వీటిని పూజలు అంటారా?పూజల పేరుతో అరాచకాలు@nandurihemamalini
Author Name:nanduri hemamalini
Youtube Channel Url:https://www.youtube.com/@nandurihemamalini
Youtube Video URL:https://www.youtube.com/watch?v=J-qRftGKv5Q
Transcript:
(00:01) శ్రీమత్తే నమః రేపు వినాయక చవితి వస్తుంది కదా దయచేసి మీ వీధుల్లో ఎవరైనా వినాయకుడిని విచిత్ర వేషధారణతో చూపిస్తే మీరు వెళ్లి అడగండి అక్కడికి వెళ్లి కుదరదు ఇలాంటి వినాయకుడు పెట్టడానికి కుదరదు అని ఖండించి చెప్పండి ఇలా మనం ఖండించలేదు అనుకోండి వికృతమైన వేషాలు వేస్తారు. మనం మన దేవుణని అపహాస్యం పాలు చేస్తున్నాం అన్నమాట.
(00:27) మన సంప్రదాయాలని మన సంస్కృతిని అంతకుమించి మన ఆరాధ్య దైవాలని మనమే కించపరుస్తున్నాం. బయటవాడు ఎవడో కించపరిస్తే మనకి బాధ అనిపిస్తుందా ఆ మధ్యఫేస్బుక్ లో కృష్ణుడికి రకరకాల వేషాలు వేస్తే మనందరం బాధపడ్డామా? అలాంటిది మనవాళ్లే ఈ వినాయక చవతి పండుగ పేరు చెప్పుకొని విచిత్ర వేషధారణతో వినాయకుడిని చూపిస్తే మీరు అసలు చందాలు ఇవ్వకండి అలాంటి వాటిలని ప్రోత్సహించకండి.
(00:53) సరే వినాయక చవితి వస్తే ఇలా రకరకాల వేషధారణ వేయడం మనందరం చూసాం దాన్ని ఖండిస్తున్నాం కూడా చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఉంది సినిమా పాటల్ని దేవుడి పాటలుగా మార్చేసేవారు మార్చేసి ఆ పాటల్ని పెట్టేవారు దేవాలయాల్లో కూడా అదే పాటలు పెట్టేవారు అప్పుడు దేవుడి గుడికి వెళ్ళినా సరే మనం సినిమా హాల్ కి వెళ్ళినట్టే అనిపించేది ఎందుకంటే ఆ పాటలు వినిపిస్తూ ఉంటే వరసపెట్టి అదే పాటలు వస్తూ ఉంటే మనం ఎక్కడున్నామో అనేది మనకి మర్చిపోతాం కదా ఆ పాటల మీద మనసు లగ్నం అయిపోతుంది ఆటోమేటిక్ గా మనకి లోపల చూస్తున్న దేవుడు కనిపిస్తాడా కనిపించడు సరే ఇలా పాటల్ని మార్చడం వల్ల చాలామంది
(01:29) వ్యతిరేకత చూపిస్తే అలా చూపించగా చూపించగా చివరికి ఏం చేశారు అంటే ఆ పాటల్ని దాదాపుగా దేవుడి పాటలుగా మార్చి రాయటం తగ్గించేశరని చెప్పొచ్చు. తర్వాత భగవద్గీత భగవద్గీత చూడండి రోడ్డు మీద మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తుంటే మనకి భగవద్గీత వినిపించింది అనుకోండి వెంటనే భయం మొదలవుతుంది ఎందుకు ఓహో ఎవరో చనిపోయారు అందుకే భగవద్గీత వినిపిస్తుందని కచ్చితంగా అనుకుంటాం మనం రోడ్డు మీద నిలబడినప్పుడు మనకి గనుక భగవద్గీత వినిపిస్తే అలాగే సమయం కాని సమయంలో భగవద్గీత వినిపించినా గాని ఓహో ఎవరో చనిపోయారుఅన్నమాట భగవద్గీత వినిపిస్తోంది అని అనుకుంటాం. దేవుడి
(02:08) గుడిలోనుంచి మనకి భగవద్గీత పెట్టడం పెట్టినప్పుడు వినిపించినా గాన వెంటనే అనుమానం మొదలవుతుంది అదేంటి పొద్దున్నే భగవద్గీత వినిపిస్తుందిఏంటి ఎక్కడి నుంచో ఎవరికైనా ఏదైనా జరిగిందా అని అంటే ఆ స్థితికి తీసుకువెళ్ళిపోయారుఅన్నమాట చాలామంది ఇళ్లల్లో భగవద్గీతను పెట్టుకోరు ఎందుకంటే భయం భగవద్గీత అంటే చనిపోయినప్పుడు ఆ శవపేటక దగ్గర ఆ శవయాత్రలోన ఈ భగవద్గీతను పెడతారని మాత్రమే చాలామందికి స్టాంప్ లాగా ముద్రింపబడిపోయింది అన్నమాట భగవద్గీత ఎప్పుడు ఏ సమయంలో కృష్ణ కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు అది మర్చిపోతాం.
