస్టం ని మనం ట్రైన్ చేసి క్యాన్సర్ సెల్స్ ని చంపమని చెప్తే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. మన ఇమ్యూన్ సిస్టం బేసికలీ ప్రతిరోజు అదే చేస్తుంది.
(15:02) డామేజ్డ్ DNA ఉన్న సెల్స్ ని మన ఇమ్యూన్ సిస్టం ప్రతిరోజు కనిపెట్టి డిస్ట్రాయ్ చేస్తుంది. క్యాన్సర్ ఎప్పుడు వస్తుందంటే అంటే కొన్ని డామేజ్డ్ ఉన్న Dఎన్ఏ సెల్స్ మన ఇమ్యూన్ సిస్టం నుంచి తప్పించేసుకుంటాయి. అప్పుడు క్యాన్సర్ అనేది ఫామ్ అవుతుంది. అవి ఇమ్యూన్ సిస్టం కి కూడా దొరకవు. దాక్కుంటాయి. సో ఆ సైంటిస్ట్ యొక్క యాక్చువల్ ఐడియా ఏంటంటే ఆ దాక్కున్న సెల్స్ ని మన ఇమ్యూన్ సిస్టం కి మళ్ళీ చూపిస్తే ఎలా ఉంటుంది? ఒక సెంచురీ పైగా మిగతా సైంటిస్ట్ ఈ ఐడియాని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.
(15:27) ఏ ఫార్మస్యూటికల్ కంపెనీ ఈ ఐడియాకి ఫండింగ్ ఇవ్వలేదు. అప్పుడు ప్రారంభమైన రీసెర్చ్ కి ఎక్కువ ఫండింగ్ దొరకపోవడం వల్ల వాళ్ళకి పెద్దగా ప్రోగ్రెస్ జరగలేదు. 1990స్ లో టక్సస్ అమెరికాలో ఉండే ఒక ఇమ్యూనోలజిస్ట్ జేమ్స్ అలిసన్ ఒక అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు. ఆయన యాక్చువల్ గా క్యాన్సర్ పైన రీసెర్చ్ చేయలేదు. ఆయన అప్పుడు మన ఇమ్యూన్ సెల్స్ పై రీసెర్చ్ చేయడం ప్రారంభించారు.
(15:47) ఆయన ఏం కనిపెట్టారంటే మన ఇమ్యూన్ సెల్స్ లో టీ సెల్స్ అని ఉంటాయి. ఆ టీ సెల్స్ లో ఒక బ్రేక్ ఉంటుంది. అంటే ఆ సెల్స్ యొక్క సర్ఫేస్ పైన ఒక బ్రేక్ లా ఆలోచించండి. ఆ బ్రేక్ పేరుటఎ4 అండ్ అది ఒక ప్రోటీన్. ఈ బ్రేక్ ఆ సెల్ పైన ఎందుకుఉందో నేను క్లియర్ గా చెప్తాను. ఈ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ గా అంటే మన ఇమ్యూన్ సిస్టం హెవీగా అగ్రెసివ్ గా అయ్యి అన్ని సెల్స్ ని చంపకుండా ఈ బ్రేక్ కాపాడుతుంది.
(16:06) ఈ బ్రేక్ గాని లేకపోతే చీటికి మాటికి మన సొంత టిష్యూస్ే మన ఇమ్యూన్ సిస్టం అటాక్ చేసి చంపేస్తుంది. అప్పుడు అలిసన్ కి ఒక సింపుల్ ఐడియా వచ్చింది. ఈ బ్రేక్ ని గాని బ్లాక్ చేస్తే ఏమవుతుందా అని సో ఆయన ఒక మందుని కనిపెట్టారు. మానవ శరీరంలో అది వేసి ఆ ఇమ్యూన్ సిస్టం యొక్క బ్రేక్స్ ని తీసేస్తే ఏం జరుగుతుందా అని ప్రయోగం చేద్దామని నిర్ణయించారు.
