🎻🌹🙏 గణేష చతుర్థి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదు ? పొరాపాటున చూస్తే ఏం చేయాలి... ?
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿వినాయకుడు , విఘ్నేశ్వరుడు , గణాధిపతి , గణనాథుడు ఇలా ఎన్నో పేర్లు గణేషుడికి ఉన్నాయి.
🌸ఏ పూజ చేసినా అందులో ముందుగా ప్రార్థించేది గణపతినే. ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు (ఆటంకాలు) రాకుండా కాపాడుతాడని గణేషుడికి ముందుగా పూజలు చేస్తారు.
🌿ఇక ఏటా వినాయక చవితి వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేపడతారు.
🌸నవరాత్రుల అనంతరం గణేషున్ని ఘనంగా సాగనంపుతూ నిమజ్జనం చేస్తారు.
🌿అయితే వినాయక చవితి రోజున గణేషుడికి పూజ చేయడంతోపాటు మనం చేయకూడని పని కూడా ఇంకోటి ఉంటుంది.
🌸 అదేనండీ , చంద్రున్ని చూడడం. చాలా మంది పండితులు , పెద్దలు వినాయక చవితి రోజు చంద్రున్ని చూడవద్దని , అలా చూస్తే నీలాపనిందల పాలు కావల్సి వస్తుందని చెబుతారు.
🌿 అయితే దాని వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
🌸సర్వ గణాలకు అధిపతిగా ఎవరు ఉండాలనే విషయంపై దేవతలందరూ శివున్ని కోరగా ,
🌿 అప్పుడు శివుడు వినాయకుడు , కుమార స్వామిలలో ఎవరో ఒకరు గణాధిపతిగా ఉంటారని , అందుకోసం వారిద్దరికీ పోటీ పెడతానని చెబుతాడు.
🌸ఈ క్రమంలో వారిద్దరినీ పిలిచి శివుడు ఏం చేయమని చెబుతాడంటే , ముల్లోకాల్లో ఉన్న అన్ని నదులు , పుణ్యక్షేత్రాల్లో ఎవరైతే ముందుగా స్నానం ఆచరించి
🌿తమను చేరుకుంటారో వారికే గణాధిపత్యం వస్తుందని శివుడు చెబుతాడు.
🌸అప్పుడు కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై ముల్లోకాలను చుట్టి రావడానికి బయల్దేరతాడు.
🌿ఈ క్రమంలో గణేషుడు ఎక్కడికి వెళ్లకుండా తన తల్లిదండ్రులైన శివపార్వతులకు నమస్కారం చేస్తూ
3 సార్లు వారి చుట్టూ తిరుగుతాడు.
🌸 అలా తిరిగే క్రమంలో గణేషుడు ప్రతి సారి కుమారస్వామికి పుణ్యక్షేత్రాల్లో కనిపిస్తూనే ఉంటాడు.
🌿దీంతో తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయగానే గణేషుడు ముల్లోకాలను చుట్టి వచ్చినట్టు అవుతుంది.
🌸ఈ క్రమంలో కుమారస్వామి కన్నా గణేషుడే మొదట వచ్చినట్టు అవుతుంది. అప్పుడు శివుడు సంతోషించి గణేషున్నే సర్వ గణాలకు అధిపతిని చేస్తాడు.
🌿అప్పుడు జరిగిన విందులో ఏర్పాటు చేసిన అన్ని వంటకాలను గణేషుడు సుష్టుగా తింటాడు.
🌸దీని వల్ల తల్లిదండ్రుల ఆశీర్వచనాలను తీసుకునే క్రమంలో వంగినప్పుడు అతనికి ఇబ్బందిగా ఉంటుంది.
🌿 సరిగ్గా నమస్కారం చేయలేకపోతాడు. అప్పుడు చంద్రుడు గణేషున్ని చూసి నవ్వుతాడు.
🌸దీంతో పార్వతిదేవి ఆగ్రహం చెంది చంద్రుడికి శాపం పెడుతుంది. చంద్రున్ని చూసిన వారందరూ నీలాపనిందలకు గురి కావల్సి వస్తుందని అంటుంది.
🌿ఎవరైతే బాధ్రపద శుద్ధ చవితి (వినాయక చవితి) నాడు చంద్రున్ని చూస్తారో వారు నిందల పాలు అవుతారు అని శాపాన్ని మారుస్తుంది.
🌸 అప్పటి నుంచి చవితి రోజు చంద్రున్ని ఎవరూ చూడకూడదని చెబుతూ వస్తున్నారు.
🌿అయితే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చవితి నాడు ఆవు పాలు పిండుతుండగా అందులో చంద్రుని ప్రతిబింబం కనిపిస్తుంది.
🌸దీంతో తాను నిందల పాలు కావల్సి వస్తుందని కృష్ణుడు చింతిస్తుంటాడు.
అనుకున్నట్టుగానే శ్యమంతకమణి అనే మణిని అపహరించినట్టు అతని మీద నింద పడుతుంది.
🌿 దీంతో ఎలాగో కష్టపడి శ్రీకృష్ణుడు ఆ మణిని తెచ్చి ఇచ్చి తన నిందను పోగొట్టుకుంటాడు. అయితే ఆ సంఘటన జరిగిన తరువాత శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు.
🌸ఎవరైతే వినాయక చవితి రోజు పూజలు చేసి గణేషుడి ఆశీర్వచనాలు పొందుతారో వారికి చంద్రున్ని చూసినా ఏమీ అవదని అంటాడు.
🌿అప్పటి నుంచి చాలా మంది చవితి రోజు వినాయకున్ని కచ్చితంగా పూజించడం మొదలు పెట్టారు.
🌸 మరో పరిహారం కూడా ఉంది. చంద్ర దర్శనం చేసిన వారు దోషం పోవడానికి ఈ క్రింది శ్లోకం చదివినా మంచిదని అంటున్నారు...🚩🌞🙏🌹🎻
🌷సింహః ప్రసేన మవధీత్ సింహొజాంబవతా హతః
సుకుమారక మారోదీః తవ హ్యోషస్సః మంతకః..🌷
సేకరణ 👌
*🌿🌸🌿 వాసవి ప్రసాద్ 🌿🌸🌿*
No comments:
Post a Comment