Wednesday, August 31, 2022

స్వధర్మం

వ్యక్తిగత ధర్మం
కుటుంబ ధర్మం
భందువుల ధర్మం
స్నేహితుల ధర్మం
సాటి మనిషితో ధర్మం
సామాజిక ధర్మం
ఆర్థిక ధర్మం
రాజ్య పరిపాలన ధర్మం
పరిపాలన ధర్మం

ఈ ధర్మాలు ఏమిటో  
తెలియాలంటే
ముందుగా  కనీసం వారానికి ఒక్కసారి అయినా నిన్ను నీవు ప్రశ్నించుకో 
నివేవరివో నీవెందుకు జివిస్తున్నవో ఎవరికోసం జివిస్తున్నవో  , ఆ వారమంతా
ఎలాగ ఆలోచిస్తున్నావు , ఎలాగ ప్రవర్తిస్తున్నావు
ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నావు  చేస్తున్న పని
చెయ్యదలుచుక్కున్న పని
ఎలాగ చేస్తున్నావు , యేమి ఆశించి చేస్తున్నావు, ఎంత మందితో కలిసి పని చేస్తున్నావు
ఎన్ని ఏండ్లని దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నావు
దాని వల్ల కలిగే ఉపయోగాలు
ప్రయోజనాలు లాభ నస్టాలు మంచి చెడులు
తెలుస్తాయి
అదే  ప్రప్రథమ స్వధర్మం
ఈ స్వధర్మం ఎప్పుడైతే అర్థం అవుతుందొ. ఇక ఇతర
ధర్మాలన్ని. అర్ధం అవుతాయి

అంతేకాని
దేవాలయం కట్టేసాము
ప్రతి రోజు దేవాలయానికి వెళుతున్నాను
హుండీలో కాసుల వర్షం కురిపిస్తున్నాను
ఓ పది పందికి భోజనం పెట్టేసాను వస్త్ర దానం చేశాను
సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి చుట్టూ తిరిగే మనుషులను చూసి దాన ధర్మాలు చేసేసి , 
గుడికి వెళ్ళి గుడిలో గుండ్రంగా తిరుగుతూ రక రకాల సంఖ్య ప్రకారంగా ప్రదక్షిణలు చేసి
గంట కొట్టేసి  దణ్ణం పెట్టేసి
బయటకు రాగానే నా నా రకాల గబ్బు పనులు చేస్తూ
బతికేస్తు 
నేను ధర్మాన్ని అచరిస్తునాను
నేను నిజాయతీ పరుడిని
నేను నీతి నిజాయితీ విలువలు సంప్రదాయాలు పాటించే వాడిని  అని అనుకోకు. 
ఓ పది మందికి మంచి చేసేసి
మరో. వంద మందకి ద్రోహం
చేసేసి
నేను నేనూ అంటూ బతికేసి
నా కుటుంబం
నా కులం
నా డబ్బు
నా అధికారం
నేను అధికారిని
నేను అంత నేను ఇంత
నేనెవరో తెలుసా
నాకు అన్ని రకాల పలుకుబడి వున్నది
ఇది కాదు ధర్మం అంటే
నా నా రకాల గబ్బు పనులు చేస్తూ  బతికేస్తు వునంత కాలం
ఎన్ని పురాణాలు గ్రంధాలు 
ఇతిహాసాలు భగవత్గీత
రామాయణం మహాభారతం
లాంటివి చదివినా విన్నా చూసిన. 
ప్రయోజనం. ఫలితం
????????????????
స్వధర్మం అంటేనే తెలియనప్పుడు
ఇక మిగిలిన ధర్మాలు ఎలాగ తెలుస్తాయి...


No comments:

Post a Comment