Saturday, August 13, 2022

మనస్సు ప్రశాంతముగా ఉండుటకు రోజులో ఒక గంటపాటు అయినా మౌనము పాటించుట అలవాటు చేసుకోవాలి. దీనివలన.....

 🕉️ జై శ్రీమన్నారాయణ🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺

🌷

🌴మనస్సు ప్రశాంతముగా ఉండుటకు రోజులో ఒక గంటపాటు అయినా మౌనము పాటించుట అలవాటు చేసుకోవాలి. దీనివలన మనసులో అలజడి క్రమక్రమముగా తగ్గుముఖం పడుతుంది. మౌనముగా ఉండడం అంటే నోరు మూసుకుని మాట్లాడకుండా ఉండడమని కాదు! కలియుగములో మానవుని మనస్సు మిక్కిలి చంచలమైనది. క్షణమునకు ఎన్ని అలోచనలు చేస్తుందో చెప్పలేము. అటువంటి చంచలమైన మనస్సును ఒక గంటసేపు ఎట్టి అలోచనలు, కోరికలు లేకుండా శూన్యముగా ఉంచుకోవడమే అసలైన మౌనము. అంతేగానీ బయటకి నోరు తెరవకుండా, మాట్లాడకుండా లోపల ఏవేవో అలోచనలు చేస్తుంటే అది మౌనము అనిపించుకోదు. కోరికలను కట్టాలి. అలోచనలు, కోరికలు లేని మనస్సు సులభంగా భగవంతునిపై స్థిరం అవుతుంది. ఈ సాధన ప్రతిరోజూ చేస్తుంటే మనస్సు సులభంగా అదుపులోకి వస్తుంది. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా ఉంటుంది.🌴

సేకరణ

No comments:

Post a Comment