*జీవిత సత్యం*
*తుమ్మెద పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి అందులో జీవనం కొనసాగిస్తుంది.. చెక్కలకు, మొద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది.
*కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు ఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి.
*అయ్యో నన్ను ఏదో బంధించేసింది అని చెప్పేసి ఆ తామర రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది..
*అయితే మహా మహా వృక్షాలకు రంధ్రం చేయగలిగిన దాని సామర్థ్యం ఆ తామర రేకులను తొలచలేదా..? ఆ తామర రేకులకు రంధ్రాలు చెయ్యలేదా..? గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి...!
*కానీ ...
అది దాని సామర్థ్యం మర్చిపోవడం, మకరందం గ్రోలే మత్తులోనో...
*లేక
నన్నేదో బంధించింది అన్న భావన దాని శక్తిని బలహీన పర్చింది.. ఆ భావనను నమ్మడమే దాని బలహీనత..!
*’నేను రంద్రం చేయలేనిదేదో నన్ను బంధించింది’... అనే దాన్ని నమ్మింది...! అంతే అది మరణాన్ని కొనితెచ్చుకుంది...!
*మన జీవితంలో సమస్యలూ అంతే, సమస్య బలమైనది కాదు..!
మనశక్తిని మనం మర్చిపోవడమే దాని బలం...!
మన శక్తికంటే దాన్ని బలంగా చూడడమే, గుర్తించడమే, నమ్మడమే దాని బలం...!
*"మాయ" అనేది నీ ఆత్మశక్తి కంటే బలమైనది కాదు...!
*దాని బలం తామర రేకు అంత..!
నీ ఆత్మబలం వృక్షాలకు రంధ్రాలు చేయగలిగేదంత!
*తెలుసుకో అదే..జీవిత సత్యం..!
(భగవద్గీత)
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏
*రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయతను కూడా నేర్పుదాం.
No comments:
Post a Comment