(16:25) ఫస్ట్ ఎలుకలపై ఎక్స్పెరిమెంట్ చేశారు. చూస్తే ఎలుకల యొక్క ట్యూమర్స్ తగ్గుతూ వెళ్ళాయి. ఒక పాయింట్ తర్వాత మాయమైపోయాయి అండ్ డిఫరెన్స్ ఏంటంటే మళ్ళీ ఆ ట్యూమర్ తిరిగి రాలేదు. అదే సమయంలో ప్రపంచానికి అటువైపు ఒక జాపనీస్ సైంటిస్ట్ పేరు తసుకు హోంజో అలాంటి సిమిలర్ డిస్కవరీే చేశారు. జేమ్స్ అనే అతను ఇమ్యూన్ సెల్స్ లో ఫస్ట్ బ్రేక్ కనిపెడితే తసుకు హోంజో అదే ఇమ్యూన్ సెల్స్ లో రెండో బ్రేక్ ని కనిపెట్టారు.
(16:47) ఆ రెండో బ్రేక్ పేరుపిడి1 మరియు అది కూడా ఒక రకమైన ప్రోటీనే.ే. ఈ ఆవిష్కరణని ఒక రియల్ ట్రీట్మెంట్ గా మార్చాలంటే చాలా ఏళ్లు పడుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఈ ట్రీట్మెంట్ అసలు పనిచేస్తుందా లేదా అని ఫార్మస్యూటికల్ కంపెనీస్ డౌట్ లో ఉండేవి. క్లినికల్ ట్రయల్స్ కూడా చాలా రిస్కీ అని అందరూ నమ్మేవారు. 2011 లోఎఫ్డిఏమో ఈసిటఎla4 డ్రగ్ ని మెలనోమా అనే క్యాన్సర్ ని ట్రీట్ చేయడానికి అప్రూవ్ చేసింది.
(17:08) అడ్వాన్స్డ్ మెలనోమా అనే క్యాన్సర్ స్ప్రెడ్ అయితే ఆ పేషెంట్స్ సాధారణంగా ఒక్క సంవత్సరం కన్నా తక్కువే బ్రతికేవారు. అడ్వాన్స్డ్ మెలనోమా ఉన్న పేషెంట్స్ ఈ ట్రీట్మెంట్ తో మంత్స్ కాదు ఇయర్స్ కాదు చాలా ఏళ్లు బ్రతుకుతున్నారు. ఆ డ్రగ్ వేసుకుంటే ట్యూమర్స్ మాయమైపోయాయి. సైన్స్ మ్యాగజిన్ ప్రకారం ఈ ఇమ్యూనో థెరపీ బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ గా 2013 లో ప్రకటించింది.
(17:27) 2018 లో జేమ్స్ అలిసన్ మరియు తసుకో హోంజో అనే ఇద్దరు సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ అండ్ మెడిసిన్ అవార్డ్ చేశారు. కానీ ఇమ్యూనోథెరపీ అదే ఈ వైద్యానికి కూడా ఒక డ్రా బ్యాక్ ఉంది. అదేంటంటే కొన్ని క్యాన్సర్స్ కి అది చాలా బాగా పనిచేస్తుంది. లైక్ మెలనోమా సర్టెన్ లంగ్ క్యాన్సర్స్ మరియు కిడ్నీ క్యాన్సర్స్ కానీ ఇంకొన్ని క్యాన్సర్స్ కి అది అస్సలు పని చేయదు.
(17:47) సో మళ్ళీ క్యాన్సర్ యొక్క బేసిక్ ప్రాబ్లం దగ్గర మనం ఆగిపోయాం. ముందు చెప్పినట్టే క్యాన్సర్ ఇస్ నాట్ వన్ డిసీస్. అది 2010 పిల్స్బర్గ్ పెన్సిల్వేనియా యునైటెడ్ స్టేట్స్ ఒక ఐదేళ్ల అమ్మాయి పేరు ఎమైలీ వైట్ హెడ్ కి అక్యూట్ లింఫోలాస్టిక్ లూకేమియా అనే ఒక రోగం డిటెక్ట్ అయింది. ఈ రోగం ఒక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అని చెప్పొచ్చు. ఈ బ్లడ్ క్యాన్సర్ ఎప్పుడు వస్తుందంటే మన బ్లడ్ లోనే కొన్ని సెల్స్ తప్పైన విధంగా గ్రో అవుతాయి.
