మంచిమాట.
మనిషికి మరణ భయం లేకపోతే, ‘మరణించాక నేను ఏమైపోతాను? ఏమైపోవాలి?’ అనే ఆలోచన లేకపోతే పారలౌకిక ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు ఉండవు, రావు. ఈ మరణ భయాలే మత బీజాలుగా ఆదిమ సమాజాల్లో మొలకెత్తాయి. జన్మదినం, నామకరణం, గృహ ప్రవేశం, వివాహం, మరణం... మనిషి జీవితంలో నిర్వహించుకొనే ఈ కార్యక్రమాలలో మానవులు అనాది నుంచీ పాటించినవి మరణానంతర కర్మలే. ఉత్తర క్రియలే! నాలుగు మంచి పనులు చేసి మరణించిన వ్యక్తికి... ఇతర గతుల సంగతి ఎలా ఉన్నా కీర్తి మాత్రం మిగిలిపోతుంది. బతికినంత కాలం అమానుషంగా జీవించి, మరణించిన తరువాత తనకు అంతిమ సంస్కారాలు శుద్ధంగా జరగాలని భావించిన ఒక వ్యక్తి గురించి బుద్ధుడు చెప్పిన కథ ఇది.
పూర్వం విదేహలో ఉపసాళకుడు అనే పండితుడు ఉండేవాడు. మొత్తం జంబూ ద్వీపంలో తనంతటి జ్ఞాని, మహా పండితుడూ ఎవరూ లేరని అతను మిడిసిపడేవాడు. ఎక్కడకు వెళ్ళినా తన పట్ల గౌరవ మర్యాదలు ఏ కొంచెం తగ్గినా సహించేవాడు కాదు. అన్ని విషయాల్లో శుద్ధి పాటించేవాడు. శుద్ధి పేరుతో మనుషులను దూరం పెట్టేవాడు.
ఉపసాళకుడికి ఒక కుమారుడు ఉన్నాడు. అతను కూడా మంచి పండితుడే. ఉపసాళకుడికి వయసు పెరిగింది. వృద్ధాప్యం వచ్చింది. ఏ క్షణమైనా మృత్యువు రావచ్చని నిశ్చయించుకున్నాడు. తన కుమారుణ్ణి పిలిచి-
‘‘నాయనా! నాకు ఎప్పుడైనా మృత్యువు రావచ్చు. నా మరణ కర్మలు చాలా శుద్ధిగా జరిపించు. నన్ను చందనం కట్టెలతో దహనం చేయించు. నన్ను దహనం ఎక్కడ చెయ్యాలో తెలుసా?’’ అని అడిగాడు.
‘‘లేదు తండ్రీ!’’ అన్నాడు అతని కుమారుడు.
‘‘అందరినీ దహనం చేస్తున్న మన ఊరి శ్మశానంలో మాత్రం చెయ్యకు. అక్కడ శుద్ధి, ఆచారాలు పాటించని వారెవరినో దహనం చేసి ఉంటారు. గతంలో ఎవరినీ దహనం చేయని పరిశుద్ధ ప్రదేశంలో నా అంతిమ సంస్కారాలు కావించు’’ అని చెప్పాడు.
‘‘తండ్రీ! అలాంటి ప్రదేశం ఎక్కడ ఉంటుందో నాకు మాత్రం ఏం తెలుసు? మీరే ఆ ప్రదేశాన్ని చూపించండి. అక్కడే చేస్తాను’’ అన్నాడు కుమారుడు.
ఉపసాళకుడు తన కుమారుణ్ణి వెంట తీసుకొని, ఊరి చివరికి వెళ్ళాడు. అక్కడికి సమీపంలో ఉన్న చిన్న కొండ మీదకు చేరాడు. అక్కడ మూడు పర్వతాలు కలిసిన లోయ ప్రాంతాన్ని చూపుతూ- ‘‘నాయనా! ఈ ప్రదేశం ఉత్తమమైనది’’ అన్నాడు.
అతని కుమారుడు సరేనన్నాడు.
వారిద్దరూ అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్న సమయంలో... బుద్ధుడు తన శిష్యులతో కలిసి అటుగా వస్తూ, ఉపసాళకుని దగ్గర ఆగాడు. విషయం తెలుసుకొని ‘‘ఉపసాళకా! ఈ ప్రదేశాన్నే ఎందుకు ఎంచుకున్నావు?’’ అని అడిగాడు.
‘‘అక్కడకు అంత్యక్రియల కోసం ఎవరూ వెళ్ళరు. మూర్ఖులు, అజ్ఞానులు, అస్పృశ్యుల స్పర్శ లేని ప్రదేశం అది’’ అన్నాడు.
అప్పుడు బుద్ధుడు- ‘‘ఉపసాళకా! ఎంత అజ్ఞానివి? ఈ భూమి మీద జీవులు పుట్టని స్థలం కానీ, సంచరించని తావులు కానీ, మరణించి మట్టిలో కలసిపోని ప్రదేశం కానీ ఎక్కడా మిగిలి ఉండదు. ఎన్నెన్నో కల్పాల నుంచి ఈ జీవుల చక్రం ఇక్కడ నడుస్తూ ఉంది. జీవుల భస్మంతో నిండని ప్రదేశం ఏదీ ఈ అవని మీద ఉండదు. మూర్ఖంగా శ్మశాన శుద్ధి కోసం ఆరాటపడకు’’ అని చెప్పాడు.
ఉపసాళకుడు తన అజ్ఞానాన్ని వీడి, బుద్ధుని శరణు వేడాడు.
సేకరణ. మానస సరోవరం

No comments:
Post a Comment