Neem Karoli Baba కథలు - జీవితాన్ని మార్చిన ఒక్క మాట
Author Name:Telugu Geeks
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguGeeks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=yNgCERtBU_g
Transcript:
(00:02) ఆ గంగా నది ఒడ్డున కూర్చున్న అమెరికా నుంచి వచ్చిన పాల్ మనసులో ఒక భయంకరమైన తుఫాన్ నడుస్తుంది. కొన్ని నెలల క్రితం అతను అమెరికాలో ఒక సాధారణ స్టూడెంట్ కానీ ఒక ఊహించని రోజు అతనికి తెలిసింది ఏంటంటే తను ప్రాణంగా భావించే అమ్మా నాన్నలు తన సొంత పేరెంట్స్ కారు పుట్టిన వెంటనే తన బయోలాజికల్ పేరెంట్స్ పాల్ ని ఎవరికో దత్తత ఇచ్చేసి వదిలేసుకున్నారు.
(00:24) ఆ ఒక్క విషయం పాల్ ని లోపల నుంచి పిండేస్తుంది. ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరు లేరా నన్ను కన్నవాళ్లే నన్ను వద్దనుకున్నప్పుడు నన్ను ఎవరు ప్రేమిస్తారు అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ప్రేమ లేదు అర్థం చేసుకునే మనిషి లేడు లైఫ్ లో క్లారిటీ అసలే లేదు. ఆ బాధ తట్టుకోలేక కాలేజీ నుంచి డ్రాప్ అవుట్ కూడా అయిపోయాడు.
(00:46) రాత్రంతా నిద్ర పట్టేది కాదు ఆలోచనల్లో పడిపోయి ఉండేవాడు. చివరికి తన లోపల ఉన్న ఈ క్వశ్చన్స్ కి సమాధానం దొరుకుతుందన్న ఆఖరి ఆశతో జేబులో ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఇండియాకి వచ్చాడు. కానీ ఇక్కడ హరిద్వార్ చేరుకున్న తర్వాత ఒక సాధువు ద్వారా అతనికి తెలిసిన విషయం ఏంటంటే హరిద్వార్ నుండి 300 కిలోమీటర్ల దూరంలో హిమాలయాల లోయల్లో నివసించే ఆ అద్భుతమైన యోగి మాటలు లేకుండానే మనుషుల బాధని తుడిచిపెట్టే నీం కరోలిీ బాబా తన శరీరాన్ని శాశ్వతంగా విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నారు.
(01:16) ఆయన మహా సమాధిలోకి వెళ్ళడానికి ఇంకా కేవలం 48 గంటలు మాత్రమే మిగిలింది. ఆ మాట వినగానే మన అమెరికా నుంచి వచ్చిన పాల్ కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. చేతిలో డబ్బులు లేవు ఆ కొండ దారిలో వెళ్ళడానికి ఆ టైంలో బస్సులు దొరకడం కూడా చాలా కష్టం చుట్టూ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం కూడా గట్టిగా ఉంది. అయినా సరే పాల్ ఆగడానికి వీలు లేదు ఎందుకంటే అతను అమెరికా నుంచి వచ్చాడు అండ్ ఆ సాధువుతో ఈ విషయం తేల్చుకోకుండా వెళ్లే ప్రసక్తే లేదని అతను ఫిక్స్ అయిపోయాడు.
(01:41) నా జీవితానికి అసలైన అర్థం ఏంటి నన్ను నేను ఎలా నిరూపించుకోవాలి నా లోపల ఉన్న ఈ అంతులేని ఏకాంతాన్ని ఎలా పోగొట్టుకోవాలి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగల ఏకైక వ్యక్తి శాశ్వతంగా కనుమరుగైపోతున్నాడు అన్న బాధ పాల్ ని ఇంకా ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. ఇప్పుడు పాల్ ముందుంది ఒకే ఒక లక్ష్యం సమయంతో పరుగు తీసి ఆ రెండు రోజుల్లోగా ఆ బాబా కళ్ళు మూసేలోపు ఎలాగైనా కేంజీ లోయల్లోకి వెళ్ళాలి.
(02:07) హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈ స్టోరీ నీమ్ కరోలిీ బాబా గురించి నేను చదివిన కొన్ని పుస్తకాల్లో నుంచి తీసుకున్న కథల్ని అలాగే ఒక ఫిక్షన్ స్టోరీతో జత చేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. పాల్ చేతిలో ఉన్న ఆ లీగల్ కాగితాలు అతని ప్రపంచాన్ని తలకిందులు చేసేసాయి. అప్పటివరకు తను ప్రాణంగా నమ్ముకున్న తన తల్లిదండ్రులు తనని కనలేదు.
(02:31) పుట్టిన వెంటనే అతన్ని ఎవరో ఒక సాధారణ కుటుంబానికి దత్తత ఇచ్చేసారనే విషయాన్ని పాల్ తెలుసుకున్నాడు. నన్ను కన్నవాళ్లే నన్ను భారంగా భావించి వదిలేసుకున్నప్పుడు నా అస్తిత్వానికి అర్థం ఏంటి నన్ను ఎవరు నిజంగా ప్రేమిస్తారు నేను ఎవరి కోసం జీవించాలి అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఈ చేదు నిజం తెలిసినప్పటి నుండి పాల్ లోపల తీవ్రమైన ఒక ఎంటీనెస్ మొదలైంది.
(02:54) కాలేజీ క్లాసులు అర్థమయ్యేవి కాదు తన చదువు మీద అతనికి ఆసక్తి పోయింది. ఈ కాలేజీ ఈ ఎడ్యుకేషన్ మన వల్ల కాదని చెప్పేసి డ్రాప్ అవుట్ అయిపోయాడు. ఫ్రెండ్స్ కి దూరం అయిపోయాడు. రాత్రంతా నిద్ర లేకుండా పిచ్చి ఆలోచనలతో గడిపేవాడు. ఆ సమయంలోనే క్యాంపస్ లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి వచ్చాడు. అతని అసలు పేరు డాక్టర్ రిచర్డ్ ఆల్బెట్ హార్వర్డ్ యూనివర్సిటీలో మైండ్ పై మానసిక సమస్యలపై పరిశోధనలు చేసిన ఒక ప్రపంచ ప్రఖ్యాత సైకాలజీ ప్రొఫెసర్ కానీ అతను ఎప్పుడైతే ఇండియాకి వెళ్లి హిమాలయాల్లో నీమ్ కరోలీ బాబాని కలిశాడో అతని ఆలోచనలు అతని జీవితం పూర్తిగా మారిపోయాయి. తనకున్న
(03:26) పేరు ఆ లేబుల్స్ అన్నీ వదిలేసి బాబా పెట్టిన రామదాస్ అనే పేరుతో ఒక సన్యాసిలా మారిపోయాడు. కాలేజీ హాల్ లో రామదాస్ మాట్లాడుతుంటే పాల్ ఒక మూల కుర్చిని వింటున్నాడు. సెషన్ ముగిసిన తర్వాత అందరూ వెళ్ళిపోయాక పాల్ నెమ్మదిగా రామదాస్ దగ్గరికి వెళ్ళాడు. వనుకుతున్న గొంతుతో తన గోడు వెళ్ళబోసుకున్నాడు మిస్టర్ రిచర్డ్ నన్ను కన్నవాళ్లే నన్ను వద్దనుకున్నారు.
