Thursday, February 20, 2025

🙏🕉️🕉️🕉️🙏
దేవుడు విద్యుచ్ఛక్తి లాంటివాడు. విద్యుత్తును ఒకసారి చూపమని అడిగితే ఎవరూ చూపించలేరు. విశాల విశ్వంలో సంభవించే నిరంతర పరిణామాలకు కారణమవుతున్నది, మనిషి మేధ అందుకోలేకపోతున్న అజ్ఞాతశక్తి- ఒకటే. గాలిలోని ప్రాణవాయువు జీవి కళ్లకు కనపడనంత మాత్రాన లేకుండా పోదు. దాన్ని జీవశక్తిగా నమ్ముతున్నప్పుడు జీవులకు ప్రాణం పోస్తున్న ఆ శక్తిని దేవుడనడానికి అభ్యంతరం ఉండకూడదు.

దేవుడు లేడనేవారి మనోభావనలను నిరసించి గాయపరచడాన్ని హైందవ సనాతన ధర్మం ఎన్నడూ ఆమోదించలేదు. ఉన్నాడని చెప్పేందుకు తార్కిక వాదనలను వినిపించింది. దేవుడంటే ఎవరేది చెప్పినా వినగల సహనం నేర్పించింది. చార్వాకుడి నాస్తిక వాదాన్ని కించపరచలేదు. ఋషులకిచ్చిన గౌరవమే ఆయనకు ఇచ్చింది.

విశ్వమంతా నిండి ఉన్న చైతన్యమంతా దేవుడేనని, అతడు రూపగుణ విశేషాలుండని తనలోనే ఉన్న దివ్య చైతన్యమని, అందులో తానొక అణువులో అణుమాత్రమైనా కాని అంశమని వేదాంతం తెలుసుకొమ్మంటుంది. వేదాంతం అర్థమైతే... దేవుడంటే వెలుగని గ్రహించి- భౌతిక లోకంలో చీకట్లు తనను ఏ రూపంలో వేధిస్తున్నా మనిషి భయపడడు!🕉️🙏

No comments:

Post a Comment