Wednesday, August 24, 2022

ద్వంద్వ మయం భగవద్గీత

 ద్వంద్వ మయం
భగవద్గీత
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫

💫 ఈ ప్రపంచం అంతా  ద్వంద్వ మయం - పగలు-రాత్రి, శీతాకాలం-ఎండాకాలం, సంతోషం-దుఃఖం, ఆనందం-బాధ.  వీటి అన్నిటికన్నా పెద్ద ద్వంద్వములు జనన-మరణములు. 

💫 ఇవి ఒక జంట లాగా ఉంటాయి. పుట్టుక సంభవించగానే మరణం ఖచ్చితంగా ఉంటుంది. మరణం మరల పుట్టుకను కలిగిస్తుంది. 

👌 జననం-మరణం అనే ఈ రెండు చివరల మధ్య ఉండేదే జీవితం  👌

💫 ఈ ద్వందములు జీవన ప్రయాణంలో విడదీయలేని భాగాలుగా ఉంటాయి.

💫 భౌతిక దృక్పథంలో, మనకి ఒకటి నచ్చుతుంది మరియు ఇంకోటంటే రోత పుడుతుంది. ఈ ఇష్టము-ద్వేషము అనేవి ద్వందముల యొక్క అంతర్లీనంగా ఉన్న స్వభావం కాదు, నిజానికి, అవి మన అజ్ఞానం నుండి ఉద్భవించినవే• మన తప్పుదారిలో ఉన్న బుద్ధి, భౌతిక సుఖాలు మనకు మంచివి అని ఒక నిశ్చయంతో ఉంది. బాధ అనేది మనకు హానికరమైనది అన్న నిశ్చయంతో కూడా ఉన్నాము. భౌతిక ప్రాపంచిక భోగాలు, ఆత్మ పై ఉన్న భౌతిక మాయను మరింత మందంగా చేస్తాయి. అదే సమయంలో, ప్రతికూల పరిస్థితులకు మాయను నిర్మూలించి, మనస్సును ఉద్ధరించే శక్తి ఉంది, అని తెలుసుకోలేకున్నాము. 

💫 ఈ యొక్క భ్రాంతికి మూల కారణం అజ్ఞానమే. ఆధ్యాత్మిక పురోగతికి నిదర్శనం ఏంటంటే, వ్యక్తి రాగ-ద్వేషాలకు , ఇష్టా-అయిష్టాలకు అతీతంగా ఎదిగి, ఆ రెంటినీ భగవంతుని సృష్టి లో ఉన్న విడదీయలేని తత్వాలుగా స్వీకరిస్తాడు.
 

🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏


🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫

No comments:

Post a Comment