Saturday, February 8, 2025

****ఈ పుస్తకం భారతదేశాన్ని ఎలా నాశనం చేసింది? | The Book That Destroyed India’s Economy

 ****ఈ పుస్తకం భారతదేశాన్ని ఎలా నాశనం చేసింది? | The Book That Destroyed India’s Economy

https://youtu.be/PRGDEoZZhcg


నిజానికి ఇది భారతదేశ ప్రాచీన చరిత్రకు సంబంధించిన అంశం ప్రాచీన భారతదేశ సుస్థిర ఆర్థిక వ్యవస్థకు తూట్లు పొడిచిన ఒక పుస్తకం భారతదేశం తిరిగి కోలుకోలేకుండా చేసింది వేలాది సంవత్సరాల నేత కళాకారుల ప్రతిభను కేవలం ఓ 200 ఏళ్లలో మాయం చేసింది పుస్తకానికి ఇదంతా తెలియదు పుస్తకంలో ఇలా చేయమని రాయలేదు పుస్తక రచయిత ఉద్దేశం మాత్రం వేరు ఆ పుస్తకం భారతీయ చేనేత కళాకారుల ప్రతిభను భారతదేశంలో వెలసిల్లిన పరిశ్రమలను బహుముఖమైన వైవిధ్యమైన భారతీయ చేనేత వస్త్ర పరిశ్రమ శ్రమను లక్ష్యంగా చేసుకొని రాయబడింది కళాకారుల సునిశ్చితమైన తయారీ పద్ధతుల్ని వాళ్ళు ఉపయోగించే వస్తు సామాగ్రిని చేనేత తయారీ విలువలను దారుణంగా దెబ్బతీసేందుకు జాన్ పోర్ట్స్ రాసిన ద టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఇండియా అనే గ్రంథం విదేశీయులకు విజ్ఞాన గ్రంధంగా ఎంత ఉపకరించిందో కానీ భారతీయ ఆర్థిక వ్యవస్థను మాత్రం ధ్వంసం చేసేందుకు ఆయుధంలా పనికొచ్చింది 1866 లో ముద్రించబడ్డ ఆ 18 సంపుటాల పుస్తకంలో భారతదేశంలోని 700 వస్త్ర రకాలు ఉండేవని వాటి తయారీ కి సంబంధించిన వివరాలను తూచా తప్పకుండా నమోదు చేశారట ఐరోపా మార్కెట్ లో 18 19 శతాబ్దాల్లో అతి సున్నితమైన మృదువైన ఒక మీటర్ మస్లిన్ వస్త్రం సుమారుగా 42 వేల ధర పలికింది డాకా మస్లిన్ గా పిలిచిన ఆ వస్త్ర విశేషం ఇప్పుడు అంతరించిపోయింది డాకా ఇప్పుడు భారతదేశంలో లేదు భారతదేశం నుంచి విడగొట్టబడ్డ బంగ్లాదేశ్ లో ఉంది అసలు ఒకనాడు ఆనాటి అవిభాజ్య బెంగాల్ ప్రాంతం ఆ తర్వాత బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వస్త్ర పరిశ్రమలు కలిగిన నేలగా పిలవబడింది నేడు ఆ పరిస్థితి లేదు మనం చెప్పుకున్న మస్లిన్ రకం పత్తి విత్తనం ఇప్పుడు లేనే లేదు సాంప్రదాయ డాకా మస్లిన్ రకం అనే కాదు అనేక రకాల చేనేత వస్త్ర పరిశ్రమలు మూతపడిపోయేందుకు బ్రిటిష్ వలసపాలకులు చాలా పట్టుదలగా పనిచేశారు అసలు ఆ విజ్ఞానం పనితనం కళాత్మకత తర్వాత తరాలకు కొనసాగే వీలు లేకుండా ప్రణాళికబద్ధంగా వ్యవహరించారు భారీ ఎత్తున తమ దేశంలో తయారైన చౌక రకం మిల్లు వస్త్రాలను భారత్ లో అమ్ముతూ ఇక్కడి వస్త్ర పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీశారు తక్కువ ధరలకు బట్టలు దుస్తులు అందుబాటులో ఉండడంతో భారతీయ వినియోగదారులు తమ చేనేతను విమర్శించి విదేశీ వస్త్రాల కొనుగోలుకు మక్కువ చూపారు మోజు పెరగడంతో దేశీయ చేనేత వస్త్ర కళాకారుల మగ్గాలు నిలిచిపోయాయి అద్దకం రంగులు వెలసిపోయాయి పట్టు పరిశ్రమ కళ కరిగిపోయింది అగ్గిపెట్టెలో పట్టేంత సున్నితమైన వస్త్రం చేసిన చేతులు పలుకు పార మరో పని ముట్టు పట్టుకొని పని చేస్తూ అసలు పని మర్చిపోయాయి భారత చేనేత కళాకారుల జీవితాలే కాదు అనేక వృత్తి కళాకారుల నైపుణ్యాలు బ్రిటిష్ వలస పాలనలో నాశనమయ్యాయి దేశ సంపద బ్రిటన్ కు కొల్లగొట్ట బడి తరలించబడింది బ్రిటన్ మ్యూజియంలో భారత హస్తకల పేరిట ఇక్కడ దోచుకోబడ్డ బహుమతుల పేర తరలించబడ్డ అపార సంపదను ప్రదర్శించడం కోసమే ప్రత్యేకంగా కొన్ని విభాగాలను గదులను కేటాయించారు గోల్కొండ గనుల్లో దొరికిన కోహినూర్ వజ్రం గురించి ఇప్పటికీ ఏదో ఒక వివాదం అడపా దడప ప్రస్తావనకు వస్తూనే ఉంది ఇవన్నీ ఒక ఎత్తు కాగా 1867 నాటి ద టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఇండియా పుస్తకం 1947 వరకు భారతదేశాన్ని కొల్లగొట్టుకుపోవడానికి బ్రిటిష్ వలస పాలకులకు రాజమార్గంగా పనికొచ్చిందని చెప్పొచ్చు ఇది చేదు నిజం అందుకే మనకు ఇంత ఉపోద్ఘాతం చెప్పుకోవాల్సి వచ్చింది 18 వ శతాబ్దం వరకు 24.4 gdp ని ఆర్జిస్తూ వచ్చిన భారతదేశం 1947 కల్లా చతికిలబడిపోయింది 23.3 gdp కలిగిన ఐరోపా మాత్రం ఐశ్వర్యవంతమైంది వివరాల్లోకి వెళితే స్వాతంత్రోద్యమ కాలంలో స్వదేశీ వస్త్రాలు ధరించండి విదేశీ వస్త్రాలను బహిష్కరించండి అనే నినాదం రాజకీయంగా భారతీయులను ఒకటి చేయడానికి దోహదం చేసింది ఎప్పుడు ఎక్కడ ఏ ఆందోళన జరిగింది విదేశీ వస్త్రాలను బహిరంగంగా రహదారుల మీద కుప్పలు పోసి తగలబెట్టేవాళ్ళు నిజానికి అదొక ప్రతీకాత్మక వ్యతిరేకంగా చూసేవారికి అందులో శతాబ్ద కాలంలో పోగొట్టుకున్న దేశీయ వస్త్ర పరిశ్రమ మెరుగుదల కనిపిస్తాయి 1615 లో భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ దూత థామస్ రో ఢిల్లీ బాదుషా జహంగీర్ కు కానుకలి ఇచ్చి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు పొందాడు భారతీయ మసాలా దినుసులు అత్యంత నాణ్యమైనవిగా గుర్తించిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తమ పాలిత ప్రాంతాల్లో పన్నులు