(03:47) నాకు ఎవరి మీద నమ్మకం లేదు లోపల ఒక విపరీతమైన కోపం నిస్సహాయత ఉన్నాయి. నన్ను ఎవరు ప్రేమించట్లేదనే ఆలోచన నన్ను చంపేస్తుంది. నా జీవితానికి అసలు అర్థం ఉందా అని అడిగాడు పాల్. రామదాస్ పాల్ కళ్ళల్లోకి చూసి నెమ్మదిగా నవ్వాడు పాల్ నువ్వు ఎవరైతే నిన్ను ప్రేమించలేదని బాధపడుతున్నావో వాళ్ళ ఆలోచనలనే నీ మనసులో మోస్తూ నిన్ను నువ్వు బంధించుకుంటున్నావ్.
(04:11) నీకు ఈ పరిస్థితి నుంచి బయటపడే ఒక కథ చెప్తాను విను ఇది నేను స్వయంగా నా గురువైన నీమ కరోలి బాబా సమక్షంలో చూసిన సంఘటన. [సంగీతం] బాబా దగ్గరికి లక్నోకి చెందిన రవి ప్రకాష్ పాండే అని ఒక వ్యక్తి వచ్చాడు. అతను ప్రభుత్వ ఉద్యోగి అతను బయట ప్రపంచాన్ని మనుషుల్ని అసలు నమ్మేవాడు కాదు బాబాని చూడటానికి వెళ్ళినప్పుడు కూడా అతని మనసంతా కొన్ని డౌట్స్ అపనమ్మకం ఒంటరితనం ఇవన్నీ ఉన్నాయి.
(04:40) అతను మనసులోనే అనుకున్నాడు ఈయన నిజమైన సాధువ అయితే నన్ను పిలిపించాలి లేదా నా ఇంటికి వచ్చి నాకు దర్శనం ఇవ్వాలి అప్పటివరకు నేను ఈయన్ని నమ్మను అని అనుకని వెళ్ళిపోయాడు. అతని మనసులోని కోపాన్ని ఆ శరతులని బాబా అప్పుడే గ్రహించారు. బాబా అతని ఇంటికి స్వయంగా వెళ్ళారు. కానీ బాబా అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతని వైపు చూడను కూడా చూడలేదు అలా ఆయన ఇంటికి వెళ్ళాడు బయటికి వచ్చేసాడు అంతే ఆ సంఘటనతో ఆ వ్యక్తి మనసులో అశాంతి ఇంకా పెరిగిపోయింది.
(05:06) తను పెట్టుకున్న శరతులన్నీ నెరవేరిన అతని లోపల ఉన్న ఆ గందరగోళం తగ్గలేదు. నేను అనుకున్నట్టే బాబాయ ఇంటికి వచ్చాడు కానీ బాబా ఎందుకు నన్ను అలా చూశడు కానీ బాబా ఎందుకు నన్ను ప్రేమగా చూడలేదు అనే ఆలోచనలో మునిగిపోయాడు ఎందుకంటే అతని మనసులో ఎప్పుడు ఎదుటి వాళ్ళని పరీక్షించాలనే స్వార్థం వేరే వాళ్ళ మీద అపనమ్మకమే ఉన్నాయి. ఎనిమిదేళ్ల పాటు అతను ఆ మానసిక సంఘర్షణతో నలిగిపోయాడు.
(05:28) ఎనిమిదఏళ్ల తర్వాత అలహాబాద్లో బాబా మళ్ళీ అతనికి కనిపించారు. ఈసారి బాబా అతన్ని చూసి కోప్పడలేదు నెమ్మదిగా అతని చేయి పట్టుకొని పక్కకు తీసుకువెళ్లి తులసీదాసు రాసిన ఆ రామాయణ పద్యాన్ని గొంతు విప్పి పాడారు. బాబా అతనితో స్పష్టంగా చెప్పారు ఈ సృష్టిని గాని భగవంతుని గానీ కేవలం స్వచ్ఛమైన ప్రేమతో మాత్రమే చేరుకోగలవు. బయట పరిస్థితుల మీద కోపంతో సందేహాలతో నువ్వు ఎవరిని గెలవలేవు బయట ప్రపంచం నీ ప్రేమను గుర్తించకపోయినా నీ హృదయంలో ప్రేమను మాత్రమే నింపుకో బాబా పట్టుకున్న ఆ చేతి స్పర్శతో ఆ క్షణంలోనే అతని లోపల ఉన్న ఎనిమిదేళ్ల ఆ డౌట్స్ ఆ కోపం ఆ
(06:10) ఒంటరితనం మంచులా కలిగిపోయాయి. రామదాస్ పాల్ భుజంపై చెయి వేసి అన్నాడు పాల్ నిన్ను కన్నవాళ్ళు నిన్ను వదిలేశారన్న కోపం నీలో ఉంది కానీ నువ్వు పరిస్థితుల్ని ఎదుటి మనుషుల్ని ద్వేషిస్తూ ఉంటే నీకు సమాధానం దొరకదు. ప్రేమను బయట వెతకడం మానేసి నీ లోపల ఉన్న చేదు ఆలోచనల్ని వదిలించుకో నీ ప్రశ్నలకి అసలైన పరిష్కారం ఆ హిమాలయ లోయల్లో ఉన్న నీమ కరోలి బాబా దగ్గరే ఉంటుంది.
(06:36) కుదిరితే అక్కడికి ఒకసారి వెళ్ళు అని చెప్పి రామదాస్ వెళ్ళిపోయారు. ఆ రాత్రి పాల్ కి నిద్రపడట్లేదు. రామదాస్ చెప్పిన ఆ కథ అలాగే రామహి కేవల ప్రేమ పియరా అనే మాటలు పాల్ గుండెలో రింగ్ అవుతూనే ఉన్నాయి. తన లోపల ఉన్న ఎన్నో సమాధానాలు వెతుక్కోవడానికి పాల్ తన దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి జేబులో మిగిలిన కొద్దిపాటి డాలర్లతో ఇండియాకి బయలుదేరాడు. ఈ కథ ముందుకు వెళ్ళే కొద్ది చాలా బాగుంటుంది అండ్ ఎండింగ్ ట్విస్ట్ అస్సలు మిస్ అవ్వకండి.
