💥ఆచార్య సద్బోధన:✨
🍀🌹🌻🏵️🌎🚩
"మనలో అధిక సంఖ్యాకులు దైవము నుండి విలువలేని వాటిని పొందటానికి ప్రార్థిస్తుంటారు.
ప్రాపంచిక సుఖ సంతోషాలూ, వ్యాధి నివారణలూ, ఉద్యోగాభివృద్ధులు ఇవన్నీ ఆకర్షణీయంగా కనిపించే కాకిబంగారపు నగలు.
కానీ దైవము మనకు మోక్షం అందించుటకు సంకల్పించాడు. అయితే దానిని కోరువారు మనలో కొద్దిమంది మాత్రమే!
దైవమును మనల్ని రక్షించే వస్తువును అడిగి అందుకోవాలి తప్ప మనలను బంధించే విషయాలు కోరుకోకూడదు.
ఒక వెయ్యి ప్రాపంచిక విషయాల కోసం దేవుని అడుగుతుంటాము తప్ప తనను కావాలని అడిగేవారు చాలా అరుదు.
ఇలాంటివారు ఏనాటికీ భక్తులు కాలేరు!. భగవంతుని తప్ప ఇంక దేనినీ కోరనివాడే నిజమైన భక్తుడు.
మేము సాయిభక్తులమనీ, రామభక్తులమనీ, కృష్ణభక్తులమనీ మనకు మనము చెప్పుకుంటున్నాము కానీ ఆయన కూడా మనల్ని తన భక్తులుగా అంగీకరించాలి కదా!
మనము భగవంతునికి సంపూర్ణంగా శరణాగతులమై ఆయన యొక్క ఉపకరణాలుగా అయితే తప్ప మనము తన భక్తులమని చెప్పుకొనే అర్హత మనకు కలుగదు.
🦚🌹🌻🏵️💦🎊⛳
No comments:
Post a Comment