వసూలు చేయడం మొదలు పెట్టింది ఆ పన్నుల సొమ్ముతోనే భారతీయ మసాలా దినుసులను ఇతర సుగంధ ద్రవ్యాలను బియ్యాన్ని కొనుగోలు చేసి ఐరోపా దేశాలకు తీసుకుపోయి అక్కడ కొన్ని రెట్లు ఎక్కువ ధరకు అమ్ముకునేది అప్పుడే వారి చూపు భారతీయ వస్త్రాల మీద పడింది భారతీయ పట్టు వస్త్రం నీటిని తాకినంత మృదువుగా ఉంటుందని చెప్పుకునేవారు రోజులు నెలలు తరబడి మగ్గం మీద నేసే వస్త్రాలు చేతి వేళ్ళ పనితనంతోనే సుందరంగా ముస్తాబై భారతదేశ గొప్పతనాన్ని నిలిపేవి 60 అడుగుల పట్టు వస్త్రం అగ్గిపెట్టెలో పట్టిందంటే ఆ వస్త్రం ఎంత మృదువుగా ఎంత ఉద్దికగా ఉండేదో మీరే అర్థం చేసుకోవచ్చు బెనారస్ పట్టుచీర కొంగు చేయడానికి 5600 దారం పోగులు అవసరమయ్యేవి చీర పూర్తిగా తయారు కావడానికి కనీసం 16 నుంచి 30 రోజుల సమయం పట్టేది ప్రత్యేక తరహా వస్త్రాల కోసం ముగ్గురు లేదా ఏడుగురు కళాకారులు పనిచేసేవాళ్ళు కాంజీవరం పస్మినా చందేరి పుల్కారి ఇక్కత్ జంధారి కలంకారి బనారసి అజ్రక్ బాగ్ బంధని పటోల పొందూరు పోచంపల్లి అరణి అలా ఎన్నో రకాల నేత కళలు ఈ నేల మీద వికసించాయి భారతీయ ప్రతి ఊలు పట్టు వస్త్రాలకు నేటికి గిరాకి బాగానే ఉంది కళాకారులే వేళ్ళ మీద లెక్క పెట్టే అంత తక్కువ మంది ఉన్నారు చరిత్రలో ఓ నాలుగు వేల సంవత్సరాల పూర్వానికి ప్రయాణించి చూస్తే చేత్తో కుట్టిన దుస్తులనే అందరూ ధరించేవారు ఎంత పెద్ద వస్త్రమైన సూది దారంతోనే బట్టగా దుస్తుగా తయారయ్యేది మళ్ళీ వాటి మీద వివిధ అలంకారాలు చేసేవాళ్ళు వివిధ రాళ్లను మణులను పొదిగి కుట్టేవాళ్ళు మొత్తం పని చేత్తోనే సాగేది అంటే కొన్ని వందల వేల మందికి ఉపాధి దొరికేది ప్రాచీన రోమన్ చరిత్రలో నూలు వస్త్రాల కోసం భారతదేశంతో వ్యాపారం చేసేవారని వారి చారిత్రక పత్రాల్లో రాసి ఉంది అలాంటి విలువ కలిగిన భారతీయ వస్త్ర పరిశ్రమ ఐరోపా దేశాలకు కంటపడింది భారత్లో నేసే పరదాలు తివాచీల నాణ్యతం ఇచ్చిన ఐరోపా రాజులు భారీగా వాటిని కొనుగోలు చేసేవాళ్ళు ఫలితంగా వారి ఖజానా మీద భారం పడేది దిగుమతులకు ప్రత్యామ్నాయం ఏంటా అని ఆలోచించారు బ్రిటన్ అప్పుడు ఆర్థిక మాన్యంతో ఇబ్బంది పడుతోంది దిగుమతుల మీద సుంకాలు విధించిన ఖజానా నిండడం లేదు భారతీయ వస్త్రాలకు గిరాకి రోజు రోజుకు పెరుగుతూ పోతుంది అప్పుడు వైద్యుడైన జాన్ ఫోబ్స్ వాట్సన్ బ్రిటన్ వలస పాలనలో ఉన్న భారతదేశంలో బ్రిటిష్ సైనికులకు వైద్యం చేయడం కోసం ఆర్మీ డాక్టర్ గా భారతదేశంలో పనిచేశాడు 1858 లో బ్రిటన్ లోని ఇండియా మ్యూజియం కి అతన్ని సంచాలకుడిగా నియమించారు భారతదేశ దిగుమతులను నియంత్రించే సలహాలను అతడే బ్రిటన్ ప్రభుత్వానికి సూచించాడు చిత్రకారులు పరిశోధకులు నాటి అధికారులు నమోదు చేసిన సమాచారం ఆధారంగా చారిత్రక ఘటనలను నిర్మించుకుంటూ ఉంటాం ఆ వివరాల ప్రకారం చూస్తే జాన్ ఫోబ్స్ వాట్సన్ భారతదేశంలో తయారైన వివిధ రకాల వస్త్ర నమూనాలను సేకరించి బ్రిటన్ లోని ఇండియా హౌస్ లో ప్రముఖుల ముందు ప్రదర్శించాడు భారతదేశం చేసుకునే దిగుమతుల కంటే బ్రిటన్ కు ఆ దేశం చేసే ఎగుమతుల విలువ ఎక్కువ అని చెప్పాడు భారతదేశానికి అమ్మేందుకు తమ వద్ద ఏముందని ఆలోచన చేశారు భారత్ లో అన్ని ఉన్నాయి కదా అనేది అక్కడ సమావేశమైన బ్రిటన్ ప్రముఖుల ఉద్దేశం తమ వద్ద లేకనే వ్యాపారం వంకన దేశాలను కబలిస్తూ సముద్రాలు దాటి వెళ్ళిన తమకు భారతీయుల చేత తమ దేశం నుంచి ఏం కొనిపించాలనే సందేహానికి వాట్సన్ ఇచ్చిన సమాధానమే కాలాంతరంలో భారతీయ కళాకారుల చేతుల్ని సృజనాత్మకతను నిస్తేజంగా మార్చేయడం ఆనాటి సమావేశంలో భారతీయుల చేనేత వస్త్ర నైపుణ్యాన్ని తర్కించి అచ్చం అలాగే ఉండేలా తమ దేశంలో వస్త్రాల్ని దుస్తుల్ని తయారు చేసి చౌకదరులకు భారత్ లో అమ్మాలని వాట్సన్ చెప్పాడు బ్రిటన్ లో పారిశ్రామిక విప్లవం మొదలైంది మిల్లులు వచ్చాయి అయితే భారతదేశంలో దాదాపు ప్రతి పని చేతి పనిముట్లతోనే చేసేవాళ్ళు ఇనుము బంగారం చెక్క వస్త్రం పాత్రలు పనిముట్లు ప్రధాన వ్యవసాయం అన్నీ కూడా అన్నీ కూడా మనిషి తన చేతులతో చాలా సృజనాత్మకంగా చేసేవాడు నాగలి పట్టిన బండ్లు లాగిన గానుగ తిప్పిన కావలి కాచిన పెంపుడు జంతువులు తాను కలిసి చేయవలసిందే చివరికి యుద్ధాలు చేస్తున్న చేత్తో చేసుకున్న ఆయుధాలే ఉండేవి ఆ తర్వాత యంత్రాల ద్వారా బ్రిటన్ భారీ ఎత్తున బట్టలు తయారు చేసింది భారతీయ విధానాల్లో పనులు చేస్తే వారికి రోజులు నెలలు పడుతుంది పని వాళ్ళు కూడా ఎక్కువగా కావాలి అదే యంత్రం అయితే దాన్ని తిప్పేందుకు ఒక్క మనిషి ఉంటే చాలు తయారయ్యేవి మాత్రం గుట్టలు గుట్టలుగా ఉంటాయి వాటిని భారత్ కు తీసుకుపోయి అమ్మితే చాలు లాభాలు దండిగా వస్తాయి బ్రిటన్ ప్రభుత్వానికి వాట్సన్ ఆలోచన నచ్చింది భారతీయుల వస్త్ర పరిశ్రమను అధ్యయనం చేసి రమ్మని అతన్ని వినియోగించారు అలా అతను రాసిన భారతీయ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన పుస్తకం అవ్వడానికి పరిశోధన గ్రంథం అయితే అది