Sunday, March 13, 2022

నేటి మంచిమాట. ఇక్కడ గమనించటం అంటే...

నేటి మంచిమాట.

"దేహంపైఉన్న ధ్యాసను చైతన్యంపై ఎలా నిలపాలి ?"

"అద్దంలో ప్రతిబింబం చూసుకునేప్పుడు మనకు ఆ అద్దంపై ధ్యాస ఉండదు.

అద్దాన్నే చూడాలనుకుంటే అందుకు మన ప్రతిబింబం అడ్డేమీ కాదు.

ప్రతిబింబంపై ఉంచిన ధ్యాసను అద్దంపైకి తెచ్చుకుంటే సరిపోతుంది.

అలాగే ప్రస్తుతం దేహంపై ఉన్న ధ్యాసను చైతన్యంగా ఉన్న 'అసలు నేనెవరు' అనే విచారణలోకి మార్చాలి.

కేవలం మంత్రజపం చేస్తూపోతే ఆధ్యాత్మికంగా ప్రయోజనం ఉండదు. మనలోనుండి ఆ జపాన్ని చేసేదెవరో గమనిస్తేనే సత్యం తెలుస్తుంది.

అంటే మనసుకు మూలంగా ఉన్న చైతన్యం తెలుస్తుంది.

ఇక్కడ గమనించటం అంటే మనసు చేసే మంత్రాన్ని, ఆ మనసే వినేంత శ్రద్ధగా చేయటం అన్నమాట !"

శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment