Wednesday, August 24, 2022

మనం చేసే తప్పుల వలన బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. మనం ఆలోచించే విధానం తప్పు. అసలు మీరు ఈ ఆలోచించే విధానం మార్చుకుంటే, అసలు మీకు మృత్యువు రాదు.

 ఆమృతత్వ విద్య -13

మొత్తం జీవించే కళ శ్వాస మీద ఆధారపడి ఉన్నది. శ్వాస ను ఒక అస్త్రం లాగా ఉపయోగించగలిగితే అది శాస్త్రం అవుతుంది. మీరు దానిని సవ్యంగా అర్థం చేసుకుని, మీ జీవితాలలో దానిని ఉపయోగించుకోగలగాలి, తర్వాత దానిని ఇతరులకు చెప్పగలగాలి. ఇది తెలుసుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు.

700 సంవత్సరాల క్రితం ఒక బాబాజీ, ఒక అవధూత ఏ కారణం వల్లనో తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ ఉన్న కోయజాతి వాళ్ళు ఆయనకు సంరక్షణ ఇచ్చి, నయం చేశారు. నయం చేస్తే ఆయన వాళ్ళకి ఆహారం సమస్యగా ఉన్నదని గమనించాడు. అందుకు ఆయన మీరు నాకు సహాయం చేశారు కనుక ఇక్కడ ఒక సంచి పెడుతున్నాను, మీకు ఏది కావాలంటే దానిని ఆ సంచీలో చేయిపెట్టి తీసుకోండి అన్నారు. అప్పటి నుండి ఆ ఊరి వాళ్ళు ఆకలి వేస్తుంది, ఏది కావాలంటే అది చేయి పెట్టి తీసుకోవడమే. ఏదో మందు కావాలి, చేయి పెట్టి తీసుకోవడమే. ఈ మధ్య వరకు ఉన్నది. తర్వాత మనం వెళ్ళాం, మనం వెళ్ళాక అది ... మీకు అవసరమైనది తెలియదు, అనవసరం అయినది తెలియదు. అన్నీ కావాలి. వాళ్ళు ఆకలి అయితేనే చెయ్యి పెట్టి తీసుకునే వాళ్ళు. ఇంటికి తీసుకువెళ్ళి దాచుకోవటం వాళ్ళు చేయలేదు. మీరు ఆ స్థితికి ఎదగాలి, ఆ మానసిక స్థితి తెచ్చుకోవాలి. ఏది అవసరమో అది మాత్రమే తీసుకుంటాము తప్ప, అనవసరం అయినది అడగము అనే మానసిక స్థితి తెచ్చుకుంటే, ఇవన్నీ పని చేయడం మొదలుపెడతాయి. పక్కింటి వాడికి టీవి ఉన్నది కనుక మనకు టీవి కావాలి. పక్కింటి వాళ్ళకి కారు ఉన్నది, అది నాకు కావాలి. కోరికలు కోరడం తప్పని ఎవరూ అనడం లేదు. ఆకలి వేస్తే ఆహారం కావాలని, చలి వేస్తే దుప్పటి కావాలంటే దానికి ఏ గురువు వద్దు అని అనడు. అవసరమైనవి ఏదో, అవసరమైనవి ఏదో నిర్ణయించుకునే స్థితిలో మనుషులు లేరు. అనవసరం అయినవి కోరుకుంటున్నారు, అవసరమైనవి కోరుకోవటం లేదు. కష్టాలు అందుకు వస్తున్నాయి. భగవంతుడి వలన రోగాలు రావడం లేదు. భగవంతుడి వలన ఏ సమస్యలు రావడం లేదు. సమస్యలు అన్నీ మనం తెచ్చిపెట్టుకున్నవి. మనం చేసే తప్పుల వలన బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. మనం ఆలోచించే విధానం తప్పు. అసలు మీరు ఈ ఆలోచించే విధానం మార్చుకుంటే, అసలు మీకు మృత్యువు రాదు.
                       (సశేషం)

డా. మారెళ్ళ శ్రీరామకృష్ణ మా‌ష్టరు గారు ఇచ్చిన ప్రవచనాల నుండి

No comments:

Post a Comment