నేను 'కర్త'ను కానని ఉంటే ఉన్నా లేనివారే.
గురువైనా, దేవుడైనా మనమున్న చోటుకే వస్తాడు...
భగవంతుని కోసమంటూ ఒక్క అడుగు కూడా వేయవలసిన అవసరం లేదు...
ఒక అడుగు వేసినా...
విడిచిన అడుగులో భగవంతుడు లేడని అర్థం వస్తుంది...
నీవున్న చోటనే ఉన్నాడు...
నీలోనే ఉన్నాడు...
నీవుగానే ఉన్నాడు...
హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు...
కనుక ఈ దైవ సృష్టిలో ప్రతి అణువూ విలువైనదే...
నిరుపయోగం అని తలచి ఒక్క అణువును పెరికి వేసినా సరే ఈ విశ్వం కుప్ప కూలిపోతుంది...
శరీరాన్ని అంతం చేసే క్యాన్సర్ కణం కూడా హరిమయమే.
***
బోర్లించిన U ఆకారంలో ఉన్న ఒక విచిత్రమైన వస్తువు యొక్క బొమ్మను చూశాను...
ఒక కొసలో పెన్సిల్ కూసు ఉంది...
ఇంకొక కొసలో రబ్బరు(eraiser)ముక్క ఉంది...
పెన్సిల్ వ్రాస్తూ పోతుంటుంది...
వెనుకనే రబ్బర్ తుడుచుకుంటూ వెళుతుంటుంది...
ఏకకాలంలో రెండు పనులూ జరుగుతుంటాయి...
ఆ తెల్లకాగితంపై-
సదా అక్షరాలూ ఉంటాయి...
సదా పరిశుభ్రంగానూ ఉంటుంది...
జ్ఞాని మనసు ఆ విచిత్రవస్తువు లాంటిదే...
ఏకకాలంలో-
వ్యవహారము జరుపుతూ ఉంటాడు...
అదే క్షణంలో నిర్వ్యవహారంగానూ ఉంటాడు...
ఏకకాలంలో-
ఆలోచనాపరుడుగానూ ఉంటాడు...
ఆలోచనారాహిత్యంగానూ ఉంటాడు...
ఇలాంటి స్థితి కలగడం మనకెలా సాధ్యం?
అంటారేమో...
చాలా సులభం...
నేను 'కర్త'ను కానని ఉండడమే...
ఆ స్థితిలో -
మీరు ఏమి చేసినా చేయనివారే అవుతారు...
మీరు ఏమి తలచినా తలవనివారే అవుతారు...
మీరు ఉన్నా లేనివారే అవుతారు...
అందరికీ మీరుంటారు...
మీకు మీరుండరు...
No comments:
Post a Comment