Wednesday, August 24, 2022

వాస్తవం - అవాస్తవం

 వాస్తవం - అవాస్తవం

ఒక గురువుగారు మరియు అతని శిష్యుడు వీధి దీపాల కింద నడుచుకుంటూ వెళుతున్నారు...

శిష్యుడు గురువుగారిని ఒక ప్రశ్న అడుగుతాడు..

అయ్యా! వాస్తవమంటే ఏమిటీ...?
అవాస్తవమంటే ఏమిటి...?""అని...

గురువుగారు చాలా ఆచరణాత్మక భోధిసత్తుడు....
మౌనంగా ఆ వీధి దీపాలకిందే నడుస్తూ ఉంటాడు ప్రశ్న వున్నప్పటికీ కూడా...

కొంత దూరం వెళ్ళాక తల ఎత్తి ఆ దీపాల వైపు చూస్తాడు
ఆరిపొమ్మన్నట్లు ఆజ్ఞ జారీ చేస్తూ మౌనంగానే.....

వున్నట్లుండి ఆ దారిలోని చమురు దీపాలన్నీ ఆరిపోతాయి..
ఇద్దరూ నడుస్తూనే వుంటారు....ఇంతలో వాళ్లముందర ఒక
పాము కనిపిస్తుంది దారికి ఎదురుగా...

శిష్యుడు అటూ ఇటూ వేదికి చివరికి ఆ చీకటిలో కఱ్ఱలాంటిదేదో చేతికి చిక్కితే దాన్ని తీసుకుని ఆ పాముని
గబా..గబా..అని నాలుగు బాదుతాడు....

అదే సమయంలో గురువుగారు  తల పైకెత్తి దీపాలను
వెలగమన్నట్లు మౌనంగానే ఆజ్ఞ జారీ చేస్తాడు...దీపాలన్నీ మళ్లీ వెలుగుతాయి...

ఆ వెలుగులో చూస్తే శిష్యుడు ఏదైతే పామనుకున్నాడో అది
పాము కాదు...వంకర కర్ర..
అదే సమయంలో ఏదైతే కర్ర అనుకుని చేతిలో పట్టుకున్నాడో
 అది పాము....
శిష్యుని గుండె ఆగినంత పనైంది...వెంటనే ఆ పామును 
వదిలేసి కర్రను పట్టుకుంటాడు...
గురువు గారు చిన్నగానవ్వి....""శిష్యా నీ ప్రశ్నకి సమాధానం దొరికిందా"""? అని అడుగుతాడు....

ఇప్పుడు శిష్యుడు రెండు చేతులు జోడించి గురువుగారికి
ప్రణమిల్లుతాడు....

అప్పుడు గురువుగారు...

చూడు శిష్యా ఈ మానవుడు....
ఏదైతే కనబడుతోందో ( శరీరము,,,ఆస్తులు,,,భౌతికము,,బంధాలు,,)
వాటిని వాస్తవమని నమ్ముతాడు...నువ్వు 
కర్రని పామని నమ్మినట్లు....పైవన్నీ కూడా కేవలం
మనసులో ఇమిడే భావాలు మాత్రమే....ఎవైతే మనసులో
ఇముడుతాయో అవన్నీ అవాస్తవాలే...కానీ వాటినే సత్యమనీ ,,శాశ్వతమనీ ,,నమ్ముతున్నాడు
ఇక ఏదైతే కర్ర అనుకున్నావో అది పాము....

ఈ మనిషి అనేవాడు
 ,,,ఏదైతే మాయకు ప్రాణం పోస్తుందో,,, ఏదైతే బంధానికి ప్రాణం పోస్తుందో,,,ఏదైతే ద్వంద్వానికి ఊతం ఇస్తుందో,,, దాన్నే,,, ఆ పామనే మనస్సునే వాణ్ణి వాడు రక్షించుకునే ఆయుధంగా వాడతాడు....

పాము సత్యం కానీ అది చేతిలో ఉంది...కర్ర అనుకుంటున్నావు కాబట్టి...అవాస్తవం...
కర్ర సత్యం కానీ అది కింద ఉంది...పామనుకుంటున్నావు కాబట్టి..... ఇదీ అవాస్తవమే....

 ఏదైతే చంపబడాలో ( మనస్సు ) దాన్ని పట్టుకుంటాడు...
ఏదైతే చంపడానికి పనికొస్తుందో (జ్ఞానం ) దాన్నే పామనుకుని వదిలించుకోవాలనుకుంటాడు....

కనబడుతున్న దాన్ని ( శరీరాన్ని ) శాశ్వతసత్యమని 
కనబడని ఆత్మను అసత్యమని నమ్ముతాడు.......
చీకట్లో ఉన్నంత వరకూ మనిషి ఇలాగే ఉంటాడు...

వెలుగొచ్చాక నువ్వు పాముని వదిలేసి 
కర్రను పట్టుకున్నట్లే...మనిషి
జ్ఞానోదయం అయ్యాక శరీర సత్యం వదిలేసి
ఆత్మసత్యం  పట్టుకుంటాడు.



🔹🔸🔹🔸🔹🔸🔸

No comments:

Post a Comment