Saturday, February 1, 2025

Neem Karoli Baba Life Story Last Part: The Baba Who Inspired Steve Jobs & Ram Dass | #neemkarolibaba

 Neem Karoli Baba Life Story Last Part: The Baba Who Inspired Steve Jobs & Ram Dass | #neemkarolibaba



హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భార్గవ రెడ్డి నేను గత కొన్ని సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నాను నాకు యోగులన్న యోగుల జీవిత చరిత్ర అన్నా చాలా ఇష్టం అయితే ఈ మధ్యనే భారతదేశ సుప్రసిద్ధ గురువుల్లో ఒకరైన శ్రీ నీమ్ కరలి బాబా గారి జీవిత చరిత్రను చదవడం జరిగింది అయితే ఈ వీడియోలో బాబా గారి జీవిత చరిత్ర చివరి భాగాన్ని మీతో పంచుకోబోతుంది బోతున్నాను ఈ వీడియోలో బాబా గారు చేసిన మరికొన్ని మహిమల గురించి తెలుసుకోబోతున్నాం అవేంటంటే చనిపోయిన యువకుడిని బాబా ఎలా బ్రతికించారు రిక్షా తొక్కుకునే సీతారాం అనే వ్యక్తి ఏ విధంగా బాబా కృప వల్ల కోటీశ్వరుడు అయ్యాడు అసలు బాబా జైలు ఫుడ్ ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది యమధర్మరాజు నీమ్ కరులి బాబాని ఎందుకు కలవాల్సి వచ్చింది కలిసినప్పుడు వారి మధ్య ఏం జరిగింది అదేవిధంగా బాబా శరీర ఎక్కడ విడిచిపెట్టారు అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇంకొక అనుభవం చెప్తాను ఒకసారి బాబా గారు భూమిదార్ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ భూమిదార్ ఆశ్రమం ఎక్కడంటే కెంచిమ్ నుంచి కొంత దూరంలోనే ఈ భూమిదార్ ఆశ్రమం ఉంది సో అక్కడ బాబా ఉంటున్నప్పుడు బాబా గారికి ప్రియ శిష్యుడు ఒకాయన ఉంటారు ఆయన పేరు ఓంకార్ సింగ్ ఈ మన బాబా గారికి ఒక భక్తుని కలుసుకోవాల్సి వస్తుందన్నమాట అయితే ఆ భూమిర ఆశ్రమం నుంచి వేరే ఊరు వెళ్ళాలి సో అప్పుడు ఈయన ఓంకార సింగ్ ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉన్న కారుని అదేవిధంగా బాబాని తీసుకెళ్లడానికి ఒక డ్రైవర్ కావాలి కదా అలా ఈ ఓంకార్ సింగ్ గారి కొడుకుని డ్రైవర్ గా పంపిస్తాడు ఓంకార్ సింగ్ గారి కొడుకు పేరు యుధిష్ఠిర్ సింగ్ ఈ యుధిష్ఠిర్ సింగ్ వయసు ఒక 20 22 సంవత్సరాలు ఉంటుంది ఈ అబ్బాయి బాబా గారిని కార్లో ఎక్కించుకొని ఏ వ్యక్తినైతే కలవాలో ఆ వ్యక్తిని కలిసిన తర్వాత తిరిగి మళ్ళీ ఆశ్రమానికి తీసుకొస్తాడు మరుసటి రోజు పొద్దున్నే ఈ యుధిష్ఠిర్ సింగ్ కాళ్ళ కృత్యాలు తీర్చుకోవాలని ఆశ్రమం వెనకున్న చెట్లు పొదల్లోకి వెళ్తాడు వెళ్తే అనుకోకుండా నల్ల తాచుపాము ఈ యుధిష్ఠిర సింగ్ ని కరుస్తుంది ఈ యుధిష్ఠి సింగ్ భయంతో ఆ ప్లేస్ నుండి ఆశ్రమం వైపు పరిగెత్తు పరిగెత్తుతూ దారి మధ్యలో పడిపోతాడు చనిపోతాడు అయితే అక్కడున్న వాళ్ళు వెళ్లి బాబా గారితో చెప్తారు ఇలా మీతో పాటు వచ్చిన కుర్రాడు చనిపోయాడు అని బాబా గారు ఎక్కడైతే ఆ యుధిష్ఠి సింగ్ చనిపోయి పడి ఉన్నాడో అక్కడికి వస్తాడు ఈ లోపల అక్కడున్న జనాలందరూ కొంతమంది ఏడుస్తూ ఉంటారు చనిపోయాడు అని ఆ ఏడుస్తున్న వాళ్ళని చూసి ఏమైంది అని ఏడుస్తున్నారు ఏం కాలేదు అని చెప్పి బాబా గారి శరీరం పైన ఎప్పుడు ఒక కంబలి ఉంటుంది మీరు ఈ ఫోటోలో చూస్తే ఆయన ప్రతిక్షణం ఆయనతో పాటు ఒక కంబలి కప్పుకొని ఉంటారు ఆయన ఆ కంబలిని తీసి ఆ యుధిష్ఠి సింగ్ అంటే చనిపోయి పడి ఉన్న అబ్బాయి పైన కప్పుతాడు వాడి పైన కప్పి బాబా గారు ఇలా చెప్తారన్నమాట ఏ యుధిష్ఠి సింగ్ నీ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలిరా మనం అర్జెంట్ గా వెళ్ళాలి రాణికి అయితే వెళ్ళాలి లే లే అంటాడు ఈ యుధిష్ఠి సింగ్ ఏమో అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంటారు ఈ యుధిష్ఠి సింగ్ ఏమో నిద్రలో నుండి బయటకు వచ్చినట్లు ఆ కంబలు తీసి ఆ ఓకే స్వామీజీ ఓకే స్వామీజీని లేస్తాడు బాబా అంటారు వెళ్లి కార్ దిగిరా ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం అంటాడు ఈ యువకుడు పరిగెత్తుకుంటూ వెళ్లి కార్ ని రెడీ చేస్తారు ఇలా ఈ బాబా గారు చనిపోయిన వ్యక్తులను కూడా బ్రతికించేవారు ఇలా బాబా నుంచి కాపాడబడిన యుధిష్ఠిర్ సింగ్ 82 సంవత్సరాలు జీవించారు ఒకసారి ఏమవుతుంది అంటే ఇది ఫేమస్ అనుభవం ఆయన లైఫ్ స్టోరీలో బాబా గారు ఆగ్రాలో ఒక భక్తున్ని కలవాల్సి ఉంటుంది దాని కోసమని ఈయన రైలు మార్గం ద్వారా వెళ్లి ఆగ్రా రైల్వే స్టేషన్ లో దిగుతాడు సమయం పొద్దున్నే నాలుగు నాలుగున్నర ఆ మధ్యలో బాబా గారేమో స్టేషన్ నుండి బయటకు వస్తాడు అంటే అప్పట్లో రిక్షాలు ఉండేటివి ఇప్పుడు ఆటోలు కార్లు ఉన్నాయి కదా అప్పట్లో రిక్షాలు ఉండేటివి ఈ బాబా గారు వెళ్లి రిక్షా స్టాండ్ లో రిక్షా వాళ్ళని అడుగుతారు ఇలా ఫలానా చోటికి వెళ్ళాలి అంటే ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే ఈయన సాధువు ఈయన దగ్గర ఏం డబ్బులు ఉండవు పొద్దు పొద్దున్నే బోనీ కాకపోతే రోజు మొత్తం కూడా వాళ్లకు ఏం డబ్బులు రావనే ఒక సెంటిమెంట్ ఉంటుంది అలా అక్కడున్న రిక్షా స్టాండ్ లో ఎవరూ రారు అయితే సీతారాం అనే ఒక వ్యక్తి ఈయన దగ్గరికి వచ్చి అయ్యా మీరు నా రిక్షాలో కూర్చోండి మిమ్మల్ని మీరు ఎక్కడికి వెళ్లాలో అక్కడ మిమ్మల్ని దింపుతాను అంటాడు బాబాయ్ వెళ్లి ఆయన రిక్షాలో కూర్చుంటాడు అడ్రస్ చెప్తాడు ఈ సీతారాం అనే వ్యక్తి బాబా గారిని తీసుకెళ్లి ఆ ప్లేస్ లో దించుతాడు దించిన తర్వాత బాబా గారు తీసి డబ్బులు ఇవ్వబోతారు ఇవ్వకపోతే ఆ సీతారాం అనే వ్యక్తి తీసుకోకుండా అయ్యా నాకు డబ్బులు వద్దు మీ ఆశీర్వాదం నాకు కావాలి అదేంటంటే మా ఇంట్లో ఇలా ముగ్గురు పిల్లలు ఉన్నారు నేను నా భార్య నేను ఒక్కడినే సంపాదిస్తున్నాను నా పిల్లల చదువు వాళ్ళ ఫుడ్ అన్ని చూసుకోవడానికి నాకు చాలా కష్టంగా ఉంది కాస్త మీరు నాకు ఆశీర్వదించండి నాకు ఏదో విధంగా ఒక ఒక మంచి పని దొరికేటట్లు అని ఈ రిక్షా అతను బాబా గారిని వేడుకుంటారు అప్పుడు బాబా గారు ఈ రోజు నుంచి నీ జీవితం మారిపోయింది పో అంటారు ఈ రిక్షా డ్రైవర్ ఆ మాట విని ఎంతో సంతోషిస్తాడు బాబా గారు ఆ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు ఈ రిక్షా అతను మళ్ళీ బాబా బాబా అని పిలుస్తాడు బాబా తిరిగి చూసి ఏంటి అంటాడు అయ్యా మీరు మీ బ్యాగ్ ని మర్చిపోయారు తీసుకెళ్ళండి ఇద్దో అంటారు ఆయన అంటారు అది నా కోసం కాదు అది నీ కోసమే దీన్ని ఇక్కడ చూడకు ఈ బ్యాగ్ ని మీ ఇంటికి తీసుకెళ్ళు మీ ఇంట్లో విప్పి చూడు అంటాడు సరే అని ఈ సీతారాం అనే వ్యక్తి ఇంటికి వెళ్తాడు పొద్దున్నే ఐదున్నర ఆరు మధ్య సమయం ఇది పోంగానే ఈ సీతారాం గారి వైఫ్ సీతారాం చూసి బాధపడతాది అరే మనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నువ్వు ఇప్పుడు వెళ్ళావు అప్పుడే వచ్చేస్తున్నావు వాళ్ళ చదువులు ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని సీతారాం గారి బాధ భార్య బాధపడుతుంటుంది అప్పుడు ఈ సీతారాం గారు ఒక సంచి తీసుకెళ్లి ఈ జరిగిన స్టోరీ మొత్తం చెప్తారు చెప్తే ఆ సంచిలో ఏముందో చూడాలి కదా సరే ఈ భార్య భర్తలు ఇద్దరు విప్పి ఆ సంచి చూస్తారు సంచిలో కలశం లాంటి ఒక రాగి పాత్ర ఉంటుంది ఈ ఇద్దరు ఆ రాగి పాత్రను విప్పి చూస్తారు విప్పి చూస్తే ఆ రాగి పాత్ర నిండా బంగారు నాణ్యాలు ఉంటాయి అలా ఆ రోజు నుంచి సీతారాం కాస్త సీతారాం సేట్ అవుతాడు సేట్ అంటే కోటీశ్వరుడు వాళ్ళ కొడుకులు వీళ్ళంతా పెద్ద బిజినెస్ లో ఉన్నారు అలా బాబా గారి వల్ల ఒక రిక్షా దక్కుకుండే వ్యక్తి పెద్ద కోటీశ్వరుడై ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవుతాడు అదేవిధంగా ఆ సీతారాం గారు అనేక గుడులను నిర్మిస్తాడు మీకు ఇంకొక అనుభవం చెప్తాను బాబా గారు కీల ఘాట్ లో ఉంటున్నప్పుడు ప్రతిరోజు బాబా జైలుకి వెళ్లి జైల్లో పెట్టే ఆహారాన్ని తినేవారు ఇలా కొన్ని రోజులు జరుగుతుంది అప్పుడు ఒక భక్తుడు బాబాని అడుగుతారు బాబా నాకు ఒక చిన్న డౌట్ ఉంది అదేంటంటే అసలు మీరు జైలుకి వెళ్లి ఫుడ్ తినడం మాకు నచ్చలేదు ఎందుకంటే ఇక్కడ ఈ ఆశ్రమంలో ఇంత మంచి ఫుడ్ వండుతున్నారు అదేవిధంగా నీ భక్తులు కూడా నీకు ప్రసాదాన్ని తీసుకొస్తున్నారు మీరు ఇవేమీ తినకుండా ఎక్కడో ఆ జైలుకి వెళ్లి వాళ్ళ దగ్గర అడుక్కొని తినడం మాకు నచ్చట్లేదు అసలు దీని వెనకున్న మర్మం ఏమిటి ఏంటి అని అడుగుతాడు అప్పుడు బాబా అరే అక్కడ జైల్లో ఖైదీలు ఉన్నారు కదా ఆ ఖైదీలకు వాళ్ళు సరైన ఆహారం పెట్టట్లేదు అదే నేను వెళ్ళాను అనుకో నేను వస్తున్నానని వాళ్ళు బాగా ఆహారం వండుతున్నారు వండి వాళ్ళకి పెడుతున్నారు అని చెప్తాడు అంటే ఆయన అలా ఖైదీల గురించి కూడా ఆయన ఆలోచించి వాళ్లకు మంచి ఫుడ్ ఇవ్వాలని ఈ బాబా గారు ఆ కీల ఘాటికి దగ్గరలో ఉన్న జైలుకి వెళ్లి ఆహారం తినేవారు ఒకసారి ఏమవుతుందంటే బాబా గారు భూమిర ఆశ్రమంలో భక్తులతో కూర్చొని మాట్లాడుతుంటారు అదే సమయంలో ఒక విచిత్రమైన వ్యక్తి బాబా దగ్గరికి వస్తాడు అతను చూడ్డానికి ఎలా ఉంటాడు అంటే నల్లగా బాగా కండలతో అతను వేసుకున్న దుస్తులు కూడా చాలా పాతవిగా కళ్ళేమో ఎర్రని నిప్పు కణాల్లా ఉంటాయి అతను బాబా దగ్గరికి వచ్చి బాబాని చడబడా చడబడ తిడుతుంటాడు అక్కడున్న భక్తులకు ఏమి అర్థం కాదు అసలు ఎవరు ఇతను ఎందుకు ఇలా తిడుతున్నాడు ఏ కారణం లేకున్నా ఇంత పెద్ద గురువును పట్టుకొని అసలు ఎందుకు తిడుతున్నాడు అక్కడున్న అందరికీ ఆశ్చర్యం వేస్తుంది అతనేమో తిడుతుంటాడు బాబా ఏమో నవ్వుతుంటాడు అతను తిడుతుంటాడు ఈయన నవ్వుతుంటాడు కాసేపు తర్వాత అప్పుడు బాబా అక్కడున్న భక్తుడితో లోపలికి వెళ్లి ఆహారాన్ని తీసుకురా ఈయన కోసం అని చెప్తాడు ఈ భక్తులకు ఏం అర్థం కాదు ఆయనేమో తిడుతున్నాడు ఈయనేమో నవ్వుతున్నాడు మధ్యలో ఆయనకు ఆహారం తీసుకొచ్చి పెట్టండి అంటున్నాడు అని ఆ భక్తుడు సరే ఈయన చెప్పాడు కదా అని లోపలికి వెళ్లి ఆహారాన్ని తీసుకొస్తాడు ఈయన తిడుతుంటాడు తిడుతుంటాడు ఇలా ఆయన తిట్టి తిట్టి తిట్టి అలసిపోయి ఆ వ్యక్తి బాబాతో అంటాడు అసలు నువ్వు ఎవడు ప్రతిసారి నా పనిలో వేలు పెట్టడానికి అసలు నీకు ఏం అధికారం ఉంది చూస్తూ ఉండు నేనేంటో నీకు చూపిస్తాను అంటాడు అప్పటివరకు శాంతంగా నవ్వుతున్న బాబా ఒక్కసారిగా ఆ వ్యక్తి వైపు ఉరిమి చూస్తాడు అంతే ఒక్కసారిగా ఆయన ఆ మాటలు ఆపేసి పరిగెత్తుకుంటూ ఆశ్రమం బయట వెళ్తాడు అలా అందరూ చూస్తుండగానే అతను కొంత దూరం వెళ్లి అదృశ్యం అయిపోతాడు ఇక్కడున్న భక్తులకు ఏం అర్థం కాదు అసలు వచ్చిన వ్యక్తి ఎవడు ఈయన ఎందుకు తిట్టాడు అలా కొంత దూరం వెళ్లి ఎలా అదృశ్యం అయిపోయాడు అనే ఒక భక్తుడు ఏంటి స్వామి ఇదంతా అతను ఎవరు అని అడుగుతాడు అడిగితే అప్పుడు బాబా అతనా అతని పేరు యమధర్మరాజులే అంటాడు అక్కడున్న వాళ్ళకి అందరికీ ఒక్కసారిగా గుడ్డ జల్లుమంటుంది అదేంటి స్వామి అంటే ఆ ఏం లేదు లే మొన్న ఈ మధ్య ఒకరిని తీసుకెళ్లాలి అనుకున్నాడు నేను ఆ ఛాన్స్ ఆయనకి ఇవ్వలేదు కదా అందుకు కోపంతో నా మీద వచ్చారు సర్లే ఇంకేం లేదులే అంతే అంటాడు ఆబ్వియస్ గా ఆయన యమధర్మరాజు ఆయన డ్యూటీ నేను చేయనివ్వడం లేదు ఈయన ఆపుతున్నాడు అలా ఆయనకు కోపం వచ్చి ఈయన దగ్గరికి వచ్చాడు సో ఇలా బాబా గారి ఎన్నెన్ని చెప్పాలి అనుభవాలు బాబా గారు కెంచిదాం ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒకరోజు ఆయన ప్రియ శిష్యుని పిలిచి రేపు నేను బృందావన్ వెళ్ళాలి అనుకుంటున్నాను దానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యి అని చెప్తారు అయితే ఈసారి నేను కార్లో కాకుండా రైల్లో వెళ్తాను అని చెప్తారు ఆ భక్తుడికి ఏం అర్థం కాదు ఇదేంటి ఫస్ట్ టైం ఈయన అంటే ఎప్పుడు బృందావనం వెళ్ళేవారు ఇక్కడి నుంచి కార్లో వెళ్ళేవారు ఈసారి ట్రైన్ లో వెళ్తాను అంటారు ఏంటి అని ఆలోచించి ఆయన గురువు కాబట్టి ఆయన చెప్పినట్టుగానే ట్రైన్ లో వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాడు మరుసటి రోజు పొద్దున్నే బాబాగారు ఆ కెంచిదాం ఆశ్రమం మొత్తం చుట్టూ తిరిగి ఆ ఆశ్రమంలో ఉన్న కాళికాదేవి విగ్రహం ముందు హనుమంతుడి విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారు ఇది అక్కడున్న భక్తులకి కాస్త వింతగా ఉంటుంది అంటే ఎప్పుడూ చేయని విధంగా బాబాజీ ఆ రోజు చేస్తుంటారు ఒక్కసారిగా ఆకాశం మొత్తం కూడా ఉరుములు మెరుపులు మొదలవుతాయి అలా బాబా ఆ ఆశ్రమం నుంచి బయటకు వస్తారు