Wednesday, August 24, 2022

పుస్తకాలు చదవాలనుకునేవారికి పలు నెలవులు...

 ..పుస్తకాలు చదవాలనుకునేవారికి పలు నెలవులు

ఇక్కడ కాపీరైట్ పరిధి దాటిన పుస్తకాలు లేదా రచయితలు/ప్రచురణకర్తలు క్రియేటివ్ కామన్స్ లైసెన్సు లో విడుదల చేసిన పుస్తకాలు ఉంటాయి.

2. సత్యకామ్.కామ్ 
https://sathyakam.com/
ఇక్కడ రచయితల అనుమతితో వెబ్ లో చదవడానికి మాత్రమే అవకాశముండేలా కొన్ని పుస్తకాలున్నాయి(కవర్ పేజ్ కనబడే పుస్తకాలే ప్రస్తుతం చదవగలం. కవర్ పేజ్ కనిపించని పుస్తకాలు సాంకేతిక సమస్యల‌ వలన కనపడవు.) 

3. ఇంటర్నెట్ ఆర్కైవ్
https://archive.org/details/texts?&and[]=languageSorter%3A%22Telugu%22
ఇక్కడ తెలుగులో నలభై రెండు వేలకు మించి పాత పుస్తకాలున్నాయి.

4. గూటెన్‌బర్గ్ ప్రాజెక్ట్

https://www.gutenberg.org/browse/languages/te

ఇక్కడ ఒక ఆరు తెలుగు పుస్తకాలు ఉంటాయి.

5. తెలుగువన్ గ్రంథాలయం https://www.teluguone.com/grandalayam/amp/

ఇక్కడ చాలా పుస్తకాలు - కథలు, నవలలు అందుబాటులో ఉంటాయి.

6. కథానిలయం
https://kathanilayam.com/

కారా మాస్టారు గారి శ్రీకాకుళంలో ఉన్న కథానిలయానికి వెబ్ లో ప్రతిరూపం. కథలు వెతికేప్పుడు పిడిఎఫ్ అందుబాటులో ఉంటే పిడిఎఫ్ బొమ్మ కనిపిస్తుంది. నలభై ఐదు వేల కథలు చదివే వీలుంది.

7. కినిగె ఉచిత పుస్తకాలు

https://kinige.com/free
కినిగెలో ఉచితంగా చదువుకునేందుకు రెండు వేలకు పైగా పుస్తకాలున్నాయి. వీటిల్లో చాలా అపురూపమైన కథల పుస్తకాలు, నవలలు, వ్యాసాలు ఉన్నాయి.

8. ఈమాట జాలపత్రికలో పుస్తకాలు
http://www.eemaata.com/books/library.html

9. కౌముది జాలపత్రికలో పాత సంచికలను సంచికలవారీగా నెల నెలా చదవవచ్చు, లేదా రచయిత/రచన ఆధారంగా ఉన్న పిడిఎఫ్‌ల నుంచి చదువుకోవచ్చు.
ఆ సంచికలలో ఎన్నో ప్రసిద్ధ నవలలు, కథలు దాగున్నాయి.
https://www.koumudi.net/library.html
https://www.koumudi.net/monthly_copies.html

No comments:

Post a Comment