*తాలద్వజుడు :*
నారదుని మిధ్యా భర్త. నారదుడు
స్త్రీగా మారగా తాలద్వజుడను రాజు పెండ్లాడి పుత్ర
పౌత్రులకు జన్మనిస్తాడు. మహావిష్ణువు మాయావాదం
గురించి నారదుడికి తెలియజేయడానికి ఈ పని
చేస్తాడు. ఒకసారి నారదుడు జీవిత రహస్యాన్ని
గురించి మహావిష్ణువుని అడగ్గా జీవితం లేదని
మనస్సుయొక్క భ్రమే జీవితమని చెప్పగా అదేమిటో
తెలియజేయమంటాడు. విష్ణువు నారదుడిని గరుడ
వాహనంపై ఎక్కించుకొని భూలోకంలో ఓ కొలను
ఒడ్డుకు వస్తాడు. మహావిష్ణువు నారదుడిని తన
తుంబుర ప్రక్కన పెట్టి ఓసారి కొలనులో దిగి స్నానం
చెయ్యమని చెప్తాడు. నారదుడు అలా కొలనులో
స్నానం చెయ్యగానే ఓ అందమైన స్త్రీగా మారి పూర్వ
జన్మ మర్చిపోయి చుట్టూ చూస్తుండగా తాలద్వజుడను
రాజు ఓ గుర్రంపైన అటుగా వస్తూ ఈ సుందరిని
చూసి సౌభాగ్య సుందరీ అని పిలిచి మోహించి వివాహం చేసుకోగా
అతని వల్ల ఈమెకు రెండేళ్లకోసారి
ఓ పుత్రుడు జన్మిస్తారు. అలా 24 సంవత్సరాలకు
12 మంది పుత్రులు, తర్వాత 8 మంది పుత్రికలు
జన్మిస్తారు. వీరికి వివాహమై తాలద్వజునికి పౌత్రులు
కల్గి పెద్ద కుటుంబంగా మారుతుంది. ఒకరోజు చాలా
సుదూర ప్రాంత రాజు కన్యాకుబ్దం పై పడి ఇతని
పుత్రపౌత్రుల్ని అందర్ని సంహరిస్తాడు. తాలద్వజుడు
దుఃఖంతో తన భవనానికి చేరుకుంటాడు. సౌభాగ్య
సుందరి విలపిస్తుంది. మహావిష్ణువు బ్రాహ్మణ
వేషంలో వచ్చి ఆ రాజ దంపతులకు జీవిత సత్యాలు
బోధించి ఈమెను, తాలద్వజుడిని ఆ పాత కొలను
దగ్గరకు రమ్మని చెప్తాడు. ముందుగా ఆమెను ఆ
కొలనులో మునగమని చెప్పగా ఆమె కొలనులో
మునిగి తన నిజరూపమైన నారదుడిగా మారగా
మహావిష్ణువు స్నానానికి ఇంత ఆలస్యమేమని
ప్రశ్నిస్తాడు. నారదునికి జరిగింది అర్థమవుతుంది.
అయోమయంతో తాలద్వజుడు నాభార్య ఏమైందని
నారదుద్ని ప్రశ్నించగా మహావిష్ణువు జరిగింది వివ
రించగా అతడు ఆ కొలనులో స్నానంచేసి అడవులకు
వెళ్లి తపస్సు చేసి మోక్షం పొందుతాడు.
- దేవీభాగవతం
No comments:
Post a Comment