(07:03) కానీ ఈ కథలో పాల్ లాగా మనందరికీ కూడా లైఫ్ లో ఏదో ఒక నెగిటివ్ థింకింగ్ అనేది గట్టిగా ఉంటుంది. నేను బేరం ఆడలేను నేను అతిగా ఆలోచిస్తాను నేను గట్టిగా మాట్లాడలేను ఇలాంటి నెగిటివ్ థింకింగ్ ని సబ్కాన్షియస్ మైండ్ పవర్ తో పాజిటివ్ థింకింగ్ గా ఎలా మార్చాలో నేను తెలుగు గీక్స్ అకాడమీలో అన్లాక్ యువర్ సబ్కాన్షియస్ పవర్ అని ఒక కోర్స్ ద్వారా డిస్కస్ చేశాను.
(07:24) ఇందులో పాజిటివ్ థింకింగ్ ని ఏదో మ్యాజిక్ లో కాదు ప్రాక్టికల్ గా ఎలా చేయొచ్చో సూపర్ క్లారిటీతో కోర్స్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశను. ప్రస్తుతం త్రీ మాడ్యూల్స్ అయిపోయాయి ఫైనల్ మాడ్యూల్ లో ఉంది. ఇవన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్ అండ్ వర్క్ షీట్స్ ఉంటాయి లైఫ్ లో ఎప్పుడైనా సరే తిరిగి చూసుకుంటా ఉండొచ్చు. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తెలుగు గీక్స్ అకాడమీలో అన్లాక్ యువర్ సబ్కాన్షియస్ పవర్ దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిండు కామెంట్ లో ఉంటుంది.
(07:46) బ్యాక్ టు ద స్టోరీ విమానం 30వేల అడుగుల ఎత్తులో మేఘాల మధ్యలో దూసుకుపోతుంది. చుట్టూ ఉన్న ప్రయాణికులంతా నిద్రపోతున్నారు. కానీ పాల్ కళ్ళలో ఏమాత్రం నిద్రలేదు. తన లైఫ్ ని తలకిందలు చేసిన ఆ చేదు నిజం ఇంకా అతని మెదడిని తొలిచేస్తూనే ఉంది. దానికి తోడు అతను కాలేజ్ డ్రాప్ అవుట్ అయిపోయాడు. జీవితంలో ఏం చేయాలో క్లారిటీ లేదు చాలా పెద్ద తప్పు చేస్తున్నా అనే డౌట్ లో ఉన్నాడు.
(08:08) ఆ క్షణంలో అతనికి నిద్ర పట్టట్లేదు చేతిలో రామదాస్ ఇచ్చిన ఆ పాత అన్పబ్లిష్డ్ మాన్యు స్క్రిప్ట్ ఒకటి ఉందో దాన్ని తీశడు. దాని మొదటి పేజీ తెరిచాడు. అందులో ఒక విదేశీ భక్తుడు నీమ్ కరోలి బాబా సమక్షంలో తనకు ఎదురైన ఒక నిజమైన అనుభవాన్ని రాసి ఉంచాడు. పాల్ ఆ పేజీల్ని క్యూరియస్ గా చదవడం మొదలు పెట్టాడు. బాబా దగ్గరికి కెనడాకి చెందిన ఒక విదేశీ భక్తుడు వచ్చాడు.
(08:34) మొదటి చూపులోనే బాబా అతన్ని చాలా ఆప్యాయంగా దగ్గరకి తీసుకున్నాడు. ఎలాంటి శరతులు లేకుండా ఎలాంటి నిబంధనలు పెట్టకుండా ఒక కన్న తండ్రిలా అతనికి ప్రేమను పంచడం మొదలు పెట్టాడు. బాబా దగ్గర ఉన్నప్పుడు అతనికి సమయమే తెలిసేది కాదు. కానీ ఆ యువకుడికి లోపల ఒక నమ్మకం ఉండేది. నా ఫ్యామిలీ బాగా డబ్బు ఉన్న ఫ్యామిలీ మా ఫాదర్ చాలా రిచ్. కెనడాలో ఉన్న నా సొంత తండ్రి నాకేం కావాలంటే అది ఇచ్చేస్తాడు.
(08:55) నాకేమైనా కష్టం వస్తే ఆదుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అని అనుకుంటూ ఉండేవాడు. తన సొంత తండ్రి మీద అతనికి విపరీతమైన నమ్మకం ఉండేది. కొన్నాళ్ళకి ఆ యువకుడి దగ్గర ఉన్న డాలర్లుఅన్నీ అయిపోయాయి. జేబు పూర్తిగా ఖాళీ అయిపోయింది. సరిగ్గా అప్పుడు బాబా అతన్ని దగ్గరికి పిలిచారు. బాబా నవ్వుతూ నీ దగ్గర డబ్బులు లేవు కదా కెనడాలో ఉన్న మీ నాన్నకి ఒక లెటర్ రాయ్ కొన్ని డబ్బులు పంపించమని అడుగు అని అన్నారు.
(09:19) ఆ యువకుడు ఎంతో నమ్మకంతో తన తండ్రికి ఒక లెటర్ రాసి పోస్ట్ చేశాడు. వారం రోజులు గడిచాయి రెండు వారాలు గడిచాయి నెల రోజులు గడిచిపోయింది. అవతల నుంచి ఒక పైసా రాలేదు కనీసం తన లెటర్ కి రిప్లై కూడా రాలేదు. అతను నమ్ముకున్న అతని సొంత తండ్రే అతన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేసాడు. ఆ కుర్రాడి గుండె పగిలిపోయింది.
(09:38) అప్పుడు అతను అన్నాడు నాకు జన్మనిచ్చిన నా తండ్రే నన్ను కష్టాల్లో వదిలేసాడు అని అనుకుంటూ కన్నీళ్ళతో కుమిలిపోయాడు. రోజు బాబా అతని దగ్గరికి వచ్చి మీ నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా అని అడిగేవారు. ప్రతిసారి అతను తల దించుకొని రాలేదు బాబా అని ఏడుస్తూ చెప్పేవాడు. చివరికి ఒకరోజు ఆ కుర్రోడు నిస్సహాయంగా బాబా తన చెక్కబల్ల మీద కూర్చున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు కారుతూ మా నాన్న నన్ను మర్చిపోయాడు బాబా నాకంటూ ఎవరూ లేరు అని బాబా పాదాలపై పడిపోయాడు.
(10:03) అప్పుడు బాబా ఆ చెక్కబల్లపై నుండి మెల్లగా ముందుకు వంగారు. ఎంతో గాఢమైన ప్రేమతో ఆ విదేశీ కుర్రాడు తలమీద ముద్దు పెట్టుకున్నాడు. ఆయన గొంతు ఎంతో గంభీరంగా అంతకంటే ఎంతో కరుణతో ప్రేమతో పలికింది. ఐ యామ యువర్ ట్రూ ఫాదర్ నేనే నీ నిజమైన తండ్రిని ఈ ప్రపంచంలో రక్త సంబంధాలు సమాజం పెట్టిన పేర్లు కేవలం భౌతికమైనవి మాత్రమే నీ అవసరాలు తీరగానే లేదా పరిస్థితులు మారగానే ఆ మనుషులు మారిపోవచ్చు కానీ నీ ఆత్మను ప్రేమించే సృష్టికర్త నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టడు.