(02:40) ఈ శవాల దగ్గర శవయాత్రలో పెడతారు కదా అది వినేసి ఇంక మనం భగవద్గీత అనేది చదవము చదవకూడదు ఇంట్లో ఉండకూడదు అలా మనసులో బలంగా ముద్రించేశరు ఈ మధ్య ఈ మధ్య దేవాలయాల్లో భగవద్గీత వినిపిస్తుంది ఇప్పటికే దేవాలయాల్లో భగవద్గీత వినిపించిన కొంచెం ఎక్కడో భయం మొదలైపోతుంది కొంతమందికి అలాగే కొన్ని పూజలు జరుగుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో చూసాం ఈ పూనకాలు వచ్చినట్లు ఆ పాటలు పాడుతూ ఇంకా మొహంలో లో అది ఒక రకమైన పిచ్చి అన్నమాట మూఢ భక్తి వేరు మూఢ భక్తి వేరు కానీ మూర్ఖపు భక్తి వేరు వీళ్ళు చూపించేది మూర్ఖపు భక్తి అలాంటి వాళ్ళని ఎంత ప్రోత్సహించారు ఆ మూర్ఖపు భక్తి
(03:23) చూపించే వాళ్ళ దగ్గరికి వెళ్లి అసలు మొన్న ఆ మధ్య అయితే వేల మంది అక్కడికి వెళ్ళిపోయారు. ఏది చేయాలో ఏది చేయకూడదో మనకి తెలియదు చేయకూడని వాటిల దగ్గరికి వెళ్లి బాగా ఆకర్షణ అన్నమాట ఏదో వచ్చేస్తుంది మనకి అని ఆకర్షణ అలాగే పెద్ద పెద్ద విగ్రహాలకి ఆడవాళ్ళు అభిషేకాలు చేయటం పూజలు చేయటం చేస్తారు అసలు పెద్ద పెద్ద విగ్రహాలకి అసలు ఆడవాళ్ళు పూజలు అభిషేకాలు చేయకూడదు.