(18:12) దానితో అవి చాలా ఫాస్ట్ గా మల్టిప్లై అవుతాయి. అది పిల్లల్లో డిటెక్ట్ అయ్యే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్. ఎమైలీ పేరెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ దొరికింది. డాక్టర్స్ ఏమన్నారంటే ఇలాంటి పిల్లలకి 90% నయమైపోతుంది అని చెప్పారు. కీమోథెరపీ చేస్తే సరిపోతుంది అని అన్నారు. ఎమైలీ కి కీమోథెరపీ మొదలయింది. కీమోథెరపీ క్యాన్సర్ సెల్స్ ని కాకుండా నార్మల్ హెల్దీ సెల్స్ ని కూడా డ్ామేజ్ చేస్తుంది.
(18:32) అది మనం ముందే మాట్లాడుకున్నాం. కీమోథెరపీ తర్వాత ఎమైలీ కి చాలా ఒంట్లో బాలేకుండా అయిపోయింది. ఆ పాపకి ఒక డేంజరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అండ్ దాని తర్వాత ఆల్మోస్ట్ తను కాళ్ళు తీసేయవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ఎలాగో బ్రతికి బయటపడింది. ఆ ట్రీట్మెంట్ అయ్యాక తన బాడీలో క్యాన్సర్ సెల్స్ ని ఇంకా ఆ డాక్టర్స్ డిటెక్ట్ చేయలేకపోయారు. డాక్టర్స్ సాధారణంగా ఒకవేళ క్యాన్సర్ ఇలా తగ్గిపోతే ఆ సిచువేషన్ ని రెమిషన్ అని అంటారు.
(18:55) రెమిషన్ అంటే క్యాన్సర్ సెల్స్ ఎంత చిన్నగా అయిపోయాయి అంటే డాక్టర్స్ ఇంకా దాన్ని డిటెక్ట్ చేయలేరు. ఎమైలీ యొక్క పేరెంట్స్ అమ్మయ్య అని అనుకున్నారు. కానీ 16 నెలల తర్వాత ఆ క్యాన్సర్ మళ్ళీ తిరిగివచ్చింది. దీన్ని మెడికల్ భాషలో రిలాప్స్ అంటారు. రిలాప్స్ అంటే క్యాన్సర్ వెళ్ళిపోవడం మరియు మళ్ళీ రావడం. ఈసారి డాక్టర్స్ ఏమన్నారంటే ఎమైలీ యొక్క క్యాన్సర్ ట్రీట్ చేయడం చాలా కష్టం అని చెప్పారు.
(19:15) ముందు పనిచేసిన కీమోథెరపీ ఇప్పుడు ఎమైలీ పైన పని చేయట్లేదు. ఎమైలీ కి జస్టిస్ ఇన్ కేస్ కీమోథెరపీ మళ్ళీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కానీ ఏం ఉపయోగం లేకపోయింది. డాక్టర్స్ జింకా చేతులుఎత్తేశారు. ఎమైలీని ఇంటికి తీసుకొని వెళ్లి ఎంత టైం తనకి మిగిలిందో అంత టైం బాగా గడపండి అని డాక్టర్స్ ఆ పేరెంట్స్ కి చెప్పి పంపించారు. బేసికలీ ఎమైలీ ఇంకా ఎక్కువ రోజులు బ్రతకలేదు అని డాక్టర్స్ చెప్పారు.
(19:36) కానీ ఆమె తల్లిదండ్రులు ఓటమి ఒప్పుకోలేదు. ఏదైనా కొత్త టెక్నాలజీ ఉందా అని వెతకడం మొదలు పెట్టారు. వాళ్ళక అప్పుడు చిల్డ్రెన్స్ హాస్పిటల్ లో ఫిలడాఫియా దొరికింది. అక్కడ ఒక క్యాన్సర్ రీసర్చర్ పేరు కార్ల్ జూన్. తన టీం్ తో కంప్లీట్లీ ఒక కొత్త ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్ పైన వర్క్ చేస్తున్నారు. ఆ ట్రీట్మెంట్ ఏమో అడల్ట్స్ పైన టెస్ట్ చేశారు కానీ ఇంతవరకు పిల్లల పైన అయితే టెస్ట్ చేయలేదు.
