Thursday, August 25, 2022

పూజ చేస్తున్నప్పుడు రకరకాల ఆలోచనల ఉధృతి ఎందుకని పెరుగుతుంది ?

 💖💖💖
       💖💖 "307" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖
"పూజ చేస్తున్నప్పుడు రకరకాల ఆలోచనల ఉధృతి ఎందుకని పెరుగుతుంది ?"

"పూజకు అడ్డు తగులుతున్నాయనే విషయాలను అంతకుముందు గుర్తుకొచ్చినప్పుడే ఆపి ఉంటే అవి సాధనకు అడ్డుతగిలి ఉండేవికావు. మనం కేవలం పూజ సమయంలో మాత్రమే పవిత్రంగా ఉండాలనుకోవటమే ఇందుకు కారణం. నిజానికి మన దైనందిక క్రియలన్నీ అలా పవిత్రంగా ఉంచుకోగలిగితే ప్రత్యేకించి ఏ ప్రయత్నం లేకుండానే పూజలో కూడా అదే పవిత్రత కొనసాగుతుంది. రోజంతా పిచ్చి, పిచ్చి ఆలోచనలు వచ్చినా ఫర్వాలేదు కానీ దేవుడి ముందు కూర్చున్న గంటసేపు రాకూడదనుకుంటే సాధ్యంకాదు. ధ్యానం అంటే స్థిరమైన మానసిక స్థితి. మనం చూడదలుసుకున్నదే కనిపించటం, కావాలనుకున్నంతసేపు ఒకే ఆలోచనలో ఉండగలగటం మనం ఆశిస్తున్న ధ్యానస్థితి. మనం ఈస్థితిని కేవలం పూజలోనో, సాధన కోసం కూర్చున్న సమయంలోనో సాధించాలని అనుకుంటున్నాం. మనం ఉండాలనుకున్న ఆలోచనలోనే ఉండటాన్ని ప్రతి పనిలోనూ సాధనచేస్తే గానీ అది పూజలో కూడా మనం ఆచరణలోకి తెచ్చుకోగలుగుతాం. చేస్తున్న పనిలో కాకుండా మరో విషయాన్ని ఆలోచించుటం వలన మనసు కలుషితమవుతుంది. పవిత్ర ఆలోచనలు, శ్రద్ధ, సావధానత, ఏకాగ్రత వంటి లక్షణాలు రోజంతా అనుసరించాల్సినవి. అందుకే ప్రతి పనిని దైవకార్యం అనుకొని పవిత్రంగా చేయటం అలవర్చుకుంటే త్రికరణ శుద్ధితో జీవించటం సాధ్యమవుతుంది. అదే ఆధ్యాత్మిక సౌధాలకు చేరుస్తుంది !"

"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"

No comments:

Post a Comment