Wednesday, August 24, 2022

విష్ణు యొక్క చేతిలో ఏముంటుంది? శంఖము ఉంటుంది.

 *SANJEEVANI* - The Vibrant Life
                   Practicals

23rd August, 2022

 _*గురుచేతనత్వము - సంజీవని - 90*_

విష్ణు యొక్క చేతిలో ఏముంటుంది? శంఖము ఉంటుంది. శంఖము అంటే ఒక ట్రిలియన్. ట్రిలియన్ అంటే ఏంటో నన్ను అడక్కండి మళ్ళా పుస్తకం చూడాలి (నవ్వుతూ). సైన్స్ ఏం చెప్తుంది అంటే మానవ శరీరములో అన్ని కణాలుంటాయ్. సెల్స్ ఉంటాయి. దానిని ఋషుల యొక్క భాషలో శంఖము అంటారు. ఇట్ ఈజ్ ఏ నెంబర్ శంఖము అంటే. మన శరీరంలో ఉండే ప్రతి కణానికీ కూడా ఆ హృదయము సరఫరా చేసేటటువంటి నెత్తురు వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. అంచేత విష్ణువుని ఏమంటాం మనం *సర్వవ్యాపి* . ప్రతి కణానికి కూడా ఆ శక్తి వెళుతుంది. ఎక్కడి నుంచి వెళ్తోంది, హార్ట్ నుంచి వెళుతోంది. యంత్ర విద్య గురించి చెప్తూ చెప్తున్నాను అక్కడికి తీసుకెళ్తాను మిమ్మల్ని. అందుకు ఆహారం తీసుకునేటప్పుడు అది (యంత్రం) వేసుకోవాలి?  

 ఇంకొకటి ఏముంటుంది విష్ణువు చేతిలో? సుదర్శన చక్రం ఉంటుంది. మన శరీరంలో కూడా అనేక చక్రాలు ఉన్నాయి, లైఫ్ సైకిల్స్. రెస్పిరేటరీ సైకిల్ అది ఒక చక్రము. గాలి పిలుస్తూంటాం, వదుల్తూంటాం. ఇది కరెక్ట్ గా లేదనుకోండి, సుదర్శనంగా లేదు. వాడు గుర్రనుకోండి (గురక పెడతాడు), వాడి ప్రక్కన మీరు పడుకోండి చూస్తాను. అమెరికాలో అయితే ఆ పేరు మీద విడాకులు ఇచ్చేయొచ్చట. తెలియదు నాకు. అందుకే అట అన్నది. కరెక్టే కదా, రాత్రల్లా నిద్ర పట్టకపోతే గురకతో ఏం చేస్తాడు. అంచేత ఏంటి అక్కడ - సుదర్శనంగా లేదు శ్వాస పీల్చుకోవడం.  

 డైజెస్టివ్ సైకిల్ ప్యాంక్రియాస్ జ్యూస్ అది ఒక సైకిల్. నర్వ్స సిస్టం యొక్క సైకిల్ ఉంది. అంటే లోపలికి తీసుకెళ్లేటువంటి నర్వ్స్ ఎఫరెంట్, బయటికి తీసుకెళ్లేటువంటి నాడులు ఇఫరెంట్. లోపలికి వెళ్ళేటటువంటి నాడులు, బయటకి వచ్చేటటువంటి నాడులు దీంతో ఏమవుతుంది? ఒకటి జ్ఞానము, ఒకటి క్రియ. జ్ఞానపక్షము కరెక్ట్ గా ఉండి క్రియా పక్షము కరెక్ట్ గా లేదనుకోండి పెరాలసిస్ అంటాం దాన్ని. వాడికి అన్ని వినిపిస్తూనే ఉంటాయి పాపం చెయ్యి పైకెత్తాలనుంటుంది, కానీ మోటర్ నర్వ్స్ ఉంటాయే, యాక్టివేషన్ ఇచ్చే నర్వ్స్ పనిచేయ్యవ్. అంటే సుదర్శన చక్రము దెబ్బతినినది. అందుచేత చక్రాలు తెలియాలి మీకు. బాడీలో ఉన్నటువంటి చక్రాలు నేర్చుకోమని, విష్ణు యొక్క బొమ్మ పెడితే ముఖం నిండా పాలో ఏదో అభిషేకం చేస్తే, పాపం ఆయనకి జలుబు వస్తుంది ఊపిరి సలపదు. అదృష్టవశాత్తు ఏంటంటే ఆయన బొమ్మే అది. అది కాదు మీరు చేయాల్సింది, ఆ సుదర్శన చక్రము యొక్క లాజిక్ అర్థం చేసుకోండి. అంచేత మన శరీరంలో ఉండేటటువంటి ఆ సైకిల్స్, మీకు బాగా అర్థం అవ్వాలి. 

ఇదంతా కాకుండా గద ఉంటుంది ఒకటి. వాల్వ్స్‌, మీ శరీరంలో ఉన్నటువంటివి చూస్తే గద యొక్క స్ట్రక్చర్ అర్ధమవుతుంది. వాల్వ్స్‌ ఏంటి, రక్తం క్రిందకి వెళ్తోంది, పైకి రావాలి అంటే వాల్స్ కరెక్ట్ గా లేకపోతే ఏమవుతాయి? పైకి ఎక్కదు రక్తం కిందకి జారిపోతూ ఉంటుంది. అలాంటి గదా కరెక్ట్ గా లేనటువంటి సిస్టం ఏదైనా ఉందనుకోండి - వెరికోస్ వెయిన్స్ అనే కాళ్ళ లో, ఈ రిక్షా తొక్కి వాళ్ళ కాళ్ళు మీరు గమనిస్తే నరాలు ఉబ్బిపోయి ఉంటాయి . కారణమది. గద కరెక్ట్ గా పని చేయడం లేదు, బాదటం. అంటే మూవ్మెంట్. వాల్వ్స్‌. సిస్టమ్స్ . కానీ ఇదంతా కరెక్ట్ గా పని చేయాలి అంటే పద్మం మీద ఉండాలి వాడు. చేతిలో పద్మం ఉండాలి. అంటే ఏంటి, వాడు ఇన్వాల్వ్ అయిపోతే వాడు చెయ్యలేడు.

                      ----- *మాస్టర్ R.K*

జై గురుదేవ్
🙏🙏🙏 

No comments:

Post a Comment