Tuesday, August 23, 2022

యద్భావం తద్భవతి

 యద్భావం తద్భవతి

⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

 ఎవరి గురించి అయినా మనం ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదు.  ఇది ఒక నియమముగా పెట్టుకోవాలి. అలా ఆలోచించకుండా ఉండగలమా!  అని సందేహం కలుగుతుంది. అయినా దీన్ని మనం అభ్యాసం చేయాలి.  ఎందుకంటే దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి•

 నిరంతరం ఇతరుల గురించి చెడుగా ఆలోచించడం వల్ల ముందు మన మనసులో చెడ్డ వాతావరణం ఏర్పడుతుంది.  అది అవతలి వారికి ఎంత హాని చేస్తుందో తెలియదు కానీ, ముందు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది అని చెప్పటంలో తిరుగు లేదు.  దీనికి శాస్త్రీయమైన దాఖలాలు ఉన్నాయి. రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం అదుపు తప్పుతుంది. మనిషి ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాడు అంటారు. 

 దుర్యోధనుడు ఒకసారి వెతికితే ఎక్కడా అతడికి ఒక్క మంచివాడు కూడా కనపడలేదట.  చెడ్డ వాడికి మంచి ఎక్కడ కనిపిస్తుంది? ఏ చూపుతో చూస్తే ఆ భావమే అందరిలో కనిపిస్తుంది• 

 ఉదయం లేవగానే ఈ లోకం బాగుండాలి. అందరూ బాగుండాలి. అని హృదయపూర్వకంగా పది నిమిషాలపాటు కోరుకోవాలి.  
ఇలా చేస్తే ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.

⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

No comments:

Post a Comment