Tuesday, February 4, 2025

 🙏 *రమణోదయం* 🙏

*నిద్రపోతున్న వాడు స్వప్నంలో తాను తిరిగి తిరిగి అలసి సొలసి పోయినట్లు చూసి, మేలుకున్న తర్వాత, ఆ  స్వప్న దృశ్యమంతా కేవలం భ్రాంతియని తెలుసుకుంటాడు. తన మెత్తని పడక మీద, ఎటువంటి దుఃఖాలు లేకుండా అసంగుడుగా నిద్రపోతున్న తానొక్కడే నిజమని గ్రహించడమే జ్ఞానం.*

వివరణ: *తాను లేకపోతే త్రిపుటి లేవు. ఇది తెలుసుకుంటే అవన్నీ తనకు అన్యంగా కేవలం మిథ్యగా వీడిపోయి నిరాధారమైపోతాయి. ఆ త్రిపుటుల సంగం లేకుండా సత్యజ్ఞానంలో శయనించే సుఖస్వరూపుడే జ్ఞాని.*

"మానవమాత్రులం" అని తీసిపారేయకండి.
దేవతలకు సైతం అందని మోక్షస్థితి
కేవలం "మానవజన్మ" తోనే సాధ్యం.🙏

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.564)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం!?*

No comments:

Post a Comment