Wednesday, August 24, 2022

దీక్షగా చేయడం అంటే పట్టుదలతో చేయడం. దీక్ష అంటే ఏది ఉచితమో అది మాత్రమే చేస్తానని.

 అమృతత్వ విద్య -14

సంస్కారాలు కృష్ణుడి జీవితంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆ సంస్కారాలను మనం పునర్జీవింప చేసుకోవాలి. సంస్కారం అనేది మనస్సును మార్చేటటువంటి పద్ధతి. సంస్కరింపబడిన తర్వాత మనస్సు మారిపోవాలి. ఒకడు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఇంజనీర్ లాగా ఆలోచించాలంటే కనీసం 5-6 సంవత్సరాలు ఆ ఆలోచనా విధానం మీదే ఉండాలి. దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. పట్టుదల తో ప్రయత్నం చేస్తే ఇంజనీర్ అవుతాడు. ఇప్పుడు మీరు అమృతత్వ దీక్ష తీసుకుంటే అమృతత్వం రావాలి, వచ్చి తీరాలి. కానీ ఒక రోజులో రాదు. 

ప్రతి రోజు మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ రోజు నేను చేయవలసినది చేశానా? చేయదలచినది చేశానా? ఈ ప్రశ్న రోజూ వేసుకుంటే మీ సంస్కారాలు మారతాయి. ఆహారం అవసరమైనప్పుడు అవసరమైన పరిమాణంలో ఒకే చోట తీసుకునే అలవాటు చేసుకోండి. మీ ఆహార విహారాలు పరిపూర్ణంగా మీ కంట్రోల్ లో ఉండాలి తప్ప ఇతరుల కంట్రోల్ లో ఉండకూడదు. నియమాలు పెట్టుకోండి, నియమాలు ఆచరించారో లేదో చూసుకోవాలి. తప్పులు చేస్తుంటాం కానీ నిరాశ చెందవలసిన పని లేదు. ఎన్ని సార్లు తప్పు జరిగినా, ఎన్ని సార్లు పడిపోతున్నా, ఖచ్చితంగా మీరు ఒక సంవత్సరంలో మారిపోతారు. చేయవలసినదీ ప్రతి రోజూ ప్రశ్న వేసుకుంటూవుండాలి, మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయాలి. దీక్షగా చేయడం అంటే పట్టుదలతో చేయడం. దీక్ష అంటే ఏది ఉచితమో అది మాత్రమే చేస్తానని.
                          (సశేషం) 

డా. మారెళ్ళ శ్రీరామకృష్ణ మాష్టారు గారు ఇచ్చిన ప్రవచనాల నుండి 

No comments:

Post a Comment