Thursday, February 20, 2025

 ఛత్రపతి శివాజీ..🚩🚩

శివాజీ బాల్యం నుండీ తల్లి జిజియాబాయి పెంపకం,దాదాజీ కొండదేవ్ శిష్యరికంలో అద్భుతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకుని ఒక మహావీరునిగా రాజ్యనిర్మాతగా, అన్నిటినీ మించి ధార్మిక, మానవతా విలువలు సంతరించుకున్న మనిషిగా రూపొందిన ఖ్యాతి ఆ ఇరువురికే దక్కుతుంది. 

శివాజీ జీవితం సాఫీగా సాగలేదు. అనేక ఒడిదుడుకులకు లోనయింది. తండ్రి ప్రేమాభిమానాలకు, శిక్షణకు దూరమైనాడు. బాల్యం నుంచీ కూడా కొండదేవ్ తండ్రి, గురువు దైవం అన్నీ తానే అయి శివాజీలోని ఆరిపోని వెలుగును,తేజస్సును నింపాడు. వీరివురి మధ్య నెలకొన్న అనుబంధం ఆదర్శపూరితం, అజరామరం చరిత్రలో క్రూరమైన మొగలాయీల పాలనలో హిందూ సమాజం మగ్గతున్న వేళ గో, బ్రాహ్మణాదులకు రక్షణ లేని వేళ,  పవిత్ర మాతృమూర్తుల కన్నీళ్ళు మహానదులై ప్రవహిస్తున్నవేళ ఛత్రపతి శివాజీ జన్మించాడు.
శివాజీ అసమాన్యుడు అని మొగలులు అబ్బురపడే విధంగా హైందవ సమాజ రక్షణకు ఉద్యమించాడు.
స్వతంత్ర హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించి, హిందూ దేశంలో హిందువులు సగర్వంగా జీవించగలిగే స్థితిని నిర్మించాడు.

ఈ భూమిపై ఎందరో రాజులు హిందూ దేశాన్ని మొగలుల, సుల్తానుల బారి నుండి కాపాడడానికి పోరాడారు. రాజ్యాలు స్థాపించారు.  అమరులైనారు.
ఆ సామ్రాజ్యాలు వారి వెనుకనే కూలిపోయాయి.
అయితే మన వీరుడు ఛత్రపతి శివాజీ స్థాపించిన హిందూ సామ్రాజ్యం బలోపేతంగా మారి మొఘలులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
హిందూ చైతన్యానికి ఆలవాలంగా నిలిచింది. అతను మనకు అన్ని విధాలుగా నిత్యస్మరణీయుడు.

ఒక కవి శివాజీ ఈ దేశంలో జన్మించి ఉండకపోతే..

"కాశీ జీ కీ కలా జాతీ,
మధురా మసీద్ హోతీ 
శివాజీ నా హోతో సున్తీ హోతీ సబ్ కీ"

అని తన కావ్యంలో వర్ణించాడు. ఇటువంటి దుర్భర పరిస్థితులలో ఉన్న  హైందవానికి ఆశా కిరణంగా ఉద్భవించాడు శివాజీ. నిజాంశాహీల పాలనకు ఎదురుతిరిగి పూనా లో స్వాతంత్ర  మరాఠా సామ్రాజ్యానికి నాందీ పలికాడు. 17 ఏళ్ల  వయసులో తొలిసారి యుద్దం చేసి బీజాపూరు సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటాను స్వాధీనం చేసుకున్నాడు.