(19:55) ఆ ట్రీట్మెంట్ పేరుఏఆర్ టి సెల్ థెరపీ కార్ టి అంటే చైమరిక్ యాంటిజన్ రిసెప్టర్ టి సెల్ థెరపీ. ఈ పేరు కాంప్లికేటెడ్ గా ఉన్న మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బాడీలో ప్రత్యేకమైన ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. వాటి పేరు టీ సెల్స్. ఆ టీ సెల్స్ ని చిన్న చిన్న సోల్జర్స్ లా మీరు అనుకోవచ్చు. ఆ టీ సెల్స్ యొక్క పని ఏంటంటే డేంజరస్ వైరసెస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ మరియు బ్యాక్టీరియాని డిస్ట్రాయ్ చేయడం కానీ క్యాన్సర్ సెల్స్ ఏమో చాలా తెలివైనవి.
(20:18) ఒక్కొక్కసారి ఆ టీ సెల్స్ క్యాన్సర్ సెల్స్ ప్రమాదకరమా కాదా అని గుర్తించలేవు. సో డాక్టర్స్ కి ఒక ఐడియా వచ్చింది. ఆ డాక్టర్స్ ఆ పేషెంట్ యొక్క టీ సెల్స్ ని తన బాడీలో నుంచి ఫస్ట్ తీశారు. ఆ టీ సెల్స్ ని లాబరేటరీ లో పెట్టి జెనటికలీ మోడిఫై చేశారు. జెనటిక్ మోడిఫికేషన్ ఉంటే ఆ సెల్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని చేంజ్ చేయడం. ఆ టీ సెల్స్ కి ఆ సైంటిస్ట్ ఒక కొత్త విషయాన్ని అతికిస్తారు.
(20:40) దాని పేరే చైమరిక్ యాంటిజెన్ రిసెప్టర్ ఆర్సిఏఆర్. బేసిక్ గా మీరు ఇలా ఇమాజిన్ చేసుకోండి.సిఏఆర్ అంటే టీ సెల్ కి ఒక కల్జోడు తగిలించినట్టు. ఆ సెల్ కి ఒక్కసారి ఆ కల్జోడు తగిలిస్తే ఆ టీ సెల్ ఏమో క్యాన్సర్ సెల్ ని ఈజీగా చూడగలదు. అలా చేసిన తర్వాత ఆ సైంటిస్ట్ ఆ టీ సెల్స్ ని మిలియన్స్ ఆఫ్ టీ సెల్స్ గా ల్యాబ్ లో గ్రో చేస్తారు.
(20:59) ఆ మిలియన్స్ ఆఫ్ టీ సెల్స్ ని మళ్ళీ ఆ పేషెంట్ బాడీలోకి ఎక్కించేస్తారు. దాని తర్వాత ఆ టీ సెల్స్ ఒక కొత్త మిషన్ లోకి దిగుతాయి. దాని తర్వాత వాటి పని ఒక్కటే క్యాన్సర్ సెల్స్ ని వెతకడం అటాక్ చేయడం మరియు డెస్ట్రాయ్ చేయడం. సో ఈ థెరపీ ప్రకారం మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టం సెల్స్ ని మనం యాక్టివేట్ చేసి క్యాన్సర్ సెల్స్ కి అగైన్స్ట్ గా చేస్తున్నాం.
(21:17) కానీ ఈ ట్రీట్మెంట్ జరిగిన వెంటనే ఒక భయంకరమైన విషయం జరుగుతుంది. ఆ టీ సెల్స్ ఎమైలీ యొక్క క్యాన్సర్ ని అయితే అటాక్ చేయడం ప్రారంభిస్తాయి. కానీ సమస్య ఏంటంటే అవి చాలా అగ్రెసివ్ అయిపోతాయి. అవి అలా అటాక్ చేస్తూ సైటోకైన్స్ అనే కెమికల్ సిగ్నల్స్ ని బాడీలో రిలీజ్ చేస్తూ ఉంటాయి. అలా రిలీజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ వస్తుంది.
(21:34) బేసిక్ గా ఈ ట్రీట్మెంట్ అప్పుడు సైటోకైన్స్ బాడీలో ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అలా రిలీజ్ అయినప్పుడు మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టం చాలా హైపర్ యక్టివ్ అయిపోతుంది. ఎమైలీ కి విపరీతమైన జ్వరం వచ్చేసింది. బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువయపోయింది. శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టమైపోయింది. ఎమైలీ ని ఒక ఐసయు లో పెట్టారు. వెంటిలేటర్ మీద ఉంచారు. చాలా రోజుల వరకు ఎమైలీ కోలుకోలేదు.
