మీ జీవితం కొత్త దశలోకి అడుగు పెడుతోందని చెప్పడానికి విశ్వం ఇస్తున్న ఏడు సంకేతాల (7 సంకేతాలు) గురించి.... . ఈ సంకేతాలు కష్టాలు తొలగి, సంతోషాలు మరియు మీరు ఆశిస్తున్న ఫలితాలు రావడానికి సంకేతాలు...
విశ్వం మీ కష్టాలు ముగుస్తున్నాయని చెప్పే సంకేతాలు:
1. కొత్త అవకాశాలు తలుపులు తట్టడం: ఇది విశ్వం మీకు ఇస్తున్న మొదటి సంకేతం [2]. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతూ ఉంటాయి [3. ఇది అనుకోని కాల్స్ రూపంలో 4 ఒక కొత్త వ్యక్తి రూపంలో. 5 లేదా ఒక చిన్న పుస్తకం రూపంలో కావచ్చు. మీరు వెతుకుతున్న విషయాలకు సంబంధించిన అవకాశాలు లేదా సమాధానాలు ఈ రూపాలలో దొరుకుతాయి
2. ఒంటరిగా ఉండాలనే కోరిక: ఇప్పటివరకు గుంపులో జీవించిన మీరు, ఇప్పుడు సైలెన్స్‌ను వెతుక్కుంటారు బయటి శబ్దాల కంటే లోపల ఉండే మీ 'ఇన్నర్ వాయిస్' (Inner Voice) మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. దీనిని చాలా మంది డిప్రెషన్‌గా భావిస్తారు, కానీ ఇది విశ్వం మీకు చెప్పే గాఢమైన మాట . మీ ఆత్మశక్తి నుండి వచ్చే శబ్దాన్ని వినడం కోసం మీలో ఒంటరిగా ఉండాలనే ఆలోచన కలుగుతుంది. మీ కష్టాలకు మార్గాలను కూడా ఈ ఒంటరితనం నుండే గ్రహించగలుగుతారు .
3. సంకల్పాలు బలంగా పని చేయటం: మీరు ఒక ఆలోచన పెట్టగానే వెంటనే దాని ఫలితాన్ని పొందడం చూస్తారు . యూనివర్స్ నుండి వెంటనే రెస్పాన్స్ వస్తుంది . ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద కోయిన్సిడెన్స్ (coincidence) గా ఏర్పడుతుంది . ఒక ఆలోచన (thought) ఒక వ్యక్తిని మీ వద్దకు చేర్చి, ఆ వ్యక్తి ద్వారా మీకు అవకాశం ఎదురవుతుంది . మీ మాట, మీ ఆలోచన, మీ సంకల్పం ఇవే మీ భవిష్యత్తుగా మారుతున్నాయని విశ్వం మీకు తెలియజేసే స్పష్టమైన సంకేతం ఇది .
4. పాత సంబంధాలు అలవాట్లు దూరమవటం: ఇది కూడా విశ్వం ఇస్తున్న సంకేతమే . ఇప్పటివరకు మీరు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్న వారు మీకు దూరమవుతారు . మీరు విడిచి ఉండలేని అలవాట్లను మీరుకు మీరుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు . ఇది డిస్ట్రాక్షన్ (Distraction) కాదు, కొత్త కన్‌స్ట్రక్షన్ (Construction) . విశ్వం కొత్త మార్గాలను అందించడం కోసం పాత మార్గాలను మూసేస్తూ ఉంటుంది .
5. మీలో చిన్న చిన్న విషయాల్లో కూడా మార్పు రావడం: నిన్నటి వరకు మీకు ఎంతో కోపం, చిరాకు తెప్పించిన మాటలు ఇప్పుడు మీకు గాలిమాటల్లాగా అనిపిస్తాయి . అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు . మీ మనసు వశమవుతున్నప్పుడు కొత్త దశ మొదలవుతుందని పతంజలి యోగంలో "చిత్తవృత్తి నిరోధః" అని చెప్పబడుతుంది . ఇది విశ్వం మిమ్మల్ని శాంతి స్థితిలోకి నడిపిస్తున్న సంకేతం .
6. లోపల నుండి అనిర్వచనీయమైన శాంతి కలగడం: మీ సమస్యలు ఏమీ తీరకపోయినా సరే, మీలో ఒక కారణం లేని ఆనందం పుడుతుంది . ఇది అవేకినింగ్ (Awakening), అంటే మీరు కొత్త జీవన దశలోకి అడుగు పెడుతున్నారని విశ్వం చెబుతున్న సంకేతం.
7. కొత్త ఆలోచనలు కొత్త దిశలు: ఇప్పటివరకు ఒక దిశలో జీవించినా, అకస్మాత్తుగా మీ అంతరాత్మ, మీరు ఇంకా గొప్పది చేయాల్సి ఉందని, వేరే మార్గంలో వెళ్లాల్సి ఉందని చెప్తుంది . మీ ఫ్రీక్వెన్సీ మారినప్పుడు కలిగే కొత్త ఆలోచనలు ఇవి . మీరు కలలు కన్నవి, ఊహించినవి మేనిఫెస్ట్ (Manifest) అవ్వబోతున్న పిలుపులు ఇవి .
ఈ సంకేతాలు మీకు కొత్త అవకాశాలు, కొత్త ఆశలు, కొత్త శాంతిని అందించే విశ్వ స్వరాలు ].
*ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment