Thursday, August 18, 2022

మంచి మాట..లు(17-08-2022)

బుధవారం:-17-08-2022
ఈ రోజు AVB మంచి మాట..లు
విజయాల నుండి వినయాన్ని, పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకున్న వాడే గొప్పవాడు,
విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం మీ సొంతం అవుతుంది,
వాదించే వారికి నువ్వెంత తక్కువ స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు,
మనుషులకు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ చులకనగా మాత్రం చూడకు...సమాజం లో వాడుకొని నిందలు వేసే వారు ఉన్నారు

ఆశయం లేని జీవితం, విశ్వాసం లేని మాటలు, పట్టుదల లేని పనులు ఎప్పటికి కోరగానివి. నిప్పై కాల్చుతుంది నీలోని దుర్గుణం, నీడై నిలుస్తుంది..నీలోని సద్గుణం

నీలోని సద్గుణం మరియు హృదయం కూడా భూమిలాంటిదే, ద్వేషం అనే మొక్కను నాటితే విషం చిమ్ముతూ పెరుగుతుంది, ప్రేమ, విశ్వాసం అనే విత్తనాలు నాటితే సమాజానికి పనికి వచ్చే మొక్కలను ఇస్తుంది...
సేకరణ ✍️AVB సుబ్బారావు

No comments:

Post a Comment