రాంగానే ఆయన శరీరం పైన ఉన్న కంబలి కింద పడిపోతుంది అక్కడున్న భక్తుడు వెంటనే వెళ్లి ఆ కంబల్ని తీసి బాబా శరీరం పైన కప్పాలని చూస్తారు చూస్తే బాబా ఆపి ఇక దీని అవసరం నాకు లేదు వదిలేయ్ అంటారు ఆ భక్తుడికి ఏం అర్థం కాదు అలా బాబా కెంచిమ్ నుంచి మధుర స్టేషన్ చేరుకుంటారు చేరుకోగానే బాబాని చూడడానికి అక్కడున్న భక్తులందరూ మధుర రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తుంటారు ఆయన శరీరం నుంచి విపరీతమైన వస్తుంటుంది ఒక భక్తుడి దగ్గర బాబా నీళ్లు తీసుకుని తాగుతాడు తాగి బాబా అన్కాన్షియస్ అయిపోతారు అప్పుడు బాబాని ఆశ్రమానికి తీసుకెళ్లకుండా నేరుగా రామకృష్ణ మిషన్ హాస్పిటల్ కి తీసుకెళ్తారు తీసుకెళ్లి ఆయనకు ఊపిరి ఆడడం ఇబ్బందిగా ఉంటే ఆక్సిజన్ మాస్క్ పెట్టి బ్లడ్ టెస్ట్ కి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు అప్పుడు బాబా కోపంతో ఆయనకు పెట్టిన మాస్క్ ని తీసేసి నేల మీద కొట్టి ఇవేమి అవసరం లేదు అని చెప్పి జై జగదీష్ హరి జై జగదీష్ హరి జై జగదీష్ హరి అని మూడు సార్లు చెప్పి బాబా గారు శరీరాన్ని వదిలేస్తారు అలా బాబా గారు 1900 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన లక్ష్మీనారాయణ శర్మ గారి శరీరాన్ని తీసుకొని 1973 వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన అంటే 73 సంవత్సరాలు ఆ శరీరంతో ఉండి బాబా నీ కరులిగా శరీరాన్ని వదిలేస్తారు బాబా శరీరం శరీరం తీసుకున్నది ఆ శరీరాన్ని విడిచిపెట్టింది రెండు ఒకటే రోజు బాబా శరీరం వదిలే ముందు కొంతమంది భక్తులు ఏడుస్తుండగా అప్పుడు బాబా గారు నేను ఎక్కడికి పోవడం లేదు ఇక్కడే ఉంటున్నాను కేవలం శరీరాన్ని మాత్రమే విడిచిపెడుతున్నాను అని చెప్పి శరీరాన్ని విడిచిపెడతారు దానికి నిదర్శనంగా బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ఎంతో మంది భక్తులకు దర్శనం ఇచ్చారు ఇప్పటికీ ఇస్తున్నారు ఆయన జీవిత చరిత్రను చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీ నీమ్ కరులి బాబా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా బాబా గారి జీవిత చరిత్రను విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు జై నీమ్ కరోలి బాబా జై శ్రీరామ్ జై హనుమాన్ మళ్ళీ మనం మరో గొప్ప యోగి జీవిత చరిత్రతో కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు 

No comments:

Post a Comment