భారతీయ చేనేత వస్త్ర పరిశ్రమ ఊపిరిని లాగేసుకుంది వస్త్ర విశేషాలు ప్రాంతాలను బట్టి చేనేత ముద్రలు విభిన్నంగా ఉండడం వాతావరణాన్ని బట్టి దుస్తుల్లో వైవిధ్యం ప్రతి ప్రాంతానికి సంస్కృతికి చెందిన ప్రత్యేక సాగు చేసే విత్తన రకం ఉపయోగించే దారం దాన్ని తీసే దారం భద్రపరిచే తీరు నేతనేసే మెలకువలు అందులో ఉపయోగించే వివిధ ప్రాకృతిక రంగుల సేకరణ తయారీ అద్దకం కుట్లు అల్లికలు వీటన్నిటికీ ఉపయోగించే చిన్న సూది మొదలు పెద్ద పెద్ద మగ్గాల తయారీ వాటి పనితీరు వస్త్రాన్ని మడతపెట్టి భద్రపరిచే సున్నితమైన అంశాలతో సహా అన్నిటిని వాట్సన్ గ్రంధస్తం చేశాడు ఆయా వస్త్రాల తయారీకి పట్టే సమయం వాటి ధరను కూడా నమోదు చేశాడు ఆ తర్వాత ఇంగ్లాండ్ లోని మాన్చెస్టర్ నగరంలో మిల్లుల్లో భారతీయ వస్త్రాలకు నకలుగా నాసి రకం మిల్లు బట్టలు తయారు చేసి భారత్ కు తీసుకొచ్చి అమ్మడం మొదలు పెట్టాడు దాంతో భారతీయ చేనేత కళాకారుల చెయ్యి నరికేసినట్లయింది ప్రాచీన దస్తావేజులను పరిశీలిస్తే ఆనాడు ఒక్క బెంగాల్ ప్రాంతంలోనే రెండున్నర లక్షల చేనేత కార్మికులకు వృత్తి పోయిందని తెలుస్తోంది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో వారు వేరే పనులకు వెళ్ళక తప్పలేదు అంటే రెండున్నర లక్షల మంది కళాకారులు ఉపాధి పోగొట్టుకుని వస్త్ర పరిశ్రమ నుంచి బయటకు వచ్చేసారు 1857 సిపాయిలు తిరిగి తర్వాత భారతదేశంపై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం బ్రిటన్ ప్రభుత్వం చేతిలోకి వెళ్ళింది భారతీయులు బ్రిటన్ వలసపాలిత భారతీయులుగా పిలవబడ్డారు నాటి నుంచి భారతీయ వ్యాపారులు కూడా వస్త్రాలను ఎగుమతి చేసుకోవడానికి వీలు కల్పించారు ఇది మళ్ళీ తమ దేశ ఎగుమతుల మీద ప్రభావం చూపిస్తుందని భావించిన బ్రిటన్ ప్రభుత్వం భారతీయుల అమ్మకాలు కొనుగోళ్ల మీద ప్రత్యేకంగా బిల్ తయారు చేస్తుంది స్పెషల్ కౌన్సిల్ బిల్ అని పిలవబడిన ఆ విధానం ప్రకారం ఇంగ్లాండ్ కు ఎగుమతి చేయదలుచుకున్న భారతీయ వస్త్ర వ్యాపారులు ఆ దుస్తుల తాలు వస్త్రాన్ని ముందుగా లండన్ కు పోయి కొనుక్కోవాలి దాన్ని భారత్ లోని కళాకారులకు ఇవ్వాలి భారతీయ పని వాళ్ళు వాటిని భారత్ లోనే తయారు చేసి వ్యాపారులకు ఇవ్వాలి వారందుకు ప్రతిగా వెండి బంగారాలు చెల్లించకుండా భారతీయ రూపాయలను చెల్లించే వాళ్ళు తిరిగి పన్ను రూపంలో ఆ రూపాయల్లో నుంచి కొంత బ్రిటన్ వలస ప్రభుత్వం వసూలు చేసుకునేది శ్రమ లేకుండా లాభం