(10:37) సో బయట బంధాల కోసం ఏడవకు నిజమైన ఆధారం ఎప్పుడూ నీతోనే ఉంది. ఆ ఒక్క మాటతో ఆ కుర్రాడి కన్నీళ్లు ఆగిపోయాయి. లోపల ఉన్న అనాధ భావం ఒక్క క్షణంలో మాయమైపోయింది. అండ్ ఈ కథ చదువుతున్న విమానంలో పాల్ చేతులు ఒక్కసారిగా వనికిపోయాయి. ఆ కాగితంపై ఆ పుస్తకంపై కన్నీటి చుక్కబడింది. పాల్ గుండె లోపల ఏదో పెద్ద బండరై కదిలినట్టయింది.
(11:00) అంటే నన్ను కన్నవాళ్ళు నన్ను వదిలేశరని నేను ఇన్నాళ్ళు ఏడుస్తున్నాను. కానీ నన్ను దత్తత తీసుకున్న మా అమ్మ నాన్నలు నన్ను ఎంతో ప్రాణంగా పెంచారు. నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు నా పక్కనే ఉంటే నేను వదిలేసిన వాళ్ళని తలుచుకుంటూ ఇంత బాధ ఎందుకు పడుతున్నాను అని ఆలోచించడం మొదలు పెట్టాడు. పాల్ కు లైఫ్ లో మొదటిసారి ఒక చిన్న క్లారిటీ రావడం మొదలైంది.
(11:21) బాబా ఇచ్చే ఆ సమాధానం ఎంత శక్తివంతమైనదో అతనికి అర్థమైంది. విమానం చక్రాలు ఢిల్లీ రన్వేని తాకాయి. పాల్ ఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. ప్లాట్ఫామ్ మీదగా హరిద్వార్ వెళ్లే రైల్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. పాల్ ఎలాగైనా ఆ రైలు ఎక్కాలని ఆరాటబడుతున్నాడు. అమెరికా నుంచి ఢిల్లీకి రాగానే తన మనసులోని గందరగోళానికి సమాధానం వెతుక్కోవడానికి అతను ఎంచుకున్న ఏకైక గమ్యం హిమాలయాల్లోని నీమ కరోలి బాబా ఆశ్రమం కానీ ఆ భోగీలో కనీసం కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు.
(11:50) లోపల ఉన్న జనం పాల్ ని నిర్దాక్షణంగా ఎవడు ఈ తెల్లోడు అని చెప్పేసి బయటికి నెట్టేశారు. అతని చేతిలో ఉన్న టికెట్ ప్లాట్ఫామ్ నేల మీద పడిపోయింది. అప్పటికీ లోపల చిరాకులో ఉన్న పాల్ ఒక్కసారిగా పిచ్చి కోపం వచ్చేసింది. పళ్ళు కొరుకుతూ చేతులు బిగించి రేలు భోగీల్ని బాధడం మొదలు పెట్టాడు. నేను ఈ బండి ఎక్కాలి మీకు అర్థం కావట్లేదా నేను హిమాలయాలకి వెళ్ళాలి ఆ బాబాని కలవాలి నన్ను ఎవరు ఆపలేరుని పిచ్చివాళ్ళలాగా అరుస్తున్నాడు.
(12:14) అతని అరుపులు విపరీతమైన ఆవేశాన్ని చూసి పక్కనే గ్రీన్ ఫ్లాగ్ పట్టుకొని నిలబడ్డ ఒక వృద్ధ స్టేషన్ మాస్టర్ నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చాడు. ఆ అధికారి పాల్ భుజంపై చెయి వేసి శాంతంగా అన్నాడు బాబు ఆగు ఎందుకు అంత ఆవేశం ఈ రైలు పట్టాలు ఆ కాలచక్రాన్ని నీ అహంకారంతో ఆపలేవు. నువ్వు ఎంత బలవంతంగా పరిస్థితులు నెట్టాలని చూస్తే అవి నీకు అంతగా ఎదురు తిరుగుతాయి.
(12:37) ఈ ట్రైన్ కాకపోతే ఇంకొక ట్రైన్ హరిద్వార్కి వెళ్ళేది ఉంటాయి. కానీ ఎందుకు ఈ ఆవేశం హిమాలయాలకి ఎందుకు అంత అర్జెంట్ గా వెళ్ళాలిని అడిగాడు. అప్పుడు పాల్ ఆయాసపడుతూ కేంజీలో ఉన్న నీమ్ కరోలి బాబా దగ్గరికి నేను వెళ్ళాలి. నా జీవితంలో సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి అండ్ వాటికి పరిష్కారం అక్కడే దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను అని అన్నాడు.
(12:54) ఆ మాట వినగానే స్టేషన్ మాస్టర్ ముఖంలో ఒక చిరునవ్వు మెరిసింది. బాబా దగ్గరిక అయితే నువ్వు ఈ రైలు తలుపులని బలవంతంగా బద్దలు కొట్టాల్సిన పనిలేదు. అసలు మా భారతీయ రైల్వే చరిత్రలోనే ఆ బాబా పేరు ఎలా లికించబడిందో నీకు తెలుసా? మా డిపార్ట్మెంట్ లో ఎంతో మందికి తెలిసిన ఒక అద్భుతమైన సత్యం ఒక కథ ఉంది చెప్తాను విను ఆ స్టేషన్ మాస్టర్ పాల్ ని పక్కనే ఉన్న చిన్న బెంచ్ వై కూర్చోబెట్టి ఆ సంఘటనని ఆ కథని చెప్పడం మొదలు పెట్టాడు.
