Friday, March 4, 2022

🍁అప్పుడే పుట్టిన బిడ్డ ఎందుకు ఏడుస్తుందో మీకు తెలుసా?🍁

*🍁అప్పుడే పుట్టిన బిడ్డ ఎందుకు ఏడుస్తుందో మీకు తెలుసా?🍁

📚✍️ మురళీ మోహన్

🤔ఈ రోజో...నిన్ననో పుట్టిన బిడ్డ బాగా ఏడుస్తూనే ఉండటం మనం
చూస్తూనే ఉంటాము.....ఈ బిడ్డ ఎందుకు ఏడుస్తుందో అని తెలుసుకోవాలని
ఉన్నా ఏవో కారణాల వలన తెలుసుకోలేకపోయి ఉండవచ్చు......
నిజంగా ఓ బిడ్డ పుట్టగానే ఎందుకు ఏడుస్తుంది అంటే........
అమ్మ కడుపులో ఉన్న ఆ 10 నెలలు లయబద్ధకంగా వినపడే గుండె చప్పుడును
వింటూ తన్మయం చెందుతూ ఉంటుంది.......ఆ చప్పుడులో తనను తాను
మరచిపోయి ఆ చప్పుడే తనకు రక్షణగా భావిస్తూ ఉంటుంది...
బయటి ప్రపంచంలోకి రాగానే ఆ చప్పుడు దూరమై తనకు ఏదో అవుతోంది
అని భయంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆ బిడ్డ,,,,,,,,,ఆ ఏడుపు ఆ తల్లి
ఒడిలోకి చేరగానే ఆపేస్తుంది గమనించండి.......తల్లి తనను దగ్గరకు
తీసుకోగానే మళ్ళి ఆ గుండె చప్పుడు విని తనకు ఏమీ భయం లేదని
ఆ బిడ్డకు తెలిసిపోతుంది.......
నిజంగా తల్లిమీద ఆ పసికూనకు ఎంత నమ్మకమో కదా! అమ్మ ప్రేమకు
అనురాగానికీ సాటి లేదు.......చివరికి తన గుండె చప్పుడు కూడా ఆ బిడ్డకే అంకితం చేసే అమ్మతననికి నా శాతకోటి వందనాలు!
నాకు ఈ ప్రపంచం లో అమ్మ తరువాతే ఎవరైనా.......
అమ్మ తిట్టిందనో,కొట్టిందనో,నాకేది చేయలేదనో అమ్మను దూరం చేసుకోకు. మనకు ఆమె జన్మనివ్వడం ఒక్కటి చాలు మనం జీవితాంతం ఆమెకు ఋణపడి ఉండడానికి.....🙏

సేకరణ

No comments:

Post a Comment