కొనగలిగితే ఆనందం
డబ్బుకు విలువ వుంటుందా?
అమ్మగలిగితే అలజడి
బాధకు విలువ వుంటుందా?
సంపాయించగలిగితే
సంతృప్తి
ఆశకు విలువుంటుందా?
పనిలో నిబద్దత లేకుంటే
నమ్మకానికి విలువ వుంటుందా?
ఆపగలిగితే కాలాన్ని
బాల్యానికి విలువుంటుందా?
చెప్పగలిగితే భావాన్ని
మౌనానికి విలువుంటుందా?
దూరంలో తలవకపోతే
చేరువలో విలువుంటుందా?
తలపులలో నీతి లేకపోతే
నడవడికి విలువుంటుందా?
పిలుపులో ఆత్మీయత లోపిస్తే
బంధాలకు విలువ వుంటుందా?
అన్నీ సరి అయినవే అనుకుంటే
పద్ధతికి విలువ వుంటుందా?
రేపన్న ఆశ లేకపోతే
వేకువకు విలువుంటుందా?
మార్పు రావాలి అనుకుంటే
తూర్పు ఎర్రబడక ఆగుతుందా?
బృంద 🙏
No comments:
Post a Comment