18. గీత దైవ లక్షణాలను, అసుర లక్షణాలను ఏ విధంగా వివరించింది?
జ. దైవ లక్షణాలు:
1. అభయము
2. చిత్తశుద్ది
3. జ్ఞానయోగమునందుందుట
4. దానము
5. ఇంద్రియనిగ్రహం
6. యజ్ఞము
7. అధ్యయనము
8. తపస్సు
9. కపటములేకుండుట
10. అహింస
11. సత్యము
12. క్రోధములేకుండుట
13. త్యాగము
14. శాంతి
15. కౌండెములుచెప్ప కుండుట
16. సమస్తప్రాణుల యెడల కరుణ
17. విషయములపై మనస్సు పోనీయకుండుట
18. తేజస్సు
19. క్షమ
20. ఆపత్కాలమందు దైర్యమును వీడకుండుట.
21. శుచి, శుభ్రతలు కల్గియుండుట.
22. పరులకు ద్రోహముచేయకుండుట.
23. మృదుస్వభావము.
24. ధర్మవిరుద్ద కార్యములలో ప్రవేశింపకుండుట.
25. తననుతాను పొగడుకొనకుండుట.
26. తంతుల స్వభావము లేకుండుట
అసుర లక్షణాలు : డంభము, గర్వము, దురభిమానము,కోపము,పరులను పిడించునట్లు మాట్లాడుట, వివేక
జ్ఞానహినత, తాను గొప్ప అను అహంకారము, హింస.
ప్రతి మానవుడు తనలోని అసుర లక్షణాలు గుర్తించి వానిని ప్రయత్నపూర్వకంగా దూరంచేసుకొని దైవ లక్షణాలు అలవర్చుకొని భగవంతునిచే ప్రేమించబడే భక్తులుగా తమను తాము తీర్చిదిద్దుకొనవలెను.
19. యోగమనగా నేమి?
జ. యోగమనగా జీవాత్మ పరమాత్మలో లీనమగుట
యోగమనగా దైవాన్ని చేర్చుమార్గము
యోగమనగా ఆనందం
సమత్వమే యోగము
చిత్త వృత్తిని విరోధించునదే యోగము.
20. యింద్రియాలకు వైరాగ్యమును అలవరచాలని స్వామి చెప్పారు. కారణం ఏమిటి?
జ. గీతలో శరీరమునుండి జీవాత్మ మరొక శరీరములోనికి ప్రవేశించినపుడు తన సత్కర్మ, దుష్కర్మలను తప్ప మరేమి తీసుకొని వెళ్ళలేదు. వాయువు ఏవిధంగా ఒక ప్రదేశంలోని దుర్గంధాన్ని, సుగంధాన్ని తీసుకొని వేరొక ప్రదేశానికి వెళ్తుందో అదే విధంగా ఆత్మ కర్మఫలమునుతప్ప మరేదీ ఈ ప్రపంచం నుండిగాని, తన గృహము నుండిగాని తీసుకొని వెళ్ళలేదు. అందువలన ధన కనక వస్తువులయందు, భోగ భాగ్యముల నుండి మనసును సత్కర్మలవైపు, దైవముపైన మరల్చి ప్రాపంచిక భోగములపై వైరాగ్యమును అలవర్చుకొనవలెను. దీని ఉదాహరణకు స్వామి చిన్న కథ చెప్తారు.ఒక గృహస్దునకు ముగ్గురు మిత్రులు ఉంటారు. కోర్టులో అతనిపై కేసు విచారణ జరుగబోతుంది. తన మిత్రులను తనతో కోర్టుకువచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని కోరతాడు. మొదటి మిత్రుడు నేను ఇంట్లో నీకేమైనా సహాయం చేస్తాగాని ఇల్లుదాటి బయటకురాను అన్నాడు. రెండవ మిత్రుడు కోర్టువరకు నీకు తోడు వస్తానుగాని లోనికి మాత్రం రాను అన్నాడు. మూడవ మిత్రుడు నేను నీతో కోర్టులోనికి వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు. మొదటి మిత్రుడు ధనధాన్యాది సంపదలు. రెండవ మిత్రుడు భార్య,బంధు మిత్రులు. మూడవ మిత్రుడు మనం చేసిన సత్కర్మలు.
21. స్వధర్మమంటే ఏమిటి? పర ధర్మమంటే ఏమిటి?
జ. ఆత్మ సంబంధమైన ధర్మం స్వధర్మం, పర ధర్మమంటే దేహ సంబంధమైన ధర్మం.
22. అర్జునుడి పేర్లు వల్ల వ్యక్తమయ్యే విలక్షణ వ్యక్తిత్వం ఏమిటి?
జ. గురువు వద్ద నుండి విద్యకు శిష్యుడు ఏవిధంగా ఆదర్శంగా వుండాలో అర్జునుని పై పేర్ల ద్వారా తెలుసుకోగలము.
23. *యోగం* అంటే అర్థం ఏమిటి?
జ. యుగం అంటే రెండు . పరమాత్మ-జీవాత్మ . జీవాత్మ పరమాత్మతో చేరి వుండటమే యోగము భగవంతునితో సం యోగము చెందుటకు . భగవంతుని చేరే మార్గము అవలంబించటము ఆయనతో చేరటమే.
24. భగవద్గీతలో యోగం ఏవిధంగా నిర్వచింపబడినది?
జ. *కర్మ సు కౌశలమ్ యోగ:* అన్నది గీత. అంటే నిర్దేశించిన పనిని హృదయపూర్వకంగా చెయ్యి అని!
No comments:
Post a Comment