(03:51) దానికంటూ కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని కొన్ని గ్రామ దేవతల గుళ్ళల్లో ఆడవాళ్ళు ఉంటారు ఒకవేళ విగ్రహాలను ప్రాణ ప్రతిష్ట చేసి ప్రతిష్టించిఉంటే దానికి ఆడవాళ్ళు ఎలా ఎలా అభిషేకాలు చేసేస్తారు చెప్పండి ఇళ్లల్లో కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసుకోవడం ఆ పెట్టుకొని చేస్తున్నప్పుడు తెలియదు కానీ ఆ తర్వాత తీవ్రమైన పరిణామాలకి మనం గురైపోతాం అన్నమాట ఎందుకంటే అంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టినప్పుడు దానికంటూ ఒక పూజ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఒక ఆచారం ఉంటుంది అవన్నీ పాటించకుండా గొప్పకోసం మనం పెట్టామ అనుకోండి దెబ్బ అయిపోతాం అన్నమాట అంటే ఏది చేయాలో తెలీదు
(04:29) ఏది చేయకూడదో తెలీదు ఎవరినో చూసి ఇంకొకడు ఎవడో ఫాలో అవుతాడు అన్నమాట ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మొన్న వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారి వేషం ఇంకొకుక్కకి వేసింది ఒక మహా తల్లి తెలుగు ఛానలే అదేమి ఇంగ్లీష్ ఛానల్ ఏం కాదు కుక్కకి తాంబోలం ఇస్తున్నాను అని సరే దాని గురించి మనం వీడియో చేసాం అయిపోయింది కృష్ణాష్టమికి కుక్క కుక్కలకి పిల్లులకి ఉడకపలకి ఇంకా ప్రతి జంతువుకి కృష్ణుడి వేషం వేసేసి ఆ పిల్లని గ్రోవ పెట్టి ఆ పూజా మందిరాల్లో కుక్కను కూర్చోబెట్టారు ఆ వెన్న పాలు అవి పెట్టి ఆరిగింపంట పూజ అంట ఇక్కడ చూడండి ఈ అబ్బాయి కూడా కృష్ణుడి
(05:14) వేషం వేశడు వాళ్ళ తల్లిదండ్రులని ఎంత మెచ్చుకోవాలి ఎంత చక్కగా వేశారో చూడండి ఎంత సైకోలుగా మారిపోతున్నారు ఎంత పిచ్చి అది పిచ్చా బుర్ర పాడైపోయిందా మైండ్ ఏమైపోయింది అసలు వాళ్ళకి పితృ కార్యాలు జరుగుతున్నప్పుడు గాని దైవ సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు గాని అసలు కుక్క లోపలికి రాకూడదు వస్తే అసలు అసలు ఆ పూజ పని చేయదు ఇది నేను చెప్తున్నది కాదు శాస్త్రం చెప్పింది.
(05:56) అలాంటిది దేవుడి పూజా మందిరంలో పెడుతు ఇంకొక ఆయన అయితే ఆయన నామాలు పెట్టుకున్నారు. ఆయన కనిపించడానికి చూస్తుంటే ఎలా అనిపిస్తుందఅంటే శ్రీ వైష్ణవ లాగే కనిపించారు. ఆ ఒళలో పెద్ద కుక్క అన్నమాట. ఆ కుక్కని ఒళలో పడుకోపెట్టుకొని పూజా మందిరంలో పూజ చేస్తున్నారు. ఇలా భ్రష్టు పట్టించే విధంగా ఆ మనుషులని చూస్తే ఓహో వీళ్ళ అర్చకులేమో వీళ్ళు పూజారులేమో అనుకున్నట్లుగా భరిమింప చేసేలాగా వాళ్ళ అవతారం ఉంటుంది ఆ పూజ చేసేవాళ్ళ అవతారం ఉంటుంది వాళ్ళేమో కుక్కనేమో ఒళలో కూర్చోపెట్టుకొని పూజా మందిరంలో పూజ చేస్తున్నారు.
