Wednesday, August 31, 2022

చేసుకున్నదే అనుభవిస్తాం!

 చేసుకున్నదే అనుభవిస్తాం!

🔹🔸🔹🔸🔹🔸🔹

శ్రీకృష్ణపరమాత్మ ‘మనస్సు’ గురించి ప్రత్యేకంగా వివరిస్తూ ‘జీవుడు’, ‘పూర్వజన్మ కర్మ’ అందులో లీనం కావడం, కాకపోవడం గురించి చెబుతూ ఉంటే అర్జునుడికి ప్రాథమికమైన సందేహం వచ్చింది. 


భగవద్గీత మూడో అధ్యాయం 36వ శ్లోకంలో అర్జునుడు ఇలా అడుగుతున్నాడు. 

అథ కేన ప్రయుక్తో యం పాపం చరతి పూరుషః
అనిచ్ఛన్నపి వార్ష్ణాయ బలాదివ నియోజితః

భగవాన్‌ ‘‘ఇంత చక్కని ధర్మశాస్ర్తాలు కలిగిన దేశంలో పాపాత్ములు ఎక్కువై పోతున్నారు. పాపానికి పురిగొల్పుతున్న శక్తి ఏమిటి?’’ అని అడిగాడు అర్జునుడు. 

మనిషి బాగుపడడానికి, పాడైపోవడానికి అన్ని రకాల కారణాలు చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ. 

మనిషి చెడిపోవడానికి మనస్సే కారణమని స్పష్టంగా చెప్పాడు. 

సంపద మీద కాంక్ష తీసుకోండి. వంద ఉన్నవాడికి వెయ్యి కావాలి. వేలు ఉన్న వాడికి లక్షలు కావాలి. లక్షలు ఉన్న వాడు కోట్లు కావాలని కోరుకుంటాడు. లక్షల కోట్లు సంపాదించిన వారు కూడా సుఖంగా ఉండడం లేదు. వాళ్లూ ఆందోళన పడుతున్నారు. లోకంలో భయాందోళనలు పెంచుతున్నారు. నిజంగా డబ్బు సుఖాన్నిస్తే ఆ డబ్బుని అనుభవిస్తూ హాయిగా ఉండవచ్చు కదా! యాభై, వంద గదులు కట్టుకుని ఉన్న వారు కూడా సుఖంగా లేరు. ఈ ఆకలికి అంతులేదు. కోరికలతోపాటు క్రోధం కూడా మహాపాపాలు చేయిస్తుంది. 

ఉదాహరణ దుర్వాస మహర్షి. ఆయన మహాతపస్వి. కానీ ఒక్క కోపం ఆయన జీవితాన్ని తినేసింది. 

ప్రతిదానికి పూర్వజన్మ కర్మ ఉండదు. కావాలని చేసుకుని అనుభవిస్తున్నవే అన్నీ! మనసులో పుట్టిన రాగద్వేషాలు, కామక్రోధాలు మనిషిని బలహీనుణ్ణి  చేస్తున్నా, ఆ సంగతి గమనించుకోవడం లేదు.

- గరికిపాటి నరసింహారావు గారు

🔹🔸🔹🔸🔹🔸🔹

No comments:

Post a Comment