(13:22) అది బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పాలిస్తున్న రోజులు ఫరూకాబాద్ రూట్లో నీప్ కరోలి అనే ఒక చిన్న గ్రామం మీదగా ఒక ప్ాసంజర్ రేల్ వెళ్తుంది. ఆ రేల్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో ఒంటిపై చిన్న నూలుపోగు లాంటి ఒక దుప్పట కప్పుకొని ఒక యోగి కూర్చుని ఉన్నాడు. ఆయనే బాబా లక్ష్మణ్ దాదాస్ అంటే నీమ కరోలి బావ ముందు అతని పేరు లక్ష్మణ్స్ బాబా లక్ష్మణ్ దాస్ ఈ నీమ కరోలి బాబా స్టేషన్ రాగానే ఒక ఆంగ్లో ఇండియన్ అతను ఒక టికెట్ కండక్టర్ అహంకారంతో చాలా కోపంతో ఆ భోగిలోకి వచ్చాడు ఒక నిరాడంబరమైన సాధువుని ఫస్ట్ క్లాస్ లో కూర్చోవడంని చూసి అతని అహం
(13:56) తట్టుకోలేకపోయింది. ఈ సాధువు ఇక్కడేం చేస్తున్నాడు టికెట్ లేకుండా దొంగలా ఎక్కాడు అని అనుకని విపరీతంగా అరిచాడు. అతని జుట్టు పట్టుకొని ప్లాట్ఫామ్ బయటికి విసిరేసాడు. కానీ బాబా ఆ అధికారిపై ఎలాంటి కోపం చూపించలేదు ఒక్క మాట అనలేదు చాలా ప్రశాంతంగా నవ్వుతూ ప్లాట్ఫామ్ చివరన్న ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ కండక్టర్ గర్వంగా పచ్చజెండా ఊపేసాడు డ్రైవర్ ఇంజిన్ స్టీమ్ ని లివర్ ని బలంగా లాగాడు.
(14:18) ఇంజిన్ నుంచి పొగలు కక్కడం మొదలయింది. ప్రెజర్ కూడా పెరిగింది కానీ ఆశ్చర్యం ఏంటంటే రైలు ముందుకు కదలట్లేదు. ఒక్క మిల్లీమీటర్ కూడా కదలట్లేదు. ఇంజిన్ రన్ అవుతుంది కానీ చక్రాలేం పట్టాలను పట్టుకు కూర్చున్నాయి. రైల్వే ఇంజనీర్లు అందరూ పరుగులు తీశారు. చక్రాలు చూశారు భోగీలు చెక్ చేశారు ట్రాక్ అంతా కూడా చెక్ చేశారు.
(14:37) ఎక్కడ చిన్న లోపం కూడా లేదు రెండు గంటల పాటు ప్రయత్నించారు. తర్వాత ఒక బారి ఇంజిన్ తీసుకొచ్చి వెనక నుండి తోయించినా కూడా ఆ బండి కదలలేదు. అక్కడున్న ఆ సిస్టం మొత్తం కూడా చేతులఎత్తేసింది. అప్పుడు ఒక ఉద్యోగి పరిగెట్టుకుంటా ఆ కండక్టర్ దగ్గరికి వచ్చి భయపడుతూ అన్నాడు నువ్వు అవమానించింది కిందకి తోసేసింది మామూలు సాధువు కాదు వెంటనే వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో లేదంటే ఈ రైలు ఇక్కడి నుంచి కదలదు అని చెప్పాడు.
(15:00) మొదట ఆ కండక్టర్ అహం ఒప్పుకోలేదు కానీ పరిస్థితి విషమించేసరికి గత్యంత్రం లేక ప్లాట్ఫార్మ్ చివర కూర్చున్న బాబా దగ్గరికి వెళ్లి చేతులు జోడించి కన్నీళ్లతో క్షమాపణ అడిగాడు. అప్పుడు బాబా చిన్న పిల్లాడల నవ్వి తన జేబులో ఉన్న ఫస్ట్ క్లాస్ టికెట్ తీసి చూపించాడు. ఆయన దగ్గర సరైన టికెట్ ఉంది కానీ కండక్టర్ తన కళ్ళకు కమ్ముకున్న అహంకారం వల్ల ఆ నిజాన్ని చూడలేకపోయాడు.
(15:19) బాబా మెల్లగా లేచి తిరిగి ఆ కంపార్ట్మెంట్ లో అడుగుపెట్టాడు. బాబా లోపల అడుగు పెట్టి సీట్లో కూర్చోగానే ఎలాంటి లివర్ లేకుండానే ఆ భారీ రైలు స్లోగా కదిలి ముందుకు వెళ్ళిపోయింది. ఈ అద్భుతమైన కథకి గుర్తుగా భారత రైల్వే స్టేషన్ బాబా పేరు పెట్టి బాబా లక్ష్మణ్దాస్ పురి అనే బోర్డ్ ని ఆ స్టేషన్ కి పెట్టింది.
(15:38) ఈ కథంతో చెప్తున్న స్టేషన్ మాస్టర్ పాల్ భుజం తట్టి చూసావా బాబు నువ్వు కూడా ఆ కండక్టర్ లాగే ప్రవర్తిస్తున్నావ్. నీ లోపల ఉన్న కోపం ఆందోళన ఈ పరిస్థితులని నేనే బలవంతంగా కంట్రోల్ చేయాలన్న అహంకారం నీ జీవిత చక్రాలని ముందుకి కదలనేవకుండా జామ్ చేస్తున్నాయి. నువ్వు బాబా దగ్గరికి వెళ్ళాలనుకుంటే ముందు నీ మనసులోనే ఆ ఆవేశాన్ని ఆ మొండితనాన్ని వదిలే నువ్వు ఉన్న పరిస్థితులకి నువ్వు సరెండర్ అయిపో నీ దారి దానంతటి అదే సులభం అయిపోతుంది.
(16:03) ఆ మాట వినగానే పాల్ మెదలో ఏదో వెలిగినట్టయింది. తను బలవంతంగా రైలు తలుపును తోస్తున్నాడు కానీ తన లోపల ఉన్న విపరీతమైన ఆ యాంక్షియస్నెస్ అసలైన అడ్డంకని అతనికి అర్థమయింది. పాల్ చేతులు వదిలేసాడు. లోతైన శ్వాస తీసుకుని కళ్ళు మూసుకుని తన మనసుని పూర్తిగా శాంతింపచేశాడు. సరిగ్గా అప్పుడే ఆ స్టేషన్ మాస్టర్ నవ్వుతూ రా నాతో గాడ్ క్యాబిన్ లో నీకు చోటు ఇప్పిస్తాను ప్రశాంతంగా హరిద్వార్ చేరుకో అంటూ పాల్ ని రైలు వెనకబోగి వైపు నడిపించాడు.
(16:32) రైల్ సౌండ్ మొదలైంది రైల్ స్లోగా హరిద్వార్ వైపు బయలుదేరింది. పాల్ ఆ కదులుతున్న రైలు కిటికీలో నుంచి చీకటి పడ్డ ఆకాశం వైపు చూశాడు. ఆ తర్వాత రోజు ఏమైందంటే [సంగీతం] హరిద్వార్లో రేలు దిగిన పాల్ నేరుగా గంగా నది తీరానికి చేరుకున్నాడు. రాత్రంతా ప్రయాణం చేశాడు. చలి లోపల తిరుగుతున్న ఆ యాంక్షిస్నెస్ వల్ల అతని శరీరం అలిసిపోయింది.