(06:30) ఆ కుక్కను ముద్దు పెట్టుకోవడం అక్కడేమో ఉపచారాలు చేయడం ఇది చూసారా పిల్లాడికి స్కూల్ కి ఎలా తీసుకువెళ్తారు అలా వేషం వేశరన్నమాట అంటే ఈ జంతువుల్ని వాళ్ళు పెంచుకుంటుంది ఎందుకంటే రీల్స్ కోసం అన్నమాట వాళ్ళు రీల్స్ కి ఉపయోగపడతాయి కాబట్టి పెంచుకుంటున్నారు అందుకే కదా వీడియోస్ తీసి ఇవన్నీ గొప్పగా సామాజిక మాధ్యమాల్లో వదిలిపెడుతున్నారు ఆ సమయంలో అవి ఎంత ఇబ్బంది పడతాయి అవి ఆలోచించం మనం మనకి రేల్స్ ముఖ్యం మన గొప్ప ముఖ్యం ఇలా లేనిపోనివి కలిపించి ఏదో జంతు ప్రేమను చూపిస్తున్నాము అని అనుకని ఇలాంటి పూజలు చేస్తే ఎంత అరిష్టం ఏదైనా ఇబ్బంది ఎదురైంది అనుకోండి మనం
(07:12) ఇలాంటి వికృత చేష్టలు చేసాం కాబట్టి మనకి ఇబ్బంది ఎదురైంది అని మనం చచ్చినా అనుకోం అప్పుడు మాత్రం దేవుణని తిడతాం మనం చేసే వికృత చేష్టలు మాత్రం చేసుకుంటూనే వెళ్ళిపోతాం. పిల్లికి కుక్కకి ఏంటా ఆ పిచ్చవేషాలు ఏంటో చెప్పండి కనీసం ఆ వాటిని ఎవరైనా ఖండించారేమో అని చూసా ఆ వీడియోస్ కి 30వేల లైకులు కింద 1250 కామెంట్లు అన్నమాట మాక్సిమం అందరూ ఎలా పెట్టారో తెలుసా క్యూట్ క్యూటీ కృష్ణ లిటిల్ కృష్ణ జై శ్రీ కృష్ణ హరే రామ హరే కృష్ణ అంట జంతువుల్లో దేవుని చూడాలి కానీ జంతువునే దేవుడిగా మార్చేయకూడదు కదా మార్చేసి పూజలు వాటికా ఇంకెందుకు ఇంట్లోనుంచి విగ్రహాలంతా వేసి గుళ్ళ
(07:57) ఇచ్చేయండి ఆ కుక్కల్ని ఆ పందుల్ని పిల్లుల్ని కూర్చోపెట్టుకొని వాటిలకి పూజ చేయండి. బుద్ధి జ్ఞానం అనేది అసలు ఉండట్లేదు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియట్లేదు దీనికి కారణం ఏంటో తెలుసా ఎవరు పడితే వాళ్ళు ధర్మ సందేహాలు నేను చెప్పేస్తాం అని చెప్పి బయటికి రావడం అన్నారని మీరు బాధపడకండి ఎవరు పడితే వాళ్ళు ధర్మ సందేహాలు చెప్పేస్తాం ఎవరు పడితే వాళ్ళ సందేహాలు తీర్చేస్తాం అని బయటికి వచ్చేయటం వల్ల ఇది తయారయింది అన్నమాట ఏముందండి జంతువులని ప్రేమిస్తే తప్పేంటి అందరిలోనూ దేవుని చూస్తే తప్పేంటి చేయండి పర్వాలేదు ఆచారాన్ని సంప్రదాయాన్ని భ్రష్టు
(08:36) పట్టించేసేందుకు తయారయ్యారు అందరూ ఆ భ్రష్టు పట్టించడానికి ఇంకొంచెం ముందడిగేసారఅన్నమాట ఈ జంతువుల కూడా దేవుడు వేషం వేసాడు మేమ అందరిలోనూ దేవుని చూసుకుంటున్నాం చూసుకుంటే అందరిలోనూ దేవుడు చూసుకునేటప్పుడు ఇంక మన ఇంటికి తెచ్చుకునే సంబంధాలను కూడా అందరిలోనూ దేవుడు తీసుకోవచ్చు అని చెప్పి వాటిల్నే తెచ్చుకోవచ్చు కదా వీటిని ఖండించలేదు అని అనుకోండి ఇంకా ఇది ముదిరి పాకాన పడిపోతుంది.
(09:00) పరాయవాళ్ళు ఎవరైనా మన దేవీ దేవతల వేషాలని జంతువులకు వేస్తే మనం ఊరుకుంటామా ఊరుకోం కదా గొడవ పెడతాం కదా మరి హిందువులని చెప్పుకుంటూ అవేమి వేరే మతస్తులు చేశరేమో వేరే మతస్తులు ఏమి కాదు ఆ ఐడిస్ కూడా గాయత్రి ఇలానే ఉన్నాయి. నేను వీడియోస్ లోపల చూశాను బొట్టు పెట్టుకుని పూజ చేసుకుని ఆ పూజా మందిరాలు ఉన్నాయి పైన విగ్రహాలు ఉన్నాయి ఇంట్లో మంచాల మీద కృష్ణుడు వేషం వేసుకున్న కుక్కలని పడుకోబెట్టుకోవడం ఎట్ట వెళ్ళిపోతున్నాం మనం
No comments:
Post a Comment