సద్గురు శివానంద సరస్వతి మహారాజ్ సూచించిన ఆధ్యాత్మిక దినచర్య :
1. నిద్ర లేచిన వేళ ఎంత?
2. నిద్రించిన గంటలు ఎన్ని?
3. జపమెన్న్ని మాలలు చేసావు?
4. కీర్తన కాలమెంత?
5. ప్రాణాయామములెన్ని చేసావు?
6. యోగాభ్యాసం ఎంతకాలం చేసావు?
7. ఒకే ఆసనంపై ఎంత కాలం ధ్యానం చేసావు?
8. ఎన్ని శ్లోకముల గీతా పఠనం చేసావు?
9. ఎంతసేపు సత్సంగంలో గడిపావు?
10. ఎంత సేపు మౌనంగా ఉన్నావు?
11. ఈ రోజు చేసిన నిష్కామ కర్మల వివరములు?
12. ఈ రోజు చేసిన దానమెంత?
13. ఎన్ని మంత్రములు లేక శ్లోకములు రాసావు?
14. శారీరక వ్యాయామ వివరాలు?
15. ఈ రోజు ఆడిన అబద్ధముల వివరములు?
16. ఎన్ని సార్లు కోపం వచ్చింది? ఎంత సేపు ఉంది? దానికి నీవు నీకు విధించుకున్న శిక్ష ఏమిటి?
17. చెడు సహవాసమునందు ఎంత కాలము గడిపావు?
18. ఎన్ని సార్లు బ్రహ్మ చర్య నియమమును తప్పావు?
19. సద్గ్రంథములు ఏవి ఎంతవరకు చదివావు?
20. చెడు అలవాట్లు నిరోధించుటకు చేసిన ప్రయత్నాలు ఏవి? ఎన్ని సార్లు తప్పావు? దానికి నీవు నీకు విధించుకున్న శిక్ష ఏమిటి?
21. నీ ఇష్ట దైవమును లేక కులదైవాన్ని ఎంత సేపు ధ్యానించావు? సగుణమా? నిర్గుణమా?
22. ఈ రోజు చేసిన ఉపవాస లేక జాగరణ వివరాలేమిటి? ఎన్ని రోజులు నుంచి చేస్తున్నావు?
23. నీవు పాటించిన ధ్యాన నియమములు ఏమిటి?
24. అభివృద్ధి చేసుకుంటున్న సద్గుణముల వివరాలు ఏమిటి?
25. విసర్జించ దలచిన దుర్గుణముల వివరాలు ఏమిటి? కాలనిర్ణయం చేసుకున్నావా? ఈ విషయంలో సాధించిన విజయాలు ఏమిటి?
26. నిన్ను ఎక్కువగా బాధించే ఇంద్రియములు ఏవి? వాటి నియంత్రణకు నీవు చేసే ప్రయత్నాలు ఏమిటి?
27. నీవు పడుకున్న సమయం ఎంత? పడుకునేముందు ఏమీ చేసావు?
పై విధంగా ఆధ్యాత్మిక దినచర్య మనం రాసుకుంటే తప్పక విజయం సాధించగలమని నా నమ్మకం.
ధన్యవాదములు.
No comments:
Post a Comment