(16:55) చేతులు కాళ్ళు వనుగుతున్నాయి. కేంచిదామకి వెళ్ళే బస్సుల కోసం ఆలోచిస్తూ ఘాట్ మెట్లపై నిలబడ్డాడు. నది ఒడ్డున చిన్న నిప్పు రాజేసుకుని కూర్చున్న ఒక వృద్ధ సాధువు పాల్ ని గమనించాడు. ఆ సాధువు కళ్ళల్లో ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంది. పాల్ ని చూసి అన్నాడు రా బాబు చల్లో ఎందుకు వనుకుతున్నావ్ ఇక్కడ నిప్పు పక్కన కూర్చో అంటూ ఆ సాధువు పాల్ ని పిలిచాడు.
(17:14) పాల్ ఆ నిప్పు దగ్గరికి వెళ్లి చేతులు కాచుకుంటూ కూర్చున్నాడు. అతని ముఖంలో ఏదో కోల్పోయిన వేదన కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. ఆ సాధువు పాల్ ని చూసి నెమ్మదిగా నవ్వాడు. అమెరికా నుంచి ఇక్కడిదాకా వచ్చావు కళ్ళల్లో విపరీతమైన ఆకలి ఏదో వెతుకులాట కనిపిస్తుంది. ఎవరికోసం ఈ ప్రయాణం అని అడిగాడు. అప్పుడు పాల్ లోతైన శ్వాస తీసుకుని నా జీవితమే ఒక ప్రశ్న అయిపోయింది.
(17:36) దానికి సమాధానం కోసమే నీమ్ కరోలి బాబా దగ్గరికి వెళ్తున్నాను అని అన్నాడు. నీమ కరోలి బాబా పేరు వినగానే ఆ సాధువు చేత్తో వేస్తున్న నిప్పు పుల్లను వేయడం ఆపేసాడు అతని కళ్ళు ఎమోషనల్ గా మారిపోయాయి బాబా కోసం వెళ్తున్నావా నీకు వచ్చిన బాధ చాలా చిన్నది ఆయన తనను నమ్ముకున్న బిడ్డల కోసం ఎలాంటి నరకాన్నయనా ఆయన దగ్గరికి తీసుకుంటారు. మనం పడే కష్టాలను కూడా ఆయనే తీసుకుంటాడు దానికి సంబంధించి ఒక కథ ఉంది వింటావా అని అన్నాడు.
(18:04) రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు జాన్సీకి చెందిన ఒక సివిల్ సర్జన్ బాబాకు పరంభక్తుడు ఒక రాత్రి బాబా హటాత్తుగా డాక్టర్ ఇంటికి వెళ్ళారు. డాక్టర్ బాబా పడుకోవడానికి ఒక చెక్కబల్ల ఏర్పాటు చేసి తాను కింద నేల మీద పడుకున్నాడు. రాత్రి 11 గంటలకే అంతా నిద్రపోయారు. సరిగ్గా అర్ధరాత్రి 1:00 గంట సమయంలో బాబా విపరీతమైన నొప్పితో వేదనతో అటు ఇటు దొల్లుతూ మూలగడం మొదలుపెట్టాడు.
(18:29) ఆయన ఒల్లంతా నిప్పులు కురిసినట్లు కాలిపోతుంది చెమటలు కక్కుతున్నారు. కంగారుపడి లేచిన డాక్టర్ బాబా ఏమైంది ఏం జరుగుతుంది అని అడిగాడు. బాబా తన ఒంటిపై ఉన్న ఆ పాత చిన్న దుప్పటిని తీసి ఆ డాక్టర్ చేతిలో పెట్టారు. ఈ దుప్పటిని ఇప్పుడే తీసుకెళ్లి పక్కనే ఉన్న చెరువు నీళ్లలో ముంచేయ్ ఒక్క క్షణం కూడా ఆలోచన చేయగానే ఆజ్ఞాపించారు.
(18:48) అంత రాత్రివేళ ఏంటి ఇలా అంటున్నాడు అని చెప్పేసి సరే బాబా అన్నారు కదా అని చెప్పేసి ఆ డాక్టర్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ దుప్పటిని నీళ్లో ముంచి వచ్చేసాడు. ఆ దుప్పటి నీళ్లో మునగగానే బాబా శరీరం నెమ్మదించింది. ఆయన నొప్పి తగ్గి ప్రశాంతంగా నిద్రపోయారు. ఆ తర్వాత రోజు డాక్టర్ అడిగాడు బాబా అసలు రాత్రి ఏం జరిగింది అని అడిగారు.
(19:06) అప్పుడు బాబా నెమ్మదిగా చెప్పాడు నీ కొడుకు సైన్యంలో ఉంటూ జర్మన్ సైనికుల దాడిలో చిక్కుకున్నాడు. సైనికులంతా పారిపోగా వీడొక్కడే ఒక లోతైన బురదగుంటలో ఇరుక్కుపోయాడు. పైనుంచి జర్మన్ సైన్యం మెషీన్ గన్లతో బుల్లెట్ వర్షం కురిపించింది. వాడు చనిపోయాడని భావించి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ అక్కడ ఆ బుల్లెట్లన్నీ నీ కొడుకు శరీరానికి తగలకుండా నా దుప్పటిలోకి నేను లాగేసుకున్నాను.
(19:29) ఆ బుల్లెట్లు వేడి నాకు తాకింది. నువ్వు ఆ దుప్పటిని చెరువు నీళ్లలో ముంచినప్పుడే ఆ మంట చల్లారింది అని చెప్పాడు. డాక్టర్ కి ఆ మాటలు అర్థం కాలేదు. కానీ కొన్ని వారాల తర్వాత తన కొడుకు ఒక ఉత్తరం రాశడు. అది ఈ డాక్టర్ దగ్గరికి వచ్చింది. ఆ ఉత్తరంలో కొడుకు ఏమన్నాడంటే నాన్న రాత్రి 1టి:00 గంట సమయంలో నన్ను శత్రువులు చుట్టుముట్టేసారు. ఎన్నో బుల్లెట్లు నా మీదకు వచ్చేసాయి.
(19:49) ఏదో ఒక అదృశ్య శక్తి నన్ను కాపాడింది. ఒక బుల్లెట్ కూడా నా ఒంటికి తాగలేదు అని అన్నాడు. బాబా తన భక్తుడి రక్షణ కోసం వేల మైళల దూరం నుంచి ఆ మంటల్ని తన మీదకి లాగేసుకున్నాడు. సాధువు ఆ నెప్పి వైపు చూస్తూ అన్నాడు చూసావా భగవంతుడి ప్రేమ అంటే బయట సుఖాలు ఇవ్వడం మాత్రమే కాదు నీ కష్టాల్ని నీ కన్నీళ్ళని కూడా గుండెల్లో మోయడం పాల్ కళ్ళలో నీళ్లు నిండాయి అతను లేచి నిలబడి నేను ఒక్క క్షణం కూడా ఆగలేను వెంటనే కైంజీదామకి వెళ్ళాలి అని పరుగు తీయడం మొదలు పెట్టాడు.