(21:52) ఇలా జరుగుతుందని డాక్టర్స్ కళలో కూడా ఊహించలేదు. కానీ దాని తర్వాత ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఎమైలీ ని బేసిక్ గా డాక్టర్స్ ఒక కోమా స్టేట్ కి తీసుకొని వెళ్ళారు. దాన్ని మెడికలీ ఇండ్యూస్డ్ కోమా అని అంటారు. ఒక పేషెంట్ ని అలా మెడికలీ ఇండ్యూస్డ్ కోమాలో పెడితే వాళ్ళకి ప్రాపర్ గా రెస్ట్ దొరుకుతుంది. అండ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ కూడా బాగా ఇవ్వగలరు.
(22:11) కొద్ది రోజుల తర్వాత ఆమెని ఆ కోమాలో నుంచి లేపారు. అలా కోమా నుంచి లేచిన తర్వాత ఎమైలీ యొక్క బ్లడ్ మరియు బోన్ మారో ని మళ్ళీ టెస్ట్ చేశారు. లూకేమియా క్యాన్సర్ సెల్స్ కోసం డాక్టర్స్ చూశారు. కానీ వాళ్ళకి ఏమీ కనిపించలేదు. క్యాన్సర్ మాయమైపోయింది. ఎమైలీకి కంప్లీట్ రెమిషన్ దొరికింది. కంప్లీట్ రెమిషన్ అంటే డాక్టర్స్ ఇంకా ఎలాంటి క్యాన్సర్ సైన్స్ ఆ బాడీలో చూడలేదు.
(22:31) ఎమైలీ వైట్ హార్ట్ బ్రతికింది. ఆమె ఈరోజు కూడా బ్రతికే ఉంది. ఆ కాలంలో ఉన్న డాక్టర్స్ ఎమైలీ చనిపోతుంది అని చెప్పిన ఆ కొత్త రకమైన ట్రీట్మెంట్ ఆమెని కాపాడింది. ఎమైలీ యొక్క కథ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా మారుతుందో అని మనకి తెలియజేస్తుంది. కొత్త క్యాన్సర్ ట్రీట్మెంట్స్ క్యాన్సర్ సెల్స్ ని మాత్రమే అటాక్ చేయడానికి డిజైన్ చేస్తున్నారు.
(22:48) దాన్నే మనం ప్రిసిషన్ ఆంకాలజీ అని కూడా అంటూ ఉంటాం. ఈరోజు dఎన్ఏ టెస్ట్ చేసి ఎగజాక్ట్ గా ఎక్కడ మ్యూటేషన్ జరగడం వల్ల క్యాన్సర్ వచ్చిందో అని తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి టార్గెటెడ్ మెడిసిన్స్ వాడొచ్చు. ఎమైలీ ని సేవ్ చేసిన కార్ టీ థెరపీ కూడా ఒక ప్రెసిషన్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఇలాంటి ట్రీట్మెంట్స్ చాలా కాస్ట్లీ అండ్ ఇండియాలో కొన్ని స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ లోనే ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి.
(23:08) లైక్ Tata మెమోరియల్ హాస్పిటల్ ఇన్ ముంబై. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఇప్పుడు చాలా పనిచేస్తుంది. ప్రతి పేషెంట్ కి ఎగజాక్ట్ గా ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాల అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కానీ వస్తే మనం ఎలాంటి క్యాన్సర్ నైనా నయం చేయొచ్చని చాలా మంది సైంటిస్ట్ నమ్ముతున్నారు.
(23:25) ఎలాంటి క్యాన్సర్ కైనా ఒక పర్మనెంట్ సొల్యూషన్ రావాలి అది మన జనరేషన్ లోనే రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేనండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిండ్ కామెంట్ లో ఉంటుంది. మీ అభిప్రాయం క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ పైన ఏంటా అని కామెంట్ చేసి చెప్పండి.
(23:43) మీలో ఎవరైనా ఆంకాలజిస్ట్ అయితే లేటెస్ట్ క్యాన్సర్ రీసెర్చ్ లో డెవలప్మెంట్స్ ఏమవుతున్నాయో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు జై హింద్.
No comments:
Post a Comment