తరువాత 3 సంవత్సరాలలో కొండన రాజ్ ఘర్ కోటలను ,పూనా ప్రాంతాలను తను స్వాధీన పరుచుకున్నాడు. గెరిల్లా యుద్ధ పద్దతులు, మెరుపు దాడులు అమలు పరిచి మరాఠా యోధునిగా ఘన కీర్తి సాధించాడు.
ఒక పక్క ఆదిల్షా మరో పక్క మొఘల్ సేనలతో శివాజీ నిరంతర యుద్ద శీలిగా మారాడు.
కోల్హాపూర్ ,పవన్ ఖండ్ యుద్దాలలో  విజయం సాధించాడు. 
దక్కన్ పై యుద్ద యాత్రకు సిద్ధమైన ఔరంగజేబు సేన మార్గ మధంలో శివాజీతో తలపడి ఓడించింది.
పూణే ను చేజిక్కించుకుంది. 
తెలివిగా అంతాఃపురంలో ప్రవేశించి షైస్తఖాన్ ను చంపి పూణేను తిరిగి ఆక్రమించుకున్నాడు. తరువాత సూరత్,సిహఘడ్ లను జయించాడు.
1674 లో రాజ్య పట్టాభిషేకం చేసుకుని ఛత్రపతిగా మారి 27 సంవత్సరాలు పాటు యుద్ధాలు చేసి  సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు కేవలం యుద్ధాలకే ఈయన మేధస్సు పరిమితం కాలేదు.
పరిపాలనా విధానంలో నూతన పంథాలను తొక్కి భావితరాలకు మార్గదర్శకునిగా నిలిచారు. దృఢమైన విదేశాంగ విధానం, పటిష్ఠమైన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేశాడు.

శివాజీ ప్రవేశ పెట్టిన అద్భుత పరిపాలనా ప్రణాళిక అష్ట ప్రధాన మంత్రిమండలి. 
పీష్వా 
మజుందార్ 
సురనిస్ 
వాకనీస్ 
సర్ నౌబత్ 
డాబీర్ 
కాజీ అల్ ఉఝత్
సదర్ ముహతసిన్ .
నేటి పాలనా యంత్రాంగం కూడా ఇలా విభజననే పాటిస్తున్నది. ప్రజల కోసం ప్రభువు అన్న సూత్రాన్ని ,వ్యక్తిగత విలాసాలకు తావీయక ప్రజా సంక్షేమం కోసమే పాటు పడ్డాడు.  శివాజీ హిందూ మత సామ్రాజ్యాన్ని స్థాపించినప్పటికీ, తాను హిందువు అయినప్పటికీ మత సహనం కలవాడు. ఏ పరమత మందిరాలను తాకలేదు. ఏ ఇతర మత పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన రాజ్యంలో అశక్తులకు స్త్రీలకు పసివారికి కావలసిన సహాయాన్ని అందించాడు
 తాను తన అనుచరులకు ఆదర్శప్రాయంగా నిలిచాడు. చంద్రునిలోనైనా మచ్చ ఉంటుందేమో కానీ శివాజీలో అణు మాత్రం కూడా ఉండదు.
గెరిల్లా యుద్ధ విధానం శివాజీ తోనే మొదలైంది.
సరికొత్త ఆయుధాలను కనుగొని యుద్ధాలు చేయించడం ఇతని ప్రత్యేక అభిరుచి. 
పటిష్ఠమైన నౌకా దళాన్ని,అశ్వ దళాన్ని ఏర్పాటు చేసాడు. 
ఎనిమిది నెలలు పంటలు పండించే రైతులు కూడా మిగిలిన నాలుగు నెలలు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం శివాజీ బుద్ధి కుశలతకు అద్దం పడుతుంది. 
కేవలం సైనికులు మాత్రమే కాక సంఘంలో అన్ని వర్గాలవారు కోటను పరిరక్షించేవారు.
ఏ శత్రువైనా వెనుకాడేవిధంగా లక్ష సైన్యాన్ని తయూరు చేసిన కడు సమర్థుడు. 
కొండలపైన ఉన్నతమైన సాంకేతిక విలువలతో దుర్భేద్యమైన కోటలను నిర్మించడంలో శివాజీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు.
నాసికా నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కి.మీ. మధ్య 300 కోటలు నిర్మించబడ్డాయి. 
 
హిందూ బంధువులందరికీ..

        *ఛత్రపతి శివాజీ మహారాజ్*
          *జయంతి శుభాకాంక్షలు*

                🚩 ⚔️ 🪷 ⚔️ 🚩

       🚩జై భవాని - వీర శివాజీ🚩

      🔱 హర్ హర్ మహదేవ్ 🔱

          🚩🚩🚩🔱🚩🚩🚩

No comments:

Post a Comment