(20:18) అప్పుడు ఆ సాధువు లేచి పాల్ భుజంపై చెయి వేసి ఆపాడు బాబు నువ్వు బాబాని చూడాలనుకుంటే నడుస్తూ వెళ్తే సరిపోదు పరుగు తీయాల్సిందే అని అన్నాడు. పాల్ ఎందుకు ఇలా అంటున్నాడు అని అడిగాడు. సాధు ఆకాశం వైపు చూస్తూ బాధతో అన్నాడు. కెంజి నుంచి నిన్న రాత్రి నాకు ఒక మెసేజ్ వచ్చింది. బాబా తన భౌతిక లీలల్ని ముగించే సమయం ఆసన్నమైంది. ఆయన శరీరం చాలా అలిసిపోయింది.
(20:38) ఆయన ఈ భూమిపై తన రూపాన్ని విడిచిపెట్టి మహా సమాధిలోకి ప్రవేశించడానికి ఇంకా కేవలం 48 గంటలు మాత్రమే మిగిలింది. ఆ మాట వినగానే పాల్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనియింది. కాళ్ళ కింద భూమి కదిలింది. సరిగ్గా రెండు రోజులు హరిద్వార్ నుంచి కైంజీదామ కి 300 కిలోమీటర్లు ఉన్నాయి కొండదారులు ఎటు చూసినా వర్షం అటు ఇటు విరిగిపడే కొండచర్యలు ఈ టైంలో ఎలా వెళ్ళాలిరా బాబు చేతిలో సరైన డబ్బులు కూడా లేవని ఆలోచించడం మొదలు పెట్టాడు.
(21:05) నాలోని ఆ ఎంటీనెస్ కి అర్థం ఏంటి లైఫ్ లో నా పర్పస్ ఏంటి ఈ డౌట్లన్నీ అడగాల్సిన ఒకే ఒక్క వ్యక్తి కనుమరుగైపోతున్నాడా అనే ఆలోచనతో పాల్ ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా తన బ్యాగ్ ని వీపుకు తగిలించుకని ఘాట్ మెట్లు పై పరుగు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. బస్సులు మారాడు వర్షంలో తడిచాడు కొండ చర్యల మధ్య పరుగు తీశడు చివరికి కేంచిదామ ఆశ్రమం ద్వారాల ముందుకు వచ్చాడు.
(21:30) పాల్ గుండె చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. అమ్మయ్య మొత్తానికి నేను చేరుకున్నాను సమయానికి వచ్చేసాను అనే ఆనందంతో ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు. కానీ లోపల వాతావరణం చాలా తేడాగా ఉంది. ఆశ్రమం మొత్తం ఒక అంతులేని బాధతో కమ్ముకుంది. కొంతమంది భక్తులు ఒక మూలన నేల మీద కూర్చుని మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏదో ఇక్కడ విషాదం జరిగిందని ఒక నిశబ్దం ఉంది.
(21:52) పాల్ పరుగున బాబా గది వైపు వెళ్ళాడు. తలుపు తోసి లోపల చూశడు. లోపల గది మధ్యలో ఒక పాత చెక్క బల్ల ఉంది. దానిపై బాబా ఎప్పుడూ కప్పుకునే ఒక నూలు దుప్పటి మాత్రమే మడత పెట్టి ఉంది. కానీ అక్కడ బాబా లేరు. పాల్ వనుకుతున్న గొంతుతో పక్కనే నిలబడ్డ ఒక కేర్ టేకర్ ని పట్టుకొని అడిగాడు బాబా ఎక్కడ నేను అమెరికా నుంచి వచ్చాను నా జీవితంలో చాలా డౌట్లు ఉన్నాయి నేను తీర్చుకోవాలి బాబా ఏరి అని అడిగాడు ఆ కేర్ టేకర్ కల నుంచి నీరు కారడం మొదలైంది.
(22:20) ఆ చాలా భారమైన గొంతుతో ఆ కేర్ టేకర్ అన్నాడు నువ్వు ఆలస్యంగా వచ్చావ్ బాబా ఈరోజే కొన్ని గంటల క్రితమే బృందావనంలో తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా మహా సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆ మాట వినగానే పాల్ మెదల్లో పిడుగుపడింది మహా సమాధి అయిపోయారా అంటే బాబా ఇక లేరా పాల్ ఇంకేం చేయలేక అక్కడే మోకాళ్ళ మీద పడిపోయాడు. ఎవరి కోసం అయితే అమెరికా నుంచి వచ్చాడో ఎవరి కోసం అయితే ఆకలితో అల్లాడుతున్న ఈ హిమాలయాల దాకా పరుగు తీశడో ఆ ఆఖరి ఆశ కూడా గాలిలో కలిసిపోయింది.
(22:48) నన్ను కన్నవాళ్ళు నన్ను వద్దు అనుకున్నారు. ఇప్పుడు నా ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిన బాబా కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నా జీవితానికి అర్థం ఏంటి నేను ఎందుకు బ్రతకాలి అని ఏడవడం మొదలు పెట్టాడు. పాల్ ఆ చెక్కబల్ల ముందు తన తల బాదుకుంటూ చిన్న పిల్లాడిలాగా ఏడుస్తూ కూర్చున్నాడు. గంటలు గడిచిపోయాయి రాత్రి అయిపోయింది ఆ ఆశ్రమంలో దీపాల కాంతి మొదలైంది.
(23:13) ఆ కాళీ చెక్కబల్లపై దీపాల కాంతి పడుతుంది. ఏడ్చి ఏడ్చి పాల్ కళ్ళలో కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. లోపల విపరీతమైన అలసట. ఆ అలసటలోనే ఒక నిశబ్దం కూడా వచ్చింది. ఆ ఆశ్రమం కేర్ టేకర్ నెమ్మదిగా పాల్ వద్దకు వచ్చాడు. అతని చేతిలో బాబా కప్పుకున్న దుప్పటి అలాగే బాబా తన భక్తులకి ప్రసాదంగా ఇచ్చే ఆపిల్ పల్లను ఇచ్చాడు. ఆ కేర్ టేకర్ ఆ దుప్పటిని పాల్ భుజాలపై కప్పాడు.
(23:35) ఆ ఆపిల్ పండుని పాల్ చేతిలో పెట్టి నెమ్మదిగా అన్నాడు బాబా శరీరాన్ని విడిచిపెట్టే ముందు నీలాంటి అన్వేషకుల కోసం ఒక మాట చెప్పారు నా శరీరం మిమ్మల్ని వదిలేసి వెళ్తుంది కానీ నా ఉనికి మిమ్మల్ని ఎప్పటికీ వదలదు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. మీ హృదయాల్లోనే ఉంటాను అని బాబా అన్నారు. బాబా ఎప్పుడు అనేవారు ఈ ప్రపంచంలో అందరూ అడుక్కుంటూనే ఉంటారు.