గడించడం కోసం బ్రిటన్ వలస ప్రభుత్వం వేసిన ఎత్తుగడ అది దమ్మిడి ఖర్చు లేకుండా భారతీయ కళాకారుల తోలు వలిచి లాభం గడించేది అలా భారతదేశంలోని వస్త్ర పరిశ్రమ దివాళ తీసింది 1900 వ దశకంలో బ్రిటన్ వలస ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం రాజుకున్నప్పుడు అందరికంటే ఎక్కువగా బెంగాల్ ప్రజలు తమ రహదారుల మీద అగ్గి రాజేశారు అగ్గిలో విదేశీ వస్త్రాలను బొగ్గి చేశారు వస్త్రం వెనుక ఉన్న వంచనను భారతీయులు అర్థం చేసుకున్నారు గాంధీజీ స్వదేశీ ఉద్యమాన్ని విస్తరించే సమయంలో ఖాదీ వస్త్రాలను మాత్రమే భారతీయులు ధరించాలని ప్రతి ఇంట చరకా తిరగాలని పిలుపునిచ్చారు స్వాతంత్రోద్యమంలో భారతీయ వస్త్రం ప్రముఖ పాత్రలే పోషించింది 1940 ఆగస్టు 15న భారత స్వేచ్ఛా స్వాతంత్రాలను పొందినప్పటికీ భారతీయ వస్త్ర పరిశ్రమ పురాతన వైభవాన్ని మాత్రం సాధించలేకపోయింది ఇప్పుడు ఇక్కడ మిల్లు వస్త్రాలే అధికం చేనేత పని వాళ్ళు నేటికి ఉన్నారు కానీ చేనేత కళాకారుల చేతుల్లోని ఆ కళాకాంతులు ఎప్పుడో మసకబారాయి అక్కడక్కడ చుక్కల్లా మెరుస్తున్న కొంతమంది చేనేత కళాకారులను భారత ప్రభుత్వం గుర్తించింది పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది అయితే అది మెచ్చుకోలుకు గుర్తింపుకు మాత్రమే పరిమితమైపోయింది చేనేత వారోత్సవాల పేరిట ఏటా దేశమంతా వివిధ ప్రదర్శనలు నిర్వహిస్తూ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి స్వదేశంలోనూ విదేశాల్లోనూ జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో భారతీయ చేనేతను ప్రదర్శిస్తూ అతిథులకు చేనేత వస్త్రాలను వివిధ ఉత్పత్తులను జ్ఞాపికలుగా ఇవ్వడం కూడా జరుగుతోంది ఆ పాటి మన చేనేత కళాకారులకు సరిపోదు కదా చేనేత శ్రమ ఎక్కువ గిరాకి తక్కువ కావడంతో ధర ఎక్కువ పలుకుతోంది మిల్లుబట్టల కంటే ఎక్కువ ధర పలకడానికి అదే కారణం పుస్తకం జ్ఞాన బాండాగారం అయితే డాక్టర్ వాట్సన్ రాసిన పుస్తకం అందుకు మినహాయింపు సామ్రాజ్యవాద విస్తరణకు ప్రధాన ఆయుధంగా మారి ఒక దేశ కళాత్మక సృజనాత్మకతను దోచుకొని ఆ కలను చంపేసింది ఆ పుస్తకం మరి మీరేమంటారు ఆ పుస్తకంపై భారతీయులుగా మన వాతావరణానికి అనుకూలంగా మన సంస్కృతికి వారసత్వ చిహ్నంగా భారతీయ చేనేతను మళ్ళీ జీవింపజేసేలా మనం ఏం చేయాలన్నది మీరు కూడా సలహా ఇవ్వండి జై హింద్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్ 

No comments:

Post a Comment