(23:55) ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కావాలని అడుక్కుంటారు. కానీ ఇచ్చేవాడిగా మారినప్పుడే మనిషి దైవత్వాన్ని చేరుకుంటాడు అని ఆ కేర్ టేకర్ పాల్ తో చెప్పాడు. ఆ మాటలు చేతిలో ఉన్న ఆ ఆపిల్ పండు భుజాలపై ఉన్న ఆ దుప్పటి స్పర్శ పాల్ మెథడ్లో ఒక అద్భుతమైన మార్పును తెచ్చాడు. పాల్ తన చేతిలో ఉన్న ఆ ఆపిల్ పండు వైపు చూశడు.
(24:17) అతని మనసులో ఆలోచనల తుఫాను ఒక్కసారిగా ఆగిపోయింది. అతనికి జ్ఞానోదయం అయింది. ఇన్నాళ్ళు నేను ఒక బాధితుడిలా బ్రతికాను. ఈ లోకం నాకు ప్రేమను ఇవ్వట్లేదని ఏడ్చాను. బాబా నాకు సమాధానాలు ఇస్తారని ఆశపడ్డాను కానీ నా జీవిత పరమార్థం వేరే వాళ్ళ దగ్గర సమాధానాలు అడుక్కోవడం కాదు. ఈ ప్రపంచానికి నేనే ఏదో ఒక గొప్ప విషయాన్ని ఇవ్వాలి గొప్ప విజయాన్ని ఇవ్వాలి ఒక గొప్ప సృష్టిని ఇవ్వాలి అని పాల్ ఆలోచించడం మొదలు పెట్టాడు.
(24:42) ఆయన అక్కడ భౌతికంగా లేకపోయినా పాల్ కి అతి పెద్ద పాఠం నేర్పించారు. సమాధానాలు బయట మనుషుల్లో ఉండవు మన లోపలే ఉంటాయి. నిశబ్దంలోనే అసలైన క్లారిటీ పుడుతుంది. పాల్ కళ్ళు తుడుచుకున్నాడు అతని ముఖంలో ఉన్న ఆ ఎంటీనెస్ స్థానంలో అంతులేని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అతను లేచి నిలబడ్డాడు బాబా ఎప్పుడు కూర్చునే ఆ కాళీ చెక్కబల్లకు చేతులు జోడించి నమస్కరించాడు. [సంగీతం] తర్వాత రోజు తెల్లవారు జమ్మ పాల్ తన భుజాలపై ఉన్న దుప్పటిని తీసి నీట్ గా మడత పెట్టి బ్యాగ్ లో పెట్టుకున్నాడు.
(25:14) బూట్లు వేసుకున్నాడు బ్యాగ్ వీపుకు తగిలించుకున్నాడు. పూర్తి కాన్ఫిడెన్స్ తో అమెరికాకి తిరుగు ప్రయాణం కావడానికి ఆశ్రమం మెట్లు దిగుతున్నాడు. గేటు దగ్గర ఉన్న కేర్ టేకర్ ఒక పాత రిజిస్టర్ ఓపెన్ చేశాడు. పాల్ ఏమో వేగంగా నడుస్తూ ఆశ్రమం గేటు వైపు వెళ్తున్నాడు. అతని నడకలో ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంది. గేట్ దగ్గర ఉన్న కేర్ టేకర్ చేతిలో లెడ్జర్ తీసుకొని పెన్ను పట్టుకొని అడిగాడు.
(25:36) బాబు ఆశ్రమం విడిచి వెళ్ళే ముందు మా విసిటర్స్ రిజిస్టర్ లో పేరు రాయాలి. నువ్వు వచ్చినప్పుడు నీ పేరు పాల్ అని మాత్రమే చెప్పావు. రికార్డు కోసం నీ పూర్తి పేరు ఏంటో చెప్తావా అని అడిగాడు. అప్పుడు పాల్ వెనక్కి తిరిగి తన పేరు చెప్పాడు. స్టీవెన్ పాల్ జాబ్స్ ముఖంలో ఏదో తెలియని చిరునవ్వు ప్రపంచాన్ని మార్చేయాలన్న అంతులేని కాంతి పాల్ మొహంలో క్లియర్ గా కనిపిస్తుంది.
(25:58) తన పేరు స్టీవెన్ పాల్ జాబ్స్ అని చెప్పి తన చేతిలో ఉన్న ఆపిల్ పండుని నములుతూ ఎంతో ఆత్మవిశ్వాసంతో కొండదారిలో వేగంగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ కేర్ టేకర్ నవ్వుతూ ఆ పాత రిజిస్టర్ కాగితంపై నెమ్మదిగా రాశడు. స్టీవ్ జాబ్స్ ఈ ప్రాపర్ కథ చాలా ఫిక్షన్ స్టోరీ ఏది రియల్ స్టోరీ కాదు బట్ మన దగ్గర ఉన్న పాయింట్ ఏంటంటే స్టీవ్ జాబ్స్ ఈ బాబా దగ్గరికి వచ్చాడు ఈ ఆశ్రమం నుంచి బయటకి వెళ్ళిన తర్వాత స్టీవ్ జాబ్స్ లైఫ్ లో ఏమైంది అనేది మనందరికీ తెలుసు సో ఈ వీడియో పాయింట్ ఏంటంటే జస్ట్ నో అబౌట్ నీమ కరోలీ బాబా అంతే ఆయన మిరాకిల్స్ ఈ పుస్తకాల్లో కొన్ని చదివాను కొన్ని
(26:32) ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి ఆ మిరాకిల్ ని కూడా మనం మన లైఫ్ లో ఎలా చూడాలి అన్న ఆలోచనతో చేశను సో ఏదో మిరాకిల్ జరుగుతాయి ఇవన్నీ నాకు తెలిీదు జరగొచ్చు జరగకపోవచ్చు బట్ ప్రతి దాంట్లో ఒక మంచి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పాయింట్ అయితే ఉంది ఆ పాయింట్ నే నేను చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశను. సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్ లో తెలియజేయండి.
(26:55) అండ్ ఫైనల్ రివ్యూల్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు చెప్పండి. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అలాగే తెలుగు గీక్స్ అకాడమీ లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిండు కామెంట్స్ లో ఉంది. తప్పకుండా అన్లాక్ యువర్ సబ్కాన్షియస్ పవర్ ఆ కోర్స్ ని ఒకసారి చూడండి. ఫైనల్ మాడ్యూల్ లో ఉంది అండ్ ఇది ఫుల్లీ రికార్డెడ్ కోర్స్ సో మీ లైఫ్ లో ఎప్పుడైనా మీరు యక్సెస్ చేయొచ్చు లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్
No comments:
Post a Comment